మన ఆరోగ్యం మన చేతుల్లో-ఆకుకూరలుతో ఆరోగ్యం– అలౌకిక శ్రీ

ఆకుకూరలు కొన్ని ప్రత్యేకతలు కలిగిన ఆహార పదార్థం. ఆనుదిన ఆహారంలో దాదాపు 20% వరకు వీటిని తీసుకుంటే మంచిది. వీటివలన అపారమైన లాభాలున్నాయి.

ఆకుకూరల్లో మిగిలిన కూరగాయలతో పొలిస్తే విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టటానికి తొడ్పడే పొషకపదార్థం. ఆంతే కాకుండా గుండె రక్తనాళాల జబ్బులు, ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాలలో రాళ్ళు వంటి వాటిని నియంత్రించకలిగే శక్తి దీనికి ఉంటుంది.

download (1)కొలెస్ట్రాలును తగ్గించే గుణం ఉంది. లివర్ లో కొలెస్ట్రాలును వినియోగించుకొని బైల్ యాసిడ్ ను తయారుచేస్తుంది. ఇది కొవ్వు జీర్ణ ప్రక్రియలో తొడ్పడుతుంది. ఆయితే ఆకుకూరల్లో ఉండే పీచుతో బైలు యాసిడ్ కల్సినపుడు అది విసర్జించబడుతుంది. ఆందుచేత లివర్ మరలా మరలా, బైలు యాసిడ్ ను తయారు చేసుకోవలసి వస్తుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా వాడబడుతుంది.

ఆకుకూరలు కంటిచూపును పరిరక్షిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఎ కెరొటినాయిడ్, క్సైంతిన్ రూపంలో ఉంటుంది. ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. కనుక కంటిచూపు పరిరక్షించబడుతుంది.

శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బి విటమినులు, ముఖ్యంగా బి5 (పాంటోథెనిచ్ యాసిడ్) ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది. అంతేకాక బి విటమినులకు నీటిలో కరిగే గుణం ఉంటుంది కనుక, ఇవి శరీరంలో నిల్వచేయబడవు. అందుకే ఆకుకూరలు ప్రతిదినం తీసుకోవాలి.

ఎముకల ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కాల్షియం అనే ఖనిజలవణం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ముఖ్యంగా 31-35 సంవత్సరాల వయస్సు మహిళలు 1000 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే కొంతవరకు సిఫార్సు చేయబడ్డ పరిమాణాన్ని పొందవచ్చు.

పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్ను నివారించకలుగుతాయి.

ఎక్కువగా దొరికే ఆకుకూరలు, వాటి పొషక విలువలు:
పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర, మునగాకు, సొయ్యకూర, గంగవల్లి కూర, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటి కూర, కోత్తిమీర, కరివేపాకు, పుదీన.

కరివేపాకు :
సాధారణంగా వంటకాలలో సువాసన కోసం ఉపయోగించే కరివేపాకు వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ను నివారిణిగా ఇది ఉపయోగపడుతుంది. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నవారికి కరివేపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ప్రముఖ అవయవమైన కాలేయాన్ని ఉత్తేజపర్చటంలో కరివేపాకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కరివేపాకు పొడిగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే రక్తపోటును అదుపు చేసుకోవచ్చు.

కొత్తిమీర :
సర్వ సాధారణంగా ప్రతి వంటకంలో వినియోగించే కొత్తిమీర మనిషి ఆహార రుచిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. కొత్తిమీరను ఉపయోగించి చేసే కూరగాయ వంటకాలు నోటికి రుచిని కలిగిస్తాయి. అదే విధంగా విరేచనాలతో బాధపడేవారు కొత్తిమీరను తింటే ఉపయోగంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కొత్తిమీర ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

పొన్నగంటి కూర :
పొన్నగంటి కూర గ్రామీణ ప్రాంతాల్లో చేలల్లో విరివిగా లభిస్తుంది. అన్ని ఆకుకూరల్లోకెల్లా ఇందులో అధికంగా విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరానికి చలువనిస్తుంది. కడుపులో చేరిన తలవెంట్రుకలను సైతం నశింపజేస్తుంది. దీన్ని పోడికూర, పప్పు, వేపుడు మాదిరిగా వివిధ రకాలుగా వంటి ఆరగించవచ్చు.

ముల్లంగి ఆకు :
ముల్లంగి అనేది అకుకూరకన్నా దుంపగా అధిక ప్రాధాన్యం పొందింది. ముల్లంగి ఆకును కూడా కూరగా వండుకుని తినవచ్చేవనేది మన ప్రాంతంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. ముల్లంగిని సర్వరోగ నివాణిగా పేర్కొంటారు. ముల్లంగి తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలం. వీరేచనాలకు విరుగుడులా పనిచేస్తుంది. గాయాలకు మందుగా కూడా పనిచేస్తుంది.

పుదీనా :
సుగంధభరితమైన పుదీనాను భుజించడం వల్ల మెదడుకు చురుకుదనంతో పాటు ఏకగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పుదీనా ఆకులను కలిపిన నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పరిగడుపున పుదీన ఆకును ఆరగిస్తే ఎసిడిటీ సమస్యను నివారిస్తుంది. పుదీన రసంతో గొంతు నొప్పి, తలనొప్పి తగ్గుతాయి.

పాలకూర, తోటకూర :
పాలకూర, తోటకూర, పుంటికూరల్లో పుష్కలంగా బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి ముఖ్యంగా చర్మవ్యాధులు, రక్తహీనత నివారణకు తోడ్పడతాయి.

చింతచిగురు :

చింతచిగురు అంటే ఇష్టపడని వారుండరు. చింత చిగురుతో తయారు చేసిన మాంసం చికెన్ వంటకాలు భలే రుచిగా ఉంటాయి. చింత చిగురులో విటమిన్-సీ అధికంగా ఉంటుంది. ఇది రక్తశుద్ధికి తోడ్పడుతుంది. కాలేయానికి పుష్టినిస్తుంది. పైత్యం, వికారాలు, మచ్చలను నివారిస్తుంది. ఉదయం అరకప్పు చింతచిగురు రసం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. ఇది లాలాజల గ్రంథిని ఉత్తేజ పర్చి నోటికి రుచిని అందిస్తుంది.

చేమకూర :
చేమకూరకు శరీరంలో చేరిన ఎటువంటి రాయినైనా కరిగించే గుణం ఉంటుందని అంటారు. కీడ్నీల్లో రాళ్లు, ఇతర వ్యాధులు ఉన్నవారు చేమకూర లేదా చామగడ్డతో తయారు చేసిన వంటకాలను అధిక మొత్తంలో తీసుకుంటే మంచింది.

మెంతికూర :
ఇది రక్తపోటుకు దివ్యౌషధం. రక్తపోటు ఉన్నవారు మెంతికూరను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది. ముల్లంగి, మెంతికూర రంగరించిన రసం సేవిస్తే మూత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి.

తెలుసుకున్నారు కదా ఆకుకూరల్లో ఎన్ని ఉపయోగాలున్నాయో ………

మరి మీ రోజూవారి ఆహారంలో తప్పక ఏదో ఒక ఆకు కూర ఉండేలా చూసుకోండి ………

-అలౌకికశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, మన ఆరోగ్యం మన చేతుల్లో, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)