దేశమంటే మత్తు కాదోయ్ – క్రిష్ణ వేణి

Our greatest glory is not in never falling, but in rising every time we fall- Confucius


అభిషేక్ చౌబే డైరెక్ట్ చేసిన ‘ఉడ్తా పంజాబ్’(Udta Punjab) విడుదలకు ముందే వివాదానికి గురయిందన్నది అందరికీ తెలిసినదే. సినిమా మీద సాగిన చర్చ చాలా మట్టుకు డ్రగ్ menace మీదనా, రాబోయే ఎసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మీద పడే దాని ప్రభావంమీదా అయినప్పటికీ, సమస్య మరింత లోతైన ఒక వ్యాధికి ఆనవాలు అన్నది మాత్రం యదార్థం.

సాంస్కృతికంగా సుసంపన్నంగా, భౌతికంగా బలంగా, సాంప్రదాయకంగా గర్వంగానూ ఉండే పంజాబ్ రాష్ట్రం మాదకద్రవ్యాలకి పుట్టిల్లు ఎలా అయింది! ఎప్పుడయింది? ఇప్పుడక్కడి పరిస్థితి ఈశాన్య రాష్ట్రాలకన్నా కనాకష్టంగా మారిన కారణాలేమిటి!
డ్రగ్స్ దుర్వినియోగం మధ్య 80’ల్లో ప్రారంభం అయింది. 90’ల్లో పరాకాష్టకి చేరుకుంది. ఆ తరువాత pharmaceutical డ్రగ్సూ, డిసైనర్ డ్రగ్సూ వచ్చాయి. అకాలీ దల్ కానీ, బిజెపీ కానీ లేక ముందటి కాంగ్రెస్ అయినాకానీ- అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలూ ఈ గంభీరమైన సమస్యని నిర్లక్ష్యపెట్టాయి. కేంద్రప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకునే ఏ ప్రయత్నం చేయలేదు.
పార్టీ ఆఫీసునుంచీ మూలమూలలవరకూ, డ్రగ్స్ దుర్వినియోగం యువతని అంతం చేస్తోందనే వినిపిస్తుంది. ‘చిట్టియా కలాయియాన్ దే’ అన్న పాటలో ఉన్న ‘చిట్టా’ (chitta)మాట ఇప్పుడు పంజాబ్లో తెల్లటి హెరాయిన్ పౌడర్‌ని ఉదహరించడానికి ఉపయోగపడుతోంది.
క్రిత0 ఎన్నో సంవత్సరాలుగా ఈ డ్రగ్ సమస్య గురించిన రిపోర్టులు పేపర్లలోనూ, పత్రికల్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటి గురించిన పాటలెన్నో యూట్యూబ్లో కూడా ఉన్నాయి. రాహుల్ బోస్ ఏంకర్ చేసిన ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది.
వీడియో చూడండి.
The Directorate of Revenue Intelligence, The Narcotics Control Bureau మాత్రమే కాక, ఆఖరికి Intelligence Bureau కళ్ళ ఎదుట కూడా డ్రగ్ స్మగ్లింగ్ భారీ ఎత్తున, నిక్షేపంగా కొనసాగుతోంది. క్షయమవుతున్న ఈ రాష్ట్రానికి, ఈ డిపార్టుమెంట్లన్నీ కేవలం ప్రేక్షకులుగానే మిగిలాయి. సెక్రెటెరియేట్, పోలీసు-అందరికీ దీనిలో జోక్యం ఉంది. ఇకపోతే, దీనికి రాజకీయ మద్దతు ఎలానూ ఉంది.
పాకిస్తానుకీ, భారతదేశానికీ మధ్య 553 కి.మీ.ల పొడుగున్న అంతర్జాతీయ సరిహద్దు వద్దే ఈ సమస్యకి సమాధానం దొరుకుతుందని పంజాబ్ ప్రభుత్వమూ, పోలీసూ చెప్తూ దీన్ని ఆపడానికి తగిన చర్య తీసుకోవడం లేదని Border Security Force (BSF)ని నిందిస్తాయి. తను catch-22 పరిస్థితిలో చిక్కుకుందనీ, సరిహద్దు మీదుగా వచ్చే డ్రగ్స్ సంఖ్య అతి స్వల్పమనీ BSF చెప్తుంది.
అక్కడి డ్రగ్స్ దుర్వినియోగం గురించిన పుకార్ల వల్ల, AIMS పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో సర్వే చేసింది. కేంద్ర ప్రభుత్వపు అనుమతితో, పంజాబ్ రాష్ట్రం ఖర్చుతో సర్వే జరిగింది. రాష్ట్రపు జనసంఖ్య ఒక కోటీ తొంబై వేలయి ఉండగా, AIIMS సర్వే కొన్ని వేల మందిని మాత్రమే మచ్చుకి తీసికోగలిసింది. నికార్సైన సంఖ్యేదీ తేలనప్పటికీ, AIIMs అధ్యయనం ప్రకారం, 18-25 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో 73.5% వ్యసనానికి బానిసలయినవారు. వీరిలో 30% కన్నా పైన HIV-positive. దేశంలో, డ్రగ్సుకి సంబంధించిన కేసులు ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 50% పై చిలుకు.
పోలీసుల సహాయం లేకుండా ఈ నెట్‌వర్క్ పని చేయలేదు అని AIIMS లో ఎడిషనల్ ప్రొఫెసర్ అయిన ఆనంద్ పటేల్ చెప్తారు. ప్రతీరోజూ 20 కోట్ల రూపాయలు హెరాయిన్ మీదా, హఫీమ్ మీదా ఖర్చవుతున్నాయి. ఒక సంవత్సరపు వ్యాపారం 7500 కోట్ల రూపాయలది. పల్లెవాసులు కూడా ఈ డ్రగ్ స్మగ్లింగ్లో జోక్యం ఉన్నవారే.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్- నార్కో వార్ మీద 8 నెలలు పని చేసి, కిందటి నెల పలుమార్లు రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ సంబంధంగా 11,000 మందిని అరెస్ట్ చేశారు. కానీ దాడి జరిగినది వ్యసనపరులమీద. డ్రగ్స్ మీద కాదు. రాష్ట్రంలో అసలు మాదకద్రవ్యాల సమస్యే లేదని అక్కడి హెల్థ్ మినిస్టర్ చెప్పారప్పుడు. ఒక్క పెద్ద చేపా పట్టుపడలేదు. పెద్ద పట్టణాల్లో అరెస్టయిన ఏ న్యూసూ లేదు.
డ్రగ్స్ సులభంగా దొరికే కారణం- అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ నుంచి వ్యాపారం ప్రారంభం అయి, పంజాబ్ మీదగా యూరప్ వరకూ సాగడం. కాబట్టి పంజాబ్ కేంద్ర బిందువయింది- ప్రత్యేకంగా, హిరాయిన్ దొంగరవాణాకి.
రెండో సమస్య సంశ్లిష్ట డ్రగ్స్. అవి తయారు చేసే ముడి సరకు సులభంగా దొరుకుతుంది కాబట్టి విరివిగా దొరుకుతాయి. వీటిని కొనుక్కోడానికి జమ్మూనుంచి అమ్రిత్‌సర్, లుధియానా, పాటియాలాకి విద్యార్థులొస్తారు. అడ్వాన్స్ డబ్బు చెల్లించబడుతుంది. కలుసుకునే చోటు నిర్థారించబడుతుంది. డ్రగ్స్‌ని సేకరిస్తున్నప్పుడు, వ్యసనదారులు ఒంటరిగా ఉండాలి. వాళ్ళని మరెవరూ పంపలేదని నిశ్చయపరచుకుంటారు పెడ్లర్స్.
పల్లెల్లో డ్రగ్ సేవన చేసే చిన్నపిల్లలు ఎంతమందో! పిల్లలు పేదవారైతే, తమ భాగాన్ని ఉపయోగించుకుని, తక్కినది మార్కెట్ వెలకి అమ్మివేస్తారు.
ఒక వ్యక్తి వద్ద కనుక డ్రగ్ చాలా కొద్ది మోతాదులోనే దొరికి, సదరు వ్యక్తి అది తన సంత వాడుకకేననీ అమ్మడానికి కాదనీ ఒప్పుకున్నప్పుడు, ఆ వ్యక్తిని జైలుకి పంపకుండా పునరావాస కేంద్రాల్లో ఉంచుతారు. ఎక్కువ మోతాదుతో పట్టుబడినప్పుడు జైల్లో వేస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం- జైల్లో పెట్టబడిన డ్రగ్ ఎడిక్టులకి యధావిధిగా తమ డ్రగ్ డోస్ దొరకడం. అంటే ఎక్కడో అక్కడినుండి సప్ప్లై కొనసాగుతుందనేగా!
పంజాబ్లో టెర్రరిస్మ్ సంవత్సరాల్లో ఆస్థులు పోగేసుకున్న చాలామంది ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు, రిటైర్ అయిన తరువాత, తమ ఆడంబరమైన జీవన శైలిని కొనసాగించడానికి ఈ డ్రగ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. రాజభవనాల్లాంటి వారి స్వంత ఇళ్ళూ, డజనుమంది నౌకర్లూ, పెద్దపెద్ద కార్లూ, ప్రభుత్వాలిచ్చే జీతాల/పెన్షన్లతో నడపడం సాధ్యం కాదే!
ఈ డ్రగ్స్‌కి గిరాకీ ఎక్కడినుంచి వస్తుంది? హరిత విప్లవంతో పాటు రాష్ట్రానికి కలిగిన కలిమి, చదువుకున్న/ఎక్కువ చదువుకోని యువతని కూడా పుట్టించింది. యువతకి ఆర్ధిక అవకాశాలు లేకపోవడం డ్రగ్ సేవనకి దోహదం చేసింది. వారికి పొలాల సేద్యం మీదకానీ, తమ తండ్రుల దారిలో నడవడం మీద కానీ ఆసక్తి లేదు.
ఇండియా పాకిస్తాన్ బోర్డర్‌కి అతి సమీపంలో ఉన్న అమ్రిత్సర్ అయినా, గుర్దాస్‌పుర్ అయినా, తరన్ తరన్ అయినాకానీ- ఈ ఊళ్ళకి ఆ బోర్డరే ఒక శాపం.
అమ్రిత్‌సర్‌కి రెండు కి.మీ దూరం కూడా లేని మక్బూల్‌పురాలో ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరైనా డ్రగ్స్ పాలిట పడి మరణాన్ని కొనితెచ్చుకున్నవారే. ఇప్పుడీ ఊరిని ‘Village Of Widows’ అని పిలుస్తారు. రాష్ట్రం ఈ గ్రామం గురించి పట్టించుకోకపోతే కనుక, ఇది కాస్తా త్వరలోనే, ‘దయ్యాల గ్రామం’ అయే ప్రమాదం ఉంది.
Drug 2మనకి దళిదవాదులున్నారు, స్త్రీ వాదులున్నారు. మనం లింగ సమానత్వాన్ని ప్రొమోట్ చేస్తాం. గే హక్కులని సమర్థిస్తాం. కానీ డ్రగ్ దుర్వినియోగానికి విరుద్ధంగానూ, డ్రగ్సుని ప్రొమోట్ చేస్తున్న వాళ్ళ మీదా పోరాడే ఏక్టివిస్టులెవరూ కనిపించరేం! ఈ ఒకే ఒక్క సినిమా ఎంత తేడా అని కల్పించగలదు? ఇప్పుడు ఈ సమస్య ఉన్నది నార్త్ ఈస్టుతో పాటు పంజాబ్లోనే. కానీ భారతదేశంలోనేగా? మిగతా రాష్ట్రాలకి కూడా పాకదూ!
ఎలాగో అలాగున డ్రగ్ సరఫరా గొలుసుని పూర్తిగా తెంచేసి, డ్రగ్ స్మగ్లర్లని అరెస్ట్ చేయవలిసిన అవసరం ఉంది. డ్రగ్స్ దొరకకపోయినప్పుడు, ఉపసంహరణ లక్షణాలు (withdrawal symptoms) కనపడతాయి. మరణాలు కూడా సాధ్యమే. కనుక, ఏకకాలంగా సరైన డి ఎడిక్షన్ సెంటర్లని ఏర్పరచాలి. యథాస్థానానికి వచ్చినవారికి సమాజంలో ఒక చోటు కావాలి కాబట్టి, ఆ తరువాత కౌన్సెలింగు అవసరమూ పడుతుంది.
ఒక పూర్తి తరాన్ని డ్రగ్స్‌ పేరిట కోల్పోయి, ‘నన్ను కాపాడండి’ అంటూ మౌనంగా రోదిస్తున్న రాష్ట్రపు నాశనాన్ని ఆపడానికి- ప్రభుత్వమూ, ఎన్జీవోలూ, సామాజిక కార్యకర్తలూ, వాతావరణం ఉత్పత్తి సమూహాలు –అందరూ కలిపి అవగాహనని కలిగించడానికీ, నాయకులమీద ఒత్తిడి తేవడానికీ, తమ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించని అధికారుల మీ ఏక్షన్ తీసుకోడానికీ సహాయపడాలి.

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , Permalink

28 Responses to దేశమంటే మత్తు కాదోయ్ – క్రిష్ణ వేణి

 1. Venkata S Addanki says:

  దీనిని ఆపడం ఎంతైనా అవసరం. మంచి విషయాన్ని ముందుకు తీసుకువచ్చారు.ధన్యవాదములు

 2. D.Venkateswara Rao says:

  Drugs that Can Kill You in 5 Minutes

  People use drugs to briefly step out of reality. Addicts light up to escape the real world for a moment. An alcoholic takes another drink to revisit that “better place” the beverage creates for him. But no one�excluding the suicidal camp�takes that sniff, puff or sip thinking, “This might kill me in 5 minutes.”

  As a child you learned not to put certain things in your mouth because of what if could do to your little body. As adults, it may be time to revisit that child-like mentality as we approach certain substances.

  Let us not forget that drugs and alcohol are poisonous; they merit our respect and consideration before use. Don’t join the millions that found out too quickly that when you fool around with toxic substances, you allow your life to swing in the balance.

  Drug Cocktails
  A vast majority of drug related deaths begin with a mixture. In a 2003 report the Drug Abuse Warning Network cautioned us that an average of 2.7 drugs were used in fatal overdose cases.

  The body reacts to different drugs in different ways. As an effect, when one drug affects breathing, and the other disturbs brain activity the body can’t keep up and eventually shuts down. The effect is synergistic, and through teamwork and toxic tendencies, the drugs can kill.

  Heroin (or Brown Sugar) combined with Alcohol shows us the lethal capability of a dangerous cocktail. When used together, the drugs can easily stop a person’s natural breathing pattern.

  Glutamate is generally acknowledged as the most important transmitter for normal brain function. Alcoholic drinks can decrease the effects of glutamate, impairing the judgment of an individual. Combine this effect with the euphoric “high” of heroin, and the user can actually lose the drive to breathe.

  Within five minutes, death through self-inflicted suffocation can shortly follow the use of the heroin alcohol cocktail.

  Heroin, Brown Sugar and Other opiates
  Overdoses of heroin kill more people than any other single drug on the market. The initial high given by the drug causes mental confusion, slowed breathing, nausea, and sedation.

  But when used in excess, the immediate effects of heroin build up and often result in respiratory failure. This means the body quite literally forgets to breathe and deprives itself of oxygen�eventually killing the user within a matter of 5 minutes.

  Alcohol
  The effect of alcoholic beverages is directly related to the amount consumed. Through a process called “metabolizing,” your liver does its best to eliminate the toxic alcohol from your blood, but it can only handle so much. The excess alcohol is left to circulate throughout the body.

  The more alcohol circulating, the more intense its effect; and the more intense the effect, the slower the user breathes. A lack of oxygen reaching the brain can cause coma, which can lead to death.

  The body may attempt to rid itself of the access alcohol by vomiting it out. If this happens during coma�and it has�the person can literally drown in his own vomit.

  Nicotine
  Can cigarette smoking kill you in a matter of minutes? No, not unless you choke on your bidis. But what can kill you quickly is a combination of nicotine patches or gum, and smoking.

  According to a research team from the University of Utah, “This combination [of smoking and using nicotine patches or gum] puts much more nicotine into the body than smoking alone. Sometimes, nicotine can reach levels high enough to paralyze the muscles that control breathing or cause a heart attack.”

  The result of high nicotine concentrations can prove deadly.

  Cocaine
  Cocaine, like other stimulates, boosts the release of adrenaline-like hormones causing increased motor activity, heart rate and blood pressure. Cocaine also causes blood vessels to narrow.

  This dangerous release of hormones and thinning blood vessels is connected to heart attacks, brain damage, overheating, and respiratory failure.

  Heart Attack: The increased motor activity demands the heart to produce more oxygen. But as the blood vessels narrow, blood supply significantly decreases which often leads to a heart attack.

  Brain Damage: The spike in blood pressure can cause blood vessels in the brain to rupture resulting in a cerebral hemorrhage.

  Overheating: Because of the boost in motor activity the body heats up and needs to be cooled. But altering adrenaline hormone levels can influence the body’s ability to cool itself. The result is organ failure, and eventual death.

  Respiratory Failure: Similar to the affects of Alcohol and Heroin, Cocaine can inhibit a person from breathing, which can lead to death.

  Addiction to Deadly Drugs
  Beyond the direct�and sometimes deadly�affect of drugs and alcohol, each of these substances has a direct affect on the mind. They can temporarily distort reality, and influence the users perception of what’s around him or her. These distortions are dangerous and addictive.

  Think of drugs and alcohol as a poison�a toxic substance that can destroy you and the people around you. The best way to take drugs is to take them seriously, and never take them in the first place.

  Avoiding drug cocktails, heroin, alcohol, nicotine and cocaine could mean avoiding death�don’t chance it.

  • Krishna Veni Chari says:

   Thank you do very much for your detailed and informative comment డ్.వెంకటేశ్స్కార రావు గారు. 🙂
   Appreciate ఇట్.

 3. v. lakshmi devi says:

  కృష్ణ వేణి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
  మీరు డ్రగ్స్ గురించి చెప్పిన విషయం సినిమా లో ఎలా చెప్పారో కానీ మీరు మాత్రం చాల గొప్పగా చెప్పారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని రాయలసీమ మహిళా శక్తి గా కోరుతున్నా.. మేము కూడా రాయలసీమలో మధ్య నిషేధం కోసం లక్ష సంతకాలు అనే ప్రోగ్రాము చేస్తూ ఆట పాట లతో డప్పు దరువులతో వాడ వాడల తిరుగుతున్నాము. అక్కడ కూడా చైతన్యం చేయాలి ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని, జనాల్ని మత్తులో ముంచి పాలన చేస్తూ ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడం సిగ్గు చేటు.

  • Krishna Veni Chari says:

   వి. లక్ష్మిదేవి గారూ, మీకే నేను ధన్యవాదాలు చెప్పాలి- చదివి కామెంటు పెట్టి మరీ మెచ్చుకున్నందుకు. 🙂
   మీ ప్రోగ్రాం విజయవంతం అవాలని కోరుకుంటున్నాను.
   థేంక్యూ. 🙂

  • P S Prakash says:

   మద్యపాన నిష్షేదం విషయం లో మీ ప్రయత్నాలు అభినందనీయం ,కాని సమస్య మూలాల్లొకి వెళ్ళకుండా ఏది పరిష్కారం కాదు. అటువంటి ప్రయత్నం ఎదైనా చిల్లు బకెట్ తొ నీళ్ళు తోడి చిల్లు బాన లో పొసినట్లే.చివరకు ప్రయాసే మిగులుతుంది ఒకప్పుడు ఊరికి చివరన ఉండే కల్లు పాకలు సార దుకాణాలు ఇప్పుడు ఊరికి మద్యలొకి ఎల వచ్చాయో ఆలోచించండి. ప్రత్యక్షం గానో పరొక్షంగానో మహిళలు కూడా ఈ వ్యాపారం లొకి వస్తున్నారంటే ప్రజల ఆలొచనా సరళి లొని మార్పు ని గమనించండి. గత 30-40 సంవత్సరాలుగా ప్రజలు వినొదాన్ని ఇచ్చె సిని మీడియా(సినిమాలు) ఏమి చెబుతుందో గమనించారా? ఇద్దరు మిత్రులు కలసి సాయంత్రం సేదతీరటానికి(ఇప్పుడు మద్యం తొనే రోజు ప్రారంబించేవాళ్ళు చాల మంది ఉన్నారు)సినిమాలు కాక కళా రూపాలు కాని, క్రిడా ప్రోత్సహకాలు కాని ఏమైన ఉన్నాయా? “నగరానికి ఎమైంది” అంటు ధుమపానానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది,మద్యపానానికి అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ముఖ్యం గా గ్రామాల్లొని బ్రాంది షాపుల్లొ నెలకు ఇంత అమ్మకాలు జరుగుతున్నాయి ఇన్ని లాభాలు వస్తున్నాయి అని చట్టబద్దంగా వెల్లడింపచెసి గ్రామస్తులను(ఈర్ష్యా బావానైనా రెచ్చగొట్టి )జాగ్రుతం చెయగలరా? ఇవేమి లెకుండా మద్యం మానేసి ప్రొద్దు కూకిన వెంటనే ఇంటికెళ్ళి పడుకోండి అంటే వింటారా ? విన్న అది మూడు నాళ్ళ ముచ్చటే అని గత చరిత్ర చెబుతుంది కదా! దయచెసి మీలా ప్రయత్నాలు చెసే వాళ్ళు తప్పక ఆలోచించాల్సిన విషయం ఇది .

   • Krishna Veni Chari says:

    పి ఎస్ ప్రకాశ్ గారూ,
    > నగరానికి ఎమైంది” అంటు ధుమపానానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది,మద్యపానానికి అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా<
    నిజమే మీరు చెప్పినది. అంతే కాక, టివిల్లో వచ్చేసోడా అమ్మకాల అడ్వర్తైసుమెంట్లన్నీ మద్యాల కంపెనీలవే. ఇన్డైరెక్టుగా మధ్యాన్నే ప్రచారం చేస్తున్నారు.
    కానీ ఇది ప్రాధమికంగా పంజాబు రాష్ట్రంలో రెండు మూడు దశాబ్దాల కిందట తలెత్తిన డ్రగ్ సమస్య గురించిన కామన్ కనుక మద్యం గురించి మాట్లాడలేదు. సూచించినందుకు కృతజ్ఞతలు. 🙂

 4. v. lakshmi devi says:

  krishna veni garu

  • Krishna Veni Chari says:

   వి లక్ష్మిదేవి గారూ, నా పేరు రాసి ఊరుకున్నారు !!!

 5. SRINIVAS SATHIRAJU says:

  1985 లో మొదటి సారి లిట్టిల్ ఫ్లవర్ అనే జూనియారు కాలీజీ లో పనిచేస్తున్న రామకృష్ణ అనే మిత్రుడు…నన్ను అడిగాడు టీవీలో ఇంటర్వూ రోలు ఉంది చేస్తావా..అని ఏమిటి అన్నా….ఎం లేదు ఒక డ్రగ్గ్ వ్యసన పరుడిగా నువ్వు మొహానికి నలుపు చేసి ( లైట్ వెయ్యకుండా చూపిస్తారు…నేను చీకటిలో నుంచి మాట్లాడతాను అన్నమాట)…పూర్తి వివరాలు చెప్పాడు…హైదరాబాదులో నడుస్తున్న మాదక ద్రవ్యాల డబ్బున్న వారి పిల్లలే కాకుండా మధ్య తరగతి పిల్లలు వారు తినే కేడీబార్ చాకోలెట్లలో ఎలా కలుపుతున్నది ఆఖరికి జామకాయలు బండి దగ్గిరనుంచి టీ కోట్లలో (ఆల్ఫా టీ కొట్టు)…అన్ని వాళ్ళు చూపిస్తారు…..నేను నటించా…500 రూపాయలు ఇచ్చారు…. కానీ వాళ్ళు చేపినవి మాత్రం చూపించలేదు….నేను నటించ దానికి కారణం నా బాంకు ఆఫీసరు పరీక్షలకు ఇంట్లో డబ్బులు అడగ దానికి మొహమాట పడి నేను ఇలా సంపాయించుకున్నా..కానీ నాకు తెలిసినది…నిజమైన వ్యసన పరులంతా డబ్బున్న వాళ్ళ పిల్లలు అతడి స్తూడెంట్లు …అవన్నీ కూడా నిజాలే…ఇప్పుడు ఇంకా కొత్త రకాలు వచ్చాయి..ఇంకా చెప్పాలంటే పల్లెటూళ్లలోకి కూడా వ్యాపించాయి… ఓపియం ఇప్పుడు చాలా మట్టుకు మీరు రుచిగా ఉంది అని ముచ్చట పడీ ప్రతీ హోటలు వారు వాడుతున్న ప్రక్రియే …కుంచెం కుంచెం గా అలవాటు చేసి తరువాత ఆ తిండి లేడా వంటకం పై మీరు కాఫీ మీద ఆధార పడినంతగా ఆధార పడటమే ఈ నాటి వ్యాపార రహస్యం… అభినందనలు…రచయిత్రికి…అన్ని అక్షర సత్యాలే !

  • Krishna Veni Chari says:

   శ్రీనివాస్ సత్తిరాజుగారూ,
   మీరు నటించిన అనుభవం బాగుంది. అభినందనలు. 🙂
   అవును, చాక్లెట్లలో వాటిల్లో కలపడం-వాటన్నిటి గురించీ విహంగలోనే కిందటేడాది ఒక కాలమ్ రాశాను. ఉడ్తా పంజాబ్ చూసిన తరువాత వచ్చిన ఆలోచనతో రాసినదిది.
   తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ వ్యసనం పాకిందన్న సంగతి నాకు కొత్త. మీ మెప్పుదలకి నా కృతజ్ఞతలు. థేంక్యూ

 6. SRINIVAS SATHIRAJU says:

  1985 లో మొదటి సారి లిట్టిల్ ఫ్లవర్ అనే జూనియారు కాలీజీ లో పనిచేస్తున్న రామకృష్ణ అనే మిత్రుడు…నన్ను అడిగాడు టీవీలో ఇంటర్వూ రోలు ఉంది చేస్తావా..అని ఏమిటి అన్నా….ఎం లేదు ఒక డ్రగ్గ్ వ్యసన పరుడిగా నువ్వు మొహానికి నలుపు చేసి ( లైట్ వెయ్యకుండా చూపిస్తారు…నేను చీకటిలో నుంచి మాట్లాడతాను అన్నమాట)…పూర్తి వివరాలు చెప్పాడు…హైదరాబాదులో నడుస్తున్న మాదక ద్రవ్యాల డబ్బున్న వారి పిల్లలే కాకుండా మధ్య తరగతి పిల్లలు వారు తినే కేడీబార్ చాకోలెట్లలో ఎలా కలుపుతున్నది ఆఖరికి జామకాయలు బండి దగ్గిరనుంచి టీ కోట్లలో (ఆల్ఫా టీ కొట్టు)…అన్ని వాళ్ళు చూపిస్తారు…..నేను నటించా…500 రూపాయలు ఇచ్చారు…. కానీ వాళ్ళు చేపినవి మాత్రం చూపించలేదు….నేను నటించ దానికి కారణం నా బాంకు ఆఫీసరు పరీక్షలకు ఇంట్లో డబ్బులు అడగ దానికి మొహమాట పడి నేను ఇలా సంపాయించుకున్నా..కానీ నాకు తెలిసినది…నిజమైన వ్యసన పరులంతా డబ్బున్న వాళ్ళ పిల్లలు అతడి స్తూడెంట్లు …అవన్నీ కూడా నిజాలే…ఇప్పుడు ఇంకా కొత్త రకాలు వచ్చాయి..ఇంకా చెప్పాలంటే పల్లెటూళ్లలోకి కూడా వ్యాపించాయి… ఓపియం ఇప్పుడు చాలా మట్టుకు మీరు రుచిగా ఉంది అని ముచ్చట పడీ ప్రతీ హోటలు వారు వాడుతున్న ప్రక్రియే …కుంచెం కుంచెం గా అలవాటు చేసి తరువాత ఆ తిండి లేడా వంటకం పై మీరు కాఫీ మీద ఆధార పడినంతగా ఆధార పడటమే ఈ నాటి వ్యాపార రహస్యం… అభినందనలు…రచయిత్రికి…అన్ని అక్షర సతయాలీ

  • Krishna Veni Chari says:

   థేంక్యూ శ్రీనివాస్‍ సత్తిరాజుగారూ 🙂

 7. Hemachandra says:

  సమకాలీన సామాజిక సమస్యలు ,వాటి పరిష్కార మా ర్గాలు గురించి రాస్తూ ఉన్న రచయితల లో కృష్ణ వేణిచారి గారి పేరు తొలి వరుసలో ఉంటుంది. అభినందనలు.

  • Krishna Veni Chari says:

   హేమచంద్రగారూ,
   నా పేరు తెలుగులో ఏ వరుసలోనైనా కూడా ఉండటమా? ఇంత పెద్ద కాంప్లిమెంటు ఎవరూ ఇవ్వలేదు ఇప్పటివరకూ. థేంక్యూ. 🙂

 8. వనజ తాతినేని says:

  మీరు వ్రాసే వ్యాసాలూ చాలా ఆశ్చర్యకరమైన విషాదకరమైన విషయాలని తెలుపుతాయి . ప్రతి సమస్య వణికించేదిగా ఉంది. ప్రపంచానికే మాదక ద్రవ్యాల రవాణా కి కేంద్ర బిందువుగా మన దేశం ఉందని ఎన్నో ఏళ్ళ నుండి వింటూనే ఉన్నాం . అయినా ప్రభుత్వం కళ్ళు మూసుకునే ఉంది . అధికార యంత్రాంగం తీరు తెన్నులు ,అకాల మరణాలు ..మత్తులో ఊగుతున్న దేశ యువత ..ఎటు వెళుతున్నాం మనం ?
  మంచి అవగాహన కల్గిన్చేలా వ్రాసారు . ధన్యవాదాలు కృష్ణ వేణి గారు . మీ వ్యాసాలన్నింటిని పుస్తక రూపంలో తీసుకుని రండి . యువతకి చేరువ కావాలి ..అవగాహన పెరగాలి . అభినందనలు మీకు .

  • Krishna Veni Chari says:

   వనజగారూ, నా వ్యాసాలూ వాటిలో సమస్యలూ- అన్నీ సమాచార మాధ్యమాలవల్ల నాక తెలిసినవేనండీ. ఇకపోతే ‘పుస్తక రూపం’ లో- పుస్తకం ఢిల్లీలో వేస్తే, అక్కడ ఉన్న నా తరం వారికి ఎంతమందికి తెలుగుచ్చో కూడా అనుమానమే.
   మీ పొగడ్తకి కృతజ్ఞతలు. 🙂

 9. Dattamala says:

  పంజాబ్ అనగానే నాకు గుర్తొచ్చే భగత్ సింగ్,బాంగ్ర డాన్స్, ఆవ పువ్వులు, పంజాబీ డ్రెస్ స్థానం లో ఇప్పుడు “చిట్టా” అంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఆమధ్య నా కొడుకు సినిమా చూసి “చిట్టా వె” అని పాడుతుంటే అర్ధం అడిగాను కాని సినిమా సబ్జెక్టు అనుకోలేదు … కృష్ణ గారు మీరు ఏది రాసినా అర్దవంతంగానే ఉంటుంది. పంజాబ్ అనగానే వాళ్ళు చాలా “Energetic ” అని నిన్న డిస్కస్ చేసుకున్నాము …వాళ్ళు మత్తు బారిన పడ్డం విచారకరం

  • Krishna Veni Chari says:

   ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి మారి చాలా ఏళ్ళే అయింది దత్తమాల గారూ. ఆవతోటలెక్కడికీ పోలేదనుకోండి. బాంగ్రాలూ, దిద్దాలూ కూడా ఉత్సవాల్లో పెళ్ళిళ్ళలో, పండుగల్లో ఇంకా చేస్తూనే ఉంటారు. Energetic-పంజాబీ జాతికే మారుపేరది.
   ఇకపోతే, ‘చిట్ఠా” అని ఉపయోగించేది మంచి అర్థంలోనే. జంట పదాలయిన ‘గోరీ, చిట్ఠీ’- అంటే తెల్లగా ఉన్న అమ్మాయని అర్థం.
   మీరు చెప్పిన పాటలో ఆ మాట కాస్తా తెల్లటి హెరాయిన్‍ పౌడర్ని సూచించడానికి, “చిట్ఠా వే” గా ఉపయోగించబడింది. నా కాలమ్లో నేను పొరపాటున ‘వే’ కి బదులుగా ‘దే’ అని రాశాను. సరిదిద్దలేదు.
   మీరు ఏది రాసినా అర్దవంతంగానే ఉంటుంది————ఎన్ని థేంక్యూలు చెప్పాలి ఈ పొగడ్తకి! థేంక్యూ. 🙂

   • Krishna Veni Chari says:

    సారీ, ‘దిద్దా’ తప్పుగా టైప్‍ చేశాను అది గిద్దా డాన్సు. భాంగడా మగవాళ్ళది. ‘గిద్దా ‘ ఆడవాళ్ళు చేసే డాన్సు.

 10. Lakshmi Narayana Addagiri says:

  స్పష్టం గా వివరించారు.. ఈ article దేశ prajalanu ఆలోచింప చేయటాన్ని దోహదపడుతుంది..శుభాభివందనాలు ..!

  • Krishna Veni Chari says:

   లక్ష్మీ నారాయణ అద్దగిరిగారూ,
   ఓపికగా చదివి, మెచ్చుకుంటూ కామెంటు పెట్టినందుకు ఎన్నో కృతజ్ఞతలు. 🙂

 11. Venkata S Addanki says:

  ఎప్పటిలాగే మీరు మళ్ళీ ఒక సామజిక అంశం తొ మా ముందుకి వచ్చారు, మీరసలు ఇన్వెస్టిగేటివ్ జర్నో అయ్యుంటే బాగా రాణించేవారేమో అనిపిస్తుంది, ఎక్కడెక్కడివో విషయాలు కూలంకుషంగా శొధించి మరీ వివరిస్తున్నారు. మీరన్నట్లూ పంజాబ్ రాష్ట్రం దేశం లోనే ఒక పేరున్న రాష్ట్రం. మొన్న జరిగిన పఠాన్ కోట్ ఉగ్రవాదుల చొరబాటు వెనుకకూడా అంతర్లీనంగా ఈ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నదని ఒక విషయం వెలుగులోకి వచ్చింది. గురుదాస్పూర్ పోలీస్ ఉన్నతాధికారి అర్ధరాత్రి ఏ పనిమీద బోర్డర్ కి వెళ్ళీ ఉగ్రవాదులకి పట్టుబడ్డాడు, వారి చెరనుండి బయటపడ్డాక ఎందుకు పోలీసులని అప్రమత్తం చెయ్యలేదు తదితర విషయాలలో , అసలు డ్రగ్ వ్యాపారం కోసమే తన స్నేహితుడితో కలసి వెళ్ళడన్న ఆరోపణా లేకపోలేదు.

  కానీ ఏది ఏమైనా పంజాబ్ రాష్ట్రం ఎందరో స్వాతంత్ర సమర యోధులని ఇచ్చింది ఈ దేశానికి, అలాగే మన త్రిదళాలో కూడా ఎక్కువ మనకి కనిపించేదీ దేశ సేవకి అంకితమయ్యేవారుగా మన సిక్కు సోదరులు కనపడతారు. అటువంటి రాష్ట్రంలో వారి శక్తులని నిర్వీరం చేస్తూ తద్వారా ధైర్య సాహసాలు కలిగిన యువకులు భారత రక్షణ దళాలో చేరకుండా చెయ్యలన్న ఒక సంకల్పం కూడా ఉండవచ్చు. అదే విధంగా పాకిస్తాన్ నుండి ఏ విధంగా డ్రగ్స్ మనదేసంలోకి రావచ్చో సినిమాలో పూర్తిగా చూపించకపోయినా, సరిహద్దులవెంట ఉండే కొంతమంది సైనికులు కూడా వీరికి సహాయపడుతున్నరన్నది నిర్వివాదాన్శం. ఈ సైనికులని తమవైపు తిప్పుకుందుకు లోకల్ యంత్రాంగాలు తోడ్పడుతున్నాయి అన్నది కూడా నిజమే.

