ఇదేనా ప్రేమంటే!(కవిత )- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

ఇదేనా ప్రేమంటే!
విభిన్న ద్రువాల్లాంటి ఆడ,మగా
విచిత్రమైన ఆకర్షణకు లోనవటమేనా ప్రేమంటే?
పైపై మెరుగుల భ్రమలోపడి
కన్నవారినుండి కర్కశంగా విడిపోవటమేనా ప్రేమంటే?
పెద్దల కట్టడిని కాలతన్ని
విచ్చలవిడిగా వ్యవహరించటమేనా ప్రేమంటే?
వేసిన తప్పటడుగులను వెనక్కి తీసుకోలేక
విరక్తితో విలపించటమేనా ప్రేమంటే?
పరువుమర్యాదల మాట మరిచి
పెడదారిలో పయనించటమేనా ప్రేమంటే?
ఆకతాయి ఆత్రాల వెంట పరుగులు తీయటమేనా ప్రేమంటే?
మొన్న కలుసుకోవటం,నిన్న నచ్చుకోవటం,
నేడు ఒకటవటం,రేపు విడిపోవటమేనా ప్రేమంటే?

– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to ఇదేనా ప్రేమంటే!(కవిత )- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.ప్రేమ ప్రేమను ప్రేమించడానికి ప్రేమిస్తుంది.
    ప్రేమను ప్రేమించినప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. శ్రీ శ్రీ