ఇండియన్ -అమెరికన్లు ఆలోచించి ఓటు వేయండి !

                 

k

          అమెరికన్ ఎలక్షన్స్ ఈసారి ప్రజలను తికమక పెట్టడమే కాక వారిని ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది! ఎప్పుడూ లేనంతగా రాజకీయాలు దిగజారిపోయాయి అని అంటున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో మామూలే కానీ ఇపుడు వున్న ఇద్దరు అభ్యర్ధులలో ఒకరు మగ, ఒకరు ఆడవారు, డోనాల్డ్ ట్రంప్, హిలరీ క్లింటన్. అందుకని కూడా ఇంతగా ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది!
డోనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు కూడా ప్రెసిడెంట్ కోసం అభ్యర్ధిగా నిలబడ్డాడు కానీ ఎప్పుడూ ఎలక్షన్లకి ఇంత దగ్గరగా రాలేదు. రిపబ్లికన్ పార్టీలో వున్న అభ్యర్ధులందరినీ తన నోటి దురుసుతనంతో ఓడించి తానొక్కడే అభ్యర్ధిగా నిలబడ్డాడు. ఈసారి అతనిలో పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది, ఏం చేసయినా సరే అమెరికా రాష్ట్రపతి పదవిని దక్కించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే వయసు పెరుగుతుంది కానీ తరగదు కదా, మరోసారి పోటి చేసే ఓపిక, ఆసక్తి వుంటాయో లేదో తెలియదు కదా! తను బురదలో పడి దొర్లిన సమాచారం బయటికి వచ్చినా సరే, తనకు వ్యతిరేకంగా వున్న అభ్యర్ధిని, తనకు నచ్చని వారిని బురదలో పడేసి రాజకీయాలంటే చాలా మందికి విసుగు వచ్చేలా చేసయినా సరే తను మాత్రం అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని చాలా పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడు.

మరో ప్రక్క హిలరీ క్లింటన్ ఇంతకు ముందు ఒబామాకి వ్యతిరేకంగా అభ్యర్ధిగా డెమోక్రాటిక్ పార్టీనుండి పోరాడింది, కానీ అప్పట్లో అమెకి అంతగా ప్రజలనుండి స్పందన రాలేదు. అప్పుడు ఇద్దరూ చరిత్రలో జరగని సంఘటనని నిజం చేయాలనుకున్నారు. కానీ రెండు ఒకటే సారి అయ్యే అవకాశం లేదు అంటే ఆఫ్రికన్-అమెరికన్ ఒక ప్రెసిడెంట్ గా, లేదా ఒక స్త్రీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలి. ఒకటి తర్వాత ఒకటయితే అవకాశం వుంటుంది అని ఆమె పోటినుండి తప్పుకుని ఒబామా ప్రెసిడెంట్ అయ్యాక ఆయన దగ్గరే సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పని చేసారు. ఆమె తన భర్త బిల్ క్లింటన్ గవర్నమెంట్ వున్నపుడు స్త్రీల, శిశు సంక్షేమానికి పాటు పడ్డారు. ఈ ఎలక్షన్ల ప్రచారం మొదలయినపుడు డోనాల్డ్ ట్రంప్ ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. హిలరీ రిపబ్లికన్ అభ్యర్ధులు ఇంకా బరిలో వుండగా ఆమెని డోనాల్డ్ ట్రంప్ గురించి అడిగినపుడు, ’డోనాల్డ్ ఈజ్ డాంకీ ఆఫ్ ది డికేడ్,’ అన్నది. ఎప్పటిలా వచ్చాడు మధ్యలోనే పోతాడు అనుకున్నారు. కానీ సీతని పొందని రావణాసురుడు అన్నీ లోకాలను జయించిన వాడు, పెద్ద జ్ఞాని, కళలపట్ల ఆరాదన కలవాడు, రుద్రవీణ వాయించేవాడు, బయట స్త్రీలను చెరపట్టినా మండోదరినే తన రాణిగా గౌరవించాడు, కానీ సీతని తన దాన్ని చేసుకోవడానికి ఎన్ని అన్యాయాలను చేయాల్సి వచ్చినా చేసాడు. అలాగే ట్రంప్ రాష్ట్రపతి పదవిని పొందడానికి తను అన్ని రూల్స్ ని వదిలేయదల్చుకున్నాడు, చాలామందికి తాము చేయలేని చెడ్డ పనులను మరొకరు చేస్తుంటే నోటికొచ్చినట్టు ఇతరులను అవమానిస్తుంటే, స్త్రీలను సెక్స్ సింబల్స్ గా చుస్తూ వారిని ఎలా చెరపడ్తాడో లాంటి విషయాలు బయట పడినపుడు అతన్ని హీరోగా చూసిన వారు కూడా వున్నారు, రిపోర్టర్లు రిపబ్లికన్ సపోర్టర్స్ ని అతను అన్న మాటల గురించి అడిగితే చాలా మంది,’ఇందులో తప్పేముంది, అతను చేసినట్టు మేము చేయగలిగే ఫ్రీడం మాకు వుంటే బావుండు,’ అన్నారు. గొర్రెల మందలా అతన్ని అనుసరిస్తున్నారు. అతను కనక ప్రారంభంలోనే అభ్యర్ధిగా ఓడిపోతే ఇతర ఏ అభ్యర్ధి వున్నా హిలరీ క్లింటన్ సులువుగా ఓడించవచ్చు అని అనుకున్నది.

హిలరీ క్లింటన్ లో లోటుపాట్లు లేవని కాదు. ఆమె ఈ-మెయిల్స్ కుంభకోణంలో విపరీతంగా కూరుకుపోయింది. తాను తప్పు చేసానని, తప్పులు అందరి వల్ల జరుగుతాయని, అందరిని క్షమించమని అడిగింది. ఈ కుంభకోణాన్నే వారు పూర్తిగా వాడుకుంటున్నారు. ట్రంప్ పిచ్చి వాగుడు, అతను చేసిన పిచ్చి పనులు నచ్చని రిపబ్లికన్ పార్టీవారు అతనికి తమ సహకారాన్నివ్వడం మానేసి, వారు కూడా హిలరీకి సహకారాన్నిఅందిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ కి రాజకీయాల్లో అస్సలు అనుభవం లేదు. కానీ హిలరీ క్లింటన్ కి ఎన్నో రంగాల్లో పని చేసిన అనుభవం , విదేశీ విధానంలో ఎన్నో దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పింది. ఆమె తీసుకున్న నిర్ణయాలన్నీ మంచివని చెప్పలేము. కానీ ప్రచారానికి వెళ్ళినపుడు, డిబేట్స్ లో పాల్గొనపుడు ట్రంప్ లాంటి నోటి దురుసుని తట్టుకుని, ట్రంప్ తన పక్కన హిలరీ అస్సలు నిలబడలేదని ఆమె చాలా నీరసంగా నడుస్తుంది అని వంగి ముసలి వాళ్ళు నడిచినట్టు నడిచి చూపిస్తాడు స్టేజ్ పైన. తను మొగవాడు కాబట్టి అన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలనని ఆమె స్త్రీ కాబట్టి ఇంట్లోనే ఆమె స్థానం అనే అభిప్రాయం ప్రజల్లో కలగజేయడానికి ప్రయత్నించినా ఆమె తట్టుకుని నిలబడగలిగింది.

ట్రంప్ గురించి మాట్లాడితే ఇన్ కం టాక్స్ లు కట్టకుండా వదిలేసిన మనిషి, అది తన తెలివితేటలకు నిదర్శనంలా చెప్పుకుంటున్నాడు. అంతే కాదు అతడు స్త్రీ లోలుడు, స్త్రీ అంటే అతని దృష్టిలో ఒక సెక్స్ సింబల్ మాత్రమే. కూతురితో పాటు ఇంటర్వ్యూ ఇస్తున్నపుడు తండ్రితో ఆమెకి ఏ ఆటలు ఆడడం ఇష్టం అని అడిగితే,’ రియల్ ఎస్టేట్ కానీ గోల్ఫ్,’ అని చెపితే, డోనాల్డ్ వెంటనే, ’నేను సెక్స్ అని చెబ్దామనుకున్నాను కానీ తను నా కూతురు కదా, అది చెప్పలేను,’ అని అన్నాడంటే కూతురిని కూడా ఒక సెక్స్ సింబల్ గానే చూస్తాడు. ఇంత నీచంగా మాట్లాడే అతన్ని ఇంకా ఇంత మంది ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ’తను ఇంటికి వచ్చే వరకు డిన్నర్ రెడీగా లేకపోతే ఆ రోజు ఇల్లు టాప్ లేచి పోవాల్సిందే నా కోపంతో,’ అని తనే చెప్పుకున్నాడు. స్త్రీలంటే ఇంట్లో వుండాల్సిన వారని అతని అభిప్రాయం. మరి ఇతనికి, తాలిబాన్ కి పెద్దగా తేడా ఏముంది? చెప్పండి. స్త్రీలని లైంగిక హింసకు గురి చేసాడని ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడే ఎందుకు బయటికి వస్తున్నాయంటే ఒక టీ.వి యాంకర్ తో స్త్రీల గురించి హీనంగా మాట్లాడిన మాటలు, వీడియో బయట పడ్డాయి. దాంతో అతని కౄరత్వానికి బలైన వారంతా బయటకు రావడం మొదలు పెట్టారు. కేవలం స్త్రీలనే కాదు, ఇతర దేశాల వారిని, జాతులవారిని, వికలాంగులను వెక్కిరించి నీచమైన తన అభిప్రాయాలతో వారిని అవమానాలకి గురి చేసాడు. సన్నగా, మోడల్స్ లా లేని వారిని, ’ఆమె చాలా లావుగా వుంది ఎందుకంటే తను పందిలా తింటుంది,’ ’చిన్నస్తనాలు వున్నవారు అసహ్యంగా వుంటారు,’ ఇలా ఆడపిల్లల గురించి ఇష్టమొచ్చినట్టు వాగుతుంటాడు.
మెక్సికో నుండి అక్రమంగా వచ్చిన వారిని, వచ్చేవారిని వెళ్ళగొట్టేస్తానని ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పని చేస్తూ పన్నులు కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నవారు, తాము మెక్సికోకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో లేకపోతే పిల్లలిక్కడ తాము అక్కడ వుండాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు. బీదవారు అక్కడ పరిస్థితులు బాగా లేక తమ జీవితం, పిల్లల జీవితం బాగుండాలని ఇక్కడకు వచ్చిన వారిని ఇప్పటివరకు వారి వుండే స్టేటస్ ని మార్చి అది లీగల్ గా చేయాలని ప్రయత్నిస్తున్నారు కొందరు, కానీ ట్రంప్ కనక ప్రెసిడెంట్ అయితే వారిని వెళ్ళగొట్టి ఒక పెద్ద గోడ కడ్తానని అప్పుడు, డ్రగ్ అడిక్ట్స్, డ్రగ్ డీలర్స్, దొంగలు, కూటికి, గుడ్డకు లేని వారు వచ్చి ఇక్కడి వారి పనులు తీసేసుకుంటున్నవారు వచ్చే అవకాశం వుండదు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. వారు వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ వారికందరికీ వుద్యోగాలిప్పిస్తాననేలాంటి వాగ్దానాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడ్తూ, అమెరికాని గొప్పగా చేస్తానని ప్రచారం మొదలుపెట్టాడు.

ఎలక్షన్లు నాల్గు రోజులుందనగా ఇప్పుడెందుకు ఇదంతా రాస్తున్నానుకుంటున్నారేమో? చదువుకోని వారు, ఆలోచించలేని వారు, ముస్లిమ్ లను ఇష్టపడని వారు, డోనాల్డ్ ట్రంప్ ని ఎందుకు ఇష్టపడుతున్నారంటే, అతను ఏది దాచుకోకుండా మాట్లాడుతాడట, కానీ దేశం కోసం ఏం చేస్తావని అడిగితే మాత్రం ఒక్క పాలసీ గురించి మాట్లాడడు. డోనాల్డ్ ట్రంప్ కి డబ్బంటే చాలా ఇష్టం, అందుకే టాక్స్ లు కట్టడు. ధనవంతుల ఓట్లకోసం వారికి ఇన్ కంటాక్స్ లు పెంచనని అంటున్నాడు, అంతే ఇక్కడికి డబ్బు సంపాదించి తర తరాలకు కావాల్సినంత వున్న భారతీయులకు అతను మంచివాడు కాడని తెలిసినా అతనికే తమ సపోర్ట్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుఅది, మేమంతా హిలరీ క్లింటన్ కి టాక్స్ లు కడితే ఏం లాభం? కానీ మీరు వుంటున్న ఈ దేశం ప్రగతి కోసమే వాడతారు కదా మీ దగ్గర టాక్స్ లు తీసుకున్నా కూడా. ఎందుకు బాగా చదువుకున్నవారు కూడా ఇంత చిన్న విషయం ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు. హిలరీ గురించి ట్రంప్ ఏదంటే అదే రిపీట్ చేస్తున్నారు, ఆవిడ నీరసంగా వుంటుంది, వృద్దురాలయిపోయింది ఆమె దేశాన్ని ఏం పాలిస్తుంది అని ట్రంప్ అన్న మాటలనే రిపీట్ చేస్తున్నారు, వారి మెదళ్ళను వాడటం లేదు ఎందుకంటే అప్పుడు వారి మనసు బాధ పడ్తుంది, డబ్బుని కాపాడుకోలేరు.

ట్రంప్ భారతీయుల ఓట్లకోసం, ’ ఐ లవ్ హిందూస్ అండ్ ఐ విల్ కంబాట్ రాడికల్ ఇస్లామిస్ట్స్,” అని అంటున్నారు. హిందువులకు, అమాయకులైన ముస్లింల మధ్య వివాదాలు పెంచడానికి చేసిన కామెంట్స్ ఇవి. కుహానా మేధావులకు అర్ధం కావడం లేదా! ఒకపుడు బ్రిటిషర్స్, ’డివైడ్ అండ్ రూల్,’ అన్నారు, సాధించారు, ఇప్పుడు ట్రంప్, ’డివైడ్ అండ్ గెట్ ఓట్స్,’ అంటున్నారు. అతని కోసం ఒక యాడ్ చేసారు, అతని ఫోటోలకు పూజలు చేస్తున్నారు, తల మీద పెట్టుకుంటున్నారు. మీరు ఇంత సపోర్ట్ చేసినా ఒకవేళ అతను గెలిస్తే మా అమెరికన్లకు ఉద్యోగాలు కావాలి, మీరు వారి పనులను దొంగిలిస్తున్నారు కాబట్టి మీరంతా వెళ్ళిపొండి అని వెళ్ళగొట్టడని గ్యారంటీ ఏదన్నా వుందా? ఆలోచించండి! స్త్రీలను ప్రతి నిమిషం అవమానిస్తూ తన కూతురే కాకపోతే ఇవాంకా ట్రంప్ తో డేట్ చేసే వాడినని చెప్పుకు కున్నాడు బిగ్ పర్వర్ట్ ! మోడి గారితో పోల్చుకుంటుంటే వూరుకుంటున్నారు.
ఆయన ఇలాగే స్త్రీలను అవమానించారా? ఆయన ఇప్పటికీ తల్లి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. మరి ఏ నైతిక విలువలు లేని ట్రంప్ కి మోడీ గారు సపోర్ట్ చేయడం ఏమిటీ? మతం పేరుతో, ముస్లింలందరూ తీవ్రవాదులు కారని, అమాయకులైన ముస్లింలను కూడా టెర్రరిస్ట్ లని నిందించడం ఎంతవరకు సబబు? మీరు ట్రంప్ ని సపోర్ట్ చేస్తున్నారంటే వీటినన్నింటిని సపోర్ట్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి.

అమెరికాలో ఇంతవరకు స్త్రీ ప్రెసిడెంట్ లేరు. ఎనిమిదేళ్ళ క్రితం ఒబామా గారు ప్రెసిడెంట్ అయ్యి ఆఫ్రికన్-అమెరికన్లకు గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం, ఎంతో సంతోషాన్ని అందించారు. ఏ జాతి వారయినా సరే రాష్ట్రపతి కావొచ్చు అని నిరూపించి చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. పదవిలోకి వచ్చినా ఆయన ఎక్కువగా ఏమీ చేయలేదనే ఆరోపణ వుంది కానీ ప్రతి ఒక్క ప్రెసిడెంట్ లాగానే ఇతరుల ప్రభావంతో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రితం ఒబామా గారు చరిత్ర సృష్టించారు, అలాగే ఈ సారి హిలరీ క్లింటన్ మొట్టమొదటి స్త్రీ ప్రెసిడెంట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నది. కానీ స్త్రీ ఒక ప్రెసిడెంట్ గా పనికి రాదని, ఆమె తెలివిని, అనుభవాన్ని చూడకుండా, ఆమె వృద్దురాలయిపోయింది, బలహీనురాలని, స్త్రీకి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదనే అపోహని ప్రజల్లో కల్గిస్తున్నాడు. ఇతర దేశాల్లో స్త్రీ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిష్టర్లు వారు వారి పనిని మామూలుగానే చెసుకుంటూ పోతూనే వున్నారనే విషయం ట్రంప్ కి ఎవరైనా చెప్పాలి, చూపించాలి, ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తున్న స్త్రీల ధైర్యసాహాసాలను చూపించాలి. ఎప్పుడు స్త్రీని ఒక సెక్స్ సింబల్ గా చూస్తూ ఎంతో మందిని లైంగిక అత్యాచారాలకు గురి చేసే అలవాటు పడిన మెదడుకి, ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి?

అమెరికా దేశం వలస వచ్చిన వారితోనే (ఇమ్మిగ్రంట్స్) మొదలయ్యింది. అలాంటిది అక్కడ కేవలం తెల్లవాళ్ళే వుండాలని ఇతర జాతుల, దేశాల వారు వుండకూడదని అంటున్నారు, జాత్యాహంకారాన్ని చూపిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. మరొక అభ్యర్ధి గుడ్దిలో మెల్లలా అందరికీ సమానహక్కులు వుండాలని, విద్యార్ధులకు చదువు విపరీతమైన ఖరీదైన విషయం గా మారిందని, ఆ విషయంలో వారికి ఫీజులు తగ్గించడమో, లేదా ఫీజులు లేకుండా చదువుకునే అవకాశం అందరికీ కల్పించడానికి ప్రయత్నిస్తామని చెపుతున్నారు. స్త్రీలకు సమాన వేతనాలు కల్పించడానికి ప్రయత్నిస్తామని, స్త్రీకి తన వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకునే హక్కులకు ప్రాధాన్యతనివ్వాలని అంటున్నారు. స్త్రీని కేవలం సెక్స్ సింబల్ గా, ఆమె స్థానం కేవలం గృహిణిగా ఇంట్లోనే వుండాలని అంటున్నారు మరొకరు.

ఇద్దరు అభ్యర్ధులు తప్పులు చేసినవారే కానీ అందులో ఎవరు మన హక్కులను కాపాడాలనుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా తుపాకులు తీసుకుని ఎంతో మందిని ఏ కారణాలు లేకుండా, లేదాఅ చిన్నప్పట్నుండి జాత్యహంకారంతో పెరిగినవారు ఇతర జాతులవారిని అసహ్యించుకునేవారు కాల్చి చంపేస్తున్నారు, ఎలిమెంటరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్ లో, హైస్కూల్స్ లో, కాలేజిల్లో, బయట ప్రజలు రోజు తిరిగే స్థలాల్లో ఎక్కడపడితే అక్కడ ఆలోచించకుండా కాలుస్తూ ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు, కొంతమంది వికలాంగులై, ఎన్నో సర్జరీలు చేయించుకుంటూ జీవితాంతం వీల్ చేయిర్స్ లో, మరి కొంతమంది కనీసం పక్కపైనుండి కూడా లేవలేకుండా చాలావరకు అవయవాలు పనిచేయకుండా జీవితాంతం ట్రీట్మ్ంట్స్ తో, మెడికల్ ఇన్సూరెన్స్ లేనివారు ఆర్ధిక ఇబ్బందులని ఎదుర్కుంటూ గడుపుతున్నారు. అందుకని ఒక పక్క ఈ గన్స్, రైఫిల్స్, ఆయుధాలను ఎక్కడపడితే అక్కడ ఎవరు పడితే వారు వెళ్ళి కొనుక్కుని జరిపే హత్యాకాండలని ఆపాలని, విచ్చలవిడిగా ఈ గన్స్, రైఫిల్స్, రక రకాల తుపాకుల షోస్ చేయడం దాంతో ఎవరైనా సరే చూస్తే కొనుక్కోవాలనే ఆలోచనని వారిలో రేకెత్తిస్తున్నాయని, ఇలాంటివి జరగకుండా ఆపాలని, ఒకవేళ వారి ప్రాణాలకు హాని వుండి వారి రక్షణ కొరకు కొనుక్కోవాలంటే ఎన్నో నియమాలను పెట్టి, లైసెన్స్ ఇచ్చి వాటిని చిన్న పిల్లలకు అందకుండా వుండేలా చూసుకోవాలని, మొత్తానికి ఈ ఆయుధాల కొనుగోలుని తగ్గించాలని, ప్రజల్లో స్కూల్స్, కాలేజ్, ఎక్కడపడితే అక్కడ జరిగే షూటింగ్ లని ఆపడానికి పూర్తిగా ప్రయత్నించాలని హిలరీ క్లింటన్ పార్టీ వారు అంటున్నారు.
మరో పక్క ఈ గన్స్ ని ఇష్టం వచ్చినట్టు కొని అవి పిల్లలకు అందుబాటులో వుండకుండా జాగ్రత్తలు తీసుకోనివారయినా సరే, గన్స్ వుండడం తమ హక్కని, ఈ గన్స్ తో జంతువులని వేట ఆడడంలానే మనుషులను కూడా జాత్యాహంకారంతో మారణకాండలను జరుపుతున్నారు అయినాసరే ఆ హక్కుని తీసేయకూడదని గన్స్ కావాలనే గ్రూప్ ఎన్.ఆర్.ఎ (నేషనల్ రైఫిల్ అసోసియేషన్) కి పూర్తి సహకారం ఇస్తామని ట్రంప్ అంటున్నారు.

హిలరీ క్లింటన్ తీసుకున్న నిర్ణయాలన్ని మంచివని అనడం లేదు కానీ స్త్రీల, పిల్లల హక్కులను సంరక్షిస్తూ వచ్చిన, ఇక ముందు ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి వారి అభివృద్దికి పాటుపడతామని, ధనవంతులకు ఎక్కువ పన్నులను విధించి, దేశాభివృద్దికి వుపయోగిస్తామని, కష్టపడుతున్న, మధ్య తరగతి, పేదవారికి పన్నుల భారం తగ్గించడం లేదా పన్నుల భారం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తామని అంటున్నారు హిలరీ క్లింటన్ పార్టీ వారు. ప్రచారం చేసేపుడు దేశం ముందు వున్న సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చేస్తారు, వారి ప్రణాళికలు ఏమిటి అన్న విషయాల గురించి మాట్లాడుతున్నారు.
అదే ట్రంప్ తన ప్రచారంలో దేశాన్ని గొప్పగా చేసేస్తానని, కానీ ఎలా చేస్తారో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెప్పలేదు, ఐసిస్ తీవ్రవాదులను మట్టుపెట్టేస్తామని, ఒబామా హెల్త్ కేర్ మంచిది కాదని, దాన్ని తీసేసి మరింత మంచి హెల్త్ కేర్ ప్రోగ్రాంలు చేస్తామని, ఉద్యోగాలిప్పిస్తామని, ఆర్ధిక వ్యవస్థని మార్చివేస్తానని వాగ్దానాలు, స్లోగన్లు మాత్రమే చేస్తుంటారు కానీ ప్రణాళికల గురించి అస్సలు మాట్లాడడు. అందుకే ప్రతి విషయంలో ఆచి తూచి ఓటు హక్కు వున్న భారతీయులందరూ ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ట్రంప్ లాంటి వాడినే ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఎన్నుకుంటుంటే తాలిబాన్ లాగానే ఇతర జాతుల వారిని ద్వేషిస్తుంటే, ముఖ్యంగా స్త్రీలకు వున్న ఈ మాత్రం స్వాతంత్యం కూడా లేకుండా పోతుంది. కనీసం స్త్రీలయినా ఆలోచించి మనం ముందడుగు వేయాలా, లేదా వెనక్కి వెళ్ళాలా అని సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం వుంది. ఈ తరం, ముందు తరం ఆడపిల్లలు కేవలం సెక్స్ సింబల్స్ కాదు అన్నీ రంగాల్లో ముందుకు వెళ్ళగలరు అని నిరూపించాలి అనుకుంటే వెనక్కి వెళ్ళకుండా ముందడుగు వేయాలంటే జాగ్రత్తగా ఆలోచించి ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాల్సి వుంది!

-కనకదుర్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

వ్యాసాలు, , , , Permalink

6 Responses to ఇండియన్ -అమెరికన్లు ఆలోచించి ఓటు వేయండి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో