జ్ఞాపకం-5(ధారావాహిక)-అంగులూరి అంజనీదేవి

                 తెలుసన్నట్లు తల వూపాడు జయంత్‌ ! అంతే ! అది ఎలా తెలుసు, ఆ తెలియడమన్నది ఎంత వరకు సాగింది. అన్నది చెప్పలేదు. చెప్పి వుంటే భరద్వాజ మానసిక స్థితి ఎలా వుండేదో !!

             కానీ భరద్వాజ విచారవదనుడై ‘‘కారణాలు నీకు తెలుసో లేదో కాని సంలేఖ చదువు ఐ.పి.సి.సిలో వుండగా మధ్యలోనే ఆగిపోయింది జయంత్‌. అలా ఎందుకు జరిగిందో ఏమో నిజానికి తను చాలా తెలివైన అమ్మాయి. టెన్త్‌లో 520 మార్కు తెచ్చుకుంది. ఇంటర్‌లో సి.ఎ. ఫౌండేషన్‌ తీసుకుంటూనే 970 మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాతనే ఐ.పి.సి.సిలో వుండగా ఏం జరిగిందో ఏమో ఎవరకీ తెలియదు. సి.ఎ. చెయ్యటం కలగా భావించిన ఆమె మధ్యలోనే ఆ కలను చెరిపేసుకుంది. డిగ్రీలో జాయిన్‌ అయింది. అదీ రెండు సంవత్సరాలు చదవకుండా ఇంట్లో ఖాళీగా వుంది…’’ అన్నాడు.

            ….జయంత్‌ ఆలోచనలో పడ్డాడు. ‘సంలేఖ డిగ్రీ చదువుతుందీ అంటే ప్రస్తుతం సిటీలోనే ఏదో హాస్టల్లో వుండి వుంటుంది. తను అక్కడికే వెళ్లి రావడం మంచిదేమో కదా ! ఇలా నడుచుకుంటూ ఇంటికెళ్లడం అవసరమా !’’ అని మనసులో అనుకుంటూ సడన్‌ బ్రేక్‌ వేసిన బైక్‌లా ఆగిపోయాడు.

                  ‘‘ఏంటి బాబూ ! ఆగిపోయావ్‌ ?’’ అడిగాడు భరద్వాజ.
ఎలా చెప్పాలో అర్థంకాక ‘‘ఏంలేదు మాస్టారూ !’’ అంటూ నడవడం మొదు పెట్టాడు. జయంత్‌ అడుగులు అతి కష్టంగా పడుతున్నాయి.

                 ‘‘ప్రతి రోజూ తిలక్‌, సంలేఖ కాలేజీకి వెళ్తూ ఇదే దారిలో వచ్చి బస్సెక్కుతారు. రాఘవరాయుడు పిల్లలిద్దర్ని హాస్టల్లో వుంచి చదివించలేక బస్‌పాస్‌ తీసిచ్చాడు.’’ అన్నాడు.
మళ్లీ ఆలోచనలో పడ్డాడు జయంత్‌. ‘అయితే నేనిక్కడే ఆగిపోతే పోలా ! సంలేఖని బస్సు దగ్గరే కలవచ్చు’ అని మనసులో అనుకుంటూ ఆగిపోయాడు.
               ‘‘నీకేదో కాళ్లు పీకుతున్నట్లున్నాయి, మాటిమాటికి ఆగిపోతున్నావ్‌ !’ ఓచోట కూర్చుంటావా?’’ అడిగాడు భరద్వాజ.

              ‘‘వద్దు మాస్టారూ ! వెళ్దాం !’’ అంటూ అతనో నిర్ణయానికి వచ్చాడు. ఇలా నడుచుకుంటూ ఇంటికెళ్తేనే బాగుంటుంది. వాళ్ల కుటుంబ సభ్యులను చూసినట్లు వుంటుంది, మాట్లాడినట్లు వుంటుంది. పైగా దారిలో కలిస్తే మాట్లాడుతూ నడవడానికి ఆమె ఏమైనా భరద్వాజ మాష్టారా ? మాట్లాడొచ్చు. మాట్లాడకపోవచ్చు. బస్కెక్కి వెళ్లిపోనూ వచ్చు. నిజానికి సంలేఖ తన విషయంలో చాలా మారిపోయి వుంటుంది. తనేమైనా చిన్న షాక్‌ ఇచ్చాడా? ఎన్నిసార్లు షాక్‌ ట్రీట్‌ మెంట్‌ ఇచ్చినా నయంకాని షాక్‌ కదా అది.

           భరద్వాజ తన దోరణిలో తను ‘‘సంలేఖ చదువు విషయంలో అంతరాయం జరగటం రాఘవరాయుడిని బాగా కలచివేసింది జయంత్‌! ఆయన ఆ బాధలోంచి బయటకి రావడానికి కొన్ని నెలలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. కారణం ఆయనకి కూతురంటే అంత ప్రాణం. చిన్నప్పుడు సంలేఖకి తెలుగు బాగా నేర్పించాలని ఆయన నా దగ్గరకి పంపేవాడు. మిగతా తల్లి, దండ్రులు ‘తెలుగు ఎందుకు ఇంగ్లీష్‌ ముఖ్యం కాని’ అంటూ తమ పిల్లల్ని ఇంగ్లీష్‌ టీచర్‌ దగ్గరకి పంపేవాళ్లు. వాళ్లకి మాతృభాషపట్ల ఏమాత్రం గౌరవం లేకపోవటం, తెలుగును కించపరచడం అని నేను పెద్ద ఉపన్యాసం లాంటిది ఇవ్వను కాని మాతృభాష ఎంత అవసరమో చెప్పగను.’’ అంటూ ఆగాడు.
             జయంత్‌ ఆయన ఏం మాట్లాడినా ప్రశాంతంగా వినటానికి సిద్ధపడ్డవాడిలా ప్రియంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటల్లో సంలేఖ ప్రసక్తి వస్తోంది కాబట్టి. భరద్వాజ తిరిగి మాట్లాడుతూ ‘‘ అలా అని తెలుగుతో సంబంధం లేకుండా మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు లేకపోలేదు.’’ అన్నాడు.

            ఆ మాట వినగానే తను పనిచేస్తున్న కంపెనీలో తెలుగు మాట్లాడడం కూడా రాని తన సహోద్యోగి గుర్తొచ్చారు జయంత్‌కి… వాళ్ల గురించి ఆయనతో చెప్పాడు. వచ్చీరాని తెలుగులో వాళ్లెంత గమ్మత్తుగా, ఇబ్బందిగా మాట్లాడుతుంటారో చెప్పాడు సరదాగా…
                అది వింటుంటే ` యునెస్కో సంస్థ ‘తెలుగు మృతభాష అంచున వుందన్న’ హెచ్చరిక ఎందుకు చేసిందో స్పష్టమైంది భరద్వాజకి.

            ‘‘కానీ ప్రపంచ భాషల్లో అత్యంత మధురమైన భాష తెలుగు. అందుకే శ్రీ కృష్ణ దేవరాయలు ‘దేశభాషందు తెలుగు లెస్స’ అని ప్రశంసించాడు. శబ్ద సంపద, శబ్ద సౌష్టవం, భావవ్యక్తీకరణ, శ్రావ్యతల్లో కూడా తెలుగుతో మరే భాషలు సాటిరావు. మన తెలుగు గురించి తమిళ మహాకవి ఏమన్నారో తెలుసా?’’ అడిగాడు జయంత్‌ వైపు తిరిగి భరద్వాజ.
ఆసక్తిగా చూస్తూ ‘‘చెప్పండి మాష్టారూ! తెలుగు భాష గురించి తమిళ మహాకవి ఏమన్నారో..?’’ అడిగాడు జయంత్‌.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో