నా కళ్ళతో అమెరికా-55(యాత్రాసాహిత్యం )-కె .గీత

హవాయి దీవులు (భాగం-1)

dr.k.గీతఅమెరికా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు సెలవులు వచ్చినా “ఎక్కడికి వెళ్దాం?” అంటే ఇంట్లో వచ్చే మొదటి ప్రపోజల్ హవాయి దీవులు. మేమున్న అమెరికా పశ్చిమ తీరమైన కాలిఫోర్నియా నుంచి హవాయి దీవులు పసిఫిక్ సముద్రం లో పశ్చిమంగా అయిదారు గంటలు విమాన ప్రయాణం చేస్తే వస్తాయి.

అక్కడికి వెళ్లాలంటే కావలిసినవి రెండు. కుటుంబమంతటికీ విమానపు ఖర్చులు, రెండు కనీసం వారం రోజుల సెలవులు.
మొదటిది చాలా ముఖ్యం. పిల్లలకు వారం రోజులు సెలవులొచ్చిన ఎన్ని సందర్భాలలో విమానపు టిక్కెట్ల కోసం ప్రయత్నం చేసినా మనిషికి దాదాపు ఏడెనిమిది వందల డాలర్లకు తక్కువ లేకపోవడంతో ప్రయత్నం విరమిస్తూ వచ్చాం.
హవాయి అనేక దీవుల సమూహం. శాన్ ప్రాన్సిస్కో నుంచి అందులో ఏదైనా ఒక హవాయి దీవికి నలుగురికి రాను పోను టిక్కెట్లకే నాలుగైదు వేల వరకూ, ఇక అక్కడి నుంచి మరే దీవికి వెళ్లాలన్నా మళ్లీ మనిషికి రెండు మూడొందలు చొ||న మరో వెయ్యి పన్నెండు వందల డాలర్లు అవుతాయి.

IMG_9206

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

రెండు రోజులు ఇక అటూ, ఇటూ ప్రయాణం పోను అక్కడ కనీసం అయిదు రోజులు ఉండాలంటే హోటలు, కారు, భోజనాలు, అక్కడ చూడవలసిన వాటికి ఎంట్రెన్సు టిక్కెట్లు .. ఇతరత్రా ఖర్చులు మరో మూడు నాలుగు వేల డాలర్లు … వెరసి దాదాలు పది వేల డాలర్లు.

ఇవన్నీ లెక్క చూస్తే అమెరికా నుంచి ఇండియా వెళ్లి రావడంతో సమానం అవుతుంది. కాబట్టి ప్రతీ సారీ వాయిదా పడ్తూనే ఉంది మా ప్రయాణం.

మొన్న ఏప్రిల్ నెలలో వారం రోజుల స్ప్రింగ్ బ్రేక్ సెలవులకి పిల్లలు ఎటైనా వెళ్దామని పేచీ మొదలు పెట్టేరు. ఇక ప్రపోజల్ ఏవిటో చెప్పనవసరం లేదు కదా!

ఫోటోలు ఇక్కడ చూడండి

ఒక నెల ముందుగా మార్చి నెలలో హవాయికి ఎప్పటిలానే విమానపు టిక్కెట్ల వివరాలు చూసాం. మామూలే.
ఎందుకో చివరి నిమిషంలో “కాస్ట్ కో” వాళ్ల “హవాయి డీల్” ఏదో ఉందని వాళ్ళ ట్రావెల్ వెబ్సైటులోకి వెళ్లి చూసేం. ఆ డీల్ చూసి ఆశ్చర్యం కలిగింది.

నలుగురికి కలిపి దాదాపు నాలుగు వేల డాలర్లలో రెండు దీవులు చూసే పాకేజీ అది. ఆ రెండు దీవులలో ఒకటి రాజధానీ నగరం “హానోలులు” ఉన్న “ఒవాహు” ఐలాండ్. మరొకటి “హవాయి ఐలాండ్ ” గా పిలవబడే “బిగ్ ఐలాండ్ ” లేదా “మావీ ఐలాండ్ లేదా మరొక ఐలాండ్. పాకేజీ లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి రాను పోను ప్రయాణపు ఛార్జీలు, ఒక దీవి నుంచి మరో దీవికి ఒకసారి వెళ్ళదానికయ్యే టిక్కెట్లు, అయిదు రోజుల పాటు హోట్ల చార్జీలు, కారు రెంటల్ కలిపిన డీల్ అది. మామూలుగా నాలుగు వేళ డాలర్లు ఎక్కువ మొత్తమే అయినా హవాయి వెళ్లిరావాలంటే మామూలుగా అయ్యే పదివేలతో పోలిస్తే సగానికంటే తక్కువ కావడంతో చాలా మంచి డీల్ అని చెప్పాలి.

ఇక ఆలస్యం చెయ్యకుండా బుక్ చేసేసుకున్నాం. ఎటు పడితే అటు పరుగులు తీసే చిన్న పాప సిరితో ప్రయాణాలు కష్టమే అయినా అలాంటి మంచి డీల్ ముందు ఏదీ ఆలోచించలేదు మేం.

నిజానికి హవాయి దీవులు మొత్తం ఎనిమిది ప్రధాన దీవుల సమూహమైనా దాదాపు 135 చిన్న దీవుల సముదాయం.
హవాయి చూడాలనుకున్నపుడు కలిగే మొదటి సందేహం అసలు ఏ దీవికి వెళ్లాలనేది. నా ఉద్దేశ్యంలోరాజధానీ నగరం కాబట్టి హానోలులు తప్పకుండా చూడాలి. దానితో బాటూ ఇంకొకటేది చూడాలనేది పాకేజీని బట్టి ఆలోచించుకోవచ్చు.

హానోలులు తో బాటూ పాకేజీలో ఉన్న ఆప్షన్ లలో ఒకటి బిగ్ ఐలాండ్, మావీ ఐలాండ్ తప్పనిసరిగా చూడాల్సినవి అంటారు. బిగ్ ఐలాండ్ అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. అక్కడే ప్రసిద్ధి గాంచిన “హవాయన్ స్పేస్ అబ్సర్వేటరీ” ఉంది. మావీ ప్రకృతి అందాలకు కి, హైకింగులకు ప్రసిద్ధి. ఇక రెండు చోట్లా సముద్ర తీరపు అందాలు చూడవలసినవే. సత్య, వరు అగ్నిపర్వతాల్ని చూడాలని పట్టుబట్టేరు. నాకేమో అబ్జర్వేటరీ తప్పనిసరిగా చూడాలని. ఇంకేముంది? మా పాకేజీలో హనోలులుతో బాటూ బిగ్ ఐలాండ్ చేరింది. ఇక సముద్రం అంటే గుర్తుకొచ్చింది. పిల్లలు ఎన్నాళ్లుగానో వెచ్చని సముద్రాన్ని చూడాలని తహతహలాడుతున్నారు. మేమున్న ప్రాంతపు సముద్రంలో కాళ్లు ముంచాలంటేనే తట్టుకోలేనంత చల్లగా ఉంటాయి. హవాయిలో నును వెచ్చని సముద్ర తీరం ఉంటుందని తెలిసి బాగా హుషారు పెరిగింది అందరికీ.

ఇక పాకేజీ టూర్ బుక్ చేసేటప్పుడు ఇంకో చిక్కొచ్చి పడింది. ఏ దీవిలో ఎన్నాళ్లు ఉండాలో ఆన్ లైను లో బుక్ చేసేటప్పుడే మనం నిర్ణయించుకోవాలి.

ఇప్పుడు మేం ఎంచుకున్న రెండు ఐలాండ్లలో, మాకున్న అయిదు రోజులలో 3 రోజులు ఒక చోట, 2 రోజులు మరో చోట ఉండాల్సి ఉంది. బిగ్ ఐలాండ్లో ఎక్కువ చూసేవి ఉన్నాయా? ఒవాహూ లో ఎక్కువ ఉన్నాయా అనేది మాకు బొత్తిగా తెలియని విషయం. ఇక ఆన్లైను లో దొరికిన సమాచారాన్ని దొరికినవి దొరికినట్లు త్వరగా చదివి, మొత్తానికి మొదట మేం దిగబోయే బిగ్ ఐలాండ్ లోనే 3 రోజులు ఉండాలని, ఆ తరువాత వెళ్లే ఐలాండ్లో 2 రోజులు ఉండాలని అనుకున్నాం. పైగా ఏ పాకేజీ తీసుకున్నా ప్రధాన నగరం ఉన్న హానోలులు తప్పకుండా ఉంటుంది కాబట్టి మరో సారి వెళ్లేటప్పుడైనా పూర్తిగా చూడొచ్చని అనుకున్నాం.

ఫ్లెటు బుకింగుతో బాటే కావలసిన కారు కూడా బుక్ చేసుకోవాలి. అక్కడికెళ్ళాక చూసుకోవచ్చనే ఉద్దేశ్యంతో అప్పటికొద్దీ దొరికిన మమూలు కారు ఆప్షన్ పెట్టేం.

ఇక బుకింగులు అయిపోగానే తర్వాతి పని ప్రయాణానికి కావలసినవన్నీ సర్దడం. అది నా పని ఎప్పుడూ. పిల్లలకు స్విమ్మింగు డ్రెస్సులు వగైరా, సిరికి కారు సీటుతో సహా సర్దేను.

ఏప్రిల్ నెలలో హవాయి దీవుల్లో వర్షాలు పడతాయని విన్నాను కాబట్టి తడిసినా తేలికగా ఆరే బట్టలు పెట్టేనందరికీ.

రోజూ కాస్త కాస్తగా సర్దుతూ ఉన్నా ప్రయాణపు రోజు వరకూ సర్దుతూనే ఉండడం ప్రతీసారీ పరిపాటి. అందుకే బయలుదేరే రెండ్రోజుల ముందు మాత్రమే సర్దేపని పెట్టుకున్నానీసారి. పైగా విపరీతమైన బిజీ పనులలోనూ, ఉద్యోగ బాధ్యతల్లోనూ ఉన్నాను.

ఇప్పటి వరకు మేం చేసిన అన్ని ప్రయాణాలకంటే బాగా ఉత్సాహంగా ఉంది అందరికీ.

మా పాకేజీలో భాగంగా మాకు డైరక్టు ఫ్లైటు లు కాకుండా ఎక్కువ స్టాపులతో ఉన్నాయి. అంతే కాదు పక్కపక్కన సీట్లు కూడా లేవు. ఆ విషయం ప్రయాణం చేసేంత వరకూ పట్టించుకోలేదు మేం.
బయలుదేరే రోజు రానే వచ్చింది.

శాన్ ప్రాన్సిస్కో నించి మాకు దక్షిణంగా 400 మైళ్ల దూరంలో ఉన్న లాస్ ఏంజిలస్ వెళ్లి అక్కడి నుంచి హవాయి వెళ్లే ఫ్లైటులో వెళ్తాం.

నిజానికి పశ్చిమ తీరం నుంచి డైరక్టు ఫ్లైటు అయిదున్నర గంటలు. ఇలా చుట్టు తిరగడం వల్ల, మధ్య వెయిటింగుల వల్ల రోజంతా మా ప్రయాణం పడ్తుందన్నమాట.

మధ్యాహ్నం పన్నెండు గంటల ఫ్లైటుకి శానోజే ఎయిర్పోర్టుకి చేరేం. లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్టులో రెండు గంటల వెయిటింగ్ తర్వాత బిగ్ ఐలాండ్ లో ఉన్న కోనా ఇంటర్నేషల్ ఎయిర్పోర్టుకి వెళ్లే ఫ్లైటు ఎక్కేం.

అయిదారు గంటల ప్రయాణంలో ఇద్దరికొక చోట, ఇద్దరికొక చోట సీట్లు బుక్కయ్యి ఉన్నాయి. సిరికి డాడీ కనబడక పోతే క్షణం తోచదు. అలాగని వీళ్ళిద్దరూ ఎక్కడో కూచుంటే బాత్ రూముకి వగైరా తీసుకెళ్ళాల్సి వస్తే నేనో, వరునో సాయం వెళ్ళాలి. అందుకని ఫ్లయిట్ ఎక్కే ముందే కౌంటర్ లో విషయం చెప్పి మొత్తానికి కనీసం పక్క పక్క వరసల్లో సీట్లు సంపాయించాను. అంతే కాదు. మా ప్రయాణం మొత్తంలో ప్రతీసారీ ఇలా రిక్వస్ట్ చేసి మార్పించా.

సరే ఇక అన్ని గంటల ప్రయాణం ఇండియా వచ్చినపుడు, న్యూయార్క్ వెళ్ళినపుడు తప్ప చెయ్యలేదు. అన్ని గంటల పాటు సిరితో సహా అంతా ఎవరికి ఉన్న సీట్లలో వాళ్ళు సినిమాలు చూడడం లో నిమగ్నమై పోయేరు. నేను మాత్రం విమానం మబ్బుల్ని దాటే వరకూ విహంగమై కిటికీకి అతుక్కుని ఆకాశం లో అందమైన దృశ్యాల్ని పరికించి, నా స్క్రీన్ లో లైవ్ లో ఫ్లయిట్ వెళ్లే దారి మాప్ లో చూస్తూ , అయిదు గంటల పాటు రచనకి ప్ర్రాధాన్యత నిచ్చి, కౌముది లో నా సీరియల్ ఎపిసోడ్స్ రాసేను.

చీకటి పడిన తర్వాత కోనా ఇంటర్నేషల్ ఎయిర్పోర్టు లో దిగేం. అమెరికాలో అన్ని చోట్లా కనబడే ఎయిర్పోర్టు లు ఊహించుకున్న మాకు అక్కడ కనబడ్డ దృశ్యం చూసి నవ్వు వచ్చింది.

విమానం లో నుంచి కిందికి దిగడానికి మెట్లు ఉన్నాయి. అక్కణ్ణించి లగేజీలు లాక్కుంటూ నడుచుకుని ఎయిర్పోర్టులోకి అడుగు పెట్టేం. అది చూస్తే నేను చిన్నతనంలో మొదటి సారి చూసిన బేగంపేట విమానాశ్రయం జ్ఞాపకం వచ్చింది. ఇక ఎయిర్ పోర్టు ఓపెన్ ఎయిర్ షెడ్లలో ఉన్న పెద్ద సైజు బస్టాపులా ఉంది.

ఇక మేం అక్కడికి దిగేసరికి అక్కడి సమయం ప్రకారం రాత్రి తొమ్మిది అయినా, మా శాన్ ఫ్రాన్సిస్కో సమయం ప్రకారం అర్థ

రాత్రి పన్నెండయ్యి నిద్ర, నీరసం వచ్చెయ్యడం మొదలెట్టాయి.
మాకే ఇలా ఉంటే పిల్లల సంగతి చెప్పాలా!

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో