మౌనక్షరాలు ..మనోతలం (కవిత )-నీలూ

మనసు అంతుపట్టని రహస్యం
అవగతం కాని అద్భుతం
రాశారెవరో ‘మనోశాస్త్రం ‘
బంధించడానికి యోగాభ్యాసం
నియంత్రించడానికి ధ్యానం
ఆలోచిస్తున్నకొద్దీ అనంతకోటి ఆలోచనలు
ఏదో తెలుసుకోవాలన్న తపన

అసలు దేనికోసం ఆరాటపడుతున్నా
ఎందుకు సతమతమవుతున్నా
ఏమి పొందానని సంతోషం
ఏమి కోల్పోయానని నిర్వేదం

బంధాలన్నీ అశాశ్వతమంటూనే
ప్రేమ శాశ్వతంఅంటారేం !
అదికూడా మనసుకు బంధమేగా
శ్వాస వీడగానే కాలిపోయే దేహం
ప్రేమ శాశ్వతమని ఎలా నమ్ముతుంది ?

ప్రేమ అన్న భావం ఎప్పుడు పుట్టిందో !
ఆడమ్ అండ్ ఈవ్ తో నా ?
రాధాకృష్ణులతోనా ?
హీర్ రాంఝా ,లైలా మజ్నూల తోనా ?
షాజహాన్ ముంతాజ్ తోనా ?
కాళిదాసు శకుంతలా దుష్యంతుల తోనా?
ఏమో ! చరిత్రలో ఏదీ శాశ్వతమైన దాఖలాలు లేవు

సప్తపదితో జతపడిన అడుగులు కడదాకా కలిసి నడువవెందుకో !
ఇద్దరిలో ఒకరు ముందుగా నడక ఆపేసి
అనంతంలోకి అవసరమన్నట్టు
దేహంతో మనసుతో ముడిపడిన బంధాన్ని తెంచుకొని
పయనం తప్పదన్నట్టు
మిగిలిన వారికి ఓ కడివెడు కన్నీళ్లు
పిడికెడు జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోతారు
కడవరకూ తోడుంటానన్న బాస శాశ్వతం కాదేం ?

శరీరాలు ఏకమైనప్పుడు అదే ప్రేమనిపిస్తుంది
వేరవగానే నైరాశ్యం …వైరాగ్యం
మనసుకా శరీరానికా వియోగం ?

అంతరంగం ఒక రణభూమి
పగబట్టిన శత్రువులా పొంచి పొంచి
ఒక్కసారి విరుచుకుపడతాయి
ఆశా నిరాశలు సుఖ దుఃఖాలు
ఓటమి గెలుపుల్లా

అన్నీ నావే అన్నట్టూ
అందరూ నావారే అయినట్టూ
బంధం బంధం అని వాపోతుంది పిచ్చి మనసు
వేకువ వెంటే చీకటి ఉన్నట్టు
జననం వెంటే మరణం ఉందని మరచి

అన్నీ అవసరాలకై ముడిపడ్డ బంధాలే
నవ్వులు యాంత్రికమే
జీవితం యాంత్రికమే
బంధాలన్నీ యాంత్రికమే

మనసుకూ మనిషికీ మధ్య దూరం
కాలం తనకేమీ పట్టనట్టు కదిలిపోతూ
కాలానికి మనసుతో పని లేదు
మనసు మాత్రం అన్ని కాలాల్లో స్పందిస్తూ
అంతం లేని ఆలోచనలకూ ఆధారమవుతూ

పిడికిలంత గుండెలో సప్తసాగరాల ఉప్పెనలు
బాధలూ ..బంధాలూ ..ఆలోచనలూ .. అనుభూతులూ

లిపిలేని భాషలో లిఖిస్తూఉంటాయి
మౌనాక్షరాలు మనోతలంపై
మనసులో బంధాలను
కలిపేస్తూ ..విడదీస్తూ

                                -నీలూ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
                            

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో