సహ జీవనం 19 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

                        “కాసేపు కూర్చున్నాక స్నానాలు చెయ్యవచ్చులే, నువ్వు ఈ లోగా వంట మొదలు పెట్టు. మా బావకు ఆవ పెట్టిన సొరకాయ కూరంటే ఇష్టం. సొరకాయ వుందిగా అది వండెయ్యి” బావ వంక నవ్వుతూ చూశాడు ప్రకాశం.

                        “వద్దురా ప్రకాశం. ఇప్పుడు అవన్నీ మానేశాను. ఏది పడితే అది తినే వయసు కాదిది” అన్నాడు మోహనరావు.

                        “అలాయితే ఆనపకాయ పప్పు, బంగాళాదుంప కూర వండి, సాంబారు పెడతాను. ఎలాగూ చింతకాయ ఊరగాయ ఉండనే ఉంది” సరస్వతి లేచి వంటింట్లోకి వెళ్ళింది.

                        “సరస్వతీ, ముందు కాస్త కాఫీ ఇవ్వు మా అందరికీ” గట్టిగా చెప్పాడు.సరస్వతి అలాగేనని తల ఊపింది.

                        “ ఇప్పుడు చెప్పవే అక్కా? ఎన్ని సార్లు పిలిచినా వచ్చావు కాదు. ఇన్నాళ్ళకి నీకు తీరిక అయ్యింది” నిష్టూరంగా అన్నాడు ప్రకాశం.

                        “ఏదిరా బాబూ,ఎక్కడికీ కదలడానికి లేదు. మా అవస్థలు వింటే, అసలు పిల్లలు లేనివాళ్ళే నయమనిపిస్తుంది. వెడితే పెద్దాడి ఇంటికి, లేకపోతే చిన్నాడి ఇంటికి. ఈ రెండూ కాక, ఏనాడైనా మరో చోటికి వెళ్ళామా,పెట్టామా? ఎక్కడికైనా వెళ్ళామంటే, వాళ్ళ తోనే వెళ్ళడం, వాళ్ళతోనే రావడం,అదీ వాళ్లకు ఇష్టమైతేనే. కోడళ్ళు ఉద్యోగాలు మాకోసమే చేస్తున్నట్లు మాట్లాడుతారు. వాళ్ళ సంపాదనలో ఒక్క పైసా ఎరగం. పైగా ఇద్దరి మధ్య పోటీ! ఎవరి అవసరానికి రాక పోయినా వాళ్ళ కోపాలు ఇంతా అంతా కాదు. వీళ్ళ ఉద్యోగాలు కాదుగానీ, మా చావుకొచ్చింది. ఇద్దరూ చాకిరీ కోసమే పిలవడం తప్ప, మాకూ వయసు పైబడుతోందని కాస్త కూడా ఆలోచించరు గదా? చిన్న కోడలు అమెరికాలో పనిమనుషులు దొరకరు కనక కాస్త జాగ్రత్తగా వుంటుంది. పెద్ద ఆఫీసరు లాగ పనులు అప్పచెప్పి పోతుంది. పెద్ద కోడలు మరీ ఒంటెత్తు గుణం. రేపు మీరు మా మీదే కదా ఆధారపడేది, బాగున్నప్పుడైనా ఎందుకు చెయ్యరన్నట్టు మాట్లాడుతుంది. ఎవరూ పడరు ఆవిడగారికి” సరస్వతి తెచ్చిన కాఫీ తాగుతూ చెప్పింది.ప్రసాదం ఆవిడ ఆవేదన విని నిట్టూర్చాడు.

                         సరస్వతి వాళ్లకు కాఫీలు ఇచ్చి, అక్కా తమ్ముళ్ళు చెప్పుకునే విషయాలు తను వినడం బాగుండదని అక్కడ ఉండకుండా వెంటనే వెళ్ళిపోయింది.సావిత్రి అది గమనించింది “ఎలాగైనా సరస్వతి తీరే వేరురా.”ప్రసాదంతలవూపాడు.“అవును, నిజమే. సరేగానీ, ఇప్పుడెలా రాగలిగారో చెప్పు?”

                       “కోడలి చెల్లెలి పెళ్ళి, అమలాపురంలో. వాళ్ళటు వెళ్ళారు. మేము ఈ నాలుగు రోజులు నిన్ను చూసి వస్తామని చెప్పి ఇటు వచ్చాము.”

                     “మంచి పని చేశారు, ఎన్నాళ్ళయ్యింది నువ్వు నాఇంటికి వచ్చి? ఉష పెళ్ళికి రావడమే కదా” అంటూ ప్రకాశం బావ భుజం మీద తట్టి, “కాసేపు పడుకుంటావా బావా? అక్కా, నువ్వు కూడా కాసేపు రెస్టు తీసుకోరాదూ. వంట అయిపోగానే, స్నానాలు చేసి భోజనం చెయ్య వచ్చు. సాయంత్రం బిర్లా టెంపుల్ కు వెడదాం. అన్నట్లు బావా, నీ షుగర్ కంట్రోల్లో ఉందా? అక్కా, నీ బి.పి. ఎలా వుంది? ఉప్పూ, కారం తగ్గించి తింటున్నావా? అన్నట్లు సరస్వతీ, కూరల్లో వాటిలో కొద్దిగా ఉప్పూ,కారం తగ్గించి వెయ్యి” లేవబోయాడు ప్రసాదం.

                     “ఎందుకంత హడావుడి? నువ్వు ముందు కూర్చో” అంటూ లేవబోయిన ప్రకాశాన్ని కూర్చోబెట్టాడు మోహనరావు.

                      సాయంత్రం అందరూ బిర్లా టెంపుల్ కు వెళ్ళారు. గుడిలోంచి బయటకు వచ్చి కాసేపు కూర్చున్నారు. సరస్వతి ఒక కొబ్బరి చిప్ప పగలకొట్టి అందరికి తలా ఒక కొబ్బరి ముక్కా ఇచ్చింది.

-టి.వి.యస్.రామానుజ రావు

————————————————————————————————————————————–

ధారావాహికలు, Uncategorized, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)