సరిహద్దు రేఖ-కర్రా కార్తికేయ శర్మ

gsl

జననానికి మరణానికి మధ్య
సన్నటి సరిహద్దు రేఖ !
ఇవతలిగట్టున అవిశ్రాంత పోరాటం
అవతలి తీరాన అతిప్రశాంత వికాసం !
మనిషిగా పుట్టిన ప్రతివాడు
జీవితంలో పోరాడాలి. గెలుపు సాధించాలి
ఇందులో ఎవరికి మినహాయింపులేదు
ప్రతిరోజుయుద్ధమే ! ప్రతిక్షణము వ్యూహమే !
యుద్ధాలు చెయ్యగా చెయ్యగా
జీవితం విరబూసిన అగ్ని వృక్షమౌతుంది
యౌవనంలో అభిమన్యుడు
వృద్ధాప్యంలో అంపశయ్య భీష్ముడు మానవుడు !
ఈ మధ్యలో జీవితం నిండా ముళ్ళు, రాళ్ళు, రత్నాలు , పుష్పాలు !
అయినవాళ్ళు ఒక్కొక్కరు కళ్ళముందు నిష్క్రమిస్తుంటే
గుండెపెంకులా గట్టి పడుతుంది
ధైర్యం సొంత మవుతుంది
ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన మనం
వందలు వేల మందితో అనుబంధం పంచుకొంటాం
చివరకు నలుగురే మిగుతారు
మిగిలినవారంతా గప్‌చుప్‌…
ఒంటరిగానే సరిహద్దు రేఖ దాటుతాం
వీరుడా ! ధీరుడా ! స్నేహితుడా ! సన్నిహితుడా ! అంటూ
మనల్ని నలుగురూ కీర్తించాలి
అదీ జీవితమంటే అదే ముగింపు అంటే !
అమ్మ తిట్టిందని అయ్యమందలించాడని
మాష్టారు కొట్టారని ఎదురింటివాడు ఏడిపించాడని
జీవితానికి ముగింపు పలుకుతామా ?
దేవుడు వెలిగించిన దీపాన్ని ఆయనే ఆర్పాలి
మనంత మనమే ఆర్పేసుకోవడం
పిరికితనం అమాయకత్వం !
తిట్టిన అమ్మ మెచ్చుకునేలా
మందలించిన అయ్య ప్రశంసించేలా
కొట్టిన మాష్టారు ఆశ్చర్యపోయేలా
ఏడిపించిన కుర్రాడి చెంప పగిలేలా జీవించలేమా ?
ఒక్కసారి ఆలోచించండి !
జీవితం చాలా చిన్నది
ప్రణాళికాబద్ధంగా జీవిస్తే అందమైనది
సమస్యలు వెంటబడి తరిమే కోతుల గుంపులాంటివి
భయపడితే భయపెడతాయి
ఎదిరిస్తే పరుగెడతాయి
తల్లిదండ్రులకోసమో మరెవరికోసమో
ఇష్టంలేని చదువు చదవద్దు
ఒత్తిడికి గురికావద్దు
మీ బతుకు పలకపై పిచ్చిగీతలు గీస్తానంటే
ఎవరిని అనుమతించవద్దు
మనసుకు నచ్చిన చదువును ఆనందంగా చదవండి
హాయిగా జీవించండి. స్వేచ్ఛగా శ్వాసించండి
ఎవరికోసమో మీ బతుకును బలి చేసుకోకండి
ధైర్యంగా జీవించండి హుందాగా నిష్క్రమించండి

-కర్రా కార్తికేయ శర్మ

9493819050

(30.11.16à°¨ అర్థాంతరంగా బ్రతుకు ముగించిన రాజానగరం మెడికో కుమారి ‘రాచకొండ బ్రమరాంబ’ శుభశ్రీకి కన్నీటి నివాళితో…)

కవితలు, , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో