రంగనాయకమ్మ హేట్స్ రంగనాయకమ్మ-విక్టర్ విజయకుమార్

” అబ్బా…మళ్ళీ మొదలుపెట్టిందిరా ఈమె…..” అంటూ గడ్డం లో వేళ్ళు దూర్చి నిమురుతూ మొహం ఏటవాలుగా పెట్టి నావైపు నోరు తెరిచిపెట్టి అదోలా చూసాడు.

” యు సీ…ఐ యాం నాట్ ఎ గే …. డోంట్ లుక్ ఎట్ మి లైక్ దట్ ” అన్నా.

వాడు కసా బిసా….నవ్వేసాడు.

” మై లవ్ ఫర్ యు ఈజ్ ప్యూర్లీ ప్లుటోనిక్ మై డార్లింగ్ “

నిన్న రాబర్ట్ నాగేంద్ర దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో ఇంటికి వచ్చాడు. పొద్దున్నుండి రోహిత్ సంఘటనను దాటేసిన జే ఎన్ యూ రాజకీయాలు గురించి, కరీంస్ కబాబ్స్ గురించి, వాడి ఫేస్ బుక్ చతుర్ల గురించి, సన్నీ లియోనీ కొత్త సినిమా ప్లాన్స్ గురించి …ఆపకుండా ఒదరుతున్న వీడికి ఈ మధ్య కుల సమస్య అంటూ మళ్ళీ రంగనాయకమ్మ రాసిన వ్యాసం పడక పడక వాడి దుర్మార్గపు కళ్ళల్లో పడనే పడింది.

” ఒరేయ్ రాబర్టూ….ఆమె సంగతి నీకు తెలీందేముందిరా…బట్ యు మస్ట్ నాట్ బి పర్సనల్ ఎట్ యిట్ ” సముదాయించబోయా

” ఒరేయ్ దుష్టుడా…మోదీ నీలాంటోడినే ఈజీగా పక్కా దారి పట్టించేది ..ఏవనుకున్నావో ! ” గడ్డం సరి చేసుకుని అన్నాడు ‘” మన్ మొహన్ సింగ్ మీద జోకులొచ్చాయి…మోదీ మీద సటైర్లు వచ్చాయి…ఎందుకు ? చాయిస్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ మనం వాడే భాష ఏ ఉద్దేశ్యం కోసం ఉపయోగిస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. మోదీ ఏవన్నా మారుతాడని నీకో పిచ్చి ఆశ ఏమన్నా ఉందనుకో – అప్పుడు తార్కికంగా మాట్లాడే విధానం ఎన్నుకుంటావ్. అర్థం చేసుకోవాలని ఉన్నా చేసుకునేంత పరిఙానం లేదనుకో , అప్పుడు విశ్లేషణాత్మక పద ప్రయోగాన్ని ఎన్నుకుంటావు…అలానే….చిరంజీవి నూట యాభయ్యో సినిమా అదో ప్రపంచ అద్భుతం లా వేచి చూసే మూర్ఖులకు ఎలా పాయింట్ చెప్పాల్సి వస్తుంది ? ” తనే సమాధానం ఇస్తూ ” మనం అమాయకం నటించి వాళ్ళను కంటిన్యూ చేయమనాలి ” అని కళ్ళద్దాలు సరి చేసుకుని కిసుక్కుమన్నాడు. ” అయితే అన్నీ తెలిసి పైకి నాజూకైన పదజాలాన్ని వాడి, ఎంత గీ పెట్టినా నా మాటే కరెక్ట్ అనే విధానాన్ని ఫాలో అయ్యే…” మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ” అంటే మోదీ అండ్ రంగ నాయకమ్మ టైపా…” అన్నా. వాడు సెకను ఆగి నా వేపు నాటకీయమైన ప్రేమను నటిస్తూ ” ఇన్టెలిజెంట్ బోయ్ ” అన్నాడు.

కంటిన్యూ చేస్తూ ” సటైర్ తప్పని ఆయుధం బావా అలాంటోళ్ళకు !…అంత మాత్రాన నీవు అది పర్సనల్ అని భావించడం నీకు తగిన ఆలోచన కాదు బావా ! ” అనేసి గబుక్కున వెళ్ళి టేబుల్ డ్రా లో ఆబగా వెతక సాగాడు.

” ఒరేయ్ …సిగరెట్ చూస్తే అమ్మ తంతుంది. పద……టేబుల్ లో కంటపడుతుందేమోనని నా జేబులో పెట్టుకున్నా….పద బయటకు ” అని అడుగులు ముందుకేసా. వాడు బుద్ధిగా తలొంచుకుని చొక్కా గుండీలు సరి చేసుకుంటూ ఫాలో అయ్యాడు. మరి వాడికి సిగరెట్ అంటే అంత ప్రేమ !

మా అపార్ట్మెంట్ కింద పార్క్ మూలలో కూర్చున్నాము. సిగరెట్ వెల్గిస్తూ అన్నాడు ” సిగరెట్ కాంట్ లవ్ సిగరెట్. ఎందుకు ? ” సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ వేసాడు కళ్ళద్దాళ్ళోంచి చూస్తూ.

” దానికి ప్రాణముండదు కాబట్టి ” బదులిచ్చా. ” నో !…రాంగ్…దానికి ప్రేమించాలి అని తెలీదు కాబట్టి ” అనేసి మళ్ళీ ‘ కి కి కి ‘ మని నవ్వాడు.

నోట్లో నుంచి పొగ పీల్చి గుండెల నిండా దమ్ము పీల్చాక అన్నాడు ” రంగ నాయకమ్మకు తనను ప్రేమించుకోవడం లో ఎంత అబ్సెషన్ ఉంటుందంటే , దాని కోసం తనను ద్వేషించుకోడానికి కూడా వెనకాడదు “

నేను ఫక్కున నవ్వి అన్నా ” ఒరేయ్ ..మచా…..ఇదేదో ఆక్సి మొరాన్ లా ఉంది. ఖచ్చితమైన అంచనా టైపు… “

“ఓకే…లెట్ మి ఎక్స్ ప్లెయిన్ మై బోయ్…” అనేసి గేట్ దాటి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెల్తున్న అమ్మాయిని చూసి క్షణం ఆగి ” మోహము విడుచుటే మోక్ష మది దేహ మెరుగుటే తెలివైనదే అని అన్నమయ్య ఏం చెప్పాడ్రా ?! ” అనేసి మళ్ళీ తడుముకుని ” ఓహ్..సారీ…ఇప్పుడెక్కడున్నాము ? “ అని బుర్ర గోక్కొని” యా ….. రంగనాయకమ్మ హేట్స్ రంగనాయకమ్మ దగ్గర కదా ? ” అన్నాడు.

” నీ మొహం రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ అన్నావ్ “

” అదే లేవో …. విను సాంతం . ” అని మళ్ళీ ఒక దమ్ము లాగి మొదలు పెట్టాడు. వాడి ఎక్స్ ప్రెషన్ చూస్తే నాకు వాడూ ఏదో సీరియస్ లెక్చర్ ఏదో తీయబోతున్నాడని కన్ ఫం అయ్యింది

” శారీరక శ్రమ , మానసిక శ్రమ అంతరాలు పోతే కుల వృత్తుల అలాట్ మెంట్ ఫార్ములా పోతుంది. దానితో పాటు కులం పోతుంది అని రంగనాయకమ్మ అంటుంది. ఇది అర్థం చేసుకో – ‘ దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటె మనుష్యులోయ్ ‘ కదా ?….ఈ విషయం ఎవడికి తెలీదు చెప్పు. కొన్ని ఆల్రెడీ లెయిడ్ డౌన్ ప్రిన్సిపుల్స్ అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడితే ఏమౌతుంది ….మొహం మొత్తడం తప్ప ! ఎవరికి మాత్రం ఉండదు ‘ మనుష్యులందరూ సమానులు ‘ అని. ఇప్పుడు సమస్య – అదే ఎలా సాధించాలి అని కదా ? ప్రిన్సిపుల్స్ కాదు…ప్రాసెస్ కావాలి….ఐ మీన్ నియమాలు కాదు….అమలు కావాలి….. థియరీ కాదు ప్రాక్టీస్ కావాలి. సజెషన్ లు కాదు….ఒక స్ట్రక్చర్ కావాలి. అందుకే ఇవన్నీ అర్థమైన రంగనాయకమ్మ ఇవేమీ అర్థం చేసుకోదల్చని రంగ నాయకమ్మను ద్వేషిస్తుందన్న మాట “

” ఎట్లెట్లా ? ఎట్ల ? “

” అవును….నేను ఇప్పుడు ఏకరువు పెట్టిన ప్రాస సిద్ధాంతం తెలిసిన రంగనాయకమ్మకి ….ఈ సిద్ధాంతాన్ని అమలు చేయలేని లేదా ఆ రెండో పార్శ్వాన్ని గురించి మాట్లాడని రంగనాయకమ్మ అంటే ద్వేషం. ఒక రంగ నాయకమ్మ ప్రిన్సిపుల్స్ చెప్తుంటే …ఇంకో రంగ నాయకమ్మ వచ్చి ” అబ్బో …తెలుసులే మాకు. దండకం చదవడం ఆపి …అదెలానో చెప్పు ” అని విసిగిస్తుందా…..చూడు…అప్పుడు ఈ రంగ నాయకమ్మ కు ఆ రంగ నాయకమ్మ మీద ద్వేషం వస్తుందన్న మాట “

నాకు నవ్వొచ్చింది. ఆపుకుంటూ అడిగా ” ఒరేయ్ …అంటే రంగ నాయకమ్మ కు ఈ విషయాలు అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతుందంటావా ? ” అన్నా. వాడు నా నవ్వు మొహం పట్టేసి వాడు కూడా తన గడ్డం ఫేసును చిరు దర హాస పూరిత మోముగా మలచి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.

” ఒక నిర్మాణం లేకుండా వర్గ పోరాటం సాధ్య పడుతుందా ? ఉత్తి మార్క్సిస్టు నియమాలు వల్లిస్తే వర్గ పోరాటానికి శ్రామికులు ఉరుకులెత్తుకుంటూ వెళ్తారా ? ఆ విషయం రంగ నాయకమ్మకు తెలుసు. అందుకోసం సుమారు 70 సంవత్సరాలు దగ్గర పడుతున్న మన స్వంత్ర భారత దేశ లెఫ్టిస్ట్ ఉద్యమాలలో ఏదో ఒకటి కొత్తదైనా , పాతదైనా మనకో నిర్మాణం కల్పించి నడిపించే పార్టీ కావాలి కదా ? లేపోతే ఆకాశం నుండీ వర్గ పోరాటం రాలి పడదు కదా ? శ్రామిక వర్గం తన కోసం పని చేసుకోవాలనుకుంటే ఒక పార్టీ ఉండాలని మార్క్సే కదా అన్నాడు ?!…ఈ విషయం రంగ నాయకమ్మ చదివింది. తనకు బా తెలుసు కూడాను. ఇంకో రంగ నాయకమ్మ కు మాత్రం ఆయా పార్టీల గురించి మాట్లాడ్డం ఇష్టముండదు. పోనీ కొత్త పార్టీ అవసరం గురించైనా మాట్లాడదు. ఆమెకు అందర్నీ పొద్దున్నే లేస్తూనే రెండు తిట్లు తిట్టి మొదలు పెట్తకపోతే గడవదాయె. సో…..రెండో రంగ నాయకమ్మను హేట్ చేయక ఏం చేస్తుంది ? “

వీడు సునిశితంగా విషయాన్ని చెప్తు న్నాడు గాని వ్యంగ్యం డోసే ఎక్కువయ్యింది. సమాధానం ఉందని చె ప్తూ నే సమాధానం ఇవ్వకుండా కప్ప దాటేయడం సైద్దాంతిక చర్చలో ఒక పద్దతి. ఆ విషయాన్నే వీడు వీడి తరహాలో కన్ వే చేస్తున్నాడు. అలానే వింటున్నా.

” ఈమె అందర్నీ విమర్శించడం లో ఈమెకు ఒక కిక్కు ఉంది. అంటే ఆమె చేసిన అన్ని విమర్శలు తప్పా అని అడగకు. అది ప్రశ్న కాదు. ఎవర్ని సైద్ధాంతిక న్యాయ స్థానం లో నిల్చో బెట్టినా …. ఆంతో ఇంతో తప్పులు, బలహీనతలు, పరిమితులు, మూర్ఖత్వం, పిడివాదం, మిస్ కన్సెప్షన్స్ దొరుకుతాయి…..నాది ఆరోపణే ! మరి ఆమె చేస్తున్న విమర్శలో నిజాయితీ కలిగిన విమర్శ ఉందా ? వ్యక్తిగత నిజాయితీ కాదు..సైద్ధాంతిక నిజాయితీ ఉందా ?…మొదటి రంగనాయకమ్మను అడుగు. రెండో రంగ నాయకమ్మ గురించి మొత్తం గుట్టు రట్టు చేస్తుంది. ఒక డెప్త్ లో మార్క్సిజం తెలీని పాఠకులు మాత్రమే ట్రాన్స్ లో ఉంచ్చొచ్చు. సరిగ్గా సమాజాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు , నిజంగా మార్క్సిజం గురించి ఆమె రాసిన విక్రం గైడ్స్ కాకుండా ఒరిజినల్ పుస్తకాలు చదివిన వాళ్ళు ఈ ట్రాప్ లో పడరు. నేను సింపుల్ గా కుల సమస్య గురించి ఆమెకు తెలిసినది ఏంటి, రాస్తున్నదేంటి..అని చెప్పా “

బెంచ్ పైన సర్దుకుంటూ సిగరెట్ కాలి కింద నలిపేస్తూ అన్నాడు ” ప్రతి మనిషికి ఒక మోరల్ కంపాస్ ఉంటుంది. దానికి కొన్ని ఇర్రేషనల్ టెండెన్సీస్ ఉండడం సహజం గాని …మొత్తానికి ఉత్తర దక్షిణలు మార్చి చూపదు. నిర్మాణం సూచించకుండా, నిర్దుష్ట ప్రణాళిక సూచించకుండా ఉత్తిగ వర్గ పోరాట మహా దండకం చదివితే – దళితులు ఉరికెత్తుకుపోయి వర్గ పోరాటం చేస్తారా ? ఇన్నాళ్ళు వచ్చిన లెఫ్టిస్ట్ కంపనీలు…సారీ…పార్టీలు ఎన్ని మీటర్లు వర్గ పోరాటం చేసాయి…ఎంత మేరకు కులాన్ని నాశనం చేసాయి ….. ఎంత మంది దళితులను నాయకత్వ స్థాయికి పట్టుకొచ్చాయి…..మార్క్సిస్ట్ రీసర్చ్ జరగాల్సింది వీటి మీద !…. సరిగ్గా వాటి మీద !!.. అది వదిలేసి…మోరల్ కంపాస్ ను నీతులు, నియమాలు అనే టాపిక్ మీద చూపడం సైద్ధాంతిక అవినీతి కాదా మచా ? లేదా అమెనే ఒక్క సారి తేల్చేయమను…ఈ దేశం లో ఒక్క మార్క్సిస్టు పార్టీ లేదు. ఒక్క మార్క్సిస్టు లేడు ….. నేను తప్ప…… మీరు కొత్త పార్టీ పెట్టండి అని. అలా కాక వ్యంగ్యాస్త్రాలతో, ప్రొవోకింగ్ పదజాలం తో దళితులను వర్గ పోరాట దిశ వేపు మళ్ళించే ఏకైక మార్క్సిస్టు రచయిత్రిగా ఆమె లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కుతుంది “

వాడి ఆవేదన నాకు అర్థమౌతుంది. మేఘాలు మూసుకుని ఆకాశం నల్లగా తయారౌతుంది. వర్షం వచ్చేలా అనిపిస్తుంది.

“ బావా…నీకో కథ చెప్తా విను ! “ అని మొదలు పెట్టాడు
* * * * * * *

ఒక రన్నింగ్ రేస్ ఉంది. అనుకో….జస్ట్ అలా అనుకో. అదేదో పెద్ద బహుమతి ప్రకటించి ఉన్నారు గెలవబోయే వాళ్ళకు. పాపం ……ఒక వికలాంగుడు ఆ రేస్ లో పాల్గొనాలనుకున్నాడు. అయితే తాను పాల్గొనగలిగితే తన వాకర్స్ తోనే పాల్గొన గలడు. ఈ విషయం రంగనాయకమ్మ నంబర్ వన్ కు తెలిసి ఇలా అంటుంది

“ ఓరి వెర్రి నాగన్నా…. నీవు వాకర్స్ తో గెలవలేవు. పరుగు పందెం లో గెలవాలంటే బలమైన కాళ్ళు కావాలి. అందుకు ఆపరేషన్ చేయించుకోవాలి. అంతటితో సరి పోదు మాంఛి ఫిజియో చేయాలి. ఇది దీర్ఘ కాలమైన ప్రయత్నమే. కాని అదే లక్ష్యాన్ని ఛేధించగలిగే నిజమైన మార్గము. హీ….హీ…హీ……నీవు వాకర్ ఎక్స్ట్రాగా దొరుకుతుందని వికలాగుండిగా ఉండి పోవడమే బెటర్ అనుకుంటున్నావేమొ. అలా కాదు “

ఇక ఆ మాటలు రంగనాయకమ్మ నంబర్ టు వినింది . వెంటనే నంబర్ వన్ తో ఇలా అంది

” ఇప్పుడు కాళ్ళు లేవు. దానికో తక్షణ పరిష్కారం చూడకుండా నీవేంటి…ఊరికె దీర్ఘ కాలిక సమాధానం అని నసుగుతావేంటి. ఆపరేషన్ చేయాలంటే బోల్డన్ని డబ్బులు కావాలా ? ….ఆపై స్పెషలిస్టును వెతకాలా? ….మరి ఈ దేశం లో అంత గొప్ప డాక్టర్లు ఉన్నారో లేదో చూడాలా ?….మరి డాక్టర్లు ఉంటే అలాంటి ఆపరేషన్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయో లేదో చూడాలా ?…..కాళ్ళు ఆపరేషన్ చేయించుకుని ఫిజియో చేయించుకుంటే పరిగెత్త వచ్చు అనేది యూనివర్సల్ ప్రిన్సిపుల్. నీవు చెప్పేదేంది ? ఆ మాత్రం లాజిక్ , నంబర్ టు అయిన నాకూ తెలుసు. ఆపరేషన్ చేయించాలని అందరికీ తెలుసు. అయితే అది ఎలా సాధ్య పరచాలో అది చెప్పు. అది ముఖ్యం ఇప్పుడు. ఎలా డాక్టర్ లను వెతకాలి, ఏ హాస్పిటల్ లో చేరాలి, డబ్బు ఎలా సమకూర్చు కోవాలి… మరి ఆపరేషన్ అయ్యే వరకు …జీవితాన్ని ఎంత కాలం ఇలా ఎలా లాగాలో అది చెప్పు. ప్రపంచం లో అందరికి తెలిసిన విషయమే తిప్పి తిప్పి చెప్తావేంది ? ” అని నెమ్మదిగా విసుక్కుంది.

రంగ నాయకమ్మ నంబర్ వన్, రంగ నాయకమ్మ నంబర్ టు మాటలకు హర్ట్ అయ్యింది. అలా ప్రాక్టికల్ గా, నిక్కచ్చిగా మాట్లాడ్డం నచ్చ లేదు. కోపంగా అంది ” ఐ హేట్ యు ! “

* * * * * * *
నిజమే ! అంత సునిశిత పరిశీలన ఉందని ఇమేజ్ సంపాయించినా , మార్క్సిస్టు పుస్తకాలు భట్టీ పట్టినా, ఈ ప్రాక్టికల్ విషయాలు రంగ నాయకమ్మకు తెలీదు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడానికి స్కోప్ లేదు మరి ! నాకు ఈ నంబర్ వన్, నంబర్ టు డబల్ యాక్షన్ గొడవ విని నవ్వు మెదులుతుండగా , వాడి మొహం లో పులుముకుంటున్న ఒక నిరాసక్త భావావేశాన్ని చూసి వాడేదో చెప్పడం మొదలు పెడుతుంటే భుజం మీద చేయి వేసి దగ్గరకు జరిగా.

” ఒరేయ్ అన్నిటికన్నా దుర్మార్గం నీకు చెప్పానా రా ? ” రిజర్వేషన్ ల కోసం చిన్న కులాలుగా ఉండి పోవడాన్ని దళితులు కోరుకుంటారట. అలా రాస్తుంది మార్క్సిస్టు మహా రచయిత్రి. ముస్లిములు టెర్రరిజం ను సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా ఉంది ఇది. వాకర్స్ సహాయం దొరుకుతుందని…’ కాళ్ళు లేకపోవడమే బాగుంది. కాళ్ళ మీద బరువేసి నడిచే శ్రమ తప్పింది ‘ అని ఎవరన్నా ఆలోచిస్తార్రా ? ఇది దళితులను స్టీరియో టైపింగ్ చేయడం కాదురా ..? చెప్పు ?!.. పైగా…దానికో రంగు వేసి..అలా అమాయకంగా అనుకుంటారు…అని కవర్ చేస్తుంది. ఎవరు చెప్పారు ఈమెకు వీళ్ళు ఇలాంటి భ్రమల్లో ఉన్నారని ? మరి వాళ్ళు చెప్పలేదా …’ మాకు ఈ మార్క్సిస్టు నీతి సూత్రాలు ఎప్పుడొ తెలుసు ఇప్పుడు కాంక్రీట్ గా ఏదన్నా చెప్పు ‘ …అని ? ఆ మాట ఆమె వేగులు ఆమెకు చేరవేయలేదా ? ఎవరినీ సపోర్ట్ చేయకుండా మాట్లాడ్డం గొప్పే అయితే – నేను కూడా ఎవరిని సమర్థిస్తూ ఏమీ మాట్లాడను. అందరినీ విమర్శిస్తాను. నాకూ ఆ గొప్ప తనం వచ్చేస్తుందా ? మంచితనం లేని గొప్ప తనం ఎందుకు ? నాలుక గీక్కోడానికా ? హ్యుమిలిటీ లేని మార్క్సిజం ఎందుకు ? కేపిటల్ పుస్తకానికి అట్టలు వేసుకోడానికా ? పుస్తకం చదివితే ఈత రాదురా….దళితులు రిజర్వేషన్ కోసం బతుకుతున్నారనే భ్రమలో ఉండే రచయితలు కూడ ఈ రోజు కుల సమస్య పరిష్కారం గురించి రాస్తున్నారు చూడు…అది ఈ దేశం లో మార్క్సిజానికి పట్టిన ఖర్మ ! “

వీడు చిన్నప్పట్నుండి కష్టాలు దగ్గరగా చూసాడు. జీవితం మీద వీడికో లైట్ దృక్పథమే ఉంటుంది. సాధారణంగా సీరియస్ గా ఉండడం వీడికి అబ్బినట్టు నేనెప్పుడూ గమనించింది లేదు. సటైర్ వేస్తాడనుకుంటే వీడు కాస్తా హార్ట్ కు ఎక్కువే తీసుకున్నట్టున్నాడు. నాకే కంగారు వేసింది. అంబేద్కర్ చెప్పిన మాట గుర్తొచ్చింది ” I want to tell my critics that I regard my feelings of hatred as a real force. They are only the reflex of the love I bear for the causes I believe in. ” నిజమే ఒక వ్యక్తిని ద్వేషించాలంటే , ఒక సిద్ధాంతాన్ని ద్వేషించాలంటే , దగా పడ్డ జీవితాల పట్ల ప్రేమ ఉండాలి. ఆ జీవితాల మూలాల్లో జరిగిన ద్రోహం పట్ల అసహనం ఉండాలి. సిద్ధాంతాన్ని నేర్చుకోడానికి…సైద్ధాంతిక నిజాయితీ అలవర్చుకోడానికి గేప్ అక్కడే ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా ప్రజల పట్ల ప్రేమను ప్రకటించాలని ప్రయత్నం చేస్తే అది శూన్యంగా ఉంటుంది. ఈ విషయాలు రంగ నాయకమ్మ లాంటి మేధావులకు తెలీదు అని కాదు. అయినా సరే…అలానే ఉంటారు వీళ్ళు…మార్క్సిజం కూడా అలాంటి నికృష్ట పరిస్థితుల్లోనే ఉంటుంది ఇక.

అందుకే మా రాబర్ట్ నాగేంద్ర అన్నట్టు ‘ రంగ నాయకమ్మ హేట్స్ రంగ నాయకమ్మ ‘ ! ఇదో మార్క్సిస్ట్ కాంట్రాడిక్షన్ !! మనుష్యులపై ప్రేమను చూపిస్తూ చిమ్మే ద్వేషం!! అన్నీ తెలిసి అమాయకత్వం నటించే మేథో కుంభకోణం !! సమాధానం సూచిస్తూనే సమస్యను పక్క దారి పట్టించే గొప్ప పరిఙాన అధార్మికత !! దళితులకు ఆత్మ గౌరవం లేదని నమ్మే కొంగొత్త కుల నిర్మూలన సిద్ధాంతము !!

వాడి భుజం మీద చేతులేసి ఇంటికి వెల్తుంటే, అప్పుడే జల్లులుగా మారుతున్న ఆ వర్షం చినుకుల వాసనలో వాడి నుండి వచ్చే సిగరెట్ వాసన, నాకు ముద్ద చేమంతిని ఆఘ్రాణిస్తున్నట్టు అనిపించింది.

– పి. విక్టర్ విజయ్ కుమార్

ఇవి కూడా చదవండి :

( Please reach the author for any queries or further clarity on pvvkumar@yahoo.co.uk or facebook ID “ P V Vijay Kumar” )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

2 Responses to రంగనాయకమ్మ హేట్స్ రంగనాయకమ్మ-విక్టర్ విజయకుమార్

  1. Rama Rao says:

    ఓరయ్యా, ఏమి రాతలయ్యా ఇవీ? రాబర్ట్ నాగేంద్ర మీ ఆల్టర్ ఇగోనా?

  2. దడాల వెంకటేశ్వరరావు says:

    విక్టర్ విజయ్కుమార్ లవ్స్ విక్టర్ విజయ్కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)