సహ జీవనం 15 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

                         బస్సు దిగగానే, బావ గారింటికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం.గుమ్మంలోనే ఎదురొచ్చి, ”బాగున్నావా మామయ్యా”అంటూ పలకరించాడు మేనల్లుడు ప్రకాశం. లోపలికి రాగానే, ప్రకాశం భార్య అతన్ని చూసి, పలకరించింది. ప్రకాశంను లోపలకు పిలిచి, కాఫీ ఇచ్చి పంపించింది.
                                       వచ్చి అరగంట అయినా బావగారు కనపడకపోవడంతో, “ఏరా, నాన్న ఏడి?నాన్నను చూడాలనే వచ్చాను. బయటకు వెళ్ళడా? ఒంట్లో బాగాలేదని విన్నాను?” అడిగాడు.
“నాన్న ఇప్పుడు ఇక్కడ వుండడం లేదు, మామయ్యా!” నెమ్మదిగా చెప్పాడు.
                                   సుబ్రహ్మణ్యం మేనల్లుడి మొహంలోకి చూశాడు. ఒక్కడే కొడుకు ఆయనకు. ఇక్కడ కాకుండా ఆయన ఎక్కడ ఉంటాడు?
                                 ప్రకాశం ఎటో చూస్తూ, “నాన్నను హోమ్ లో చేర్పించాను” హత్య చేసి నేరం ఒప్పుకున్నవాడిలా చెప్పాడు.
                                 “అమ్మ పోయిన దగ్గరనుంచి నాన్నకు పిచ్చి కోపం ఎక్కువైంది. ఇంట్లో అందరి మీద అరుస్తున్నాడు. ఏది పెట్టినా బాగాలేదంటాడు. ఒకోరోజు అలిగి, ఎంత బ్రతిమలాడినా ఏం తినడు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి పిల్లలతో పేచీలు, కోడలి మీద అందరితో చెప్పడాలు. అదేమని అడిగితే, నేను బాగానే వున్నాను, మీరే మారిపోయారంటాడు. చూసి చూసి, ఇక హోమ్ lo cherpinchaanu .”
            “ఎక్కడుంది, ఆ హోం?” వెంటనే అడిగాడు.
            “ఈ పక్క వీధిలోనే, శారదా వృద్దాశ్రమం…” అంటూ మరేదో చెప్పబోయాడు.
                               సుబ్రహ్మణ్యం ఒక్కనిముషం కూడా ఆగలేదు. ప్రకాశం చెప్పేది వినిపించుకోకుండా వెంటనే అటు నడిచాడు.శారదా వృద్దాశ్రమం. చూడడానికి బాగానే ఉంది. ప్రతి మనిషికి వేర్వేరు గదులు,అటాచ్డు బాత్రూములు ఉన్నాయి. చుట్టూ చెట్లు, కొంచెం వాతావరణం బాగానే ఉందనిపించింది.

                                      పొద్దున్నే నిద్ర లేపుతారట. ఉదయం ప్రార్ధన, తర్వాత ఓపిక వున్న వాళ్ళు యోగా చేస్తారు. సరిగా 8 గంటలకల్లా కాఫీ,టిఫిన్ పెడతారు. రోజుకో రకం టిఫిన్. మధ్యాహ్నం 12గంటలకల్లా పప్పు,కూర, సాంబారు గానీ, పులుసుతో గానీ, భోజనం పెడతారు. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ కాఫీ గానీ, టీ తో గానీ, ఒక నాలుగు బిస్కెట్లు ఇస్తారు. రాత్రి భోజనంలో ఒక కూర, చారు ఆధరవులు. ఆ పూట బావకు గెస్టుగా సుబ్రహ్మణ్యం భోజనం అక్కడే చేశాడు. భోజనం అదీ బాగానే వుంది.
                                     సుబ్రహ్మణ్యానికి బావ చెల్లెలి భర్తగానే కాదు, చిన్ననాటి స్నేహితుడిగా కూడా ఎంతో ఇష్టమైన వ్యక్తి. తన కన్నా ఒక సంవత్సరం మాత్రమే పెద్ద. ఎటువంటి అవాంతరం వచ్చినా తొణకడు, దేనికి తొందర పడే మనిషి కాదు. అలాంటి వాడు కొడుకుతో, కోడలితో పడక బయటకు వచ్చేశాడంటే నమ్మలేకపోయాడు.
                   “ఏమైంది బావా? ఎందుకిలా ఆశ్రమానికి వచ్చేశావు?” ఉండబట్టలేక అడిగేశాడు.
                baaవ తలెత్తి చూశాడు “ఎందుకనో, ఇవాళ నీతో చెప్పాలని వుందిరా” బావ కళ్ళలో సన్నగా కదలాడిన తడి సుబ్రహ్మణ్యం కంటబడకపోలేదు.
                      “చెప్పు బావా ఏమైంది?” బాధగా అడిగాడు.

-టి.వి.యస్.రామానుజ రావు

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో