గండం-జాని.తక్కెడశిల

 

ఘడియ ఘడియ గండం..!!
కామ కన్నులతో చూసే వాడి నుండి గండం..!!
నీచ స్పర్శతో తృప్తిపడే వాడి నుండి గండం..!!
కారు కూతలతో బాధించే వాడి నుండి గండం..!!

పల్లె అయిన పట్టణము అయిన..!!
వాడవాడల ప్రతి గల్లిలో..!!
నికృష్టుడొక్కడు ఉండనే ఉంటాడు..!!
మదమెక్కి మృగమై తిరుగుతున్నాడు..!!

వావి వరసలు మరచి..!!
కన్నబిడ్డను కోరువాడొక్కడు..!!
పసిపిల్లను చెరచువాడొక్కడు..!!
శీలాన్ని వేలానికి పెట్టువాడొక్కడు..!!

పిండదశలోనే..!!
నాపై దండయాత్రలు..!!
బడిలో..పార్కులో..!!
నడిరోడ్డుపై సాముహిక అత్యాచారాలు..!!

ప్రేమోన్మాదుల  యాసిడ్ దాడులు నుండి..!!
నట్టింట నరకంచూపించే కసాయి భర్తనుండి..!!
జీవముండగానే కాటికిచేర్చే బిడ్డల నుండి..!!
ఎవరు కాపాడెదరు నన్ను రక్షరక్ష..!!

ఏచట్టం కాపాడుతుంది..!!
ఈ మృగాల బారి నుండి..!!
ఈ ఆటవిక సమాజం నుండి..!!
మేము..! మనుషులమేకదా..!!
మరి మాకెందుకీ శిక్ష….!!

                                 -జాని.తక్కెడశిల ,,ప్రతిలిపి (తెలుగు విభాగం)

                                 బెంగళూరు,మొబైల్ –7259511956

———————————————————————————————————————————

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో