బోయ్‌ ఫ్రెండ్‌ – 40 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”నాలుగు మొట్టి కాయ లిస్తాను చాలా?”

చిత్రం ! ఒక్కొక్కసారి మనకేది కావాలో తెలిసినా, మన చేతుల్తో మనమే దాన్ని పోగొట్టుకుంటాం .
ఆమె మ్లాడలేదు.

”పోనీ ఏం కావాలో చెప్పు.” అన్నాడు భాను. ఆమె పాదాల వైపు చూస్తూ.

”నువ్వు నాకేమిస్తే నాకు సంతోషం కలుగుతుందో అదే ఇవ్వు” అని విచారంగా నవ్వి.

”అయినా నా పిచ్చిగాని నాకేమి కావాలో నాకే తెలియదు ఇంక నీ కెలా తెలుస్తుంది?…అని

”పోనీలే మొట్టి కాయలే ఇవ్వు. కలకాలం గుర్తుండేలా ఇవ్వు. మరలా మరలా నీచేత దెబ్బలు తింటానో  లేదో” ఆమె కళ్ళు అశృశిక్తమయ్యారు.

”కృష్ణా! నువ్వు కంట తడి పెడ్తున్నావా?” కొత్తగా ఆశ్చర్యంగా స్నేహితురాలి వైపు చూస్తున్నాడు.

”ఏమిటో  భానూ! అమ్మా,నాన్న గార్లనీ, నిన్నూ శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలంటే బెంగగా వుంది.” అలా అని తలవంచుకుని బేలగా నిల్చున్న కృష్ణను చూసేసరికి ఆమె మీద మమకారం, అనురాగం ఉప్పెనలా ముంచుకొచ్చింది. కుర్చీలో నుండి లేచి వెళ్ళి ఆమె ప్రక్కన నిల్చుని తల మీద చెయ్యి వేసి  మనసులో మాట బయటపెట్టబోయి ఆగాడు భాను.

”నువ్వు ఏడిస్తే నేను చూడలేను. కళ్ళు తుడుచుకో కృష్ణా.” అలా అతను తల నిమురుతుంటే గతించిపోయిన అన్న తాలూకు స్మృతులు ఆమెలో కదిలాయి . అదే సమయాన రాబోయే భాగస్వామి స్పర్శను భానుమూర్తి స్పర్శలో ఊహించింది. రెండు విభిన్నమైన బంధుత్వాల మధ్య వింతగా వారధిని సృష్టించుకుందామె.

”నువ్వు నాకేమిచ్చినా ఇవ్వకపోరునా నా పెళ్ళికి తప్పకుండా రావాలి భానూ. నువ్వు లేందే నా పెళ్ళి జరగదు.”

అతను నవ్వాడు ప్రేమగా. ”నువ్వక్కడ క్రొత్త జీవితంలోకి అడుగు మోపుతుంటే నేనిక్కడ నిన్నాశీర్వదించకుండా చేతులు ముడుచుకుని కూర్చోగలనా? తప్పకుండా వస్తాను కృష్ణా. జీవితాన్ని నిత్య నూతనం చేసే నీవంటి  సహృదయురాలిని పొందుతున్న ఆ అదృష్టవంతుణ్ణి చూడడానికైనా తప్పకుండా వస్తాను.”

ఆమె కళ్ళను వెడల్పు చేసుకుని అతని వైపు చూసింది.

‘నా దగ్గర నుండి ఏమి ఆశించని ఈ స్నేహితుడి దగ్గర నుండి కూడా ఇంత కంటే నేనేమి ఆశించను’ ఇది చాలు. నాకిది చాలు. నాలుగు కాలాల పాటు మా స్నేహం ఇలాగే నిలవనీ. తనలో కలిగిన సున్నితమైన భావం తాలూకు అనుభూతిని భద్రంగా మనసులో దాచుకుంటూ పైకి మాత్రం పకపక నవ్వింది.

”నువ్వలా నిల్చుని నా తలమీద చెయ్యి  వేస్తే మా తాతయ్య గుర్తొస్తున్నాడు భానూ.”

”పోనీలే నేను మీ  తాతయ్యనే అనుకో. ముసలి కాలంలో ఇలా గలగల నవ్వే మనుమరాలు దొరకడం అదృష్టం కదూ !” అని నవ్వేసాడు మనసారా భానుమూర్తి.

ఆ తర్వాత ఒక గంట సేపు తను నవ్వి అతనిని నవ్వించి లేచి నిల్చుంది కృష్ణ.

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పద విహంగPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో