ఆదివాసీ జీవన గీత – మహా శ్వేత(సంపాదకీయం)

 

                         mahasweta deviఎవరి జీవితo వాళ్లు జీవించడం సమాజంతో సంబంధం లేకుండా బ్రతికెయ్యడం మామూలే . దానికి భిన్నంగా అనుక్షణం చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ అణగారిన బ్రతుకుల్ని మనస్సులో చిత్రించుకుంటూ మరికొంత బాధ్యతతో రచనా  వ్యాసంగాన్ని చేపట్టడం మహా రచయిత్రి మహా శ్వేతా దేవికే చెల్లింది . 1926 లో బంగ్లాదేశ్ , డాకా లో పుట్టిన మహా శ్వేత తల్లి దండ్రుల నుంచి రచనని వారసత్వంగా పొందింది. ఆమె తండ్రి మనీష్ కవి , నవలా  రచయిత . తల్లి ధరిత్రీ దేవి సామాజిక కార్య కర్త , రచయిత్రి కూడా . భారత స్వాతంత్ర్య అనంతరం జరిగిన దేశ విభజనలో వీరి కుటుంబం పశ్చిమ బెంగాల్ కి తరలి వెళ్లింది . శాంతిని కేతన్ లో , విశ్వ భారతి విద్యానికేతన్ లో  , కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్లం లో స్నాతకోత్తర విద్యని పూర్తి చేసింది . కొంతకాలం ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసింది . ప్రముఖ నాటక రచయిత బిజోన్ భట్టాచార్యని వివాహం చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయారు . వీరు కొడుకు నాబారుణ్ కూడా సాహిత్య అకాడమీ   అవార్డు అందుకున్న కవి , నవలా  రచయిత. 20 14 లో నా బారుణ్ మరణించాడు .

                        తల్లి సామాజిక కార్యకర్త కావడం వల్ల మహాశ్వేత కూడా అదే భావజాలాన్ని అందిపుచ్చుకుని ఆది వాసీల జీవితాలకి అతి దగ్గరగా వెళ్లింది . ఒక గిరిజన బాలుడు తన జీవితంలో విజయం సాధించిన గాధని ”ఎతోవా పోరాటం” గెలిచాడు అనే నవలలో చిత్రించింది . ఈ రచన ద్వారా పిల్లలకి ఆ జీవితాల్ని ఆసక్తికరంగా పరిచయం చేసింది . భారత దేశపు ఆదివాసీయుల సంస్కృతి , పోరాటాలు వారి కన్నీటి గాధలు పరిచయం అవుతాయి . సామాజిక కార్యక్రమాలే తన రచనలకి ప్రేరణగా నిలిచాయని అనేక సార్లు చెప్పుకుంది . బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి తిరుగుబాటు చేసిన ముండా నాయకుడు బిస్రా ముండా జీవితాన్ని అరణ్యేర్ అధికార్ పేరుతో నవలగా మలిచింది . ఆమె రచనల నిండా పీడితులు , గిరిజనులు , మహిళలు , దళితులు అణిచి వేత , దోపిడీ వాటిని ఎదుర్కునే ఆత్మ స్థైర్యం ఉంటుంది .

                             చోళి కె పీచే కథా సంపుటిలో మూడు కథలు ఉన్నాయి . ఈ చోళీ కే  పీచే , ద్రౌపది , పాల తల్లి మూడు కథల్లో సమాజంలో ఉండే క్రూరత్వాన్ని , దోపిడీ వ్యవస్థ ఈ కథల్లో కన్పిస్తాయి . ద్రౌపది కథలో ఆదివాసీ విప్లవ వనిత గా  ప్రధాన పాత్రగా కన్పిస్తుంది . పోలీసులు  నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడతారు . అంతటి దారుణం తరవాత కూడా ఆమెలో రగిలే కసి , అధికార వ్యవస్థ పై ఉన్న ఏహ్యతాభావాన్ని  ఆత్మస్తైర్యం మార్చుకుని గాయాల పాలైన శరీరంతో నగ్నంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతటి సాయుధుడైనా ఆమెని చూసి భయపడి పోతాడని కథకి ముగింపు ఇస్తుంది .అగ్నిగర్భ సంపుటి లో ఆదివాసీ ప్రాంతాల , నక్సలైట్ ఉద్యమాలకి సంబంధించిన కథలే     కనిపిస్తాయి.      బీహార్ ,   పశ్చిమ బెంగాల్ ,       మధ్య ప్రదేశ్ , చత్తీస్ ఘడ్  , ఒరిస్సా రాష్ట్రాలలో పర్యటిస్తూ పశ్చిమ బెంగాల్ లోని సబర్ తెగకు సేవలందించి వారి మనసులో తల్లి స్థానాన్ని సంపాదించుకుంది .

                                 నవలలు , కథలు నాటకాలు , వ్యాస రచనను ఆయుధాలుగా చేసుకుని సాహిత్యంలో అత్యున్నతమైన 1996 లో జ్ఞానపీఠ అవార్డు , 1997 లో రామన్ మెగసేసే అవార్డు , 2006 లో పద్మవిభూషణ్ , సాహిత్య అకాడమీ , దేశీ కొట్టం అవార్డులు వంటి ఎన్నో అవార్డులను అందుకుంది . ఆమె రచనలలో ముఖ్య మైనవి హజార్ చైరాసీకి మాం , ఝాన్సీ కీ రాణి , అగ్నిగర్భ , రుదాలి , అరణ్యేర్ అధికార్ వంటి ఎన్నో రచనలలో అట్టడుగు వర్గాల జీవితాలను గురించి కథలుగా, నవలలుగా మలిచింది . గోవింద్ నిహ్లాని నిర్మించిన హజార్ చైరాసీకి మాం సినిమాలో నక్సలైట్ ఉద్యమంలో చేరిన కొడుకు కోసం తల్లి పడ్డ బాధని వర్ణించాడు . ఈ నవల తెలుగులోకి “ ఒక తల్లి “ పేరుతో అనువదించబడింది , అనువాద కర్త సూరంపూడి సీతారాం.

                           1993 లో వచ్చిన “రుడాలి “ సినిమాలో అయితే రాజస్థాన్ అగ్రకులాల కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే అద్దెకు దు:ఖించడానికి వెళ్లే ఒక స్త్రీ కథ విలక్షణమైన కధాంశం తో సినిమా తెరకెక్కింది .

                             సాహితీ వేత్తగా , జర్నలిస్ట్ గా కొనసాగుతూనే గ్రామాల్లోని ఆదివాసీ , బలహీన వర్గాలను చైతన్యం చేస్తూ ఎన్నో సంస్థలను స్థాపించింది . ‘బర్తిక’  అనే ఆదివాసీ పత్రికకి 1980 నుండి సంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు . డెబ్బై  ఏళ్లు దాటాక కూడా ఆదివాసీ , బడుగు వర్గాల కోసం పోరాటం చేయాలనే ఆకాంక్షని వెలిబుచ్చిన మహా శ్వేతాదేవిని సాహితీ ప్రపంచం కోల్పోయింది .

ఆ మహా రచయిత్రికి ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక’ తరపున నివాళులు ……

                                                                                                                                                                                                        డా . పుట్ల హేమలత                                          ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to ఆదివాసీ జీవన గీత – మహా శ్వేత(సంపాదకీయం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో