చిగురాకు రెపరెపలు మరియు మహారాజశ్రీ మామ్మగారు

[spacer height=”20px”]రచయిత్రి;మన్నెం శారద

నా అభిమాన రచయిత్రులలో మన్నెం శారదగారు ఒకరు.ఆవిడను మొదటిసారిగా మంథాభానుమతిగారింట్లో గెట్ టుగేదర్ లో చూసాను.దూరం నుంచి ఆవిడే మన్నెంశారదగారు అని లక్ష్మిగారు చెప్పారు.ఆవిడను చూడగానే మన్నెం శారద అంటే ఈవిడా?ఎంత చిన్నగా ఉన్నారు.మీకు నిజంగా తెలుసా అని ఆశ్చర్యపోతూ లక్ష్మిగారి తో అన్నాను.అవునండి. పదండి మాట్లాడిద్దాము అన్నారు లక్ష్మిగారు. నేను ఇంకా నమ్మలేకున్నాను ఆవిడ రచనలు చాలా ఏళ్ళ నుంచి చదువుతున్నాను,చాలా మెచ్యూర్డ్ గా ఉంటాయి.అని ఓ పక్క ఆశ్చర్యపోతూ, ఇంకో పక్క అంత పెద్ద రచయిత్రి నాతో మాట్లాడుతారా అని సంశయిస్తూ ముందుకు నడిచాను.

అప్పటికే ఆవిడ ఫేస్ బుక్ లో నా ఫ్రెండ్.ఆవిడ వేసే చిత్రాలు రోజూ చూస్తూ కామెంట్ వ్రాయటం నాకు అలవాటు.ఐనా ఏదో సంశయం తో దగ్గరకు వెళ్ళి ఇద్దరమూ పరిచయం చేసుకున్నాము.ఓ మీరు కమలాపరచానా? రోజూ మీ కామెంట్ కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అన్నారు.నేను ఆశ్చర్యమూ, సంతోషమూ కలగలిసి,ఉబ్బితబ్బీబ్బు ఐపోయాను.అప్పుడే అనుకున్నాను, ఆవిడ మంచిరచయిత్రి,చిత్రకారిణీ నేగాక మంచి స్నేహశీలి అని.

[spacer height=”20px”]

ఆ తరువాత తెలిసింది ఆవిడ మంచి నృత్యకారిణి అని కూడా.ఇక ఆగలేక ఆవిడ పుట్టినరోజున, ఆవిడ ను చాటింగ్ లో పలకరించి,మిమ్మలిని చూస్తూ ఉంటే ఇంత చిన్నగా ఉన్నారు.కాని నేను చాలా ఏళ్ళ నుంచి మీ పుస్తకాలు చదువుతున్నాను అన్నాను.అవునండి నేను జాబ్ నుంచి వాలెంటరీ రిటర్మెంట్ ఈమధ్యనే తీసుకున్నాను.చాలా చిన్నప్పటి నుంచే రచనలు చేస్తున్నాను అన్నారు. మీ మొదటి రచన ఏమిటి అని అడిగాను.ఒక డిటెక్టివ్ నవల, పేరు”పగబట్టిన పడుచు” అని అన్నారు నవ్వుతు. నా పదకొండవ ఏట రాసాను.మా అమ్మ వీపు చీరేసింది అని నవ్వారు. ఏడవ ఏటి నుంచి ఏదోవకటి రాస్తూ ఉండేదానిని అండి. నా మొదటి కథ నా పదహారో ఏట వచ్చింది.25 సంవత్సరాలకే సీనియర్ రైటర్ ను అయ్యాను. నా చిన్నప్పుడు అందరినీ ఇమిటేట్ చేసేదానిని .దానికి కూడా స్కూల్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.స్కూల్ లో బెస్ట్ డాన్సర్ ను కూడా.అన్నీ నేర్చుకోవాలని తపనగా ఉండేది.అని చెప్పారు.ఆవిడ వ్రాసిన చాలా నవలలకి, కథలకూ బహుమతులు వచ్చాయి.బుల్లితెర స్క్రిప్ట్ లల్లోనూ ఆవిడది అందె వేసిన చేయి.అందులోనూ రెండు నంది అవార్డులు అందుకున్నారు.బహుముఖప్రజ్ఞాశాలి మన్నెంశారద!

మన్నెంశారదగారి పుస్తకాలు ఈ మధ్య “చిగురాకులరెపరెపలు”,”మహారాజశ్రీ మామ్మగారు”చదివాను.చిగురాకులరెపరెపలు లో ఏడు సంవత్సరాల పాప అల్లరి గురించి వ్రాశారు.ఆ పాప చాలా ఆక్టివ్.ఒకరకంగా చెప్పాలంటే హైపర్ ఆక్టివ్.ఒక చిన్నపాప అంత ధైర్యంగా,భయం లేకుండా ఉండగలదు అని ఊహించను కూడా ఊహించలేము.ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆరాటం, అన్నీ నేర్చుకొని ప్రదర్శించాలి, మెప్పుపొందాలనే తపన,ఓవిధమైన మొండితనం ఆ పాప లక్షణాలు.అక్కలిద్దరికీ డాన్స్ నేర్పిస్తున్నారు, నాకు నేర్పించమంటే నేర్పించటంలేదు అని, అక్కలు నేర్చుకుంటుండగా పక్కన కూర్చొని,దీక్షగా చూసి,పెరట్లో ప్రాక్టీస్ చేసి డాన్స్ లో నైపుణ్యం సంపాదిస్తుంది.స్కూల్ ప్రోగ్రాం లో అక్కల నృత్యప్రదర్శన అనోన్స్ చేస్తే, వాళ్ళు వచ్చేలోపల తను స్టేజ్ మీదకు వచ్చి డాన్స్ చేసి అందరి మెప్పూ పొందుతుంది.

[spacer height=”20px”]పెరట్లో నీళ్ళబావి మీద కర్రలు అడ్డంగా పరిపిస్తారు ఇంటావిడ.అందులో ఏముందో చూడాలని ఆరాటము.పెద్దవాళ్ళందరూ నిద్రపోతుండగా ఆ కర్రలకు అటోచేయి, ఇటోచేయి వేసి మధ్యలో ఉయ్యాలలాఊగుతుంది.అమ్మో ఆ సంఘటన చదువుతుంటేనే వళ్ళు గగుర్పొడచటం లేదూ! నేల పగుళ్ళలోనుంచి కొద్దిగా ఏదో తాడులా బయటకు వచ్చి కదులుతుంటే అదేమిటో నని తెగ లాగుతుంది.వదలగానే ఆ తాడు ఊగటము,వదలటం, ఊపటం ఓ ఆట ఆడుతూ ఉంటుంది.పనివాళ్ళు చూసి అదేమిటా అని చిన్నగా తవ్వుతూ పోతే అదో పెద్ద కొండచిలువ! బాబోయ్ రాస్తుంటేనే నా చేతులు వణికిపోతున్నాయి.ఒకటా రెండా ఇలాంటి చిలిపి(?)అల్లరులు ఆ పాప చాలా చేస్తుంది.తల్లి చేత నిర్లఖ్యము చేయబడి,కఠినంగా దండించబడితే పిల్లల మనస్తత్వము ఎలా తయారవుతుంది, ఏమి చేసినా అమ్మ కొడుతుంది, ఇక చేయకుండావుండటం ఎందుకు అనే మొండితనం పిల్లలో ఎట్లా వస్తుందో ఈ కథల ద్వారా చెబుతారు రచయిత్రి.కాకపోతే కొంత మంది చెడు తోవలోనూపోవచ్చు, అదృష్టవసాత్తు ఈ పాప మంచి దారినే వెళుతుంది.

ఇంక రెండో నవల “మహారాజశ్రీ మామ్మగారు .”ఇది చదివాక ,దీనిమీద సమీక్ష రాద్దామని నిర్ణయించుకున్నప్పుడు,అసలు రచయిత్రి ఈ నవల గురించి ఏమి చెబుతారో తెలుసుకోవాలినుకున్నాను.వెంటనే కాల్ చేసి ,” ఈ నవల వ్రాయటము లో మీ ఉధేశ్యం ఏమిటి? ఇందులో మీకు నచ్చిన పాత్ర ఏమిటి? ఆ పాత్ర ఎందుకు నచ్చింది?” అని అడిగాను.

“ముందుగా ఒక హాస్య నవల వ్రాయాలనుకున్నాను.వ్రాసాను.అంతే. ఇది ఆంధ్రప్రభ డెయిలీ పేపర్ లో యాభైరోజులు ధారావాహికం గా వచ్చింది.అప్పట్లో రచయితలకు ఎప్పటిదప్పుడు రాసిచ్చే అవకాశం ఉండేది.అందువలన ఏ రోజు స్క్రిప్ట్ ఆ రోజు వ్రాసి ఆఫీస్ కు వెళ్ళి ఇచ్చివస్తూ ఉండేదానిని.స్క్రిప్ట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్టాఫ్ నన్ను చూసి నవ్వుకుంటుండేవారు.మొదట్లో కంగారుపడ్డాను.అది నవల ప్రభావని తెలిసి సదుకున్నాను.ఇక నాకు నచ్చిన పాత్రలంటే, మామ్మగారు, విప్లవం.స్త్రీ శారీరికంగా బలహీనురాలు కావచ్చు కాని , మానసికంగా బలవంతురాలు.తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆ బలమైన వ్యక్తిత్వమే మామ్మగారిలో చూపించాను.ధర్మరాజు మోసగాడు అని తెలీగానే మనవరాలిని తీసుకొని అజ్ఞాతం లోకి వెళుతుంది.కష్టపడి మనవరాలిని పెంచి , చదివిస్తుంది.పోయిన జమిందారీని తిరిగి తెచ్చుకునేందుకు వంటరిగా పోరాడి గెలుస్తుంది.ఇక విప్లవం.ఆమె చెప్పే ప్రతిదీ నిజమే.32 సంవత్సరాల పెళ్ళి కూతురు సిగ్గుపడుతూ, బుట్టలో కూర్చోవటం ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది.పెళ్ళిల్లకు అంతంత ఖర్చులు అవసరమా?ఇలాంటి భావాలన్ని కరెక్టే.కాకపోతే హాస్యం కోసం , తలలో ప్రేమలేఖపడటం,కవిత్వం వ్రాయటం మొదలైనవి చిత్రీకరించాను.నిషీల్ పాత్ర చివరలో ప్రవేశపెట్టాను.”అన్నారు.చదివాక మీకెలా అనిపించింది? అని అడిగారు

“.అవును నిజమే నాకు కూడా మామ్మగారు దుర్గమ్మగారి పాత్ర నచ్చింది. ఆవిడ ధైర్యం, ఆవిడ ఐడియాలు చాలా నచ్చాయి.అమాయకమైన హరిణి పాత్ర కూడా నచ్చింది.ఒకటి అని కాదు అన్ని పాత్రలూ బాగున్నాయి.కాక్పోతే ముగింపు కొంచం హడావిడిగా ముగించినట్టు అనిపించింది “అన్నాను.

“నిజమేనండి నాకూ అనిపించింది.కాని యాభైరోజులు అనుకున్నారు.మొదట్లో కొంచం వివరణ ఎక్కువైంది, చివరలో కొంచం తొందరగా అయ్యింది.బాగాలేదా?” అని అడిగారు.

“లేదండి.కథలో ఔచిత్యం ఏమీ తగ్గలేదు.ముగింపు కూడా బాగుంది.ఆద్యంతమూ బాగా నవ్వించారు.మీరు, నేను అడిగినందుకు ఏమీ అనుకోకుండా మీ అభిప్రాయాలు చెప్పారు.చాలా థాంక్స్ అండి” అని చెప్పి ముగించాను.

నా అంతట నేను పుస్తకము చదువుకొని సమీక్షించుకోవటము కాకుండా రచయిత అభిప్రాయము తెలుసుకుందామనిపించింది.తెలుసుకున్నది మీతో పంచుకోవాలనిపించింది.ఇక నేను చెప్పేదేముంది.రచయతను స్వయముగా కలుసుకొని , వాళ్ళ చేతి నుంచే పుస్తకం అందుకోవటము, భావాలు రచయతతో పంచుకోవటము మంచి అనుభూతిని ఇచ్చింది.థాంక్ యూ శారదగారు.

జే.వి.పబ్లికేషన్ ద్వారా వచ్చిన ఈ పుస్తకాల ప్రతులు అన్ని పుస్తకాల షాపులల్లోనూ లభ్యం అవుతాయి.

– మాలా కుమార్

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
జనవరి 2 న ప్రచురించాల్సిన సమీక్ష ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాం – విహంగ

పుస్తక పరిచయం, ముఖాముఖిPermalink

6 Responses to చిగురాకు రెపరెపలు మరియు మహారాజశ్రీ మామ్మగారు

Leave a Reply to Nandoori Sundari Nagamani Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో