గజల్‌ కవి శ్రీధర్‌ సృష్టించిన ”స్పార్క్‌”(వ్యాసం )-డా|| సింగుపురం నారాయణరావు ,డా|| రంకిరెడ్డి రామమోహనరావు

                        శ్రీధర్‌ కవి ఇంతకు ముందు ”మనోభా”అనే నూతన ప్రక్రియను సృష్టించి తెలుగు సాహితీ లోకానికి అందించారు. ఆయన ఒక చేత్తో నూతన కవిత్వాన్ని రాస్తూనే మరో చేత్తో నూతన సాహిత్య ప్రక్రియల్ని సృష్టిస్తున్న సవ్యసాచి. ఒక ప్రక్రియ సృష్టించడం కష్టం. లక్షణానికి సరిపడగా లక్ష్యాలను సమకూర్చడం మరింత కష్టం. కాని ఈయన రెండు పనుల్ని ఏక కాలంలో సాధిస్తున్నారు. ఇప్పుడు ”స్పార్క్‌” అనే నూతన ప్రక్రియను సృష్టించి బహూకరిస్తున్నారు తెలుగు సాహిత్య లోకానికి.
                    ”స్పార్క్‌” లక్షణాన్ని శ్రీధర్‌ నిర్ధేశించిన తీరును చూద్దాం. ”స్పార్క్‌”లో కూడా  మూడు పాదాలే ఉంటా యి. ఇది కూడా మాత్రాబద్దమైనదే. మొదటి  పాదానికి నాలుగు మాత్రలుండాలి. ఉత్తరోత్తర పాదాలలో ఒక్కొక్క మాత్ర చొప్పున పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి పాదానికి నాలుగు మాత్రలు, రెండో పాదానికి ఐదు మాత్రలు, మూడో పాదానికి ఆరు మాత్రలు ఉండాలన్నమాట. ”మనోభా”లో ఒకటి , రెండు పాదాలకు అంత్యప్రాస నియమాన్ని ఉంచడం జరిగింది. ఇక్కడ అలా కాదు. అంటే ఏ పాదానికి అంత్యప్రాస నియమాన్ని నిర్ధేశించలేదు. ”స్పార్క్‌” ద్వారా చెప్పిన ప్రతి కవితలోను ఒక మెరుపు ఉంటుంది. అందుకే ఆయన దానికి ”స్పార్క్‌” అని పేరు పెట్టి  ఉండవచ్చు. మొదటి  రెండు పాదాలలోనూ కార్యాన్ని లేదా ఫలితాన్ని చెప్పడం. ఫలితానికి మూలకారణాన్ని మూడోపాదంలో చెప్పడం ”స్పార్క్‌” లక్షణం. ”స్పార్క్‌”లన్నీ కార్యకారణ సంబంధంతోనే కనిపిస్తుంది. ఈ విషయం స్పష్టంకావాలంటే ఈ ”స్పార్క్‌”ను చదవండి.
                         మోమున
                          ఖులాసా
                         నాన్నవచ్చె
                                       పై ”స్పార్క్‌”లోని భావం ప్రతివారికి నాన్నతో ఉన్న అనుబంధం. ఆయన సృష్టించిన రెండవ ప్రక్రియ ”స్పార్క్‌”. ”స్పార్క్‌”లలో పరిమిళించిన శ్రీధర్‌ కవి సాహితీ సుమరాజాలను అఘ్రాణిద్దాం.
                           నాలో
                           ఊహలే
                            తెలుగు గజల్‌
                                        పై ”స్పార్క్‌”లో లక్షణానికి సరిపోయే లక్ష్యం సరిగా కుదిరింది. ఆయన కవి, గజల్‌కవి, నూతన ప్రక్రియల సృష్టికర్త.
             అమ్మ ప్రేమకు తులతూగే సమానమైన ప్రేమ సృష్టిలో ఎక్కడా లేదు. బిడ్డలు అమ్మ ప్రేమను అంచనా వేస్తూ ఉంటారు. పిల్లల స్కేలుకు ఏ మాత్రమూ అందనిది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమను డిగ్రీలలో కొలవదలిస్తే పిల్లల కొలతకు అందకుండా అంచనా వేయిలేనన్ని  డిగ్రీల ప్రేమ అమ్మ ప్రేమ. దీన్ని శ్రీధరులు ఎంత అందంగా చెప్పారో చూడండి.
                              అంచన
                              దొరకనిది,
                              అమ్మప్రేమ
                                          కొంతమంది తల్లుల్ని దూషించే వాళ్ళుకూడా మనకు జీవితంలో తారసపడుతూ ఉంటారు. అయినా  ఆ దూషణలకు తల్లి తన బిడ్డల్ని రక్షణ భూషాణాలతో అలంకరిస్తుంది. బిడ్డ మూలిగినా, తిట్టినా  ఆమెకు కోపం రాదు. పైగా ఆ తిట్లకు చిరునవ్వును సమాధానంగా బహూకరిస్తుంది. ఈ భావాన్ని సంస్కృతoలో  ఈ మాట తెలియజేస్తుంది. ”కు పుత్రో జాయితే కు మాతా న భవతి” ఈ సంస్కృత వాక్యాన్ని తన ”స్పార్క్‌” ద్వారా కవి సూత్రకరించడాన్ని చూస్తే ఆయన భావాంబర వీధిలో నిరంతరం వెలుగులు విరజిమ్మే ఇలాoటి  ”స్పార్క్‌” ఎన్నెన్నో వస్తూ ఉంటాయి.
                             తిట్టిన 
                              నవ్వింది,
                               తల్లిప్రేమ
                                        బుడిబుడి అడుగులు వేస్తున్న ఏడాది పిల్లాడికి తండ్రి వేలు నడకలు నేర్పుతుంది. ఆ హస్తం ఆపన్నహస్తంలా బిడ్డన్ని నిరంతరం కాపాడుతూ ఎదుగుదలకు సహాయం చేస్తుంది. అనంతరం జీవితంలో తండ్రిని విడిచిపెట్టి  జీవన గమనంలో ఎన్నో మెట్లుఎక్కుతూ జీవితంలో పైపైకి ఎదుగుతూ ఉంటాడు. ప్రతి అడుగులోనూ నాన్న మాట చేయిగా మారి బిడ్డ చేయి పట్టుకునే ముందుకు నడిపిస్తుంది. వయస్సులో ఎదిగే కొద్దీ నాన్న అనుభవాలు మరింత ఊతను ఇస్తూ ముందు నడిపిస్తుంది. నాన్న చేయి మార్గదర్శి, నాన్న మాటలు దిక్చూచి ఈ భావాన్ని ఈ ”స్పార్క్‌” ఎలా చెప్పిందో చూడండి.
                                      బిడ్డను
                                      నడిపింది,
                                       నాన్న చేయి
                                            ఓటు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు. ఆ హక్కుతో కావలసిన రాష్ట్రపతిని, ప్రధానిని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని సంపాదించుకోవచ్చు. కాని సమకాలీన సమాజంలో ఓటు హక్కును అమ్ముకుంటున్నారన్న విషయాన్ని కింది ”స్పార్క్‌” ఎలా చెప్పిందో                                      చూడండి.
                                  హక్కును
                                  అమ్మేటి ,
                                  ఎలక్షనులు
                                              పగటి  కలలు కంటూ ఏపనీ చేయకుండా ఊహల్లో గడిపే ”పనిగండం” వ్యక్తులకు కవిగా ఒక హితవును శ్రీధర్‌ చెప్పడం చాలాబాగుంది. ఊహల్లో కాకుండా వాస్తవంలో ఒక్కరోజైనా జీవిస్తే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిసిన మరుక్షణం నుండి మనిషిగా పునర్జన్మను పొంది గొప్పవ్యక్తిగా వికసించి సమాజానికి ఎంతో కంత ఉపయోగపడతాడు.
                                     బతుకుము
                                      ఒక రోజు,
                                       వాస్తవమున
                                              నిరుపేదల జీవితాల్లో అన్నీ కష్టాలే, కడగండ్లే. సుఖాల్ని వాళ్ళు నిరంతరం వెతుక్కుంటూ ఉండవలసిందే. అందుకనే పేదవారికి బాధలే ఆస్తి అని అంటున్నాడు ఈ   కవి.
                                పేదకు
                                బాధలే
                                 కోట్ల ఆస్తి
                                           ”గతకాలమె మేలు వచ్చు కాలము కంటెన్‌” అని నన్నయ భట్టారకులవారు వేయి సంవత్సరాలకు పూర్వమే చెప్పారు. ఎప్పుడు గడిచిన క్షణాలే మంచివని, రాబోవు కాలము అంతగా మంచిది కాదనే భావన ఎప్పుడూ ప్రజల ఆలోచనల్లో ఉంటుంది. శ్రీధర్‌ గడచిన క్షణాలనే శుభక్షణాలుగా భావించి ఆదికవిని తలపింపచేశారు.
                                 గడిచిన
                                 కాలమే,
                                 శుభగడియలు
                                             ”మాతా పుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః” అని సంస్కృత శ్లోకం లో  అనుకుంటూ ఉంటారు. కలహాలు ధనంకోసం, ఆస్తిపాస్తుల కోసం వస్తూ ఉంటాయి. ప్రపంచంలోనే సంబంధాలన్నీ ఆర్దిక సంబంధాలే అని కార్లమార్క్స్‌ చెప్పాడు. సవ్యయంగా ఉన్నంత సేపూ ఏ గొడవలూ రావు. ఆస్తి పంపకాల విషయం వచ్చేటప్పటికి ఏకోదరులైనా సరే హెచ్చు తగ్గుల విషయంలో ఎంతవరకైనా వెళ్ళి పోతారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల్ల మధ్య, చివరికి భార్యభర్తల మధ్య ఆస్తుల విషయాలలోనే గొడవలు వస్తూ ఉంటాయి. చివరికి తిట్టుకోవడం నుంచి కొట్టుకోవడం వరకూ కూడా వస్తుంది. మొత్తం మీద మనుషుల మధ్య అగాధాలు ఏర్పడతాయి. దూరాలు పెరిగిపోతాయి. భౌతికంగా ప్రక్కవాల్లతో  ఉన్నా నిత్యం కళ్ళకు కనిపడినా మాటలుండవు. మనస్సు విముఖంగా ఉంటుంది. ఆ దూరాలు అనంతం. దీన్ని రమణీయ భావబంధురంగా చెప్పారో చూడండి.
                                  దూరం
                                  పెరిగింది,
                                  ఆస్తి తగువు
                                        ఇంట్లో ఇల్లాలు వంటింట్లో  ప్రియురాలు అన్నది నేటి  స్థితి. ఇంట్లో  భార్యపై నిత్యం అలుగుతూ అలక్ష్యంచేస్తూ సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటారు. కాని ప్రియురాలుని మాత్రం తెగప్రేమించేస్తూ ఉంటారు. సంసారాలు చక్కగా సాగాలంటే ఇది సరియైన పద్ధతికాదు. ఈ ”స్పార్క్‌” ద్వారా చెప్పిన విషయం కంటే ”స్పార్క్‌” చదివిన తరువాత పాఠకుడు దీనికి పదిరెట్లు కవిత్వాన్ని చదువుతాడు. అదే ”స్పార్క్‌” ప్రత్యేకత. కవిత్వంలో ఇలాoటివి అరుదులో అరుదైన కవితా జయకేతనాలు.
                                 కోపం
                                 ఆలిపై,
                                 ప్రేమ చెలికి
శ్రీధర్‌ ఇలాం ”స్పార్క్‌”లు మరిన్ని సృష్టించాలని తెలుగు సాహిత్యానికి మరింత వన్నె చేకూర్చాలని కవిగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా  కోరుకుందాం.

డా|| సింగుపురం నారాయణరావు ,డా|| రంకిరెడ్డి రామమోహనరావు

——————————————————————————————————-

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో