ముసుగు-4(కథ ) -శ్రీసత్య గౌతమి

సరిత క్రొత్త నాటకం మొదలెట్టింది. తన తల్లి, మేనమామ, ఇతర బంధువులు ప్రసాద్ ని చేసుకోవద్దంటున్నారనీ … ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, మాట్లాడిన పద్ధతి తమను గౌరవించే విధంగా, ఇష్టపడిన విధంగా లేదనీ, అందువల్ల వాళ్ళకి నచ్చిన సంబంధం ఖాయం చేస్తున్నారనీ సరితా ఒకటే ఏడుపు ప్రసాద్ దగ్గర.

ప్రసాదుకు ఒక ప్రక్క అర్ధం కాలేదు, తన వాళ్ళతో ఒక్కసారికూడా మాట్లాడడానికే రానివాళ్ళు, తనవాళ్ళు మాట్లాడిన పద్ధతి తమని గౌరవించేవిధంగా లేదని ఎలా చెప్పారని సరితను కూడా అడిగాడు.

దానికి సరిత తన గురించి గాని, తన చదువు, ఉద్యోగం గాని పట్టించుకోలేదు … మీవాళ్ళు అడగలేదు సరికదా, ఎంతసేపు ఫ్యామిలీ మేటర్స్ ని గుచ్చి గుచ్చి అడిగారనీ … దాన్ని బట్టి తనవాళ్ళు తనకు ఇది మంచి జరిగే సంబంధం కాదని నిర్ణయిస్తున్నారనీ, తానిక ఏ నుయ్యో, గొయ్యో చూసుకోవాలని వాపోవడం మొదలెట్టింది.

ప్రసాద్ ఏమి చెప్పినా సరిత వినడం లేదు. తాను అప్పటికే నిరాశా నిస్పృహలతో బ్రతుకుతున్నట్లు నమ్మించేసింది.

ప్రసాదుకు రామారావు గారు సరిత ఫ్యామిలీ గురించి తాను సేకరించిన కొన్ని విషయాలను చెప్పబోయారు.
కానీ ప్రసాద్ వినే పరిస్థితిలో లేడు. అతను పూర్తిగా సరితను, తన చుట్టూ అల్లుకొని ఉన్న కకూన్ నే నిజమనే భ్రమలో పూర్తిగా పడిపోయాడు.

హేమలతను మరియు మరికొంతమంది పాత స్నేహితులతో కలిసి లేదా ఫోన్లలో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. సరిత తొందరపాటుకి సరిగ్గా ఆలోచించే టైం కూడా లేకపోవడంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా స్నేహితుల సమక్షంలో ఒక గుళ్ళో దండలు మార్చేసుకున్నారు. ఇకఫోటోలు, పార్టీలు కన్నవాళ్ళకి తెలిసీ వాళ్ళ గుండెకోతలు, ఏడుపులు వరుసగా జరిగిపోయాయి, ఏవీ ఆగకుండా.

ఈసారి ఏకంగా క్రొత్తపెళ్ళికూతురుగా సరిత రెండవసారి ఆ ఇంట్లో అడుగుపెట్టింది.
                                                            ***********************

సరిత విచిత్రమైన ప్రవర్తన రేవతమ్మకు ముక్కున వేలేసుకొనేలా చేసింది. అత్తమామల నిర్ణయాలకి ఏమాత్రం విలువివ్వకుండా తాను చేసిన బలవంతపు ప్రవేశానికి కించిత్తు కూడా ఫీలింగే లేదు సరితకు. అసలేమీ  జరగనట్లు నవ్వేస్తూ తిరిగేస్తున్నది ప్రసాద్ చుట్టూ.

“మాట్లాడడానికి మీ పెద్ద వాళ్ళని తీసుకొని రా అని పంపిస్తే … మా వాడిని నీ ఇష్టానికి తిప్పుకొని మా ప్రమేయం లేకుండా ఏకం గా పెళ్ళే చేసుకొని మా ఇంట్లో తిరిగేస్తున్నావ్ … ఇదేమి సమంజసం?” ఉండబట్టలేక అడిగేసింది రేవతమ్మ సరితని.

వెంటనే తడుముకోకుండా సరిత వంటగదినిండి పైన ప్రసాద్ గదిలోకి వినబడేటట్లుగా పెద్ద గొంతు వేసుకొని “నన్నడగకండి. మీరేమడగాలనుకున్నా మీ అబ్బాయినే అడగండి. అనవసరంగా మా తల్లిని వాళ్ళని అనడం కూడా మంచిది కాదు” … అరవడం మొదలెట్టింది.

రేవతి ఏదో అనబోతున్నా … సరిత వినిపించుకోవడం లేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ గట్టిగా గట్టిగా చెబుతూ … “కావాలంటే చెప్పండి మేమిప్పుడే వెళ్ళిపోతాం… మీ ఇష్టం ఉండమంటేనే ఉంటాం” … అని గొంతు చించుకుంటూ ప్రసాద్ గదివైపు వెళ్ళిపోయింది.

రేవతమ్మకు నోటమాటరాలేదు, సరిత మాటలు విని … “తానన్నది ఏమిటి? సరిత అంటున్నదేమిటి?”.

వెంటనే ఒకప్రక్క నుండి ప్రసాదు, మరో ప్రక్కనుండి రామారావు వచ్చేసారు.

“ఏం జరిగింది?” … ప్రసాద్.
“రేవతీ … ఏంటీ గట్టి గట్టిగా మాటలు విన్నాను?” …. రామారావు.

సరిత … కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ … ప్రసాద్ కు ఏవో చెప్పడం మొదలెట్టింది గదిలో.

రేవతి అక్కడే నిలబడి తాను అడిగినది, సరిత చెప్పిన మాటలు రిపీట్ చేసినది భర్త రామారావుకి.
కౌముది అక్కడే కూర్చుంది, ఈ విషయాలన్నీ వింటూనే ఉన్నది. తానూ రేవతికి సపోర్ట్ చేసింది. రామారావుగారు సైగ చేసి రేవతిని ఊరుకోమన్నారు.

ఇద్దరూ, కాదు కౌముదితో సహా ముగ్గురూ కూడా తమ కొడుకు క్రిందకి వచ్చి అమ్మా, నాన్నతో ఈ విషయం గురించి అనునయంగా అడిగి మాట్లాడతాడని ఈ విషయాన్ని చక్కదిద్దుతాడని ఎదురుచూసారు.

కానీ అలా జరుగలేదు. తాను తయారయ్యి … క్రిందకి వచ్చేసి కార్ తీసుకొని వెళ్ళిపోయాడు.
సరిత ఏమీ కానట్టు అతన్ని నవ్వుతూ సాగనంపేసి, గేటు వేసేసి, తరువాత తలుపుకు కూడా గడియపెట్టేసి … లోపలకెళ్ళిపోతోంది. అత్తగారు ఎదురుగా కనబడినా … ఏమీ పట్టనట్లు నోరు బిగించేసుకొని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ గది తలుపు వేసేసుకొన్నది.

రామారావు, రేవతి, కౌముది ఆవిడ ప్రవర్తనకు అవాక్కయిపోయారు. తామన్నది అక్కడ లేనట్టుగానే సరిత ప్రవర్తించడం వాళ్ళకి అది క్రొత్తగా, వింతగా తోచింది. ఇది కేవలం సరితతో రెండవ పరిచయం అంతే.

ఇంతలోనే వాళ్ళ ఇంటిలోనే వాళ్ళని పరాయివాళ్ళుగా ఫీల్ అయ్యేటట్లు చేసేసింది సరిత. వాళ్ళక్కడే నిలబడి ఉన్న తలుపులు గడియ పెట్టేయడం, ఇల్లంతా చీకటి చేసేసి ఆవిడ తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టేసుకోవడం…

రేవతికి మనస్సు మనస్సులో లేదు…అయినా యాంత్రికంగా వంటగదిలోకి వెళ్ళి అందరికీ వంట చేసి … భోజనాలకి పిలిచింది.

రేవతి కౌముది నికూడా తీసుకొని సరిత గదికి వెళ్ళి సరితను భోజనానికి పిలిచింది.

సరిత ఏమీ మాట్లాడకుండా వినేసి … మెల్లగా లేచి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చింది. మిగితా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గిర కూర్చున్నారు.

రామారావు … సరిత వాలకం చూసి, సరితా… “భోజనానికి వచ్చి కూర్చో” ..అన్నారు.
“ఫర్వాలేదండి … మీ అబ్బాయి కూడా వస్తారేమో ఇప్పుడు భోజనానికి” అన్నది.
“అవునా… జెనెరల్ గా లంచ్ కి రాడే. సరే వస్తే రాని … నువ్వు రా” … అన్నారు రామారావు.

ఈ లోపులో  … ఎవరో కుర్రాడు వచ్చి తలుపు దగ్గర ఆగాడు. వెంటనే సరిత లేచి వెళ్ళి … వాడి చేతిలో ఉన్న పార్సెల్ తీసుకొంది.

ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.

తాను కూడా అది తీసుకొని పైన రూం లోకి వెళ్ళబోతూ ఆమె వైపే చూస్తున్న వీళ్ళందరినీ చూసి ఉద్దేశిస్తూ … “మీ అబ్బాయికి పేషంట్స్ ఉన్నారట, రావటం లేదు. నాకు భోజనం పంపించారు. మీరు చేసేయండి” … అంటూ గర్వంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

అదే ఇంట్లో వుంటూ, రెండవ పరిచయానికే … చిన్న మాటకి … రెండు కుటుంబాలుగా విడదీసేసింది సరిత.

రామారావు, రేవతి మనసు నొప్పి దాంతో సరిగ్గా తినలేకపోయారు. ప్రొద్దునకి  ప్రొద్దున ఒక బాధ, కొడుకు ఏమీ మాట్లాడకుండా సరితకు మాత్రమే హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడనీ, దానితర్వాత ఈ భోజనాలదగ్గర బాధ.

ఇహ సాయంత్రం ఏ సినిమా చూపించనుందో సరిత … అందరికీ!!!
                                                *********************
ఇలా సాయంత్రం వరకూ ఆ బాధ అలాగే ఉంది. రాత్రయ్యింది, ప్రసాద్ ఇంటికి వచ్చేశాడు. రేవతమ్మ మారుమాట్లాడకుండా ప్రసాద్ నీ, అందరినీ భోజనాలకి పిలిచింది. అందరూ వచ్చికూర్చున్నారు. రేవతమ్మ మనసు మూగగా రోధిస్తున్నా … పైకి నవ్వు ముఖానికి పులుముకొని …

“ప్రసాద్ … మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నావట, సరిత చెప్పింది, ఇంతలో ఎవరో కుర్రాడు వచ్చి నువ్వు రావట్లేదని చెప్పినట్లున్నాడు, బాగా లేటయ్యిందా?” … చాలా అనునయంగా అడిగింది.

ప్రసాద్ అస్సలు మొహం ఎత్తకుండా … “లేదు, వద్దామనుకున్నాను కానీ, రాలేదు అందుకే సరితకు భోజనం ఏర్పాటు చేశాను”… అన్నాడు.

రేవతి అడిగిన ప్రశ్నకు, ప్రసాద్ చెప్పిన సమాధానానికి అస్సలు మ్యాచ్ కాలేదు. తల్లి ముఖంలో రంగులుమారాయి. తండ్రి ఇక ఊరుకోలేదు.

“ఏంటిరా … సరితా సరితా అని మాట్లాడుతున్నావ్. ఎప్పట్నుండి వచ్చిందిరా సరితా? ఇది కేవలం రెండవసారి ఆమె మన ఇంటికి రావడం, మొదటి సారి ఆటో దిగి వచ్చింది, రెండవ సారి మరో మోటారు బండి కారు దిగి వచ్చింది, థట్స్ ఆల్ ……

అమ్మ ఏమడుగుతోంది? నువ్వేం చెప్తున్నావ్?” …. తండ్రి గద్దించాడు.

“సరితకు కు కనీసం భోజనానికి కూడా పిలవరా?” …. అడిగాడు ప్రసాద్.

“ఎవరు చెప్పార్రా పిలవలేదని? అమ్మా, చెల్లీ పైకి వెళ్ళి మరీ రాణీ గారిని క్రిందకు పిలుచుకొని వచ్చారు. నేను కూడా భోజనం చెయ్యమని నోరు తెరిచి అడిగాను. అప్పుడే ఆమె నోరిప్పింది, నువ్వు భోజనానికి వస్తున్నావని ఒకసారి, వెంటనే రావట్లేదని రెండవసారి …
ఈ లోపుల ఎవరో కుర్రాడు పార్సెల్ తెస్తే, పట్టుకొనిలోపలికి పోయింది.
ఇప్పుడు నువ్వుచెప్పేదాక తెలియదు అది భోజనం పొట్లమని.
అయినా ఇంట్లో భోజనం ఉండదా? నువ్వు భోజనం పంపడమేమిటి ఆమెకి?” …. రామారావు ఉగ్రులయ్యారు.

సరిత ఈ హఠాత్పరిణామానికి ఒకసారి అక్కాబెక్కా అయిపోయి …

“బాగుంది … భోజనం పెడతారో, పెట్టరో అని వర్రీ అయ్యారు నా గురించి. ప్రొద్దుట్నుండి మీరెవరూ అతనితో గానీ, నాతో గానీ మాట్లాడకపోయేసరికీ….”అని దీర్ఘం తీసింది.

దానితో సాయంత్రానికి మరో విభిన్నమైన బాధ మొదలైంది అందరికీ, సరితకు తప్పా.

అసలు ప్రసాద్ వచ్చి మాట్లాడాలని కన్న వాళ్ళు చూస్తుంటే ఆ సిట్యువేషన్ ని తనకనుగుణంగా మార్చుకొని క్రొత్త సమస్యని వారి మధ్యకు తీసుకొచ్చి పెట్టింది సరిత.

ఇలాగే వంటగదిలోకెళ్తే ఒక సమస్య, కుళాయి దగ్గిర ఒక సమస్య, వస్తువు ముట్టుకుంటే ఒక సమస్య, పూజగది దగ్గర ఒక సమస్య … ఇలా ఆ ఇంట్లోని ప్రతి చిన్న విషయాన్ని తనకీ, ప్రసాద్ కు  వ్యతిరేకంగా మారుస్తూ … కన్నవాళ్ళనీ, చెల్లెలినీ ప్రసాద్ దృష్టిలో చిన్న బుచ్చుతూ, చెడ్డచేసే ప్రయత్నాలలోనే అహర్నిశలూ అలుపులేకుండా శ్రమిస్తున్నది సరిత.

ప్రసాద్ ఉన్నంతసేపూ గొడవలు, గిల్లి కజ్జాలు… అతను వెళ్ళిపోయాక హాయిగా తన రూం లోకి వెళ్ళి పడుకొని ప్రసాద్ వచ్చేదాక ఫోన్లు.

రేవతి పిలిస్తే వచ్చి తినేస్తున్నది, లేదూ ఆమెకి మూడ్ లేకపోతే … ప్రసాద్ కి ఫోన్ చేసి భోజనం పొట్లం తెప్పించుకొని తన గదిలోనే తినేస్తున్నది.

ప్రసాద్ వచ్చేసరికి చక్కగా అలంకరించుకొని అందరూ భోజనాలకు కూర్చున్నప్పుడు, రేవతి వండిన భోజనాన్నే … తన చేతిలోకి తీసుకొని … ప్రసాద్ కి వడ్డించి … అతనితో పాటు గదిలోకి వెళ్ళిపోతున్నది.
ఇలా నెల రోజులయ్యింది. నెల రోజులబట్టీ సరిత వరస ఇదే. తయారవ్వడం, భోజనం చెయ్యడం ఇంట్లోనో, బయటనుండో, రాత్రయ్యేసరికి మళ్ళీ తయారవ్వడం, లోపలకెళ్ళి తలుపేసుకోవడం.

ఉన్నవాళ్ళతో కలవడానికి ట్రై  చెయ్యడం గానీ, అత్తా, ఆడబడుచులతో సరదాగా ఉండడం గానీ ఏదీ లేదు.

తానొక్కర్తే సుఖంగా ఉంటోంది, మిగతా అందరినీ విషాదం లోకి త్రోసేస్తున్నది.

ఎవరయినా ప్రసాద్ ని నోరు తెరిచి అడిగితే… ఒకటే చెప్తుంటాడు- సరితని సరిగ్గా చూడడంలేదనీ, ఆమెని అర్ధం చేసుకోవడంలేదనీ.

రామారావు, రేవతీలకు పూర్తిగా అర్ధమయిపోయింది. సరిత ప్రసాదుకీ, వాళ్ళకీ మధ్యలో అడ్డంగా నిలబడి వేరు చేసేస్తున్నదని. ఇక అటువంటప్పుడు ఏమి మాట్లాడినా ప్రసాద్ కు తప్పుగానే తోస్తుంది తప్పా … తమవైపు ఆలోచించలేడని కన్న వాళ్ళు సర్దుకు పోతున్నారు. దాన్ని ఇంకా చాతకానితనం గా తీసేసుకొని సైలెంట్ కిల్లర్ లా సరిత వ్యవహరిస్తూనే ఉంది.

కొద్ది నెలలు గడిచాక, రామారావు, రేవతి కూర్చొని మాట్లాడారు ప్రసాద్, సరితలతో… ఇంట్లో అందరితో కలి సి ఉండాలని. అదే అదునుగా తీసుకొని సరితా ఉత్తినే ఏడుపులు మొదలెట్టింది.

-శ్రీసత్య గౌతమి

————————————————————————————————————————————

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)