  ఏది ఏమైనా ఈ దుస్థితినుండి, పంజాబ్ రాష్ట్రం కోలుకోవాలనీ, ప్రభుత్వాలు, ప్రజలూ తమ విలువైన సహాయక చర్యలు చేపట్టి ముఖ్యంగా యువతని ఈ రక్కసి కోరలబారినుండి కాపాడాలి, అలాగే దీనికి సంబంధించిన ముఠాలనూ, అధికారులను కఠినంగా శిక్షించాలి అని కోరుకుందాము. మీ రచన సూపర్. మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి మంచి విషయాలను మీనుండి తెలుసుకోవాడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

  • Krishna Veni Chari says:

   వెంకట్‍ ఎస్‍ అద్దంకిగారూ।
   మీరసలు ఇన్వెస్టిగేటివ్ జర్నో అయ్యుంటే< నేనొట్టి కాలమిస్టుని మాత్రమే. 🙂
   —– గురుదాస్పూర్ పోలీస్ ఉన్నతాధికారి———ఈ అధికారులకే అక్కడ బంగ్లాలూ నౌకరూ ఉన్నాయని నేనన్నది కాలమ్లో.
   మీకు ఈ సమస్య గురించి చాలా అవగాహన ఉందని మీ కామెంట్లోనే తెలుస్తోంది.
   ——– మీ రచన సూపర్.——- మీరెప్పుడూ ఇలాంటి విశదమైన కామెంట్లలో నన్ను మొదటినుండో ప్రోత్సహిస్తున్నం మీకు చాలా కృతజ్ఞతలు. 🙂

  • Krishna Veni Chari says:

   పంజాబ్ రాష్ట్రం ఎందరో స్వాతంత్ర సమర యోధులని ఇచ్చింది ఈ దేశానికి – ————-దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఈ డ్రగ్‍ సమస్య వల్ల యువతలో అధికమంది ఫిసికల్‍ ఫిట్నెస్‍ టెస్టుల్లో పాస్‍ అవలేకపోవడం వల్ల పంజాబు కోటాకి కేటాయించిన కోటాని కూడా ఇప్పుడు వదిలేసుకుంటోంది రాష్ట్రం. ఎక్కడి రాష్ట్రం ఎలా అయిందో ఇప్పుడు అని తలచుకుంటే బాధ కలుగుతుంది.

 12. Suresh says:

  మీరు మెన్షన్ చేసిన సినిమాని చూసాక కానీ, ఆ సమస్య ఎంత తీవ్రమైనదో అర్ధం కాలేదు. ఆ సినిమా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దెబ్బతీయటానికి తీసినది అని ప్రచారం జరిగినా, చూస్తున్నంత సేపు అసలు ఎందుకు ఈ సమస్యని ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు అని అనిపించింది. ఇప్పుడు మీ ఆర్టికిల్ లో చెప్పిన మాట “ఇప్పుడు ఈ సమస్య ఉన్నది నార్థ్ ఈస్టుతో పాటు పంజాబ్లోనే” చదివాక … అందుకే ఏమో వేరే రాష్ట్రాలు అంత సీరియస్గా తీసుకోవటం లేదు అని అనిపించింది. చాలా బాగుందండి మీ ఆర్టికిల్… చాలా విలువైన సమాచారాన్ని స్టాటిస్టికల్ గా ఇచ్చారు. మీ మాటల్లోనే చెప్పాలంటే “కానీ భారతదేశంలోనేగా? మిగతా రాష్ట్రాలకి కూడా పాకదూ!” ఈ ఆలోచన వస్తే మిగతా రాష్ట్రాలు కచ్చితంగా కొన్ని అవసరమైన చర్యలు తీసుకొంటాయి.

  • Krishna Veni Chari says:

   డ్రగ్‍ సమస్య మిగతా రాష్ట్రాల్లోనూ ఉంది. ఎక్కువగా నార్థు ఈస్,ట్లో కానీ ఇప్పుడు పంజాబ్లోనే అన్ని రాష్ట్రాల డ్రగ్‍ ఎడిక్టుల సంఖ్యనీ తీసుకుంటే కూడా, చాలా పెద్ద శాతం అది. ఒకానొక్కప్పుడు పాడీపంటలో అయిదు నదులు పారుతూ సంపన్నంగా ఉండే రాష్టం ఇప్పుడే గతిలో ఉందో తలచుకుంటే/చూస్తే, గుండె దిగజారుతుంది.
   మీ పొగడ్తకి బోల్డు థేంక్యూలు 🙂

   • Krishna Veni Chari says:

    “నార్థు ఈస్టు” అని చదువుకోగలరు నా కామెంట్లో ఉన్న మాటని.