సకలం- 2 – కవిని

Kavini Aluri”పోతుండ్రు…” ముక్త సరిగా సమాధానం చెప్పింది కనకవ్వ.

”నర్సయ్య…ఏమన్నా అండా …ఏంది.. గట్టున్నావు..”

”గాయనేమంటడు. మడిసి రంది పెట్టుకుండు.. ఈ సంసారం ఎళ్ళదీసుడు.. అయితదో ! లేదో ! అంటుండు.

”గట్లంటే.. మా కుటుంబం పది మందిమి… పొద్దు పదిమంది… మాపు పదిమంది.. ఇర్వయ్‌ మంది బతకాలంటె…. ఎంత పెట్టుబడికావాలె.. అందులో కూలీలేక గిట్ల  బతుకుతున్నం. ఏం చేత్తం… పనుంటె పనికి పోతన్నం.. పని లేనినాడు అట్లాగే  తిరుగుతున్నం. గిట్లుంది…” అన్నది లింగవ్వ.

లక్ష్మి బయట ఊడుస్తూ…” పిల్లలకు బడితిండి తింటె తిన్నట్టు… పోతే పోయినట్టు.. రాసుకుందమంటె బుక్కులు లేకపాయె… పెన్నులు లేకపాయె… మనకే కూలిపడక పాయె.. ఏం కొనిత్తమమ్మ మళ్ళా ఏది ముట్టినా .. అగ్గి ముట్టినట్టే ఉంది..

మస్తురేట్లున్నాయ్‌.. సదీపేయాలంటే.. గవర్నమెంటూ ఏం సాయం సేసేటట్టు లేదు.. ఏం పోయినట్టు లేదు.

”గీ గవర్నమెంటు … పంటలు లేకపాయె.. సేలన్నీ ఎండిపోయినాయ్‌. ఏం ఆధారం లేదు. కరంటుంటె కొదిగెల్లె… రెండు మడ్లు పారేది.. ఒకటే మడి పారె.. అట్ల కొంత …వర్షం కొట్టక అట్లకొంత. ఒకపూట తింటే ఓ పూట పన్నట్టు పూరా బతకకుండ పూర పానం పోకండ.. జీవి గంజి పోసుకున్నట్టుగ బతుకుతున్నం” అంది లింగవ్వ.

లింగవ్వ సంసారం పెద్దది.. కొడుకులు కోడళ్ళు… మనుమళ్ళు.. మనవరాళ్ళు.. భర్త పిల్లల చిన్నతనంలోనే కాలం చేశాడు… రెక్కలు ముక్కలు చేసుకుని సంసారాన్ని నెట్టుకొచ్చింది. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. ఇప్పుడు ఆమెకు 70 సం||రాలు…లోపల పని చేసుకుంటున్న చిన్న కోడల్ని పిలిచింది.

”పిల్లలు స్కూలు కెళ్ళిండ్రా…” అని అడిగింది.. తలూపి లోపలకు వెళ్ళింది చిన్న కోడలు.

ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండి పోయింది లింగవ్వ” ఈయాల జర గంజైనా కాయాలే..”ఒక పాళి ఊరోకెళ్ళాస్తా….ఎవళ్ళయినా పనిస్తరేమో…” అనుకుంటూచేతి కర్ర తీసుకుని నిలబడిందల్లా… ఏమాలోచించుకున్నదో? ఏమో? కనకవ్వ దగ్గరకొచ్చింది. నర్సవ్వను చూడగానే కనకవ్వ చేతిలో పని పక్కన పెట్టి ” కైకలు లేకపాయె… తిండిలేకపాయె… పొద్దుందాకా ఎండుకుంట.. ఎటైన కూలిపని దొర్కలేదు. పనులు బందు పెడ్తిమని సర్కారోళ్ళు పని ఇయ్యక పోయిరి… కరువు పని లేదు సేన్లు లెవ్వు… కూలిపని దొర్కెతే పోయినట్టు… లేకుంటే లేదు.. ఉపాసాలు.. ఉప్పులు షగం కడుపు దాచ్కుంటూ బతుకుతుంటిమి…”

నీళ్ళు తెచ్చి నీళ్ళ తొట్టిని నింపుతున్న లక్ష్మి కల్పించుకుని….

”ఏం చెప్పాలె- తెలంగాణ అంటా  కరంటు బందు పెట్టిరి… కరెంటు ఆఫీసు కాడికి పోయి అడిగితే తెలంగాణ కావాలె.. కరెంటూ గావాల్న అని అనబ్టిరి… కరంటు సక్కంగ లేక సేను పారపెడ్దమంటె పారకపాయె”
బట్టలు ఉతుక్కుంటున్న లింగవ్వ పెద్దకోడలు నర్సవ్వ.

”సేనే పారకపోయినంక మీకేం పనిత్తమని రైతులు అనబ్టిరి. కూలీ పనులు లేక రెండునెల్లాయె… ఇప్పుడు మూడు నెల్ల కష్టం అంతకు ముందు వానలు పడ్డాయి. పత్తి కలవనో… వరి కలవనో దొరికినాయి కరంటు సక్కంగ ఇయ్యక పత్తి ఎండిపాయె.. పొలాలు ఎండిపాయె పనులే లేవు.. తిన్ననాడు తింటన్నాం.. పన్ననాడు పంటున్నాం.” కనకవ్వ తోమిన గిన్నెల్ని లోపల పెడ్తూ…. ”తెలంగాణ వస్తే పనిస్తమని.. ఆళ్ళు అనబ్టిరి… బందు పెట్టమనిరి.. అన్నీ బందు పెట్టినం… ఇస్కూలు.. బడి…బందు

పెట్టిరి…పిల్లలకు .. ఈ కతలన్నీ జరగబట్టే.. ఇదిగో గిట్ల…….”

లక్ష్మి ఇంటలోకి   వెళ్ళబోతున్నదల్లా ఆగి ”ఇగో… ఇదిగావాలె.. అదిగావాలె.. తెలంగాణ కావాలంటే …పని బందు పెట్టి  రెండు మూడు నెల్లు తిరిగినం గద కనకవ్వ.”

”అవ్‌.. డర్నా కెళ్ళినం.. డర్న సేసినం.. ఇంక బోనాలు తీస్కోని పోవాలంటె.. బోనాలు తీసినం.. డప్పుల తో  తీస్కపోయినం..కిలో మీటరు దాకా నడ్సుకుాం.. చౌరస్తా దాకా పోయినం…” కనకవ్వ అన్నది. లింగవ్వ గుర్తు తెచ్చుకుంటూ..

”ఓ….ఎల్లినాం.. 32 మగిళాసంగాలోల్లం ఎల్లినాం… ఓఁ… 60,70 సిల్లర దాకా ఎల్లినాం. అట్లెల్లి సేసినాం.. ఇగో మల్లిప్పుడు అప్పి సంది పనిలేదు…. ఎవర్న డగత్తదమ్మా… ఎవర్నడగత్తది…”

కనకవ్వ ”అవ్‌…అవ్వా.. వ్యాను పంపించుండ్రు.. కామారెడ్డి నుంచి వ్యాను పంపితే ఒక వాను నిండా మగిళలందరం పోయినాం…! అక్కడ రైలు ఆపేసిండ్రు… పొద్దుగాలపెందలనే 10 గం||లకు పోయి 4 గం||ల దాకా ఉన్నాం… ఆఁ రైలు పెట్టెలలో గూసున్నాం. ఎండలో .. పొద్దుందాకా గూసుంటే…… 4 గం||లు అయ్యింది… డర్నా చేసినాక మళ్ళ ఇంటి  కచ్చినాం.. ఎండల్నే ఎండినాం.. మళ్ళ ఇంటి  కచ్చినాక ఇక్కడ గూడా ఊరంతా తగిలి బోనాలు తీసుకుని చౌరస్తా కాడి కెళ్ళినాం.. అట్లెల్లి సేసినాం.. అప్పి సంది పనిలేదు…” అంటూ లోపలకు వెళ్ళింది కనకవ్వ. చేతిలో ఉన్న పళ్ళాల్ని, గరెటల్ని, గ్లాసుల్ని చెంబుల్ని, ముందు గదిలో ఉన్న షల్ఫులో పెట్టింది . ప్లాస్టిక్‌ బిందెలోని నీళ్ళను నీళ్ళ తో  పోసింది. ముందు గదిలో గట్టులాగా ఎత్తుగా ఉన్నచోట ఖాళీ కూర గిన్నెల్ని, అన్నం గెన్నెల్ని తెచ్చిపెట్టింది. ఇంతకు ముందయితే అన్నం వండుకుని తెచ్చిపెట్టేది.. ఇప్పుడు బియ్యం నిండుకున్నాయి.. నర్సయ్య గింజలు తెస్తేనే ఈ రోజు ఒక పూటైనా గంజి కాచుకునేది. లేకపోతే పస్తే… పిల్లలు మధ్యాహ్నం స్కూల్లోనే తింరు. రాత్రికి వాళ్ళకూ పస్తె వెనక గది కిక చీకి. ఆ గది కరంటు ఉన్నా చీకటే. లేకపోయినా చీకటే… కరంటున్నా కరంటు బిల్లు కట్టలేక ఆ గదిలో లైటు అత్యవసరమైతే తప్ప దాదాపుగా వేయరు… ఆ గదిలోంచి ఎలుకలు కొరికిన పాత గోనె సంచుల్ని తెచ్చి బయటపడేస్తూ….

”ఇద్దరు పిల్లల సవరించుకోవాలె…. పొద్దుగాల ఉపాసమే పోతుండ్రూ…. తిండుండది.. ఏముండది..  తానాలు సేసి, బట్టలేసుకుని పోతరు… ఇక ఆడ పగటేలు.. ఏం పెడ్తరో… ఏం పోతరో.. మనం సూత్తమా… మాదొక్క పిల్లున్నదని సూడొస్తదా… పదిమందితో పాటు.. మనకి.. ఇగ గమనించుకునే ఊకుండాలె…”

లక్ష్మి ‘ఇగ… పగటేల గింత పెడ్తరనే పంపుతున్నాం.. పెద్దముడుసులు, తెలంగాణ కావాలన్నోళ్ళు ఏడపోయిండ్రో ఉన్నోడు తినుకుంట నవ్వబట్టె లేనోడు ఏడ్వబట్టే.. అన్న్టాయె…. ”

కనకవ్వ: ఈ ఏడంత అద్దాన్నం ఎన్నడూగాలె… ఇజ్జత్తుకి కుదవ బెట్టుకుాం.. తెచ్చుకుాం బతుకుతున్నం.. పిల్లల పొట్టకెట్ల పెడుదుము. మనమెట్ల బతుకుదుము.. బండ్లు…ఎడ్లు… కూలీ ఏంలేదు కష్టముంది.

నర్సవ్వ ”అందరూ… ఒకపాళి ఇారి…” అని కేకేసింది. కనకవ్వ, లక్ష్ష్మి, అందరూ అక్కడకు వచ్చారు.

”సంవచ్చరం సాదించి .. సాదించి… బందు ప్టిెరి… అక్కడ మాడ బెట్టిరి  గానీ .. ఇక్కడ బందాయె.. ఏం లాభం.. అదే పట్టుగుండే మంచి గుండి పోవు. సాలించుకోమంటే ఎగరబట్టె… దుంకబట్టె సాదించుకోకుంటే.. ఏం లాభం.. గిట్లగాదు.. సావకండా బతుక్కండ అయితాం.. ఈ బంద్‌ గిట్లనే ఉంటది.. తెలంగాణ చెప్పేదాకా.. నేనిట్లంటన్న మీరే మంటరు..”

లక్ష్మి: నువ్వు పెద్ద మడిసివి నువ్వేదంటే మేమదే అంటం… అందరూ కలిసి గట్టుగ చేస్తేనే తెలంగాణ వొస్తది.
నర్సవ్వ ”గవర్నమెంటు ఈయాల కరెంటు బందు పెట్టిరి .. నీళ్ళు బందు పెట్టిరి … కరువు పని బందు పెట్టిరి .. ఇంకేం బందు పెడ్తరో గదీ సూద్దాం..”

”గా లీడర్లు పెద్దమడుసులు ఎటైనా పోనీ… మనకు తెలంగాణా కావాలె..”

”అవ్‌.. తెలంగాణ వచ్చేదాకా కొట్లాడదాం..” అక్కడున్న అందరూ అంటున్నారు.

అప్పుడే అక్కడకొచ్చిన నర్సయ్య, నర్సింగులు, లింగం… మరికొందరు వాళ్ళతో గొంతు కలిపారు.

-కవిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

వ్యాసాలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో