బోయ్‌ ఫ్రెండ్‌ – 46 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

          జుగుప్సగా, గగుర్పాటుగా చూచింది కృష్ణ.
               ”నా స్థానంలో మీ స్నేహితురాలే వుండుంటే?”
               ”నా రాధ నీఅంత నష్ట జాతకురాలు కాదు అది నాకు బాగా తెలుసు.”కృష్ణ మనసులో భానుమూర్తి మెదిలాడు.
‘ఈ మాటలు భానుమూర్తి వింటే ఏం చేసుండేవాడీయన్ని?’ పేలవంగా నవ్వుకుందామె.
                 ”ఇక మీరు వెళ్ళండి నాకు పనుంది”
                 ”ఎక్కడికెళ్ళమoటారు? ఇది నా ఇల్లు. ఇక్కడనుండి ఒక్క అడుగైనా వేసేది లేదు నేను”. అతను మొదటి మారుగా నవ్వాడు.
                 ”మీ ఇష్టం. నేను ముందుగా చెప్పలేదనే దోషం తర్వాత నామీద వేయకండి. ఈ ఇంట్లో వుండబోయేది మనిద్దరమే. నా నుండి మీరు పొందబోయేది ఏమీ లేకపోగా నా పురుషత్వపు ఆవేశానికి మీలో విలువైనదేదో పోగొట్టుకోవాల్సి వస్తుంది మీరు.”
                   అతని నిర్లజ్జాకరమైన ఈ సంభాషణకు నిర్ఘాంత పోయిoది కృష్ణ. అదే క్షణంలో అతని నిర్మొహమాటంలోని నిజాయితీని మెచ్చుకోకుండా వుండలేకపోయిoది.
                    ”పోనీ ఇక్కడే వుండిపోతే… ఆ తర్వాతైనా అతని మనసు మారకుండా వుంటుందా?”
ఆ ఊహకే వణికిపోయిoది కృష్ణ. ‘ఊహు. మనసులేని ఆవేశపూరితమైన సాహచర్యమా? ఛీ. అదెంత నికృష్టమైంది ! ఎంత జుగుప్సాకరమైంది !’
                       ”వస్తాను. మీరు మారేరోజు కొరకు ఎదురుచూస్తుంటాను నేను” అనేసి లేచింది కృష్ణ.
                                                                     ———————-
                     రెండు సంవత్సరాల తర్వాత తన రీసెర్చ్‌ పూర్తి చేసుకుని ప్రభుత్వం తరుపున ఫారిన్ కెళ్ళబోతున్న భానుమూర్తి ఫ్లైట్ క్యాత్చ్ చేయడానికి బాంబే వస్తున్నాడు. దేశాన్ని విడిచిపోబోయే ముందు తన స్నేహితురాలిని చూడాలనే కోర్కె బలంగా కలిగింది. కానీ కృష్ణ జీవితం గురించి అతనికేవో అనుమానాలున్నాయి. కృష్ణ ఉత్తరాలలో కనబడే నిర్లిప్తత కనబడని భర్త సంగతులు అతనికేవో కథలు చెప్పాయి.

                     ఆమె జీవితంలో కలతలు ప్రవేశ పెట్టాలనిపించలేదతనికి. అయినా తన ప్రియ స్నేహితురాలిని కలుసుకోకుండా మాతృదేశాన్ని దాటిపోవడానికి అతనికి శక్తి చాలలేదు.
                     ”నాకు మీ కొత్త ఇల్లు తెలియదు. మీ ఫోన్‌ నంబరు కూడా తెలీదు. నేను వచ్చేసరికి నువ్వు అమ్మ దగ్గరవుండు కృష్ణా !” అని వ్రాసాడు.  ఆ ఉత్తరం చదివి స్నేహితుని తీరని విజ్ఞాన కాంక్షకు సంతోషపడ్తున్న కృష్ణ ముఖం విచారంగా మారిపోయిoది.
             ‘తన పరాభవ జీవితం భానుకు తెలిసిపోతుందేమో!’ తల్లిని ముందుగానే హెచ్చరించింది కృష్ణ.
            ”అందరికి తెలిసిపోంగా లేంది భానుకు తెలిస్తే ఏం?” నిష్టూరంగా, నిర్లిప్తంగా అంది వర్థనమ్మ.
             ”ఎవరికి తెలిసినా పర్వాలేదమ్మా. నా యోగక్షేమాల గురించి వాళ్ళెవ్వరూ కన్నీళ్ళు కార్చడం లేదు. భాను విషయం అలా కాదులే అమ్మా. బాధపడ్తాడు.”
                          ”నిజమే. నిజమే. భాను ముత్యంలాoటి పిల్లాడు” గొణిగిందామె.

-డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో