విహంగ ఆరవ వార్షికోత్సవం- అంతర్జాలంలో తెలుగు సాహిత్యం -జాతీయ సదస్సు 11/1/2017

 ఈనెల11అంతర్జాల తొలి తెలుగు మహిళాపత్రిక ”విహంగ’ ‘ 6వవార్షికోత్సవo  సందర్భంగా మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్యఅకాడమీ, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,సాహిత్యపీఠం ,బొమ్మూరు, రాజమండ్రి సంయుక్తనిర్వహణలో జాతీయసదస్సు నిర్వహించారు.ఎండ్లూరి మానస ఆహ్వానం పలికారు.కార్యక్రమానికి పొట్టిశ్రీరాములు ఉపాధ్యక్షులు  ఆచార్యఎస్.వి.సత్యనారాయణ గారు ముఖ్యఅతిధిగా,అధ్యక్షులుగా ఆచార్యఎండ్లూరి సుధాకర్ గారు ,కన్వీనర్ డా.పుట్లహేమలతగారు పాల్గొన్నారు

              ఉపాధ్యక్షులు ఎస్వీ సత్యనారాయణగారు,సంఘ సేవకులు శ్రీ పట్టపగలువెంకట్రావు గారు ,సాహిత్యపీఠం పీఠాధిపతి ఆచార్యఎండ్లూరిసుధాకర్ గారు ,డా.పుట్లహేమలతగారు  జ్యోతి ప్రజ్వలన చేసారు.ఆచార్యఎస్.వి.సత్యనారాయణ గారు మాట్లాడుతూ అంతర్జాలసాహిత్యంపై ప్రసంగిస్తూ అరచేతుల్లో సమాచారం,సాహిత్యం అందుబాటులో ఉందన్నారు.కాలంతో పాటు పరుగెత్తటం విశేషం కాదు కాలం కంటే  ఒక అడుగు ముందుకు నడుస్తే అది విశేషం అన్నారు.రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మాట్లాడుతూ అంతర్జాల సాహిత్యం పై జరిగే మొదటి సదస్సు ఇదే అన్నారు.

ఈ సదస్సు కన్వీనర్ డా.పుట్ల హేమలత గారు మాట్లాడుతూ అంతర్జాల సాహిత్యం పై అందరికి అవగాహన కల్పించటం కోసం ఈ జాతీయ సదస్సు ఏర్పాటు చేశామన్నారు.ఈ సభలో మొదటి సదస్సుకు డా .దార్ల వెంకటేశ్వరరావు గారు అంతర్జాల సాహిత్యం లో సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి మాట్లాడారు,రెండవ సదస్సు కు డా .షమీ ఉల్లా అంతర్జాల సాహిత్యoలో పత్రికల ప్రాముఖ్యాన్ని తెలియజేసారు . మూడవ సదస్సుకు శ్రీ విక్టర్ విజయ్ కుమార్ ,నాల్గవ సదస్సుకు డా .ఇక్భాల్ చంద్ గారు ఐ.టి .రంగంలో సాహిత్యాభివృద్ధి గురించి చర్చా కార్యక్రమం చాలా ఆసక్తిగా ఛలోక్తులతో కొనసాగింది . 

అనేక మంది పరిశోధకులు పాల్గొని పత్ర సమర్పణ చేసి ప్రశంస పత్రాలను అందుకున్నారు.ఈ సదస్సులో ప్రత్యేక కార్యక్రమంగా విహంగ పత్రికలో ఆయా విభాగాల్లో రచనలు చేసిన వారికి “విహంగ సాహిత్య పురస్కారo” ను ప్రదానం చేశారు.”విహంగ సాహితీ పురస్కారo”ని  వరలక్ష్మి ,కె .గీత ,గబ్బిట దుర్గా ప్రసాద్ ,డా.దార్ల వెంకటేశ్వరరావు,డా.షమీఉల్లా ,లక్ష్మి సుహాసిని ,విజయ భాను కోటే , బొడ్డు మహేందర్ అందుకున్నారు.  విహంగకి సాంకేతిక సహకారం అందిస్తున్న వర్కింగ్ ఎడిటర్స్ అరసి , పెరుమాళ్ళ రవికుమార్ పురస్కారాలు అందుకున్నారు.మల్లిపూడి వనజ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

[supsystic-slider id=5 ]

సాహిత్య సమావేశాలు, Permalink

Comments are closed.