తెలుగు పుత్రికా రత్న’జెస్సీ’పాల్

జన్మదిన సందర్భంగా  జరిపిన ముఖాముఖిలో జెస్సీపాల్ గారి అంతరంగ వీక్షణం 

jessy paul          ఆమె నడిచే విజ్ఞానభాండాగారం .ఆమె జ్ఞాపక శక్తి అమోఘం.ఉన్నత కుటుంబంలో పుట్టినా అహంకారపు ఆనవాళ్ళు ఏమాత్రం దరిచేరనీయని ఉన్నత వ్యక్తి తాను.ఉన్నతమైన ఆశయాల ఆసక్తి తాను.నిండైన ఆహార్యం,నిలువెత్తు ఔదార్యం,నిజమైన విద్యా సౌభాగ్యపు భాగ్య ప్రదాత తాను. బాలల భవిష్యత్తు తరాల బ్రతుకు విధాత తాను .మాటల్లో మృదుత్వం , చూపుల్లో కరుణత్వం నడకలో గాoభీర్యం ఆమె సొంతం .చెరగని చిరునవ్వు చెదరని ఆత్మ విశ్వాసం సడలని దృఢసంకల్పం కలగలిసిన కరుణామూర్తి తాను.  ఏ భరణమిచ్చైనా కొనలేని ఆభరణo తాను. ఆమెకు జన్మనిచ్చిన అమృతామూర్తుల గని పులకించెను ఆంధ్రావని  . సిద్ధాంతాల సైద్ధాంతి తాను . సమాజంలో ఒక బలమైన పాత్ర పోషిస్తున్న మహిళా రత్నం.

ఆమె ఎంతో మంది మహిళలకు మార్గదర్శిగా నిలిచారు.చాలా మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ప్రభావితం చేసిన ఆదర్శ మహిళ.మానవీయత,మహోన్నత్వం,సమాజ సేవ,సాధికారత ఆమెకు పెట్టని ఆభరణాలు.సామాజిక సేవలో తన పాత్ర పోషిస్తూ పేద కుటుంబాలకు కూడా నాణ్యత,విలువలతో కూడిన విద్యను అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్న మహిళా శిరోమణి గుడ్ షెప్పర్డ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి జెస్సీ పాల్ .

*మీ కుటుంబ నేపథ్యం గురించి తెల్పండి ?
మా నాన్న గారి పేరు డాక్టర్ జాన్ ఫిలిప్.ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo లో 1982 వరకు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ గా పనిచేసారు. మా అమ్మ గారు శ్రీమతి యాని ఫిలిప్ భారత ఆర్మీలో లెఫ్టినెంట్ గా వివాహానికి ముందు పనిచేసారు.వివాహానంతరం గృహిణి గా స్థిరపడ్డారు.  మేము ఆరుగురం సంతానం .నేను కుటుంబంలో రెండోవ్యక్తిని .నేను ఆగస్ట్ 22 న పుట్టాను.

అయితే ఈ రోజు మీ పుట్టిన రోజు.ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మేడం.

ధన్యవాదాలండి.

నా పేరు తలపాటి జెస్సీ పాల్. మా తల్లిదండ్రులకు మొదట అన్నయ్య  ఫిలిప్ జాషువా న్యూజిలాండ్ లో అకౌంటెoట్ గా పనిచేస్తారు.తర్వాత నేను.తర్వాత మొదటి  తమ్ముడు డేవిడ్ కురియన్ సిటీ కౌన్సిలర్ గా న్యూ జిలాండ్ లో చేస్తాడు.రెండవ తమ్ముడు మోజెస్ ఫిలిప్ ప్రముఖ వ్యాపార వేత్తగా స్థిరపడ్డాడు. తర్వాత నా చెల్లి రేచల్ ఫిలిప్  న్యూజిల్యాండ్ లో ప్రముఖ  వ్యాపారవేత్తగా,కిండర్ గార్డన్ విద్యాధినేత్రిగా బహుముఖ ప్రశంసలు పొందింది.నా చివరి తమ్ముడు మ్యాథ్యూ ఫిలిప్ న్యూజిలాండ్ లో బ్యాంకు మేనేజరు గా పనిచేస్తున్నారు  ఉన్నత విద్యని అభ్యసించి న్యూజిలాండ్ ,అమెరికా లో స్థిరపడ్డారు. 1987లో శ్రీ యల్.టి .రత్నపాల్ గారితో నాకు వివాహం జరిగింది. అతను ఒక మంచి వ్యాపారవేత్త గా తన కెరియర్ ని ప్రారంభించాడు . పీర్లెస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసి   కరోడ్ పతి అవార్డ్ గెలుచుకున్నారు.మా ఇరువురికి కవలలుగా అమ్మాయిలు జన్మించారు. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించారు.ఇద్దరికి 2013 లో వివాహo జరిగింది.పెద్ద  అమ్మాయి షారోన్ నటాషా మెడికల్ సైన్సు లో పీడియాట్రిక్స్ చేసింది.తన భర్త పేరు మాల్కమ్ న్యూజిల్యాండ్ లోనిI.B.M.లో పనిచేస్తాడు.వీరికి రెండు సంవత్సరాల బాబు .బాబు పేరు జూద్. రెండవ  అమ్మాయి శిఫ్రా  నటాలియా సైకాలజీలో పట్టభద్రురాలు.తన భర్త పేరు ఆశిష్.ఇతను హైదరాబాద్ లోని జన్ ప్యాక్ట్ సంస్థ లో ఫైన్యాన్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.శిఫ్రా ఇదే సంస్థలో విద్యార్థులకు  మానసిక సలహాదారుగా పనిచేస్తున్నారు.

[supsystic-slider id=2 position=”center”]

*మీ విద్యాభ్యాస వివరాలు ?

 నాన్న గారికి ట్రాన్సఫర్లను బట్టి కర్నూల్ లో 2 వ తరగతి వరకు ,4 వ తరగతి వరకు అనoతపురం లో చదవటం జరిగింది. 5 వ తరగతి నుండి మిగతా విద్యాభ్యాసం  హైదరాబాద్ లో కొనసాగింది.మొదటినుంచి చదువులో మంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థినిని .యూనివర్సిటి లో గోల్డ్ మెడల్ సంపాదించాను. ఎం.ఏ.,బి ఇ డి ,డిప్లమో ఇన్ సైకలాజీ  చేశాను. అలాగే 2006 లోన్యూజిలాండ్ లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోర్సు చేశాను .

 

* ఈ విద్యా వ్యవస్థ ఎలా రూపు దిద్దుకుంది?

వాస్తవoగా విద్యా సంస్థ నెలకొల్పాలన్న ఆలోచన నాదికాదు . మావారు  సమాజానికి ఉపయోగపడే పాఠశాలను నడపాలని నా భర్త శ్రీ ఎల్.టి .రత్నపాల్ గారు పాఠశాలను నెలకొల్పారు.నా విద్యార్హతను బట్టి నేను పాఠశాలను ముందుకు తెసుకెళ్లగలన్న  ఆలోచనతో , ప్రోద్భలంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాను.అప్పటినుండి ఇప్పటి వరకు  ఈ సంస్థని సమర్ధవంతంగా నడుపుతున్నాను .ఈ విద్యా సంస్థను నడపడం లో నా భర్త ప్రోత్సాహం ఎంతగానో వుoది.పదిమంది పిల్లలకి మేలైన విద్య అందిచగలుగుతున్నాను .

*మీ పారశాల కు సంబంధించిన సంక్షిప్త సమాచారం చెప్పండి ?

గుడ్ షెఫర్డ్  ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1989 జూన్12న స్థాపించబడింది.ప్రారంభం నుండి అతి తక్కువ సమయంలోనే  త్వరితగతిన అభివృద్ధి చెందుతూ  వచ్చిoది,ఈనాటి వరకు  కూడా అభివృద్ధి పథం లో   కొనసాగుతూ వస్తున్నది.పాఠశాలలో నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఆంగ్ల మాద్యమంలోనే విద్యాబోధన  జరుగుతుoది.మా పాఠశాల కో-ఎడ్యుకేషన్. అమ్మాయిలను అన్నివిషయాలలో వారిని ముందుకు నడిపించటం,వారికి అవగాహనా సదస్సులు   నిర్వహించటం,అవసరమైనప్పుడు పిల్లలకు మంత్రణo  చేయటం,జీవన నైపుణ్యాలను ప్రణాళికలో భాగంగా చేసుకొని బోధిం చటం పాఠశాల యొక్క ప్రత్యేకత.అలాగే ఆటలు,కళలు,కరాటే,చెస్,సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు ప్రగతి సాధించే  లాగున వారిని తీర్చిదిద్దుతాము.మా సంస్థ  యొక్క విధి విధానాలువిద్యార్థి సర్వతోముఖాభివృద్ధి కి ఉపకరించేలా ఉంటాయి .   

*మీ విద్యా సంస్థపై కార్పోరేట్ విద్యా సంస్థల ప్రభావం ఏమైనా వుందా?ఉంటే ఎలా ఎదుర్కొంటున్నారు?

పోటీతత్వమనేది ప్రతీ రంగంలోనూ ఉంటుంది.వాటికి మానసికంగా సంసిద్ధంగా వుండటం నేర్చుకోవడమే కాక మా విద్యా సంస్థ లో ఆధునిక విద్యా విధానాలకు అనుగుణంగా విధి విధానాలను మార్చుకోవడం,మా ఉపాధ్యాయులకు వాటి పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించటం చేస్తా0.ముఖ్యoగా విద్యార్థులకు మేలు కలిగే విధంగా మా బోధనా పద్ధతులుంటాయి .

*మీ పారశాల ఏ ఏ విషయాలలో విజయవంతమైనదిగా మీరు భావిస్తున్నారు ?

ఉపాధ్యాయుల సహకారం,తల్లితండ్రుల ప్రోత్సాహం ,విద్యార్థుల  సహకారం తో  ప్రతి వార్షిక పరీక్షలోను ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణత  సాధించటంలో మేము విజయం సాధించామని చెప్పొచ్చు . పబ్లిక్  లో  మార్కులు తెచ్చుకునే క్రమంలో  విద్యార్థులు   ఒత్తిడికి గురైనా  నిజాయితీగా  రాయటం మా స్కూల్ యొక్క ప్రభావం అని చెప్పవచ్చు.పాఠశాలలోని విద్యార్థులు  చదువుతో పాటు అన్ని రకాల  పోటీ  పరీక్షలయందు  విజయముసాధించేలా ప్రోత్సహిస్తాము.మా సంస్థ  నుండి ఇరవై బ్యాచ్ ల  పదవ తరగతి విద్యార్థులు  బయటకు వెళ్లి అన్నిరంగాలలో ఆర్మీ మొదలు నాసా  వరకు  వెళ్ళగలిగారు. వెళ్ళిన విద్యార్థులు వారి జీవితంలో సాధించిన విజయాలను విన్నప్పుడు  ఇన్ని సంవత్సరాలుగా  సంస్థ విద్యార్థుల జీవితాలలో  తన ముద్రను వేయగలిగిందన్నసంతృప్తి కలుగుతుంది. మా పాఠశాలలోక్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నత విలువలు కలిగిన విద్యార్థులను  తయారు చేయటం మా సంస్థ  ప్రత్యేకత.

*మీ పారశాల ఏవిధమైన పురోగతి సాధించాలని కోరుకుంటున్నారు ?

అకడమిక్ ఎక్సలెన్స్  కొరకు మావంతు కృషి నిరంతరం  కొనసాగుతూనే ఉంటుంది.ఈ తరo  పిల్లలకు కావలసిన విద్యను   అందించే ఉపాధ్యాయులు గా   సంసిద్ధులను  చేయటంలో ఇంకా కొంత శిక్షణ అవసరం,సాధించిన దానితో సంతృప్తి చెందను కానీ ఇంకా సాధించాల్సింది చాలా వుంది.  విద్యార్థులకు  భవిష్యత్తులో ఉపయోగపడే విద్యను అందించే దిశ గా ముందుకు వెళ్లాలని నా కోరిక.

*విద్యా విధానం లోని మార్పులకు అనుగుణంగా మీ పాఠశాలలో  ఎలాంటి మార్పులు తెచ్చారు ?

విద్యా విధానాల్లో  వచ్చిన  ప్రతి మార్పులను  క్షుణ్ణంగా గమనించటం, అనేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయటం .ఆ కార్య క్రమాల ద్వారా నేర్చుకున్న వాటిని తరగతిగదిలో అమలు పరచటం నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఈ  సంవత్సరం  పదవతరగతి విద్యార్థులకు  నూతన విధానంలో పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం  ఆలస్యంగా చెప్పినప్పటికీ అలాగే అకడమిక్ క్యాలెండర్ లో మార్పులు చేసి పద్దెనిమిది పని దినములు తగ్గిపోయినప్పటికీ వస్తున్న మార్పులకు అనుగుణంగా మేము ఎల్లప్పుడు సిద్ధం గా వుంటూ అందుకు అనుగుణమైన ప్రణాళికలు రచిస్తూ,వాటిని అమలు చేయుటలో మేము అలవాటుపడ్డాము.ప్రపంచవ్యాప్తంగా అమలులో వున్న అత్యుత్తమ విధి విధానాలను తెలుసుకొని  వాటిని మేము అన్వయిoచుకొని వాటిని  మా పాఠశాలలో అమలు పరుస్తూ ముందుకు కొనసాగుతూ వుంటాము.

 *విద్యా వ్యవస్థ లో ఇంకా ఏమైనా మార్పులు రావాలని ఆశిస్తున్నారా ? ఆశిస్తే ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటారు ?

విద్య అనేది విద్యార్థికి భవిష్యత్తు లో  ఉపయోగపడేదిగా వుండాలి.వినటం,మాట్లాడటం,చదవటం,రాయటం వంటి సామర్థ్యాలను పెంపొందించేదిగా ఉండాలి.   మన దేశంలో విద్య అనేది జ్ఞాపక శక్తి మీదనే ఆధార పడివుంటుంది .తనయొక్క అవగాహనా శక్తిని పెంచే విధంగా విద్య వుండాలి.ఇప్పటి వరకు విద్యా విధానాలలో  కొన్ని సంస్కరణలు చేస్తూ వచ్చారు.విద్యార్థి  తనకు తానూ నేర్చుకున్న దానిని జీవితానికి అన్వయిoచుకునేలా  విద్యావిధానం వుండాలి. విద్యార్థులు  మన దేశంలోని పరిస్థితులకు అనుకూలంగా ఉండే విధి విధానాలు ఉండాలి.  

*పాఠశాలల్లో తెలుగు మాట్లాడే విద్యార్థులపై చర్యలు తీసుకునే విధానంపై మీ అభిప్రాయం ?

విద్యార్థులు  ఆంగ్ల భాషపై పట్టు సాధించటానికి,ఆంగ్ల భాషలో వ్యక్తీకరించటానికి   పాఠశాల తప్ప వారికి  వేరే అవకాశo లేదు.పాఠశాలకు వచ్చే పిల్లలు 99% మంది తెలుగు మాతృభాష కలిగిన వారే వస్తుంటారు. కాబట్టి పిల్లలకు ఆంగ్లభాష నేర్పించటంలో తల్లితండ్రుల సహకారం తక్కువగా వుంటుంది.నేటి కాలంలో ఆంగ్ల భాషపై   పట్టు లేకపోతే  పోటీ ప్రపంచంలో వెనకబడిపోతారు. పాఠశాల దాటి వెళ్ళిన తరువాత  మాతృభాష ఆయిన తెలుగులోనే సంభాసిస్తారు కాబట్టి పాఠశాలల్లో ఆంగ్లంలోనే మాట్లాడేలా చూడటం ,ఆంగ్లభాషలో ప్రావీణ్యాన్నిసంపాదించేందుకు ఉపకరించేలా ఉంటుందని   నా అభిప్రాయం.కానీ కఠిన శిక్షలకు మా సంస్థ వ్యతిరేకం.

