యాత్రా దీపిక-హైద్రాబాద్ నుంచి ఒక రోజులొ(పుస్తక సమీక్ష)-మాలా కుమార్

యాత్రా దీపిక-హైద్రాబాద్ నుంచి ఒక రోజులొ
(దర్శించదగ్గ 72 ఆలయాల చరిత్ర )

రచయిత్రి;పి.యస్.యం.లక్ష్మి

మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వారికి పురాతన కాలం నుంచీ కూడా మనదేశం లో దేవాలయాల నిర్మాణం ఉంది. రాజుల కాలం నుంచి దేవాలయాలను భక్తి శ్రద్దల తో నిర్మించారు.చక్కటి శిల్ప కళ తో అలరించారు.ఎన్ని దేవాలయాలు ఉన్నా ఏ దేవాలయము ప్రత్యేకత దానిదే.దాని స్తల పురాణమూ వేరు వేరు నే.కొన్ని చోట్ల భగవంతుడు స్వయంభూమూర్తులు.తీర్దయాత్రల కు వెళ్ళటము మనకు ముందు నుంచీ వుంది.జీవితములో ఒక్క యత్రైనా చేయని వారు అరుదు.కాకపోతే ప్రసిద్ది చెందిన దేవాలయాలకే ఎక్కువగా వెళుతూ ఉంటారు.మనకు తెలియనివి, ప్రత్యేకతలు , మహిమలు కలిగినవి ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.

bdec8b75-d3d1-428d-8727-e71c0552d2ccఉదాహరణకు, హైదరాబాద్ నుంచి సూర్యాపేట కు వెళ్ళే దోవలో ఎడమవైపు దోవలో వెళితే “పిల్లలమర్రి” చేరుకోవచ్చు.అక్కడ మూడు దేవాలయాలు ఉన్నాయి.అందులో ఒకటి “త్రికుటాలయం ( శ్రీ ముక్కంటేశ్వరాలయం).ఈ ఆలయం క్రీ.శ.1195 లో జరిగింది.అప్పటి రాజు బేతిరెడ్డి నామిరెడ్డి అంగ వంగ కళింగ దేశాల నుంచి శిల్పులను రప్పించి శివాలయమును నిర్మింపజేసాడు.ఆలయ స్తంబాల మీద అద్భుతమైన శిల్పసంపదను చూడవచ్చు.అతి చిన్న డిజైన్ల మధ్య ఒక సన్నని తీగను ఒక వైపు నుంచి ఇంకో వైపు తీసుకు వెళ్ళేట్లుగా నిర్మించారు. ఒక స్తంభము మీద మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి.ఒక మారు మూల గ్రామము లో ఇంతటి అద్భుతమైన శిల్ప సంపద ఉన్న దేవాలయము ఉన్నట్లుగా ఎవరికీ తెలియదు!

నల్లగొండకి 2కిలోమీటర్ల దూరం లో ఉన్న పానగల్లు క్రీ.శ.11, 12 శతాబ్ధాల లో కందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది.వీరు ఆలయాలను నిర్మించారు.నల్ల శానపు రాళ్ళ మీద మలచిన శిల్పాలు మధ్య యుగ, వాస్తు, శిల్ప సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి.ఆనాటి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి.

పిల్లలమర్రి-సప్తస్వరాల స్తంబంఈ ఆలయం త్రికుటాలయముగా మూడు గర్భగుడుల తో నిర్మింపబడినది.తూర్పు ముఖం గా ఉన్న గర్భ గుడిలో శివలింగం వెనుక ఒక స్తంబం చాయ ఎప్పుడూ పడుతూనే ఉంటుంది.ఈ చాయ ఎక్కడి నుంచి పడుతున్నదో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఆ కాలం లోని వారి నిర్మాణ చాతుర్యానికి చక్కని ఉదాహరణ.న్రంతరం శివలింగం ఈ చాయ తో కప్పబడి ఉండటం తో ఈ దేవుడికి చాయాసోమేశ్వరుడు అని పేరు వచ్చింది.

చాయాసోమేశ్వరాలయముపూర్వం మనవారి నైపుణ్యానికి మచ్చుతునకలు ఇలాంటివి ఎన్నొ.ఒకప్పుడు వైభవోపేతంగా ఉండి ఈ నాడు సరైన ఆదరణ లేక మరుగున పడిపోతున్న ఇటువంటి దేవాలయాలు ఎన్నొ ఉన్నాయి. అటువంటివి తను చూసిన ఆలయాల గురించి అందరికీ తెలియాలనే తపన తో పి.యస్.యం. లక్ష్మి గారు కొన్ని పుస్తకాలు వ్రాసారు.అందులో ఒకటి “యాత్రా దీపిక – హైద్రాబాద్ నుంచి ఒక రోజులో. . . “దీనిలో హైద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న 72 దేవాలయాల గురించి వ్రాసారు. అన్నీ కూడా ఉదయము వెళ్ళి సాయంకాలము తిరిగి రాగలిగినవి.ఇందులో చాలా మటుకు పురాతనమైన ఆలయాలు.

అక్కడి కి ఎలా వెళ్ళాలో ఆదారి, అక్కడి వసతులు , దేవాలయాల సమయాలు అన్నీ కూడా ఇందులో వివరముగా వ్రాసారు లక్ష్మిగారు.
మన సాంప్రదాయల గురించి , మన సంస్కృతి గురించి మన తరువాతి తరం వాళ్ళ కి తెలియ చెప్పవలసిన బాధ్యత మనదే.పిల్లల సెలవల్లో ఒకరోజు ఇలాంటివి చూపించేందుకు కేటాయించాలి.పిక్నిక్ లా తీసుకొని వెళ్ళవచ్చు. ఈ మధ్య ఒక టి.వి ప్రొగ్రాం లో ఓ పాప డోంట్ ఆస్క్ మి అబౌట్ పురాణాస్ అనటము విన్నాక చాలా బాధ అనిపించింది.ఆ పరిస్తితి రాకుండా చేయవలసిన బాధ్యత తల్లితండ్రులదే.ఈ దేవాలయాలు , భక్తి కే కాదు చరిత్రకు కూడా నిలయాలు.మన పూర్వీకుల నైపుణ్యాలకు తార్కాణాలు.

ఈ పుస్తకము అందరి దగ్గరా తప్పకుండా వుండవలిసింది.తను చూడటమేకాక మన ఆలయాల గురించి అందరికీ తెలియజెపుతున్న లక్ష్మిగారు అభినందనీయులు.

ఇది దొరుకు చోటు;విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
నవోదయా బుక్ హౌస్,
సాహిత్య భారతీ బుక్ షాప్,దిల్ షుక్ నగర్.
ధర;120 రూపాయలు.

-మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , , , , Permalink

Comments are closed.