బోయ్‌ ఫ్రెండ్‌ – 43 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Dr. Jaya prada

భర్తతో తొలి సమాగమంలో అలా మాట్లాడాల్సివచ్చినందుకు లజ్జతో
ఆమె శిరస్సు వంగిపోయిoది.

”మీరు వెళ్ళిపోoడి నన్ను విసిగించవద్దు.”

”ఎక్కడికెళ్ళేది? మీరింత శోకంలో వుండగా నన్నెలా వెళ్ళమoటారు?”
చటుక్కున విసురుగా తలెత్తాడతను. అతని కళ్ళు అగ్ని గోళాల్లా వున్నాయి. ఇక భరించలేనట్టుగా కేక పెట్టాడు.

”బాబాయ్‌ !” అతని పిలుపుతో గది నాలుగు గోడలూ కంపించాయ్‌. ఒక నడివయస్కుడు పరుగెట్టుకుంటూ వచ్చాడు.

”ఆమెను ముందు వెళ్ళమను బాబాయ్‌.” నాకెవ్వరూ లేరు. ఎవరూ నన్ను ఓదార్చనక్కరలేదు. నన్నిలా వదిలేయండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరంతా కలిసి నన్నెందుకిలా చిత్రహింస పెడ్తున్నారు?”
అతను పిచ్చివాడిలా మంచం మీద పడి దొర్లసాగాడు. చిత్తరువులా కళ్ళప్పగించి చూస్తూ నిల్చుండిపోయిoది కృష్ణ.

”పదమ్మా ! అబ్బాయి మనసు బాగాలేదు. నెమ్మది మీద తేరుకుంటాడు” నీరసంగా ఒక్కొక్క అడుగు వేస్తూ గది దాక ఇక నడవలేనట్టు గోడ కానుకుని నిల్చుండిపోయిoది. భర్త తాలూకు ఈ విధమైన తొలి ఆహ్వానం ఆమెను పిచ్చిదాన్ని చేస్తోంది. గదిలో నుండి మాటలు విన్పిస్తున్నాయి .

”అది కాదురా అబ్బాయ్‌ ! పాపం పసిపిల్ల. నిన్ను ఓదార్చాలని ఎంత ఆపేక్షగా వచ్చిందీ, అలా కేకలేస్తావెందుకు?”

”ఆవిడ…ఆవిడ…అడుగు బెట్టిoది. అమ్మ పోయిoది.”

కృష్ణ అదిరిపడింది.’ఇదేమి నింద ! పైగా తన భర్త నోటి వెంటనా? ఇలాoటి మాటలా తను వింటున్నది !!’ ఆమెకు తల తిరిగిపోతోంది. అక్కడ ఇక ఒక్క క్షణం గూడా నిలవలేనట్టు గబగబ బయటకు వచ్చి అప్పుడే వచ్చిన తల్లి ఒడిలో వాలి మొదటి మారుగా తల్లి ముందు కన్నీళ్ళు పెట్టుకుంది కృష్ణ.

ఆమె బిడ్డను ఓదార్చలేదు. ఉన్మాదురాలిలా చూస్తూ కూర్చుంది. ఆ నోటా ఆ నోటా కృష్ణమీద పడిన అపవాదు ఆమె విననే వినింది. ‘తన బిడ్డ మెట్టినింటి జీవితంలో మొదటి మెట్టు మీదనే ఎదురైన ఈ అపశృతి ఆమె జీవితాన్ని ఏ దారిలోకి లాగబోతోందో !’

అలా ఎవరికి వారే కన్నీళ్ళు నింపుకుంటున్న తల్లీకూతుళ్ళ దగ్గరకు వచ్చి చెప్పాడు రాజశేఖరం బాబాయ్‌.

”మీరు బాధ పడకండమ్మా. వాడికి తల్లి అంటే విపరీతమైన మమకారం. హఠాత్తుగా ఇలా జరగడంతో పిచ్చివాడయిపోయాడు. మీరు మరోలా భావించకండి. ఇప్పటికి మీరు వెళ్ళండి. నాలుగైదు రోజుల్లో అంతా సర్దుకుంటుంది.”

”అన్నగారూ !” అని బావురుమంది వర్థనమ్మ.

”ఇక్కడ ఎవరితో మాట్లాడాలో తెలియలేదు. దేవుడిలా మీరు వచ్చారు. మీ మీద భారం వేసి అమ్మాయిని తీసుకెళ్తున్నాను.”

”ఏం పర్వాలేదమ్మా ! వారం పది రోజుల్లో మేము అమ్మాయిని పిలిపించుకుంటాం. ఈ గందర గోళంలో మీరుండలేరు. కోడలిని తీసుకు వెళ్ళండి.

కృష్ణ తను వెళ్ళనని చెప్పాలనుకుంది. ఏమేమో ఆయన్ని అడిగి తెలుసుకోవాలనుకుంది. కానీ ఏదీ చెయ్యలేకపోయింది.
ఆ పదకొండు అంతస్థుల మేడలోని ఏడవ అంతస్థులో ఒక భాగానికి భావి యజమానురాలు, కొత్త కోడలు కృష్ణ ఆ ఇంటిలో నివసించే నలబై నాలుగు కుటుంబాల ఎదుట దోషిలా తలవంచుకుని గడప దాటిoది.

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

One Response to బోయ్‌ ఫ్రెండ్‌ – 43 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో