కాళీపట్నం రామారావు ఆర్తి కథ – పాత్ర చిత్రణ(వ్యాసం )- డా.కిన్నెర శ్రీదేవి.

charcters are not created by the novelist, but found,. The pre exist in his consciousness and reveal themselves as he is writing.
-Elezabeth Bowen.

రచయిత జీవితంలో తారాసపడిన సన్నిహిత వ్యక్తుల నుండి కానీ తనకు పరిచయమున్న వ్యక్తుల ప్రత్యేక లక్షణాలను, పదిలపరచుకొన్న విశేషాంశాలను తానెన్నుకొన్న కథావస్తువుకు సరిపోయే పాత్రలుగా ఎన్నుకొని మలుచుకోవటం జరుగుతుందే కానీ పాత్రల్ని సృష్టించటం అనేది జరగదు. పాత్రల నిర్మాణానికి నిజ జీవితంలో తారాసపడే వ్యక్తులతో గల సామీప్యత, సన్నిహిత లక్షణాలుండటం సార్వత్రిక లేదా సార్వజనీన లక్షణంగా ఏర్పడడానికి అవకాశం కూడా అందువల్లనే సాధింపబడుతుందని సోమర్ సెట్ మామ్ కూడా ఒక సంధర్భంలో పాత్రచిత్రణ గురించి ప్రస్తావించారు.

గ్రామీణ జీవితంతో కాళీపట్నం రామారావుకు గల సంబంధం గ్రామీణుల జీవితం  పట్ల ఆయనకు గల అవగాహనతో కూడిన అబ్జర్వేషన్స్ పాత్ర చిత్రణలో కనబడుతాయి. కాళీపట్నం కథల్లోని ప్రతి పాత్ర నీతివంతంగా ప్రవర్తిస్తాయి. అవకాశాలు అంది వచ్చిన ప్రతిచోట తమను తాము నిలవరించుకోవటమే కాక తాము నమ్మిన నీతిని అవతలివాళ్ళతో కూడా ఒప్పించగలగటం మాష్టారి కథలో కనిపించే ప్రామాణిక లక్షణం. వాస్తవ జీవితంలో వీళ్ళిలాగే ప్రవర్తిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు కాని, ఒక రచయితగా తానాశించిన నీతి, నిజాయితీలతో కూడిన వ్యక్తిత్వాన్ని తన పాత్రలకు ఇవ్వగలిగారు.

ధర్మం పేరిట, న్యాయం పేరిట కొనసాగుతున్న అన్యాయాలకు అక్రమాలకు గల ముసుగును తొలగించి పాఠకుల చైతన్యాన్ని ఆచరణలోకి తేవటం రామారావు కథల్లో కనిపిస్తుంది. ఏపాత్రకూడా స్థాయీ బేధం లేకుండా పాత్రలన్నీ ఒకానొక నీతికి కట్టుబడి ప్రవర్తిస్తాయి. అయితే నీతి అవినీతి మధ్యగల మర్మ రహస్యాన్ని తన తాత్విక భావజాలంతో బద్ధలు చేసి సమాజం కప్పిన ముసుగును క్రమక్రమంగా బట్టబయలు చేయడం ఆయన తాత్విక దృక్పథం నిర్వర్తించడంలోని బాధ్యత తెలుస్తుంది. ఆ తాత్వికత మనుషుల్ని కొట్టు, తరుము, నరుకు, పోరాడు, పొలికేక వేయించు లాంటి ఉద్వేగాలతో కాకుండా నింపాదిగా తత్వబోధ చేస్తాయి. వాటిని అందిపుచ్చుకున్న పాఠకులే కథాంశంలోని సారాన్ని గ్రహించగలుగుతారు.

పైడయ్య భార్య పొందుకోసం పడే పాట్లు, భార్య సన్నమ్మను పొందలేక పోవడంతో ప్రత్యామ్నాయ సుఖం కోసం గంగమ్మ చెంత చేరటం, గంగమ్మ పైడయ్య అన్న నారాయణతో సంబంధంలో (relation) వుండటం వల్ల పైడయ్యను సముదాయించటం, అతని ప్రతిపాదనను తిరస్కరించకుండానే తిరస్కరించడం. పైడయ్య కూడా గంగమ్మ కట్టుబడిన నీతిని అంగీకరించటం, సన్నమ్మ కూడా పరాయి ఇంట్లో కలుసుకుందామన్న భర్త ప్రతిపాదనను అగౌరవంగా భావిస్తుంది. అలాగే నరసమ్మ ప్రతిపాదనను తోసిపుచ్చటం. సన్నికి పెద్దమ్మ వరసైన నర్సమ్మ కూడా ’మొగుడు రమ్మన్నప్పుడు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చంటుంది”. పైగా ఆ సుఖంతోనే, ఆలుమగల బంధాన్ని గట్టి చేసుకోవచ్చు. ఆ తర్వాత అత్త బంగారి నుంచీ, మిగతా కుటుంబ సభ్యుల బంధం నుండి పైడయ్యను విడిపించుకోవచ్చునని సలహా ఇస్తుంది. నర్సమ్మ మాటల్లోని అంతరార్థం అర్థమైన సన్నమ్మకు ఒళ్ళు మండి, ఇలా అంటుంది.

“ అదే ఉద్దేశమైతే నానస నెల్లను. నాకు నాయమ్మ, బాబు, నాతోడబుట్టువు ఎంతో ఆవంక మనుషులు ఆడికీ అంత, వొళ్లెరపెట్టి ఆణ్ణి తెచ్చుకొవడమైతే నా సేత కాదు” అంటుంది.

నరసమ్మ మాటల్లోని మర్మం విన్న వాళ్ళెవరైనా, ఎలాగైనా తన భర్తను తన జీవితాన్ని తాను కాపాడుకోవడానికి మాత్రమే చూసుకొంటారన్న సాధారణీకరణ ల్లోంచి తనపాత్రలను కాళీపట్నం రామారావు ఎదిగించారు. కాళ్ళను నేలకు తొక్కిపట్టి నింగికెగసిన శక్తి, ఒకొక్క పాత్ర స్వభావంలో నుంచి పాఠకుల మనసుల్లోకి ప్రవహించేలా రాయటంలో ఖచ్చితంగా రచయిత స్వంత ముద్రలు కనబడతాయి. కాళీపట్నం రామారావు తన గ్రామీణ జీవిత నేపధ్యంలోనుంచి ఒకకాలంలోని ప్రామాణికతకు( క్లాసికల్ )కొలమానంగానూ ఒక నమూనాలా (mode), తన పాత్రలను కలకాలం నిలిచిపోయే విధంగా మలిచారు. అందుకు సాక్ష్యం ’ఆర్తి” కథలోని సన్నమ్మ పాత్ర. నాదైనా, వాళ్ళదైనా ఎవరిదైనా జీవితమే తన జీవితం బాగుండడమంటే మిగిలిన వారందరి జీవితం బాగుంటేనే అన్న ఎరుక, ఆ పాత్రల సంస్కారంలో వున్ననీతి రచయిత నమ్మిన నీతి ఆయన స్వభావంలో ఇంకటం వల్లనే తన కథల్లో పాత్ర చిత్రణ విషయంలో కనిపించే ఔన్నత్యాన్ని సాధించాడానికి సాధ్యమైంది , మోహార్తితో తనను వెదుక్కుంటూ వచ్చిన పైడయ్యను సంతృప్తి పరిస్తే, గంగమ్మకు ఆర్థికంగా అన్నిరకాల ప్రయోజనాలు ఒనగూడొచ్చు. ఆర్థికాంశాలు మానవ సంబంధాల్లో ఇంకా పూర్తిగా చొరబడని సంధర్భాన్ని గుర్తుచేస్తాయి. అలాగే గంగమ్మ పైడయ్యను వదిన – మరిది సంబంధంతో నిలవరించిన సంస్కారం ఆ పాత్రలకు ఎక్కడి నుండి వచ్చింది. ఏ సామాజికాంశాలు వాళ్ళ ప్రవర్తనలో ప్రవేశించి ప్రభావితం చేశాయి అంటే, శ్రామిక గ్రామీణుల పట్ల రచయితకు గల గౌరవం, అవగాహనల్లోంచి రూపుదిద్దుకోవడం వల్లనే ఈ పాత్రలు. కథకుని సంస్కార పరిధిలో పొందిగ్గా ఒదిగాయి. అందుకే అంతటి నిబ్బరితన్నాన్ని ప్రదర్శించగలిగాయి.
. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.

కథనం విషయంలో కనిపించే సుదీర్ఘత, సంభాషణల్లో కనిపించదు. సంభాషణల్లో రచయిత చాలా జాగ్రత్తగా, పొదుపుగా, గాఢమైన ముద్రను అందించేవిగా పాత్రల స్వభావాన్ని తీర్చిదిద్దుతారు. కథ ముగింపులో రచయితగా కథకుని పాత్ర ద్వారా తన ఆర్తిని పైడయ్య స్థితిని రచయిత బట్టబయలు చేస్తారు.

“అన్నం తినకపోతే ఆకలేస్తుంది. ఆ కూడు తినబోతే వెలపరిస్తోంది”.

“మోచేతికూడు” అనే ఎంచితే ఎంచడానికి లేనిదేవుందా గుడిసెలో?” అన్నదే అసలు పెద్ద సమస్య. అట్లని ఆ అన్నాన్ని తినగలిగాడా? అంటే, అలా తినలేకపోతాడు.

“సన్నికంచంతెచ్చి పక్కకు పెట్టింది. పైడయ్య చెయ్యి కడిగేసుకున్నాడు.” అని వుంటుంది చివరి వాక్యం.

’ఆర్తి’ కథ వియ్యపురాళ్ళ మధ్య జరిగిన తగవులో భార్యాభర్తలు విడిపోయిన కథ. విడిపోవడానికి కారణం ఒకటే. కానీ విడిపోయిన వాళ్ళు కలవటానికి మాత్రం ఎన్నెన్ని అంశాలు అడ్డుతగులుతాయో ఎన్నెన్ని మానసికోద్వేగ భావావేశాలు పాఠకుల మనసుల్ని ముప్పిరిగొంటాయో! ఇవన్నీ ఒక ఎత్తు. అసలు ఈ తగవు రావటానికి గల అసలు కారణం మాత్రం కథంతా చదివితేగానీ అర్థం కాదు. భార్యా భర్తల కొట్లాటగానీ, అత్తాకోడళ్ళ కొట్లాటగానీ పల్లెల్లో ఏం జరిగినా పెత్తందార్ల ప్రమేయం లేకుండా జరగడానికి వీళ్ళేని పరిస్థితిని వాళ్లు ఎంత చొరవగా తగవుల్లోకి దూరి తమ పెద్దరికాల్ని నిలబెట్టుకుంటారో ఈ కథలో కథకుడు దృశ్యమానం చేస్తారు. ఈ కథలో ఎక్కడా రచయిత సామాజిక శక్తుల ఆధిపత్యాన్నిగానీ, వాళ్ల పెద్దరికానికి ప్రతిఫలనా  రూపమైన పంచాయితి పట్ల వ్యతిరేకతను గానీ వాచ్యం చేయలేదు. వాళ్ళ ఆధిపత్య ప్రదర్శన తీరును ఆవర్గాల స్వభావికతను మొదలైన అంశాలను పరోక్షంగానైనా చెప్పకుండా పైడయ్య ప్రవర్తన ద్వారా తన పాఠకులకు బోధపరుస్తారు.

’ఆర్తి” కథకు పేరు పెట్టడంలోనూ కథన్నాన్ని వియ్యపు రాళ్ళ మధ్య తగవుగా మలచడంలోనూ, కథకుని ఉద్దేశం నెరవేరినట్లే. కానీ ఈ తగవులో నాయుడు దూరటం వల్ల అది వియ్యపురాళ్ళ తగవు కాదు. దిక్కులేని సంసారానికి మరో చేయి కలవటంలోని ఆర్థికాంశమే ఈకథకు నేపథ్యమని అర్థమవుతుంది. దాంతోనూ, నాయుడు చెప్పిన తీర్పుతో భార్యభర్తలు కలసిపోవటంతో సరి. మామూలు కథకుడు ఇక్కడితో ఆగిపోతాడు. ఎందుకంటే తగవెందుకొచ్చిందో ఆ తగవుకు గల లఘువును ఎర్రెమ్మకు నాయుడు స్పష్టంగానే చెపుతాడు. అయితే ఏ రచయితైన ఇక్కడితో కథను ముగిస్తాడు. కాని కాళిపట్నం రామారావు మాత్రం అలా ముగించలేదు. కారణం రచయిత భార్యభర్తల మధ్యగల ప్రేమార్తిని వ్యక్తం చేయడానికి గాని తల్లికొడుకుల మధ్య, తల్లికూతుర్ల మధ్యగల ఆర్తిని చెప్పడం కోసంగానీ ఈయన కథ రాయలేదు. ఏ కథావస్తువులోనైన తన ఆర్థిక, సామాజిక, చారిత్రక దృష్టికోణాన్ని రచయిత వదలిపెట్టకుండా పట్టుకొనేవుంటాడు,

కథ మొదట్లోనే పైడయ్య చాలీచాలని పల్లెబతుకులో నుంచి బయటపడి అంతో ఇంతో స్వతత్రంగా బతికే అవకాశమున్న మురికిగుంటలాంటి పట్నంలో మార్కెట్ అరుగులపై బతుకుతున్నాడు. పల్లెలోనే వున్నట్లయితే, నారాయణ, బంగారి, ఎర్రమ్మ, నరసమ్మ వీళ్ళందరికి నాయుడింటి కూడు సహించినట్లే, పైడయ్యకు అలవాటయ్యేది. నాయుడు ఇంటి నుంచి వచ్చిన అన్నం కూరల్ని మోచేతి కూడుగా, దయాదక్షిణ్యాలతో పొందానన్న అసంతృప్తి. తన భార్యను తాను తెచ్చుకోలేక పోయానన్న నిస్సహాయత. తన అన్నలా మొరటుగా నైనా, తెగువాగానైనా భార్యను బలవంతంగానైనా లక్కొచ్చినట్లు తాను తెచ్చుకోలేని చేతగాని తనం. భార్య తనంతకు తాను కాకపోయినా తన కోసం, తనపిలుపు కోసమే ఎదురుచూడలేదన్న వుక్రోశం, తాను పిలిచినప్పుడు తన దగ్గరికి చేరలేదన్న నిస్సహాయత. ఇన్ని భావావేశాలమధ్య భార్యను, భార్య ఇచ్చే సుఖానికి దూరమైపోతున్న సంధర్భంలో నిలబడాల్సి వచ్చిన, తన బతుకులోని దుర్భరత. నాయుడు పెద్దరికపు ప్రమేయంతో భార్యను, ఆ ఇంటి కూడును అనుభవించాల్సివచ్చిన అగత్యం. అన్నీ కలిసి నాయుడు ఏర్పాటుచేసిన ’పండగకూడు”ను నాయుడి పెత్తందారీ తనానికి ప్రాతినిధ్యంగా భావిస్తాడు. అందుకే అన్నం కంచంలోనే చెయ్యి కడిగేసుకుంటాడు. అలా చేయికడుక్కోవటంలో, తన హక్కుగా,తన ప్రమేయంతో జరగాల్సిన వాటిని మరోలా పరాయి శక్తుల ప్రమేయంతో, వాళ్ళు నడిపించినట్లు నడుస్తున్నందుకు అతడు తన తిరస్కారాన్ని, నిరసనను వ్యక్తంజేస్తాడు. ఇక్కడే రచయిత తాత్విక దృక్పథం బోధపడుతుంది. ఆ చివరివాక్యమే లేకపోతే, పాఠకునికి తత్వం బోధపడే అవకాశం ఉండదు.
ఉద్యమాలు జీవితానుభవంలోంచి రావాలి తప్ప, పుస్తకాలలోంచి కాదు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధంలేని జీవితాలలో కూడా ఆర్థికసూత్రం ప్రధాన ప్రాత నిర్వహిస్తున్న తీరును కాళీపట్నం చాలా కథల్లో కనబడుతుంది. సమస్యా పరిష్కారాలలో జీవితాన్ని నడిపే గతితార్కిక సూత్రాలను తన కథలకు అంతస్సూత్రంగా చేసి ఆవిష్కరించటమే రచయితగా కాళీపట్నం రామారావు కథా రచనలోని ఉద్దేశిత లక్ష్యం.

వర్గాల మధ్య వైరుధ్యాలుండటమే కాదు. ప్రజలమధ్య కూడా వైరుధ్యాలుంటాయి. అయితే ఆవైరుధ్యాలను శతృపూర్వక వైరుధ్యాలుగా కాక సామరస్య పూర్వక వైరుధ్యాలుగానే చూడాలని మార్క్సిస్టులు (మావో) అంటారు. దీన్ని ప్రజల్లో పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న మార్క్సిస్టు నాయకుల్లోగాని, ఆ ప్రాపంచిక దృక్పథం గల రచయితల కథల్లో గానీ చూడలేం. కానీ కాళీపట్నం రామారావు కథల్లో ఈసత్యం చాలా సన్నివేశాల్లో చూడగలం. ఉదాహరణకు ’ఆర్తి’ కథలో వియ్యపురాళ్ళయిన బంగారి, ఎర్రమ్మల మధ్య వచ్చిన తగవుకు కారణం సన్కూలిడబ్బులు. జీవిక కోసం ఎంత యాతన పడుతున్నారు. ఆ జీవన ఆర్తిని చిత్రించే క్రమంలో ఆరెండు కుటుంబాల మధ్య గల వైరుధ్యాలను, ఆర్థిక స్థితిగతులను లోతుల కెళ్ళి విశ్లేషిస్తారు.

వూరి పెత్తందారైన నాయుడిలో కూడా నీతి తప్పని తనాన్ని ఈకథలో చూస్తాం. రాజకీయాలంటే గిట్టని ఆదర్శ గాంధేయవాదతడు. మామూలుగా పెద్ద మనుషులు ఇద్దరు గొడవపడినపుడు ఎవరో ఒకరిది తప్పు, మరొకరిది ఒప్పు అని తీర్పు చెప్పటం జరుగుతుంటుంది. లేదా సొంత నియోజక వర్గంలోని వాళ్ళే అయినపుడు లౌక్యంగా వ్యవహరించటం కూడా జరుగుతుంది. కాని నాయుడు పాత్ర రామారావు మాష్టారి స్నేహపూర్వక వైరుధ్యాలపట్ల గల అవగాహనతోనే ఇరుకుటుంబాల మధ్య సయోధ్య చేసి పంపిస్తాడు.

పెళ్ళైన  కూతురు అత్తారింటి మనిషి పుట్టింటోళ్ళకి ఆమెపైన ఏహక్కులేదన్న నాయుడితో నారాయణ పాత్ర ’కనుక్కున్న తల్లికి లేని హక్కు! కానీ కం’డె కట్టినోడికా?……కాకపోతే, కడుపుమంటకొద్దీ ఈ గోలంతా లేపినాది. ఎర్రెప్ప యేటనుకుంటాదంటే, దానికి నలుగురు కొడుకులూ, యిద్దరు కోడళ్ళూ గదా—నా కొక్కదాన్ని యిస్తేతప్పా. నాపిల్లేగదా—అని అనుకుంటాది “ అంటాడు. ఒక ఇంటిపెద్దగా అందరి తరపునా నిలబడడం, వాళ్ళలా ప్రవర్తించడానికి కారణమయిన పరిస్థితులను అర్థంచేసుకోవడంలో చూపే సంయమనం చదువు సంస్కారం కలిగిన వాళ్ళకంటే మించిన సంస్కారాన్ని ప్రదర్శిస్తాడు.
గంగమ్మ పైడయ్య అన్ననారాయణతో సంబంధంలో (relation) వుండటం వల్ల పైడయ్యను ”నానిప్పుడు నీకొదెన్నవుతాను. గడియకో సిటంకో మీయన్న రావాల” అంటుంది. అతన్ని తిరస్కరించకుండానే సముదాయించటం, పైడయ్య గంగమ్మ కట్టుబడిన నీతిని అంగీకరించి, తన ఆకలిని నాటుసారాతో సరిపెట్టుకుంటాడు.. భార్య సన్నమ్మకోసం చేసిన ప్రయత్నాలు, ఆమెను పొందలేక పోవడంతో ప్రత్యామ్నాయం కోసం గంగమ్మ చెంత చేరినప్పుడు ఆడ తోడు కోసం అతను పడే తపనను తోడుగా సామాజికాంశంతో పెనవేసుకున్న ఆర్థికాంశాన్ని కథాంశం చేయడంలోనే కాళీపట్నం రామారావు శిల్పంలోని విలక్షణత. ఈలక్షణాన్ని ఆర్తి కథలో పైడయ్య గంగమ్మతో తనలోని తృష్ణను వ్యక్తంచేసే సంధర్బంలో మాట్లాడిన మాటల్ని ఇక్కడ గమనించవచ్చు.

“నానార్నెల్లయి, ఆడ మనిషి కోసం ఉపాసవున్నాను. ఇయ్యాల ఇంటికొస్తె మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్నరాతిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికీ నా బాధ అర్థవైనట్టు నేదు…… కావాలంటే, పట్టంలో నాయిష్టవొచ్చినట్టే ననుండగల్దును. నాతోటోల్లంత యెలాగ్ త్ంటాలుపడతన్నారో నాను సూస్తునే వున్నాను. అన్నిట్లో అల్లాగుండొచ్చు గాని, ఆడ దాన్దగ్గిర అలాగుండాలంటే మనసొప్పుకోడంలేదు. ఇరుగమ్మకో పొరుగమ్మ్కో పాటుపడితే ఇల్లిరగతియాల; కన్నెపిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోరమనుసులున్నారు.— ఆల జోలికెల్తె, ఆసుపత్రికి పోవడం సరేసరి- పన్లో కెల్లకండ్ పదిరోజులుంటే కూల్డబ్బుల మటేమిటి? అందుకే నాబాధ నాకు తెలియాల; ఆదేవుడికి తెలియాలన్నాను._” అంటాడు.

పైడయ్య పొరుగూర్లో వున్న పెద్దమ్మ దగ్గరకెళ్ళినపుడు పట్నంపైన గల మోజుతో తనతో చనువుగా మాట్లాడిన రామయ్య కోడలు అతని మనసు నిండా ఉండడంతో పెద్దమ్మ కొడుకు కన్నయ్యను ఆమె గురించి అడుగిన సంధర్బంలో కన్నయ్యతో అన్నమాటల్లో ఆమె పాటించిన నీతి ఈమాటల్లో గమనించవచ్చు. “కడుపుకుండి మనిషి దొంగతనం సెయ్యరాదు. కట్టుకున్న పెనిమిటో, పెల్లవో వుండి కానిపని సెయ్యడం తప్పు. నీ కింటికాడ పెల్లం నేకపోతే సెప్పు. దాని కొంట్లో సుకం నేదన్నా నా నొప్పుకుంటాను. కానితీరి కూకొని కాపరాలు సెడగొట్టకు. అందరు మొగోళ్ళూ ఒకటైనట్టే అందరాడోళ్ళం ఒకటే” నంటుంది.
సన్నమ్మ కూడా పరాయి ఇంట్లో కలుసుకుందామన్న భర్త ప్రతిపాదనను అగౌరవంగా భావించి నరసమ్మ ప్రతిపాదనను తోసిపుచ్చటం. పెద్దమ్మ వరసైన నర్సమ్మ ’మొగుడు రమ్మన్నప్పుడు ఎక్కడికైనా సరే వెళ్లచ్చంటుంది”. ఆసుఖంతోనే, ఆలుమగల బంధాన్ని గట్టి చేసుకోవచ్చు. ఆతర్వాత అత్త బంగారినుంచీ, పైడయ్యను మిగతా కుటుంబ సభ్యులనుండి విడిపించుకోవచ్చునని సలహా ఇస్తుంది. నర్సమ్మ మాటల్లోని అంతరార్థం అర్థమైన సన్నమ్మకు ఒళ్ళు మండిపోయి ఇలా అంటుంది.

“ అదే ఉద్దేశమైతే నానస నెల్లను. నాకు నాయమ్మ, బాబు, నాతోడబుట్టువు ఎంతో ఆవంక మనుషులు ఆడికీ అంత, వొళ్లెరపెట్టి ఆణ్ణి తెచ్చుకొవడమైతే నా సేత కాదు” అంటుంది.

నరసమ్మ మాటల్లోని లౌక్యం, అందులోని మర్మం విన్న వాళ్ళెవరైనా ఎలాగైనా తన భర్తను తన జీవితాన్ని తాను కాపాడుకోవడానికి మాత్రమే చూసుకొంటారన్న సాధారణీకరణాల్లోంచి తనపాత్రలను కాళీపట్నం రామారావు ఎదిగించారు. కాళ్ళను నేలకు తొక్కిపట్టి నింగికెగసిన శక్తి ఒకొక్క పాత్ర స్వభావంలో నుంచి పాఠకుల మనసుల్లోకి ప్రవహించేలా రాయటంలో ఖచ్చితంగా రచయిత స్వంతముద్రలు కనబడతాయి. కాళీపట్నం రామారావు తన గ్రామీణ జీవిత నేపధ్యంలోనుంచి ఒకకాలంలోని ప్రామాణికతకు(క్లాసికల్) కొలమానంగానూ ఒక నమూనాలా (model), తన పాత్రలను కలకాలం నిలిచిపోయే విధంగా మలిచారు. అందుకు సాక్ష్యం ’ఆర్తి” కథలోని సన్నమ్మ పాత్ర. నాదైనా, వాళ్ళదైనా ఎవరిదైనా జీవితమే తన జీవితం బాగుండడమంటే మిగిలిన వారందరి జీవితం బాగుంటేనే అన్న ఎరుక, ఆపాత్రల సంస్కారంలో ప్రదర్శించిన నీతి రచయిత నమ్మిన నీతి. అది ఆయన స్వభావంలో ఇంకటం వల్లనే తన కథల్లో పాత్ర చిత్రణ విషయంలో కనిపించే ఔన్నత్యాన్ని సాధించాడానికి సాధ్యమైంది , మోహార్తితో తనను వెదుక్కుంటూ వచ్చిన పైడయ్యను సంతృప్తి పరిస్తే, గంగమ్మకు ఆర్థికంగా అన్నిరకాల ప్రయోజనాలు ఒనగూడొచ్చు. అలాగే సన్నమ్మ కాపురమూ నిలబడుతుంది. కాని కాళీపట్నం పాత్రలు అలాంటి పని పూనుకోవు. ఆర్థికాంశాలు మానవ సంబంధాల్లో ఇంకా పూర్తిగా చొరబడని సంధర్భాన్ని గుర్తుచేస్తాయి. అలాగె గంగమ్మ పైడయ్యను వదిన – మరిది సంబంధంతో నిలవరించిన సంస్కారం ఆ పాత్రలకు ఎక్కడి నుండి వచ్చింది. ఏ సామాజికాంశాలు వాళ్ళ ప్రవర్తనలో ప్రవేశించి ప్రభావితం చేశాయి అంటే, శ్రామిక గ్రామీణుల పట్ల రచయితకు గల గౌరవం, అవగాహనల్లోంచి రూపుదిద్దుకున్న పాత్రలు. అందుకే ఇవన్నీ కథకుని సంస్కార పరిధిలో పొందిగ్గా ఒదిగాయి. అందుకే అంతటి నిబ్బరితన్నాన్ని ప్రదర్శించగలిగాయి.

– డా.కిన్నెర శ్రీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

One Response to కాళీపట్నం రామారావు ఆర్తి కథ – పాత్ర చిత్రణ(వ్యాసం )- డా.కిన్నెర శ్రీదేవి.

  1. Vl kusuma says:

    మాడం, కారా మాస్టారి ఆర్తి కథాపరిచయం చాలా బాగుంది.గంగమ్మ,సన్నమ్మ ఇద్దరు స్రీల సంభాషణ వల్ల వారి ఆలోచనావిధానం చాలామంది స్రీల మనస్తత్వాన్ని నిర్భీతిగా తెలియజేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)