బహుజనులు తమ రచనల్లో ఏమి రాయాలి? (వ్యాసం ) – జ్వలిత

                          ‘‘విద్య ద్వారా సముపార్జించినటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారు ఈ విశ్వాన్ని శాసిస్తారు’’ అని 1848 వ సంవత్సరంలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పాడు.

                           ‘‘ఉత్పత్తి సాధనాలపై ఎవరిెకైతే అజమాయిషీ ఉంటుందో వారు ఈ ప్రపంచాన్ని శాసిస్తారు’’ అని కారల్‌ మార్క్స్‌ 1850 లో చెప్పారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మార్క్స్  కున్న ప్రచారం పూలేకు జరగలేదు. దానికి కారణమేమిటో మనం అర్థం చేసుకోవాలి.

                            బహుజనులు  (ఎస్‌.సీ, ఎస్‌.టీ, బీ.సీ, మైనారిటీ) అంతా ఈ దేశపు ‘మూల  వాసీలు ’ దేశ జనాభాలో 95 శాతం వున్న బహుజనులను 5 శాతం ఉన్న మనువాదులు  కొన్నివందల  సంవత్సరాలుగా బానిసలుగా పరికరాలుగా, ఓటర్లుగా వాళ్లకు అనుగుణంగా మార్చుకుని పాలన కొనసాగిస్తున్నారు.

                            ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు ఏం జరుగుతున్నదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటాడు. గట్టు మీద ఉన్న వాడే ప్రమాదం పసిగట్టగడు. ప్రత్యామ్నాయం ఆలోచించి సహాయం చేయగలడు. నిన్నటి వరకు బహుజనులంతా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన వాళ్లే .అయోమయంలో ఉన్న వాళ్లే. జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ వంటి వారు ఇంగ్లీషు వారి మిషనరీ విద్యవల్ల  మనువాదులు  చేసిన కుట్రను, వారి ద్రోహపూరిత వ్యూహాలను అర్ధం చేసుకుని ‘‘పుట్టుకతో అందరూ సమానమే, అందరూ అన్ని పనులు  చేయగలరు’’ అని ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.

                            చైతన్యపరచడమనే ప్రక్రియ సుదీర్ఘంగా నిరంతరం కొనసాగించవలిసినది. ఏదో ఒక సమయంలో సందర్భంలో రచనలు  చేయడం, సంకలనాలను వేయడంతో పూర్తయ్యేది కాదు.ఐదు శాతం మను(వు)షులు  ఎక్కడి నుండో వలస వచ్చి పుక్కిటి పురాణాలతో, ఆధ్యాత్మికత పేరుతో మూడు కోట్ల దేవుళ్ల పేరుతో మతం మత్తెక్కించి బహుజనులను విభజించి అణిచి వేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, వారి అధికారం ముందు తలెత్తిన వారిని వెంటపడి వేటాడుతుంటే ‘మనని కాదులే’ అని తమలో ఒకరి ‘బలి’కి అంగీకరిస్తూ వారిని బలపరిచిన వాళ్ళు శూద్రులు అతిశూద్రులు . వాడిపాప భీతికి, కర్మ సిద్ధాంతానికి భయపడి పరలోక సుఖానికి ఆశపడి వాడికి లొంగిపోయిన వాళ్ళు బహుజనులు .

                           గొర్రెలతో కలిసి పెరిగిన పులిపిల్లలా  మూలాలను మరిచి మనువాదులు  నిర్ధేశించిన ఆచార వ్యవహారాలను నిజమని నమ్మి అంగీకరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. మొక్కుబడులు   చెల్లిస్తున్నారు, కానుకలు ఆర్పిస్తున్నారు. వారికి సుఖాన్ని, సౌకర్యాన్ని అందించే ధర్మసూత్రాలను రాసి ఏ కాలంలో కూడా వారి జీవితాలకు భంగం రాకుండా విగ్రహారాధన, దేవాలయ నిర్మాణం, దేవుళ్ల పేరు మీద మాన్యాలను ఏర్పాటు చేసుకుని దేవ దాసీలను సృష్టించుకుని అధికారికంగా, ఆర్థికంగా, లైంగికంగా,అనువైన సుఖాలను ఏర్పాటు చేసుకుని అహంకారంతో బహుజనులను అణిచి వేస్తుంటే అనుభవించారు. వారు సృష్టించిన పాపభీతితో కళ్లు మూసుకొన్నారు. శూద్రులకు విద్య నిషిద్ధమని , స్త్రీల కు విద్యనిషిద్ధమని  వారి చిలక పలుకులతో శూద్రులను చీకట్లోకి నెట్టి సకల సుఖాలతో కాలం  వెళ్లబుచ్చుకున్నారు.

                       దాదాపు రెండు వందల కులాల  బానిసలుగా బీసీలు  చేతివృత్తులతో వస్తుత్పత్తులు చేసి ఐదు శాతం ఉన్న వారికి సేవలు   చేస్తూ ఉత్పత్తి కులాలుగా, సేవా కులాలుగా మిగిలి పోయారు. తమ గురించి తమ సేవ గురించి తమ పై జరిగిన దోపిడీ గురించి, తమ అణిచివేత గురించి మాట్లాడే అవకాశమే లేని చోట సాహిత్య సృష్టి జరగలేదనే చెప్పవచ్చు. కొండొకచో ప్రస్తావించబడినా అలంకార ప్రాయంగా పౌడరద్దినట్లే కాని మరొకటి కాదు.

                        వేటగాడు చెప్పే కథలో కల్పిత పిట్ట కథలే వుంటాయి. సింహాలు  వేటగాడి దోపిడీ గురించి వేటగాడిని ఎదుర్కొని నిలిచిన కథలు  రాయవలసి ఉన్నది. విజేత కథలు  చదివాం. ఓడిపోయిన వారి కథలు  అంటే బహుజనుల  కథలు  రాసుకోవాలి.

                           జనాభాలో 95 శాతం ఉన్న బహుజనులంతా (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీలు ) ఐక్యంగా వ్యూహాత్మకంగా కార్యచరణ యోగ్యమైన ప్రణాళికను సిద్ధం చేసుకునే రచనలు  రావాలి. తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలకు ప్రత్యామ్నాయం రాజ్యాధికారమే. ‘పొలిటికల్‌ పవర్‌ ఈస్‌ ద మాష్టర్‌ కీ’ అన్న అంబేద్కర్‌ సూక్తి మార్గదర్శకం. చట్ట సభల్లో తమ గళాన్ని వినిపించి, తమ సంక్షేమాన్ని కోరే రాజకీయ ప్రతినిధులను తయారు చేసే సాహిత్యం రావాలి. తమకు సంక్షేమాన్ని కలిగించే అభివృద్ధి పథకాలు రాయాలి. వాటి అమలుకు నిధులు  కేటాయించి అమలు  పరిచేందుకు కావల్సిన మార్గ దర్శకాలతో కూడిన రచనలు రావాలి. అందు కోసం కావల్సిన కార్యాచరణను సిద్ధపరుచుకునే రచనలు  రావాలి. సమాచార సేకరణ జరగాలి. పరిశోధన జరగాలి. పర్యటనలు జరగాలి. ఏ.సి. గదుల్లో కూర్చోని వేటగాళ్లు రాసిన కాకి లెక్కలు ముందు పెట్టుకుని తయారు చేసే ‘ఎంటిక చిక్కు’ వంటి రచనల వల్ల చైతన్యం రాకపోగా ప్రాథమిక అవగాహన లేని వారికి అయోమయాన్ని కలిగిస్తుంది. గందరగోళం సృష్టిస్తుంది. అనైక్యత మిగులుతుంది. అవగాహన లేని కార్యకర్తలు , నిబద్ధతలేని మేధావులు ఇటువంటి సాహిత్యద్యోమానికి కీడు కలిగిస్తారు. వారు రోగగ్రస్తశరీరం వంటి వారు . రోగ నిరోధక శక్తికి వీరు ప్రతినిధులమంటూ వ్యాధిని మోసుకొచ్చే వాహకాలుగా  మొత్తానికి  నష్టం కలిగిస్తారు .
                          పూలే దంపతులు బ్రాహ్మణ సమూహాల  పీష్వాల  నుండి సమాజాన్ని రక్షించేందుకు చైతన్య పరిచేందుకు విద్య ఒక్కటే ఆయుధమని గ్రహించి అందరికీ విద్య అందించే ప్రయత్నం చేశారు. జీవిత కాలం  కృషి చేశారు.భాగ్యరెడ్డి వర్మ అనేక సభలను నిర్వహించి ఆది హిందూ మహాసభ ద్వారా 2400 ఉపన్యాసాలతో నిరంతర శ్రమతో నాటి సమాజాన్ని చైతన్య పరిచాడు. 1931 జనాభా లెక్కల్లో శూద్రులను కూడా చేర్చగలిగాడు.

                          అంబేద్కర్‌ అధ్యయనం చేస్తూ అనేక వేల  ఉపన్యాసాలతో లక్షల  మందిని బౌద్ధం వైపు మళ్లించగలిగాడు. స్వయంగా  బౌద్ధాన్ని  స్వీకరించి ప్రజలకు ముఖ్యంగా శూద్రులకు అవసరమైన మార్గదర్శకం చేశాడు.మాన్య కాన్షీరామ్‌ బహుజనులకు రాజ్యాధికారం కోసం జీవితకాలం  కృషిచేసి విజయవంతం అయ్యారు ఉత్తర్‌ ప్రదేశ్‌లో.

                           విద్య అంటే అక్షర జ్ఞానమొక్కటే అనే అజ్ఞానంలో ఉన్న అత్యధిక శూద్ర ప్రజలను మనువాదులు  ఉపయోగించుకుంటున్నారు. లౌకిక ప్రజాస్వామిక దేశమయిన భారత దేశంలో సరస్వతీ శిశుమందిర్‌ వంటి సంస్థ ద్వారా అనేక మందిని మనువాదానికి అనుచరులను తయారు చేస్తూ బహుజనులను విడదీశారు. ఊహ తెలిసినప్పటి నుండి ఛాందస భావజాలాన్ని పెంచుకున్న వారిని చైతన్యపరచడం కష్టమే కాని అసాధ్యమేమి కాదు.

                            లౌకిక రాజ్యంలో పాఠశాలల్లో మత పరమైన హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలను రామాయణం ద్వారా, భారత భాగవతా ద్వారా సనాతన మనువాదాన్ని బాహాటంగా ప్రచారం చేస్తున్నా నిస్సహాయంగా చూస్తున్నారు బహుజనులు .అందుకు భిన్నంగా వ్యాసాలు  రచనలు  బహుజన వాదులు చేయగలగాలి. తమ మూలాల  గురించి తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని గురించి మూల వాసులందరిని వలస వచ్చిన మనువాదులు  ఏ విధంగా బానిసలుగా మార్చుకున్నది అంటరానితనం పేరుతో విభజించిన విషయం, శూద్రులతో పై శూద్రులతోే ఏ విధంగా దాడులు  చేయించినది సవివరంగా తెలియజేయాలి. చుండూరు, కారంచేడు, లక్ష్మీపేట సంఘటనలను, న్యాయస్థానాల్లో జరిగిన న్యాయం గురించి సవివరంగా రచనలు  సాగాలి. పురాణాలను ప్రశ్నించినందుకు తపస్సు చేసినందుకు, విద్య నేర్చినందుకు వధించబడిన వారి గాధలను చార్వాకుడు, శంభూకుడు, ఏకలవ్యుడు, శూర్పణక వంటి కథలను బహుజన కోణంలో ప్రచారం చేయవసి ఉన్నది.

                            బహుజనుల  జనాభా ఎంత? విద్యావంతులెందరు? ఎందరు ఏఏ ఉద్యోగాలు  చేశారు? ఎవరు ఎటువంటి సాహిత్యం సృష్టించారు? బహుజనులు  చేసిన ఉద్యమాలు , పాలు  పంచుకున్నవి, నాయకత్వం వహించినవి, సాధించిన విజయాలు , ఓటమి నేర్పిన పాఠాలు , ఓటమికి కారణాలు,  రచనలు , చర్చలు  జరగాలి.

                             చట్ట సభల్లో బహుజనుల  భాగస్వామ్యమెంత,  ఎందరు చట్ట సభల్లోకి వెళ్లగలిగారు . చట్ట సభకు వెళ్లిన వారు ఏ విధంగా కృషి చేశారు. ఆయుధాలు గా మారిన వారు , పరికరాలుగా మారిన వారు, నష్టం కలిగించిన వారు, నష్టపోయిన వారి గురించి అధ్యయనం, ప్రచారం జరగాలి.

                               బహుజనుల్లో కొందరు పీఠాధిపతులు గా ఎందుకు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధికి ప్రధాన శత్రువులెవరు, ఎవరితో యుద్ధం చేయాలి. ఎవరిని వ్యతిరేకించాలి.  ఎవరితో కలిసి పని చేయాలి. ఎవరిని కలుపుకోవాలి. చరిత్ర పాఠాలేమిటి, భవిష్యత్తుకు మార్గాలేమిటి అనేవి రచనల్లో ప్రతిబింబించాలి.

                                అంబేద్కర్‌ అధ్యయనం వల్ల  ఎదిగి మనువాదులకు వత్తాసు పలికే అంబేద్కరిష్టుల  పట్ల ఎలా వ్యవహరించాలి. ఆధిపత్య ధోరణులు  బహుజనుల్లో ఏ విధంగా ఉన్నాయి. వాటిని అధిగమించడం ఎట్లా, విద్య అహంకారాన్నిపెంచినప్పుడు దాన్ని అధిగమించడం కోసం, బహీనతలు  మన సమాజానికి నష్టం కలిగిస్తే ఏమి చేయాలి. ఎటువంటి ప్రలోభాలకులోను కాకుండా తక్షణ సమస్యలకు స్పoదించే రచనలు  ఏ విధంగా చేయాలనేందుకు ఇటువంటి సభలు  తరుచూ జరగాలి ప్రత్యేకంగా పత్రికలు  నడుపుకోగలగాలి.

                                ఎవరి మీదో అక్కసు వెళ్లగక్కేందుకు కాకుండా బహుజనులను చైతన్యపరిచేందుకు రచనలు  కొనసాగాలి. అంతర్జాలలో జరుగుతున్న చర్చల్లో కూడా పాలుపంచుకోవాలి. చెట్టులాగా బహుజన వాదం విస్తరించాలి. రాజ్యాధికారానికి మార్గం చూపే బోధవృక్షమయి జ్ఞాన ప్రచారం చేయాలి.

                               రెక్కాడితేనే డొక్కాడని  కులాలు  విద్య, ఉపాధి లేక ఎటువంటి అధ్యయనం తెలియక చర్చల్లో పాల్గొనక ఒంటరిగా అజ్ఞాన సముద్రంలో మునిగి ఉన్నారు. కుల సంఘాలు  పెట్టిన కొద్ది మంది అర్ధ సమాచారం, అనవసర సమాచారంతో వారిని అయోమయానికి గురి చేశారు. దానికి తోడు అనాదిగా ఒంటరిగా మిగిలి ఎదిగిన అసహాయత, ఆత్మన్యూనత నలుగురికి దూరంగా వారిని ఉంచింది. ఎవరేది చెప్పినా నమ్మే అమాయకత్వం నూరిపోసిన కర్మ సిద్ధాంతం, పాపం, పుణ్యం అందించి లౌక్యం తెలియని పరివర్తన ‘ కడుపు ` కడప` పడక’ తప్ప మరో ప్రపంచం తెలియదు. తమ తాత నుండి నేర్చిన వృత్తి నైపుణ్యం, అందించిన అహంకార పొరలకు అందుబాటులో ఉన్న మద్యం మత్తు ఇదే వారి జీవితం. సేవ చేయడం బాధ్యతని, మోస పోవడం కర్మని కాలం  నెట్టుకొస్తున్న వాళ్లు ఎక్కువ శాతం బీసీలు  పూలేను, అంబేద్కర్‌ను చదవరు. పోతులూరిని దేవుడిని చేస్తారు. కొన్ని కులాలు  జంజాలున్నాయి కనుక మేము కూడా బ్రాహ్మలే అంటూ మనువుకు ప్రతీకవుతారు.

                                సరైన నాయకుడు లేడు. వాళ్లని పట్టించుకున్న అంబేద్కర్‌ లేడు. వాళ్లకు నేర్పే ప్రవీణ్‌ కుమార్‌ లేడు. మార్గదర్శకమయ్యే కాన్షీరామ్‌ లేడు. కొద్దో, గొప్పో చదువుకున్న బీసీ మేధావులు వారిని చైతన్య పరిచే ప్రయత్నం చెయ్యరు. లెప్ట్‌ పార్టీ వల్ల చైతన్యమయిన బీసీ నాయకులు ఓటర్ల బ్యాంక్‌ను తయారు చేసే పరికరాలు , కొంతమంది చిత్త శుద్ధితో ప్రయత్నం చేసిన విడదీసే శక్తులు   బలంగా పని చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల ఆచార్యులు  చారిత్రక ప్రతీకను ప్రతిభావంతంగా ప్రచారంలో పెట్టారు. ప్రాజెక్టు వాటి ఆదాయం కోసం ఏవో సమావేశాలు , ఏవో రాజకీయ లబ్ధి కోసం పెడ్తారు కొందరు బీసీ నాయకులు . అనాధికారమైన సైన్యం కొందరు.‘కంచె’ వంటి సినిమాలు  చైతన్యపరచడానికి ఉపయోగ పడతాయి.

                                 బహుజనుల  రచనల్లో ఉపన్యాసాల్లో భావాలతో పాటు భాష ,శైలి కూడా బహుజన అస్తిత్వాన్ని ప్రతిబింబించాలి. కర్మ, అదృష్టం అగ్రకులాలు  వంటి పదాలు  ఉపయోగించ వద్దు. స్త్రీ పట్ల సమభావన, శ్రమను గౌరవించడం ,సమానావకాశాలు  అందించే ప్రగతిశీల  రచనకు ప్రాధాన్యత నివ్వాలి.

                                 జనాభాలో అధికంగా ఉండి కూడా చైతన్యం లేని బీసీలను అంతకు ముందే చైతన్యవంతులైన దళితులు  కలుపుకు పోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారంలో వాటాకు ఓటర్లయిన వారిని చైతన్యవంతం చేయడం ద్వారా బహుజన సంక్షేమాన్ని కూర్చే ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవచ్చు.

                                ఆధిపత్యాలు మాత్రమే లక్ష్యంగా సాగే సమూహాలను నడిపే స్వార్ధం మాత్రమే . సంక్షేమం  లక్ష్యంగా సాగే సమూహాలు బహుజనుల కోసం ఆలోచిస్తాయి  అనవచ్చు . బహుజనుల   ఐక్యత  వర్దిల్లాలి . జై భీం , జై జై మూలవాసీ.

– జ్వలిత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

16 Responses to బహుజనులు తమ రచనల్లో ఏమి రాయాలి? (వ్యాసం ) – జ్వలిత

 1. JWALITHA says:

  హరిబాబుగారు
  పైన తేదీలు చూసి ఆవేశ పడండి

  శ్రీనివాసుగారు ధన్యవాదాలు రోజూ పోష్టులు చూడడం నాకు వీలు పడదు

  • శ్రీనివాసుడు says:

   మంచిదండి. సావకాశంగా అన్ని లంకెలలోని సమాచారం చదివి మీ అభిప్రాయాన్ని మీకు వీలున్నప్పుడు తెలపండి. తొందరేం లేదు. ఇంకో వంద పేజీల సమాచారం సిద్ధంగా వుంది, జన్యు, పురాతత్త్వ, భాషాశాస్త్ర వివరణలతో సహా. మీరు అవన్నీ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత చాలకపోతే ఇవి కూడా పంపుతాను.

   • జ్వలిత says:

    ధన్యవాదాలు సర్

    నాకు జ్ఞానాన్ని పెంచాలి పంచాలి అనే మీ ఆతృతకు.

    • శ్రీనివాసుడు says:

     జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా, పంచుకోవాలన్నా మన మెదళ్ళు ఏ రకమైన భావజాలాలతో ఆవృతం కాకుండా, నిబంధం కాకుండా వుండాలండీ.

     మీరు అలా అనావృతంగా వున్నారని భావిస్తూ

     మీకిప్పటివరకూ అర్థమయిన ఏ విషయానికైనా మరోవైపు చూడాలని మీరు భావిస్తే ఈ జాలగూడును దర్శించగలరు.
     ఇప్పటికే దర్శించివుంటే సంతోషం.

     http://www.manushi.in/

     మధుకిష్వర్ గారి జాలగూడు.

 2. శ్రీనివాసుడు says:

  10 Reasons Why Ambedkar Would Not Get Along Very Well With ‘Periyar’
  http://swarajyamag.com/politics/10-reasons-why-ambedkar-would-not-get-along-very-well-with-periyar

 3. శ్రీనివాసుడు says:

  నాకొక సందేహం. ముస్లింల గురించి అంబేడ్కర్ భావాలతో మీరెంతవరకూ ఏకీభవిస్తారు? మన దేశంలో బుద్ధిజం రూపుమాసిపోవడానికి కారణం ఇస్లాం, మరియు ముస్లిం దురాక్రమణదారులు అనే విషయాలను మీరు అంగీకరిస్తారా? ప్రపంచంలో ప్రస్తుతం ఇస్లాం వున్న అనేక దేశాలలోని పూర్వ మూలవాసుల సంస్కృతి,. అనేక నాగరికతలు, భాషలు, మతాలు రూపుమాసిపోవడానికి ఇస్లాం కారణం అన్న విషయాన్ని మీరు అంగీకరిస్తారా?

  Dr. Ambedkar’s views on Islam and Indian Muslims by A. P. Joshi
  http://www.esamskriti.com/essays/pdf/drAmbedkaronIslam.pdf

  When Dr Babasaheb Ambedkar and his followers decided to reject hinduism for all the tyranny and the humiliations that the upper castes had heaped upon the lower castes over the centuries ,there were plenty of offers for him to convert to islam from muslim leaders eager to increase their fold .

  These leaders held out the promise of equality that islam was supposed to give and promised that dalits would lead a life of equal rights if they converted to islam ,something that was denied to them in hinduism.

  But Babasaheb decisively rejected islam …..

  Following are the reasons why–

  Ambedkar was critical of Islam and its practices in South Asia. While justifying the Partition of India, he condemned the practice of child marriage in Muslim society, as well as the mistreatment of women.

  He said,

  ” No words can adequately express the great and many evils of polygamy and concubinage, and especially as a source of misery to a Muslim woman. Take the caste system. Everybody infers that Islam must be free from slavery and caste.[While slavery existed], much of its support was derived from Islam and Islamic countries. While the prescriptions by the Prophet regarding the just and humane treatment of slaves contained in the Koran are praiseworthy, there is nothing whatever in Islam that lends support to the abolition of this curse. But if slavery has gone, caste among Musalmans [Muslims] has remained. ”

  He wrote that Muslim society is “even more full of social evils than Hindu Society is” and criticized Muslims for sugarcoating their sectarian caste system with euphemisms like “brotherhood”. He also criticized the discrimination against the Arzal classes among Muslims who were regarded as “degraded”, as well as the oppression of women in Muslim society through the oppressive purdah system. He alleged that while Purdah was also practiced by Hindus, only among Muslims was it sanctioned by religion. He criticized their fanaticism regarding Islam on the grounds that their literalist interpretations of Islamic doctrine made their society very rigid and impermeable to change. He further wrote that Indian Muslims have failed to reform their society unlike Muslims in other countries like Turkey.

  In a “communal malaise”, both groups [Hindus and Muslims] ignore the urgent claims of social justice.

  http://en.wikipedia.org/wiki/B._R._Ambedkar

  Unlike the opponents of Hinduism who blame Hindus for the decline of Buddhism in India on baseless ground, Babsaheb considered Islam to be responsible for the fall of Buddhism. Dr. BR Ambedkar writes, “There is no doubt that the fall of Buddhism in India was due to the invasions of the Musalmans. Islam came out as the enemy of the ‘But’. The word ‘But’ as everybody knows is an Arabic word and means an idol. Not many people however know what the derivation of the word ‘But’ is. ‘But’ is the Arabic corruption of Buddha. Thus the origin of the word indicates that in the Muslim mind idol worship had come to be identified with the religion of the Budhha.” On the issue of destruction of Buddhist monasteries he writes, “The Musalman invaders sacked the Budhhist Universities of Nalanda, Vikramasila, Jagaddala, Odantapuri to name only a few. They razed to the ground Budhhist monasteries with which the country was studded.” Babasaheb further writes, “Such was the slaughter of the Budhhist priesthood perpetrated by the Islamic invaders. The axe was struck at the very root. For by killing the Budhhist priesthood Islam killed Budhhism.”

  http://voi.org/history/general/bodhi…ar/page-3.html
  __________________

 4. శ్రీనివాసుడు says:

  12 Facts That Prove Aryan Invasion Theory Is Merely A Well-Designed Propaganda

  http://topyaps.com/aryan-invasion

  ఇవేగాక మీకు ఇంకా ఆధారాలు కావాలంటే ఇంకొక వేయి పేజీల సమాచారం వున్నది.

  ఇదేగాక, మీకు ఆసక్తి కలిగించే ఇంకొక విషయం గురించిన వ్యాసం కూడా యిస్తున్నాను.
  The recent controversy about a group named “Ambedkar-Periyar Study Circle” being derecognised by the IIT-Madras administration has brought to light the modus-operandi of Leftist groups in academic institutions. One of the ways in which Leftist groups operate is by appropriating the legacy and names of famous icons, even if the stated views of the icons were diametrically opposite to the views held by the Left.

  10 Reasons Why Ambedkar Would Not Get Along Very Well With ‘Periyar’

 5. శ్రీనివాసుడు says:

  THE MYTH OF ARYAN INVASIONS OF INDIA
  http://uwf.edu/lgoel/documents/AMythofAryanInvasionsofIndia.pdf

  The Myth of the Aryan Invasion of India
  By David Frawley

  http://www.hindunet.org/hindu_history/ancient/aryan/aryan_frawley.html

  The Aryan Invasion Theory: The Final Nail in its Coffin by Stephen Knapp

  http://www.stephen-knapp.com/aryan_invasion_theory_the_final_nail_in_its_coffin.htm
  ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
  అన్నింటికంటే ముఖ్యమైన, అంబేద్కర్ కంటే శాస్త్రీయమైన ఆధారం ఇది
  The Harappan Civilization and Myth of Aryan “Invasion” From, The Hindustan Times
  By Dr. N.S. Rajaram
  http://archaeologyonline.net/artifacts/aryan-harappan-myth

 6. శ్రీనివాసుడు says:

  భారతదేశం పై ఆర్యుల దండయాత్ర(లేక వలస) లో నిజానిజాలు ఎంత?

  ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము.

  1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
  అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
  దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
  వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
  ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని “ఆర్యపుత్రా” అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.

  2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
  అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని “రాయల్ ఏషియాటిక్ సొసైటీ” రహస్య సమావేశ తీర్మానం
  “ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు.”
  (వనరు:Proof of Vedic Culture’s global Existence – by Stephen Knapp.page-39)
  ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
  “నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత “గొప్పగా” మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది.”
  (వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)

  విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన “విలియం జోన్స్”,మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ “ఆర్య” శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

  3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.

  1946లో అంబేద్కర్ రచించిన “Who were the sudras?” అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో ” పాశ్చాత్యులు సృష్టించిన “ఆర్యజాతి” సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది”
  Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో “ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు”.

  4.సైంటిఫిక్ ఋజువులు:

  1920లో బయటపడిన “సింధు నాగరికత”తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
  మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే “ఆర్య” శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది ‘గుర్రాలపై దండెత్తి” ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.

  1980లో ఉపగ్రహాల ద్వారా ‘సరస్వతీ’ నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.

  ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.

  ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు.

 7. శ్రీనివాసుడు says:

  The Vedas do not support the contention that the Aryans were different in colour from the Dasas and Dasyus…..If anthropometry is a science which can be depended upon to determine the race of a people….. (then its) measurements establish that the Brahmins and the Untouchables belong to the same race. From this it follows that if the Brahmins are Aryans the Untouchables are also Aryans. If the Brahmins are Dravidians, the Untouchables are also Dravidians…..’

  (B. R. Ambedkar, ‘Writings and Speeches’ [Bombay: Education Department, Government of Maharashtra, 1986-1990], Vol. 7, p. 85 and 302-303, quoted in Koenraad Elst’s Indigneous Indians, Agastya to Ambedkar, op. cit., p.410-411).

  Known in India chiefly for his campaign in support of the lower castes (he himself was a Harijan) and his work on the Indian Constitution, it is often overlooked that in order to find out the truth of the European Theories about Aryans and non-Aryans, high and low caste, he did precisely what Sri Aurobindo exhorted Indians to do: he went to the source, and studied the Veda for himself, with an open mind. His conclusions are unequivocal, though regrettably they are largely ignored by those who profess to follow his lead and who more often than not make a strident use of the very theories he sought to demolish: ‘The theory of invasion is an invention. This invention is necessary because of a gratuitous assumption that the Indo-Germanic people are the purest of the modern representatives of the original Aryan race. The theory is based on nothing but pleasing assumptions, and inferences based on such assumptions. The theory is a perversion of scientific investigation. It is not allowed to evolve out of facts. On the contrary, the theory is preconceived and facts are selected to prove it. It falls to the ground at every point.’ (ref: B. R. Ambedkar, quoted by D.B. Thengadi in The Perspective [Sahitya Sindhu Prakashan]).

  పై వ్యాఖ్యలకు లంకె…
  https://hindufocus.wordpress.com/2009/10/14/what-great-indians-thought-about-the-aryan-invasion-theory/

  మరికొంత సమాచారం
  But how much truth is there? In his book Who Were the Shudras Vol 7, Dr Ambedkar dismisses the Aryan race with absolute contempt. On page 85, he concludes by saying (while dismissing the Aryan race theory) that:

  The Vedas do not know any race referred to as the Aryan
  There is no evidence in the Vedas of any invasion of India by the Aryan race and its having conquered the Dasas and Dasyus who were supposed to be natives of India
  There is no evidence to show that the distinction between Aryans, Dasas, and Dasyus was a racial distinction
  The Vedas do not support the contention that the Aryans were different in colour from the Dasas and Dasyus

  In the same book (page 86), Dr Ambedkar writes:

  “Enough has been said to show how leaky is the Aryan theory expounded by western scholars and accepted by Brahmins. Yet, the theory has such a hold on the people that what has been said against it may mean no more than scotching it. Like the snake, it must be killed.”

  On page 100, Dr Ambedkar writes: “In the face of the discovery of new facts set out in this chapter, the theory can no longer stand and must be thrown on the scrap heap.”

  It is a real puzzle that Dr Ambedkar’s followers believe in the Aryan race theory which he himself rejected. To him, Aryan is a linguistic term and not a term for race. Worse still, Dr Ambedkar’s followers believe that it was Dr Ambedkar himself who propounded the Aryan race theory!

  When late Kanshi Ram came up with his theory of Bahujans, Dalits in the north believed the Dalits-OBCs are always the victims and the enemy is always the upper caste.

  Dr Ambedkar had no such ambiguity. The book Who Were the Shudra is in fact two books put together as one. The first part is titled Who Were the Shudra and dedicated to Mahatma Jyotirao Phule. In his dedication to Phule, Dr Ambedkar writes: “The greatest shudra of modern India who made the lower classes of Hindus conscious of their slavery to the higher classes and who preached the gospel that for India social democracy was more vital than independence from foreign rule.”

  The second part of the book is titled The Untouchables. This part of the book is dedicated to three Dalits saints — Nandanar (Tamil Nadu), Guru Ravidass (Uttar Pradesh) and Chokhamela (Maharashtra). It is one thing to propound or believe in a theory or ideology and it is quite other thing to ascribe that theory or ideology to some one who never propounded it.

  If we have to learn from Dr Ambedkar, the first step would be to unlearn what has been stored in the name of Dr Ambedkar. He never fabricated social categories and he would have been the first person to talk about what the reality is.

  మరొక సమాచారం
  There are several evidences of this type and this fact should not be
  overlooked. It is the strong conviction of Dr. B. R. Ambedkar that not a single race
  in India exists in its pure form. All Indians inherit admixture of several races.62
  Citing Dr. G. R. Bhandarkar, he has indicated that “there is hardly a class, or Caste
  in India which has not a foreign strain in it.”63 In our own interests we all shall
  have to concede to it and accept it. The conflict theme of foreign Aryans versus
  aborigines Dalit Bahujan is illusory and imperfect. Now in India the real social
  conflict is between exploiters class castes versus exploited class castes. Until we
  come to know this actually, the movements of the exploited class-castes will not be
  stands on its own strength.

  62) A) “Most of the Indian populations are of a mixed type. India has truly
  been a melting pot or a fishing net into which have been drawn
  almost all racial types which have mingled through the process of
  admixture and a smooth and unhindered gene flow in some
  regions.” – ( Singh K.S.; people of India- An Introduction, Vol.1,
  Anthropological Survey of India, Calcutta, 1992, p. 71.)

  B) With giving the testimony of the ethnologists Dr.Babasaheb
  Ambedkar indicates towards the fact that, “—the population of India
  is a mixture of Aryans, Dravidians, Mongolians and Scythians. All
  these stocks of people came in to India from various directions and
  with various cultures, centuries ago.( BAWS, Vol.1, p.6.) and
  “ Now the ethnologists are of opinion that men of pure race exist
  nowhere and that there has been a mixture of all races in all parts
  of the world.”(BAWS, Vol.1, p.48)

  63) BAWS, Vol. 1. P. 48.

 8. శ్రీనివాసుడు says:

  జనాభాలో 95 శాతం వున్న బహుజనులందరినీ రాజ్యాధికారంకోసం తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఈ డెబ్భై ఏళ్ళనుండి ఎవరైనా అడ్డుపడ్డారా జ్వలిత గారూ?
  మన యోగ్యతని బట్టే మన పాలకులు వుంటారన్న విషయం మీరెరుగరా?
  నిరూపణకు నిలవని, అంబేద్కర్ కూడా నమ్మని, అంగీకరించని ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఇంకా మీరు పట్టుకు వ్రేళ్ళాడుతున్నారా?
  మీకు ఓపికవుంటే ది ఆర్యన్ ఇన్వసిఒన్ థియరీ అన్న వ్యాసం అంతర్జాలంలో వుంటుంది చదవడి. రూఢిగా తెలుసుకోవాలనే కోరిక వుంటే నేను చాలా సమాచారాన్ని మీరు కోరితే ఇవ్వగలను.
  గతాన్ని పూర్తిగా ప్రక్కనబెట్టి, దాని గురించి అసలు ప్రసావనే చేయకుండా జరగవలసినదానిపైనే దృష్టి పెడితే మీ లక్ష్యం ఇంకా అద్భుతంగా నెరవేరుతుందని, ఘర్షణలకు తావుండదని నా నమ్మిక.
  …………..శ్రీనివాసుడు.

 9. వెంకటేశ్వర్లు బూర్ల says:

  జ్వలిత గారూ బహుజనుల బాట ఎట్ల ఉండాల్నో, ఏం చెయ్యల్నో , ఏం రాయాల్నో మంచిగ చెప్పిండ్రు… ఈ తొవ్వల అందరు నడిస్తే ఎంత సక్కగ ఉంటది…మీ ఆలోచనలకు శెనార్తులు….

  • jwalitha says:

   వెంకటేశ్వర్లు బూర్లగార్కి ధన్యవాదాలు అరువు రాతలు, ఎరువు రాతలు చదివి చదివి దశాబ్దాలు శతాబ్దాలు కరిగి పోయాయి. మన గురించి మనం రాసుకోవాలన్నది నా ఆశ.

   శ్రీనివాసుడుగారు నేను వెళ్ళటం లేదు చాలా స్థిరంగా ఉన్నాను . మీ వద్ద ఉన్న సమాంచరం ఇవ్వండి.

   • hari.S.babu says:

    @jwalitha says:
    22/12/2016 at 7:17 పీఎం
    శ్రీనివాసుడుగారు నేను వెళ్ళటం లేదు చాలా స్థిరంగా ఉన్నాను . మీ వద్ద ఉన్న సమాంచరం ఇవ్వండి.
    హరి.స్.బాబు
    పాపం ఆయన మీరు అంబేద్కర్ చెప్పనివి రాస్తున్నారు అని అన్ని ఆధారాలు చూపిస్తే కనీసం వాటిని పరిశీలించను కూదా పరిశీలించకుందా “నేను వెళ్ళటం లేదు చాలా స్థిరంగా ఉన్నాను . మీ వద్ద ఉన్న సమాంచరం ఇవ్వండి” అంటారేమిటండీ!రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు మీకు అర్ధం కావటానికి ఎన్నిసార్లు ఎంత మెటీరియల్ పంపిస్తే సరిపోతుంది?

    • JWALITHA says:

     HARI babu గారు
     ఎద్దుకు ఎగేయడం దూడకు దిగియ్యడం అనే సామెతొకటి ఉన్నది
     నేను వేళ్ళాడుతున్నారు అనేపదానికి అభఫ్యంతరం వ్యక్త పరిచాను. ఏతేదిలో ఉన్నది.శ్రీనివాసుగారి పోష్ట్ ల తేది చూడండి.

     నాకు అర్థం కాలేదని మీ విసుగేంటి మధ్యలో

     • hari.S.babu says:

      ఆ తేదీలు గడిచి చాల కలమైంది కదా,ఇంకా స్థిరంగానే ఉండి కొత్త సమాచారం కోసం దింపుడు కళ్ళం ఆశతో వేళ్లాడుతూనే ఉన్నారా!చదివి అర్ధం చేసుకుని జవాబులు చెప్పటానికి ఎంత సమయం పడుతుందో చెప్పగలరా?మీ తొవ్వ బాగుంటే ఆ తొవ్వల మేం గూడ నడుస్తం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)