*ఒక  పేరొందిన మహిళా విద్యా వేత్త గా సామాజిక బాధ్యతాకార్యక్రమాలలో మీ వంతు పాత్రని ఎలా పోషించగలుగుతున్నారు ?

మానవుడు ఎప్పుడు సంఘజీవి.వ్యక్తి తనకొరకు తాను  బ్రతకటం కాదుకానీ తాను  సమాజంకోసం తనవంతు సహాయం చేయాలనేది నేను మొదటినుండి కోరుకునేది అది కుటుంబ నేపథ్యం కావచ్చు, మా భర్త గారి ఆలోచన కావచ్చు  మొదటి నుండి ఒక బాధ్యత  కలిగిన పౌరురాలిగా ఇతరులకు సహాయం చేయటం ,ఇతరుల అవసరాలను గుర్తించటం ఇతరుల సమస్యలని గుర్తెరిగి  నావంతు సహాయం నేను చేయటంలో ముందుంటాను. పేదపిల్లలకి  పుస్తకాలు పంచటం ,బట్టలు కుట్టించటం, ఎవరైనా ఇబ్బందుల్లో వున్నారంటే స్పందించటం లాంటివి చేస్తూవుంటాను.ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే  వారికి తప్ప మిగతా వారికి  తెలియకుండా సహాయపడతాను.పెద్దగా సహాయం చేసాను అని అనుకోను కాని వారికి సహాయం చేసే మంచి  అవకాశం గా భావిస్తు నా వంతు పాత్రను పోషిస్తూ ముందుకు కొనసాగుతున్నాను.

* ప్రభావవంతమైన మహిళ గా నేటి మహిళా లోకానికి మీరిచ్చే సందేశం ?

ప్రతి మహిళా తన అవసరత తన కుటుంబానికి ఉంటుందని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి తన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ తనకు తాను కొంత సమయాన్ని గడపటం ,తన గురించి తాను ఆలోచించటం నేర్చుకోవాలి.నేను ఇతరులను ప్రభావితం చేయగలను అనుకుంటూ తనను తాను గౌరవించుకుంటూ ఇతరుల చేత కూడా గౌరవింపబడాలి.ఈ విషయాలను మహిళలు ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలి.ఏ సమస్య వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.

*సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలపై మీ స్పందన  ?

ఈ ఆధునిక కాలంలో కూడా మహిళలు చాలా  సందర్భాలలో  అట్టడుగు స్థాయి నుండి సీ.ఈ .ఓ స్థాయి వరకు వెళ్ళిన మహిళలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కుoటున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు .ముఖ్యంగా గాంధీజీ కలలు కన్న స్వాతంత్ర్యాన్ని నేటి  మహిళలు అనుభవించలేకపోతున్నారు.ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.అలాగే లింగ వివక్షతో పాటు సమాజం లో కూడా అనేకమైన ఆటుపోట్లకు గురి అవుతున్నారు. ప్రభుత్వం చేసిన మంచి చట్టాలు ఎంత వరకు అమలు జరుగుతున్నాయన్నది ఆలోచించాల్సిన విషయం.న్యాయ వ్యవస్థలో కావొచ్చు పోలీస్ వ్యవస్థ లో కావొచ్చు అనేక లోటుపాట్లను ఎదుర్కు0టున్నాం .అన్నిటికంటే ముఖ్యంగా మనలో చైతన్యం రాకపోవడమే వీటన్నిటికీ కారణం.ఎవరో వస్తారు సమాజాన్ని మారుస్తారు అన్న ఆలోచనలో వుండటం మన భారతీయ వ్యవస్థలో మనం గమనించవచ్చు.చిన్న పని అయినా తనవంతు కృషి చేయటానికి ప్రతి మహిళ ముందుకు రావాలి.ఆ విషయంలో వెనకబడి ఉన్నామని చెప్పవచ్చు.

*మహిళా విద్యావేత్తగా ఏవైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కున్నారా?

మా ప్రాంతంలో ఎక్కువగా ప్రైవేట్ విద్యా సంస్థలలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది . మహిళా విద్యా వేత్త గా కొన్నిసార్లు వారితో పూర్తిగా కలిసిపోలేని పరిస్థితులనే ఎదుర్కున్నాను.తల్లిదండ్రుల వైపు నుంచి కాని,ఉపాధ్యాయుల నుంచి కాని ఎటు వంటి లింగ వివక్షను ఎదుర్కోలేదు.ఏదైనా కాన్ఫరెన్సు కి వెళ్ళినా ,లేదా విధి విధానాల గురించి చర్చ జరుగుతున్న సందర్భాలలో  కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూవుంటాను.

*సంస్థాగతంగా ,ఆర్థికంగా,సామాజికంగా,ఆధ్యాత్మికంగా మీ భవిష్యత్ కలలు ఏమిటి?

సంస్థాగతంగా  చెప్పాల్సి వస్తే ఈ సంస్థలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థిహృదయాన్ని ఉపాధ్యాయుడు తాకగలగాలి.విద్యార్థులు పాఠశాల వదిలి వెళ్లిన తర్వాత భవిష్యత్తులో ఈ పాఠశాలలో నేర్చుకున్న విలువల్ని తమ నిజజీవితంలో వాటిని అనుసరించి నడుచుకొని జీవితంలో ఉన్నత స్థితి పొందాలన్నది నా బంగారు స్వప్నం .

పాఠశాలకు ఇంకా స్థలం సేకరించాలి.అందులో నూతన భవనాలను నిర్మించాలి. ఆధ్యాత్మిక విషయానికొస్తే దేవుని పిలుపు అందుకునేంత వరకు దేవునికి సన్నిహితంగా వుంటూ నిజమైన క్రైస్తవురాలిగా కొంతమందిపైనైనా నా ప్రభావం వుండాలని కోరుకుంటున్నాను.దేవుని పిలుపు అందుకొని నేను వదిలి వెళ్ళిన లెగసీ కొంత మందికైనా మార్గదర్శకoగా వుండాలనే కోరిక బలంగా వుంది.సామాజిక పరంగా అయితే ఎప్పుడైనా ఏవిధంగానైనా సహాయం చేయాల్సివస్తే ఆర్థికంగాలేదా ప్రోత్సాహం గా ఎదుటి వారిని అర్థం చేసుకొని ,వారిని ముందుకు నడిపించే దిశ లో ప్రయాణం చేయాలని నా అభిప్రాయం

*మీ పాతికేళ్ళ ప్రస్థానం లో మీకు స్ఫూర్తి నిచ్చిన  వారు ,సహాయ పడిన వారి గురించి మీ మాటల్లో ?

నా ఇరవై ఏడు ఏళ్ళ ప్రస్థానం లో నాకు సహాయం చేసిన వాళ్ళు ప్రత్యేకంగా ఒక్కరు అని చెప్పలేను.కానీ ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. ప్రతి పరిస్థితి నుండి ఏదో ఒక విషయాన్ని నేను నేర్చుకుంటూనే ఈ ప్రయాణాన్ని ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చాను .నా జీవితంలో తమదైన ముద్రను వేసిన అందరికి ఎప్పటికీ ఋణ పడి వుంటాను.ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నాకు ఇరవైఒక్క సంవత్సరాలు . ఎటువంటి అనుభవం లేని రంగం…ఎక్కడా పని చేసిన అనుభవం లేదు.1989 నుండి 2016 వరకు అనేక మంది నాకు సహాయ పడ్డారు . నా జీవితంలో ప్రత్యక్షం గా పరోక్షంగా ఎందరో సహాయపడ్డారు.

విద్యార్థులు,నన్ను నమ్మిన నా విద్యార్థుల తల్లిదండ్రులు,నా శ్రేయోభిలాషులు, నా ఉపాధ్యాయులు,మరియు ఆయాలు చాలా మంది సహాయపడ్డారు.వారికి పత్రికా ముఖంగా కృతఙ్ఞతలు తెలుపుతున్నాఅభిప్రాయంను.మరీ ముఖ్యంగా ఒక నిజాయితీ , దైవ భక్తిగలిగిన అధికారిగా తన విలువను కాపాడుకున్న మా నాన్నగారు డాక్టర్ జాన్ ఫిలిప్ నాకు మొదటి స్ఫూర్తి  . అలాగే మంచి ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన నా మేనత్త వేదమణి ఫిలిప్ గారు నాకుఆదర్శం  .తర్వాత నా జీవితంలో మొత్తం నా విజయానికి కారణమైన నా భర్త నాకు స్ఫూర్తి .

*మిమ్మల్ని బాగా ఎక్కువగా సంతోషపరిచిన సందర్భాలు  ఏమైనా ఉన్నాయా?

ప్రతి దినం ఒక సంతోషకరమైన దినంగా భావిస్తాను.అది నా సిద్దాంతం అని చెప్పను కానీ ప్రతి రోజు ఒక అధ్బుతమైన రోజుగా అనుకుంటాను.ప్రతి చిన్న విషయంలో నేను సంతోషాన్ని పొందుతుంటాను.సంతోషాలన్నీ ఎక్కువై ఎక్కువ సంతోషిస్తూ ఉంటాను. ప్రత్యేకంగా చాలా ఎక్కువ సంతోషించిన సందర్భంగా  చెప్పటం చాలా కష్టం.ఎందుకంటే చాలా సంతోషాలు ఉన్నాయి.వాటిని ప్రత్యేకంగా విడదీసి చెప్పటం చాలా కష్టం.

*నేటి తరం విద్యార్థులకు మీరిచ్చే సందేశం ?

నేటి తరం విద్యార్థులను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారికి వున్న సామర్ధ్యాలను చూసినప్పుడు సంతోషం వేస్తుంది.నేటి విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంతో దాగి వుంది .  ఈ తరానికి ఎక్కువ ఇబ్బందులు కూడా ఎక్కువగా వున్నాయి.అవి అంతర్జాలం ద్వారా కావచ్చు.సినిమాల ద్వారా కావచ్చు.ఆధునికత వల్ల కావచ్చు .యాంత్రికత కావచ్చు.వాళ్ళలో వున్న సున్నితతత్వం పోతుంది అని భయం కలుగుతుంది .వాళ్ళలో పరిశీలనా శక్తి తగ్గి పోతుంది .వాళ్ళలోని సామజిక స్పృహని కోల్పోతారేమోననిపిస్తుంది.వీటన్నింటిని అధికగమించటానికి ప్రయత్నమైతే చేస్తున్నాం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది .ఈ కాలం విద్యార్థులకు అన్ని విషయాలు తెలుసు .తెలుసుకున్న మంచి విషయాలనుఏకాగ్రతతో ఎంతవరకు తమ జీవితానికి అన్వయించుకుంటున్నారన్న విషయంలో కొంత ఆలోచించాలి.విద్యార్థులు తమ జీవితoలో ఉన్నతమైన ఆశయాలు కలిగివుండాలి .వాటిని నెరవేర్చటానికి నిరంతరం శ్రమపడాలి.తమ లక్ష్యాలను సాధించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుతున్నాను.

*నేటి తరం ఉపాధ్యాయులకు మీరిచ్చే సలహాలు ?

నేటి తరం విద్యార్థులకు వున్న సామర్థ్యాలకు అనుగుణంగా బోధించాలి . ఈ విషయం లో కొన్ని సందర్భాలలో  వెనుక పడ్డామేమో అనిపిస్తుంటుంది.ప్రైవేట్ పాఠశాల యజమానురాలుగా ఒక ఉపాధ్యాయురాలిగా నేను గమనించినది ఉపాధ్యాయులు కొన్ని సార్లు ఒత్తిడికి గురవుతు0టారు .ఎంత చక్కగా చెప్పినప్పటికీ విద్యార్ధి నేర్చుకోకపోతే దానికి కారణం మేము కాదని తెలిసినప్పటికీ నిందను మాత్రం భరించాల్సి వస్తుంది.చదువనేది కేవలం ఉపాధ్యాయులు బోధిస్తే మాత్రమే కాదు . విద్యార్థుల భాగస్వామ్యం కూడా అవసరం.ఏది ఏమైనా కూడా ఉపాధ్యాయులకు నేర్పు అవసరం ప్రతి విద్యార్ధి లో ఒక గొప్పతనాన్ని చూసినట్లయితే , ఆ గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వారితో సంభాషించినట్లయితే విద్యార్థులుఉపాధ్యాయులని గౌరవిస్తారు.ఆ స్థాయి లో తమ ప్రవర్తనను ఉపాధ్యాయులు పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో చాలా వరకు విధ్యార్థుల్లో మార్పు తీసుకురావచ్చు.కాబట్టి ఉపాధ్యాయులుగా ముందు మన ప్రవర్తనని సరి చేసుకొని మన ప్రవర్తన ద్వారా విద్యార్థులను ప్రభావితం చేసే ఉపాధ్యాయులుగా నిలిచిపోతాం.

*మాతృ భాషా పరిరక్షణలో మీ వంతు పాత్ర ఏమిటి ?

మాతృ భాష అనేది ప్రతి వ్యక్తికీ అవసరం.ప్రతి వ్యక్తి తన మాతృ భాషలో చక్కటి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే అన్ని భాషల్ని సులభంగా నేర్చుకోవటానికి వీలవుతుంది .ఆంగ్ల మాధ్యమ పాఠశాల అయినప్పటికీ అన్నిoటితో పాటు తెలుగుకు సమ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పిల్లల్లో తెలుగులో వ్యాసరచనా పోటీలు, వక్తృత్వ పోటీలు, కవితా రచనలు,నీతి పద్యాల పఠనం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం . అంతే కాక తెలుగు భాషా సంఘo ను ఏర్పాటు చేశాము.వాటి ద్వారా విద్యార్థుల్లో భాషాభిమానాన్ని పెంపొదిస్తున్నాము.

*మీ అభిరుచుల గురించి తెల్పండి ?
పుస్తకాలు చదవటం,వంట చేయటం,గృహాలంకరణ ఇవి నా అభిరుచులు.

*మీకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పండి ?

నాకు 2000 సంవత్సరంలో ఇట్రోడ్ అనే సామాజిక సంస్థ రాయలసీమ లోని నంద్యాల అనే ప్రాంతం లో విద్యా సంస్థ ను నెలకొల్పి మంచి విద్యనందిస్తున్నారు అంటూ ‘బెస్ట్ స్కూల్ అవార్డు’ ఇచ్చారు .అలాగే 2005లో న్యూ డిల్లీ లో ‘రాష్ట్రీయ వికాస్ రతన్’ అనే అవార్డు వచ్చింది.2006 లో ‘రాష్ట్రీయ సమ్మాన్ పురస్కార్ అవార్డ్’ ను న్యూ డిల్లీ లో అందుకున్నాను . 2013 లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ‘ఉత్తమ ఉపాధ్యాయిని’ అవార్డు ను అందుకున్నాను.2014 బ్రెయిన్ ఫీడ్ అనే ఎడ్యుకేషన్ మ్యాగజైన్ వారు’ఆచార్య దేవోభవ’ అనే అవార్డును ప్రదానం చేసారు’

మేడం  మీ విలువైన సమయాన్ని మాకోసం  కేటాయించినందుకు ధన్యవాదాలు.మీ దృక్పథాన్ని మీ ఆలోచనలను మా విహంగ పాఠకుల కోసం పంచుకున్నందుకు సంతోషిస్తున్నాము.ఇలాగే మీ పాఠశాల అభివృద్ధి  పథం లో నడవాలని,సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.సమాజ సేవలో అధికమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాను.

మీకు మీ విహంగ పత్రికకు ధన్యవాదాలు.మీ పత్రిక ఇంకా ముందుకు కొనసాగాలని కోరుతున్నాను.నన్ను గుర్తించి నా ఇంటర్వ్యూ తీసుకున్నoదుకు ప్రత్యేక కృతఙ్ఞతలు.

ఇంటర్వ్యూ : పెరుమాళ్ళ రవికుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

22 Responses to తెలుగు పుత్రికా రత్న’జెస్సీ’పాల్

Leave a Reply to Jadhidhya Gaious Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో