పడాల రామారావు దృక్కోణంలో అల్లూరి – పెరుమాళ్ళ రవికుమార్‌

                      

vihanga-telugu magazine

‘‘శ్రీరామ రాజు యొక్క దౌర్జన్య పద్ధతులతో నేనేకీభవించజాలక పోయిననూ ఆయన అకుంఠిత సాహసమూ, త్యాగ దీక్ష, ఏకాగ్రత, ఉత్తమ శీలమూ, నిరాడంబరమగు కష్టజీవనమూ మనమందరమూ నేర్వదగినవి’’. అని అల్లూరి సీతారామరాజు గురించి గాంధీజీ అన్న మాటలు అక్షర సత్యం.పడాల రామారావు రాసిన ‘అల్లూరి సీతారామరాజు’ చారిత్రక గ్రంథం అల్లూరి సీతారామరాజు.

                   జీవిత విశేషాలని, ఆయా సంఘటనలని కళ్ళకు కట్టినట్లు తెలియజేశాడనడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రలోకానికి  తెలియని అనేక విషయాలను, వాస్తవానికి ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి తెచ్చినవిధము ప్రశంసనీయం. వెంకట రామరాజు తన కుమారుడైన అల్లూరి సీతారామరాజుకు చిన్నతనం నుంచే దేశభక్తిని నూరిపోశాడు. అంతేకాక ఒక సాహసవంతునిగా తీర్చిదిద్దాడు. వెంకట రామరాజు జబ్బుతో ఆయన ఆరోగ్యం క్షీణించి పోయి మృత్యు ఒడిలోకి చేరబోతుండగా కుమారునికి హితబోధను చేస్తూ … ‘‘బాబూ ! నా ఆశన్నీ నీ మీదే పెట్టుకున్నా !. మన జాతి వీర జాతి ! వీరులుగా పుట్టాం! వీరులుగానే మరణించాలి’’. అని పలికిన మాటలు

                             అల్లూరి సీతారామరాజుని గొప్ప వీరునిగా నిలిపాయి. అల్లూరి ఆరవ తరగతిలో ఉండగానే ఉపాధ్యాయుడు ‘సత్యహరిశ్చంద్ర’ పాఠం చెప్పాడు. పాఠం మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ పాఠం వల్ల మీరు నేర్చుకున్న నీతేమిటని విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రశ్నించగా వెంటనే అల్లూరి సీతారామరాజు లేచి హరిశ్చంద్రునికన్న ఆడినమాట తప్పని గోవు గొప్పది అంటూ… తనకు హక్కులేని ఆలిని, పిల్లల్ని అమ్మేశాడు. అని మాష్టారు మతిపోగొట్టిన చిచ్చరపిడుగు అల్లూరి.

                    విశాఖలోని ఒక బహిరంగ సభలో సుభాష్‌ చంద్రబోస్‌ స్వాతంత్రోద్యమంలో భాగంగా ఇచ్చిన ప్రసంగానికి సీతారామరాజు ఆకర్షితుడైనాడు. స్వాతంత్య్ర సమరంలో దుముక సిద్ధపడే ఆంధ్రులు ఎవరైనా ముందుకు రమ్మని చంద్రబోస్‌ కోరగా ఎవరూ ముందుకు రాలేదు. మన సీతారామరాజు లేచి‘‘ఇదిగో నేనొస్తున్నా ! ఈ దొర దురంతాల్ని ఎదుర్కొని స్వాతంత్య్ర సమరంలో ఆత్మబలిదానానికైనా జంకనని తెలుగు బిడ్డడిగా నేను శపథం చేస్తున్నా’’ అని శంఖారావం పూరించాడు.

                           పడాల రామారావు గారు ‘‘అల్లూరి సీతారామరాజు’’ చారిత్రక గ్రంథంలో నాటకీయ పద్ధతిని అనుసరించాడు. మిక్కిలి ఉపమానాలతో పాఠకుల మనసుని రాగరంజితం చేస్తూనే దేశభక్తిని పెంపొందించేలా తీర్చిదిద్దారు. తెల్లదొరల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అందరూ ఆయుధాలు ధరించి గొంతెత్తి జయధ్వానాలు చేసిన సందర్భంలో ‘‘ఆహా ఒకనాటి నిస్తేజమైన జాతి నేటికి గదా, కణకణ మండుతూ త్రేతాగ్ని నిప్పులా రాజుకుంది.

                 ఒకనాటి నిద్రాణమైన జాతి నేటికి కదా బుసులు కొడుతున్న త్రాచులా నిలువెత్తు లేచింది. ఇక భారతీ దేవి చక్కిళ్ళు జాలువారిన కన్నీటి జాడలు చెరిగిపోతాయి. ఎవడైతే తన కండ బలంతో కొండల్ని సైతం పిండికొట్టి లోకానికన్నదానం చేస్తున్నాడో ఆ కర్షకుడే కనులెర్రజేసిన లోకాలు కరిగిపోక మానవ్‌’’ అంటూ కర్తవ్యోన్ముఖులను గావించాడు పడాల రామారావు.

                   గ్రంథం ఆసాంతం చదివిన అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసోపేతుడగు వీరునిగా దర్శనమిస్తాడు. వీరపుత్రుడైన అల్లూరి తన లక్ష్యాలక్షణాలను 17-04-1923 న ఆంధ్రపత్రిక విలేఖరికి ఇలా చెప్పాడు.‘‘ప్రజలకు స్వాతంత్య్రము సిద్ధించవలెనన్న దౌర్జన్యమే మార్గం. యుద్ధం చేస్తేనే కానీ స్వరాజ్యంరాదు. అది సాధించగ అంగబలం నాకుంది. ఆయుధ బలం కావాలి. అందుకే నేనిప్పుడుపక్రమిస్తున్నాను’’ అన్నారు. ఆయుధ సామాగ్రి కోసమే చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేస్తూ ‘‘పట్టపగలు ఈ స్టేషన్‌ పై దాడి చేస్తున్నాం. ధైర్యముంటే ఎదుర్కోండి’’ అంటూ పోలీసుకి సవాల్‌ విసిరాడు. ఏ పోలీస్‌ స్టేషన్‌ పై ముట్టడి చేయదలచినా ముందుగా సమాచారాన్ని పంపి ముట్టడిచేసేవాడు. దీన్ని బట్టి అతను ఎంతటి ధైర్యశాలో గమనించవచ్చు.

                ఆనాటి కాంలో ఖైదీల దీన స్థితి అత్యంత దయనీయంగా ఉండేది. ఆ స్థితి పగవానికైనా వద్దని కోరుకునే దుర్గంధమైన చీకటి కొట్టులో పారేసేవారు. ఒంటికి నీళ్ళిచ్చే వారు కాదు. చలికి కంబళి ఉండదు. కడుపుకు కూడులేదు, మట్టి చిప్పలో పెట్టే ఆ పిడికెడు మెతుకుల్లో మట్టిపెడ్డలు సగం వేసే పులుసులో చచ్చిన బొద్దింకలు , మల మూత్ర విసర్జనకు, మంచి నీళ్ళు తాగడానికి ఒకే రకమైన ముంత . చుట్టూ దుర్వాసనతో ఖైదీల దుర్భరావస్థను కళ్ళకు కట్టినట్లు చూపించారు పడాల రామారావు. ఖైదీల కష్టాలను చదివినప్పుడు మనసు ఆర్ధ్రతకు గురవుతూ ప్రతి ఆంధ్రుడూ ఆవేశపూరితుడౌతాడు. ఈ గ్రంథంలో ఆంధ్రుల పై ఆంగ్లేయులు సాగించిన అరాచకాలు , ఖైదీల దీనస్థితి ద్యోతకమవుతుంది.

               1924 మే, 7 న సంధ్యా సమయంలో సూర్యునికి నమస్కరిస్తున్న సీతారామరాజుని ఆంగ్లేయ దళాలు చుట్టుముట్టాయి. రామరాజును బంధించి తీసుకెళ్తున్న సందర్భంలో అతనిలో ఓటమితనం కన్పించలేదు. ఆత్మస్థైర్యo , చేవ తగ్గలేదు. గుడాల్‌ దొర మరుగుతున్న పాలిచ్చి చంప ప్రయత్నించగా అల్లూరి పొగలు గక్కుతున్న పాలను గడగడాతాగి ఆంగ్లేయులను భయకంపితులను చేశాడు. చెట్టుకు కట్టివేసి ధారావాహికంగా కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో ‘వందేమాతరం’ అంటూ నేలకొరిగాడీ సీతారామరాజు. పడాల రామారావు అల్లూరి అస్తమయాన్ని వర్ణించిన తీరు కంటతడిపెట్టిస్తుంది.

                        మన్యం ప్రజల్ని చైతన్యపరచి, ప్రజల్ని ఆంగ్లేయులను ఎదిరించుటకై దండును తయారుచేసి మన్యందండుతో తెల్ల దొరలకు ముచ్చెమటలు పట్టించాడు అల్లూరి. ఆయన స్వాతంత్య్ర పోరాటం సాగించుటకు ప్రధాన కారణం తెల్లదొరల దోపిడి. పడాల రామారావు అల్లూరి సీతారామరాజు చారిత్రక గ్రంథాన్ని చదివితే రామరాజు చూపించిన సాహసం, తెగువ స్పష్టంగా కన్పిస్తుంది. దేశభక్తికి పరాకాష్ఠగా అల్లూరి పాత్ర అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ గ్రంథాన్ని చదివిన ప్రతీ వ్యక్తీ దేశభక్తిని నింపుకొంటాడనటంలో సందేహం లేదు.

                                                                                                                        – పెరుమాళ్ళ రవికుమార్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , Permalink
0 0 vote
Article Rating
22 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
M.Rajendra Prasad
M.Rajendra Prasad
4 years ago

అన్నావ్యాసం చాల బాగుంది.చాల బాగా వ్రాసావు

వుక్కేం . వీరభద్రరావు
వుక్కేం . వీరభద్రరావు
4 years ago

రవి కుమార్ గారూ ముందుగా మీకు అభినందనలు . పడాల . రామారావు గారు నాకు సాహిత్య గురువర్యులు . నన్ను శిష్య అగ్రజా అని పిలిచేవారు వారి యింటికి తరచూ వెళ్ళేవాడి . నేను వ్రాసిన కవితలు వినిపించే వాడిని . ఆయన వ్రాసిన మొత్తం సాహిత్యం నేను చదివాను .అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర వ్రాసే నిమిత్తం వారు మన్య ప్రాంతం కొంత కాలం గడిపి సీతారామరాజు చరిత్రను యధాతదం గా మనకు అందించిన మహనీయుడు . వారు మన్య ప్రాంతాన్ని వర్ణించిన తీరు చాలా బాగుంది . నా కుమారుడుకి వారే నామకరణం చెయ్యటం నాకు గొప్ప మరువలేని అనుభూతి .

Dheeraj
Dheeraj
4 years ago

చాల బాగుంది సర్ మీరు ఇంకా ఎలాంటివి ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను
dhanyavadamulu

M.HUSSAIN BASHA
M.HUSSAIN BASHA
4 years ago

చాల బాగావుంది సర్ , ఇలాంటివి మీరు ఇంకా చాల రాయాలి అని కోరుతున్నాను .

Sravan
Sravan
4 years ago

Congrats sir chala bagundi

RAMESH
RAMESH
4 years ago

very nice sir inka e lantivi chala rayali ani asethunanu

abid ali
abid ali
4 years ago

చాల మంచిగా వుంది సర్.చాల స్ఫూర్తి నీ ఇచ్చేటట్లు వుంది సర్.ఇంకా ఇలాంటివి ఎనో రాయాలని కోరుకుంటున్నాను.ధన్యవాదములు సర్.

pavan
pavan
4 years ago

మీ వ్యాసం బాగావుంది సర్ అండ్ ఇంటరెస్టింగ్ సర్

pavan
pavan
4 years ago

సూపర్ sir

Gauthami Jalagadugula
Gauthami Jalagadugula
4 years ago

ఎన్నేళ్లుగా, ఎన్ని తరాలుగా చదువుతున్న కొలదీ రక్తాన్ని మరిగించ గలిగే వీర చరిత్రలు వాళ్ళవి. కేవలం దీనికే పుట్టిన వాళ్ళు కాబట్టి సల సలా మరుగుతున్న పాలు త్రాగడం, తూటాల వర్షం కురుస్తున్న వందేమాతరం అని చెప్పగలగడం సామాన్యులు చెయ్యగలరా ? అల్లూరి సీతారామ రాజు ఒక ఆదిశక్తి.

Perumaalla ravikumar
Perumaalla ravikumar
4 years ago

మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలండి.

P.KRISHNA CHAITANYA REDDY

SIR MEERU RASINADI NAKU NACHINDI CHALA BAGUNDI. ELAGEY MEERU RACHANALU CHESI PRAKHYATI CHANDALANI KORUKUNTU DHANYAVADALU SIR

Vennela suma
Vennela suma
4 years ago

This is Neelima suma. chala bagundi sir.deshabakti gurinchi telepe vishayaanni meeru enchukoovadam chala bagundi.nijanga ee vyaasam chadivinavallaki kacchitanga deshabhakti perugutundi. inka elanti enno vishayaalu maaku teluputharu ani drudanga koorukuntunnanu.dhanyavaadalu sir. .

siva
siva
4 years ago

ఐ విష్ యు అల్ ది బెస్ట్ సర్ .

R.Dharani Kumar
R.Dharani Kumar
4 years ago

very nice and interesting sir

sirisha
sirisha
4 years ago

అన్నా బాగుంది .బాగా రాసావు.నాకు దేశ భక్తి అంటే ఇష్టం .మన్యం దొర అల్లూరి గురించి బాగా వ్రాసావు .

sirisha
sirisha
4 years ago

బాగుంది అన్నా బాగా వ్రాసావు ఇంకా రాయి.

Kranthi Kumar Reddy
Kranthi Kumar Reddy
4 years ago

very interesting sir.I wish you could write still some more essays which are useful.From now onwards I made it mandatory to read like this matter. Thank you for publishing this.

sirisha
sirisha
4 years ago

క్రాంతి కుమార్ గారు ధన్యవాదాలు. తప్పకుండా మీ సలహాను పాటిస్తాను.

Perumaalla ravikumar
Perumaalla ravikumar
4 years ago

ధన్యవాదాలండి క్రాంతి కుమార్ గారు .మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు సంతోషం.మీ సలహాను పాటిస్తాను.

rishi
Admin
4 years ago

బాగుంది రవి గారు.ఇంకా మంచి మంచి వ్యాసాలు రాయాలని కోరుతున్నాను.

పెరుమాళ్ళ రవికుమార్
Admin
Reply to  rishi

ధన్యవాదాలండి రిషి గారు తప్పకుండా ప్రయత్నిస్తాను.