జారిపోయిన మూడుముళ్ళు – క్రిష్ణ వేణి

             సుప్రీమ్ కోర్టు, త్వరలోనే అతి ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోగల అవకాశం ఉంది. ఇది భారతదేశపు చరిత్రలో కీలకమైన నిర్ణయం అవగలదేమో కూడా.
ఒక మొహమ్మదీయ పురుషుడు మూడు సార్లు, వరసగా ‘తలాక్’ అన్న మాటని ఉచ్ఛరిస్తే అది తత్‌క్షణమైన, చట్టబద్ధమైన విడాకులు పొందడమే-ఇప్పటివరకూ.
కిందటి సంవత్సరం అక్టోబర్‌లో, షయిరా బానో కాశీపుర్ జిల్లా(ఉత్తరాఖాండ్)లో ఉన్న తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమెకే కాక ఇతర ముస్లిమ్ స్త్రీలకి కూడా ఎప్పుడూ వచ్చే పీడకల, ఆమె పట్ల నిజంగా మారింది. ఆమె భర్త రిజ్వాన్, అలహాబాదునుంచి ఆమెకి తలాక్ నామా పంపాడు. అతను పిల్లలిద్దరినీ తనతోనే ఉంచుకున్నాడు. అప్పుడామె మనోవర్తి కూడా పొందలేదు.
                      35 సంవత్సరాల షయిరా- ముస్లిం పర్సనల్‌ లా(షరియత్‌)లో ఆచరించబడే తలాకె-ఇ-బిదాత్ (instantaneous triple-talaq-ITT), నికా, హలాలాహ్*1, బహు భార్యత్వం చట్టవిరుద్ధమైనవనీ, రాజ్యాంగ విరుద్ధమైనవనీ, అవి ఆర్టికల్ 14, 15, 21 మరియు 25 యొక్క ఉల్లంఘన అనీ ప్రకటిస్తూ రిట్‌ లేక ఉత్తరవు జారీ చేయమని సుప్రీమ్ కోర్టుని అభ్యర్థించింది.
రిజ్వాన్ బలవంతపెట్టడం వల్ల, షయిరా ఏడుసార్లు అబార్షన్ చేయించుకుంది. పెళ్ళయిన క్రిత 15 సంవత్సరాలలోనూ, ఆమె చేదు తప్ప సంతోషాన్ని అనుభవించలేదు.
భారతదేశపు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాధమిక హక్కులని ఉదహరిస్తూ, వ్యక్తిగత ఆచరణని ప్రతిఘటించిన మొదటి కేసు షయరాది.
                      ఈమె పెటిషన్ తరువాత, సుప్రీమ్ కోర్టు కేంద్రప్రభుత్వపు స్పందన కోరింది. ఫెబ్రవరీ 28న, ప్రొవిజన్‌కి గల న్యాయబద్ధతని ప్రశ్నించిన వకీలు అమిత్ సింగ్ మరియు వకీలు బాలాజీ శ్రీనివాసన్ చెప్పినది విన్న తరువాత, జస్టీస్ అనిల్ ఆర్.దవె మరియు ఏ.కె గోయల్ యొక్క బెంచ్ నోటీస్ జారీ చేసింది.
           ముస్లిము స్త్రీల పట్ల చూపే లింగ వివక్షతని పరిశీలించవలిసిన అవసరం ఉందనీ పెళ్ళి మరియు వారసత్వం మతంలో భాగం కావనీ, చట్టం కాలానుగుణంగా మారాలనీ, ఈ కోర్టు ముందే నిర్ణయించింది.
స్త్రీలు పురుషులకి చెందిన చరాస్తిలాగా చూసే ఈ ఆచరణలు, మానవహక్కులు మరియు లింగ సమానత్వంలాంటి ఆధునిక మూలసూత్రాలకి కానీ, ఇస్లామిక్ ధర్మానికి కానీ అనుగుణంగా లేవు.
ఒకసారి భర్త “తలాక్” అన్న తరువాత, రెండోసారి ఆ మాట ఉచ్ఛరించడానికి స్త్రీకి మూడు ఋతుస్రావాలు(ఇద్దా) దాటాక కానీ వీలుపడదని, ఖురాను 65:1 ని ఉదహరిస్తూ ముస్లిమ్ స్కాలర్లు చెప్తారు. ఈ అవధిలో, భార్యాభర్తా మధ్యవర్తులద్వారా రాజీ పడే అవకాశం ఉంటుంది. భర్త మొదటిసారో, రెండోసారో ‘తలాక్’ అన్నప్పుడు అతనికి ఆ తలాకుని 3 నెలల్లో ఉపసంహరించుకునే హక్కుంటుంది. అప్పటివరకూ స్త్రీ ఇంటి సామానుల్లో ఒకటిగా, ఎక్కడో అక్కడ పడి ఉంటుంది.
                భార్య ఋతుమతి అయినప్పుడు తప్ప “నేను నీకు విడాకులిస్తున్నాను” అని అనడానికి భర్తకి ఎప్పుడైనా హక్కుంటుంది. ఒకే వరసలో మూడు సార్లు అన్నప్పుడు, ఆ స్త్రీ ఇంక వీధిన పడవలిసినదే. అది హాస్యానికి అన్నా, తాగి ఉన్నప్పుడు అన్నా, ఒక ఎస్ ఎమ్ ఎస్ ద్వారా చెప్పినా, ఫేస్బుక్లో రాసినా, గోడల మీద రాసినా, వాట్సప్లో పంపినా కూడా- ఆ మాటలకి తిరుగు లేదు. దీనిలో ప్రశ్నలకి కానీ హేతువుకి కానీ తావు లేదు. అన్ని అభ్యంతరాలూ పక్కకి నెట్టబడతాయి. దీనికి ప్రతివాదం ఏమిటి!

               13101291_10153662523623576_108996320_nపాకిస్తాన్‌తో సహా 28 ముస్లిమ్ దేశాలు ITT ని రద్దుచేసి, విడాకులన్నీ కోర్టు ద్వారానే పొందాలని చట్టాలు ఏర్పాటు చేశాయి. మరి భారతదేశం ఇంకా 7వ శతాబ్దంలోనే ఉంటూ, దేనికోసం ఎదురు చూస్తోంది!
ముస్లిం పర్సనల్‌ లా ఈ విషయంపైన ప్రతిఘటిస్తూ కోర్టుకి పెటిషన్ పెట్టింది.
ITT ని రద్దు చేయమని 92% ముస్లిమ్ మహిళలు కోరుతున్నారు. భారతీయ ముస్లిమ్ మహిళా ఆందోలన్ సర్వే(BMMA) 2015లో, పది రాష్ట్రాలలో ఉన్న 4,710 మంది ముస్లిమ్ స్త్రీలని సర్వే చేసింది. 78% స్త్రీలు ITT ప్రకారం విడాకులు పొందారు. 8% కి హలాలాహ్‌ని పాటించమని చెప్పబడింది. 82% కి తమ పేరిట ఏ ఆస్థీ లేదు. 78% స్త్రీలు తమ స్వంత ఆదాయమంటూ లేని గృహిణులు. 55% స్త్రీలు 18 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సులోనే పెళ్ళి అయినవారు.

                      13090022_10153662523628576_2114177988_n ఇన్నేళ్ళూ, ఎవరూ అడ్డు పడకుండా ముస్లిం పర్సనల్ లా జాగ్రత్త పడుతున్నాకానీ సుప్రీం కోర్టు జోక్యం ఇప్పుడు అత్యంతవసరమైన,ఆహ్వానించతగ్గ సహాయంగా కనిపిస్తోంది.కాకపోతే, భార్య కనుక విడిపోవాలనుకుంటే ‘ఖుల్’ లేక ‘ఖులా’ అనే ప్రక్రియ ఉంది. అదీ భర్త తప్పు లేనప్పుడే. అది కూడా, తను విడిపోవడానికి అనుమతి కావాలని భర్తని అర్థించినప్పుడు మాత్రమే.
             పరిస్థితి ఎక్కువ గంభీరంగా మారుతున్న కారణం ముస్లిమ్ పెర్సనల్ లా క్రోడీకరించబడకపోవడం. ఇది 1937 నుంచీ మార్చబడలేదు. దాన్ని స్థానిక మతాధికారులు ఏ విధానంగానైనా ఇంటర్‌ప్రెట్ చేయవచ్చు. అందువల్లే ఈ డిజిటల్ యుగంలో తమ భార్యలకి విడాకులు ఇవ్వడం ఎక్కువ సులభం అయింది. ఈ విడాకుల సప్రమాణతని కొంతమంది మతాధికారులు అంగీకరించడం వల్ల, ముస్లిం మతనాయకులందరూ కలిపి దీని గురించి ఏకాభిప్రాయానికి రాకపోతే తప్ప, చిన్నచిన్న కారణాలకే ముస్లిమ్ స్త్రీలు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు.
         సమస్య, ఇండియాలో భారతీయుందరికీ అన్వయించే Uniform Civil Code లేకపోవడం కూడా.
పర్సనల్ లా లో సవరింపు కోసమని, ముస్లిమ్ స్త్రీల డిమాండు క్రిత కొద్ది సంవత్సరాల్లో బాగా ఊపందుకుంది. కానీ “ఇది ఒట్టి మాటు వేయడం మాత్రమే. ‘ITT’ అన్నది స్త్రీలని అణిచివేసి, వారిని పూర్తిగా నాశనం చేసే విధ్వంసకరమైన పరికరం. దీన్ని సవిరించడంలో అర్థం లేదు. ఇది పూర్తిగా రద్దు చేయాలి” అని స్త్రీ హక్కుల స్పెషలిస్ట్ అయిన ముంబయికి చెందిన ఫ్లావియా ఆగ్నెస్ వాదిస్తారు.
ITTని బహిష్కరించి, ఈ ఏకపక్ష విడాకుల వ్యవహారాన్ని delegitimize చేయవలిసిన అవసరం షయరా బానో కేసు వల్ల స్పష్టంగా కనిపిస్తోంది. స్త్రీల సమానతకి అడ్డం పడుతున్న ఈ చట్టాలన్నీ అంతం అయే సమయం వచ్చిందేమో అన్న ఆశ కూడా కలుగుతోంది.
సుప్రీమ్ కోర్టు ఈ కేసుని పరిశీలిస్తూ, ఒక నిర్ణయంవైపు కదులుతుండగా భారత దేశపు సమాజంలోనే వివిధ మూలాలనుండి వివాదం పుట్టుకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, నిరాశ చెందే వారు అనేకమంది ఉంటారు- అది సాంప్రదాయవాదులూ అవవచ్చు లేకపోతే సంస్కర్తలైనా అవవచ్చు.
———————–
*1- విడిపోయిన భార్యా భర్తా కానీ తిరిగి పెళ్ళి చేసుకోవాలనుకుంటే, హలాలాహ్‌ని పాటించాలి. హలాలాహ్-అంటే ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అతడికి విడాకులిస్తేగానీ తిరిగి పాత భర్తని వివాహం చేసుకునేందుకు అర్హురాలు కాదు. అంతకన్నా ముందు ఆమె ‘ఇద్దత్‌’ని పాటించాలి. అంటే విడాకులు పొందాక మూడు నెలలు పాటు మళ్ళీ వివాహం చేసుకోకూడదు. పండగలకీ, పబ్బాలకీ దూరంగా ఉండాలి. ఇలా రెండు సార్లూ ఇద్దత్ పాటించిన తరువాత, తిరిగి పాత భర్తని వివాహం చేసుకోగలదు.

– కృష్ణవేణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీతPermalink

37 Responses to జారిపోయిన మూడుముళ్ళు – క్రిష్ణ వేణి

 1. శ్రీనివాసుడు says:

  పూర్తి వ్యాసం కొరకు ఈ లంకె నొక్కండి.
  https://thewire.in/102325/marriage-and-its-discontents-muslim-personal-law/

  ‘Marriage And Its Discontents’ and the Vocal Debate on Muslim Personal Law
  By Kouser Fathima on 26/01/2017 • Leave a comment

  In Marriage and its Discontents: Women, Islam and the Law in India, Sylvia Vatuk argues how ‘paternalistic attitudes’ affect women suffering in abusive and troubled marriages.

  Sylvia Vatuk’s book on Muslim women and Muslim personal law in India comes at a time when the issue is being widely contended within the country. Representational image. Credit: Renu Parkhi/Flickr CC BY-NC-ND 2.0

  Sylvia Vatuk’s Marriage and its Discontents: Women, Islam and the Law in India comes at an interesting time. Vatuk has done her PhD from Harvard University and is professor emerita of anthropology at the University of Illinois, Chicago. The selected works cited on her faculty page are a testimony to decades of work on issues related to family, family law and Muslim women in India. The author has backed the facts with empirical data collected by the first comprehensive study on how Muslim women are negotiating Muslim personal law (MPL) and extrajudicial options to obtain divorce. She has conducted interviews with government appointed qazis, lawyers, counsellors and the women themselves and has presented the facts without being judgemental or critical.

  • Krishna Veni says:

   శ్రీనివాసుడుగారూ,
   థేంక్యూ. చదివాను. హారిబిల్ .
   వెబ్ పత్రికలన్నిటినీ ఒకసారి చుట్టి వస్తుంటే, ఈ, నా పాత కాలం పట్ల మీ స్పందన కనిపించింది.
   ధన్యవాదాలు.

 2. Krishna Veni Chari says:

  సెంటర్ చెప్పినా లా, కమిషన్ చెప్పినా కానీ, ముస్లిమ్ పర్సనల్ లా మాత్రం తన మొండిపట్టు వదులుకోదేం? 🙁
  http://timesofindia.indiatimes.com/india/triple-talaq-debate-uniform-civil-code-not-good-for-nation-says-muslim-law-board/articleshow/54828399.cms

 3. Srinivas Sathiraju says:

  ఒక ఉమ్మడి చట్టం రావలసిన అవసరం ఉంది. అందులో మాట విశ్వాసాలకు ఎంత మాత్రం చోటు ఉండకుండా భారతీయుల చట్టం అనేది రావాలి. కానీ ఓటు బాంకు రాజకీయాలకి అలవాటు పడ్డ మన రాజకీయ వాదుల్లో నిజమైన చైతన్యం రానంత వరకు అలాగే సంబంధిత మతం తాలూకు స్త్రీలలో చైతన్యం ఒక పోరాట స్ఫూర్తి లేనంత వరకు వచ్చేది ఉండేది సూన్యమే. కానీ మీరు కూడా వివరాలు కూలంకషంగా చర్చించడానికి భయ పడుతున్నట్టుగా ఉంది తప్ప వ్యాసంలో నిజాయితీ లోపించినట్టుగా ఉంది. కారణం ఒక మూఢ మతాన్ని విమర్శిస్తే చట్ట పరమైన చిక్కుల్లో ఇరుక్కుంటానా అనుకుంటూ చాలా జాగ్రత్తగా తీవ్రమైన భావజాల ఉపయోగానికి సంకోచించినట్టుగా ఉంది. ఇలా మడి కట్టుకుని రాసే రాతలు చికాకు కలిగిస్తాయి తప్పా ఉద్దేశ్యాన్ని సూటిగా చెప్పలేక చతికిల పడతాయి.

  • Krishna Veni Chari says:

   శ్రీనివాస్ సత్తిరాజుగారూ,
   అవును, ఒక Uniform Civil Code లేకపోవడమే పెద్ద సమస్య.
   కూలంకషంగా చర్చించడానికి భయ పడుతున్నట్టుగా————భయం దేనికి?
   మీ మిగతా కామెంటునుద్దేశ్యించి—– ప్లీస్, పూర్తి కాలమ్ సరిగ్గా చదవండి.
   చిక్కుల్లో ఇరుక్కుంటానూ, సంకోచపడుతున్నానూ……..ఎక్కడనిపించింది అలాగ!!!
   మూఢమతం————ఏదీ కాదు?
   నేనిక్కడ మతాలూ, కులాలూ గురించి విమర్శించను/లేను, రాయలేదు. రాయను కూడా.
   ఇదొక సామాజిక సమస్య(irrespective of any religion)కాబట్టి ఒట్టి సామాజిక దృక్కోణంతో మాత్రమే రాశాను.
   మీ వివరమైన కామెంటుకు బోల్డు కృతజ్ఞతలు. 🙂

   • Krishna Veni Chari says:

    ఏదీ కాదు—————కి బదులుగా ఏది కాదు? అని చదువుకోగలరు. తేంక్యూ. 🙂

 4. Krishna Veni Chari says:

  ఆసక్తికరమైన నిర్ణయం అంటూ అనవసరమైన ఉత్సాహంతో రాశాను. ఇదీ, ఇవ్వాళ్టి నిర్ణయం.:(

  http://www.thehindu.com/news/national/sc-cant-decide-on-triple-talaq-says-muslim-body/article9066594.ece?utm_source=email&utm_medium=Email&utm_campaign=Newsletter

  • శ్రీనివాసుడు says:

   Krishna Veni Chari గారూ!
   మీ వ్యాసం ఎవరిని ఉద్దేశించి వ్రాసారో ఆ ముస్లిం మహిళలు చదివి స్పందిస్తే అర్థవంతంగా వుంటుందేమో. ఇతర మతాల మహిళలు ఎవ్వరు ముస్లిం మహిళత సమస్యల గురించి వ్రాసినా ముస్లిం రచయిత్రులతో సహా ఎవ్వరైనా స్పందించడం నేను ఎక్కడా చూడలేదు. ఈ క్రింది వ్యాఖ్యలలో కూడా వాళ్ళెవరూ లేరు. మీ స్నేహవర్గంలోని, మరియు ఇతర ముస్లిం రచయిత్రులు, పోరాట కార్యకర్తలు ఈ సమస్యమీద స్పందిస్తే ముదావహంగా వుంటుందని నా భావన. ఇలా తెలుగులో ముస్లిం మహిళల సమస్యల గురించి వ్రాసినవి ఎంతమంది ఆ ముస్లిం బాధిత మహిళలు చదువుతున్నారూ అని నా సందేహం.

   • Krishna Veni Chari says:

    ముస్లిం మహిళలు——ఎఫ్బీలో నా లిస్టులో లేరు శ్రీనివాసుడుగారూ.
    ఇతర ముస్లిం రచయిత్రులు, పోరాట కార్యకర్తలు—–50,00 మంది స్త్రీలు ఒక గుంపునేర్పర్చుకుని పోరాటం సాగిస్తూనే ఉన్నారు. కానీ దానికి షరియత్ అడ్డం పడుతూనే ఉంది.
    తెలుగులో ముస్లిం మహిళల సమస్యల గురించి వ్రాసినవి— మరేమో ఎందుకు చదవడం లేదో, చదివినా ఎందుకు స్పందించడం లేదో, నాకూ తెలియదు. చదివి కామెంటు పెట్టినందుకు కృతజ్ఞతలు.

    • Krishna Mohan Mocherla says:

     Krishna Veni garu.. In Telugu there are many writers, educated and journalists from Muslim community who write a lot … sadly, none of them raise their voice against this issue. I am not sure what is the reason.

     • Krishna Veni Chari says:

      Krishna Mohan Mocherla garu,
      I only wish I knew the reason for the silence on this issue from the Telugu community when the whole country is condemning the barbaric practice.

 5. Buchireddy gangula says:

  మార్పు అవసరము –రాక. తప్పదు
  రావాలి
  ———————————-
  బుచ్చిరెడ్డి. గంగుల

  • Krishna Veni Chari says:

   అవునండీ బుచ్చిరెడ్డి.గంగులగారూ, మార్పు తప్పక రావాలి నిజమే కానీ అదంత సులభం అవగలదా అన్నదే ప్రశ్న. థేంక్యూ-చదివి కామెంటు పెట్టినందుకు. 🙂

 6. ఆర్.దమయంతి. says:

  చక్కని సమాచారాన్ని సేకరించి ఎంతో శ్రధ్ధగా రాస్తున్నారు కృష్ణవేణి, అందుకు – మీకు ముందుగా నా అభినందనలు.
  మత చాందస్తాలు మనల్ని హింసించేవి గా వున్నప్పుడు వాటిని రద్దు చేసుకుని నూతన పధ్ధతులను అనుసరించడంలో తప్పు లేదు.
  ఇన్నాళ్ళకి ముస్లిం వనితలు నోరు విప్పుతున్నారంటే – ఇంతకాలం నొక్కిపెట్టిన ఆక్రోశం పెల్లుబుకుతున్నదన్న నిజాన్ని మనం గ్రహించాలి.
  మగాడు అతి తేలికగా కట్టుకున్న దాన్ని వదిలించుకోవడంలో దుర్వినియోగమౌతున్న ఈ రెండక్షరాల పదాన్ని తొలగించాల్సిన అగత్యం ఎంతైన వుంది.
  నేనూ ఇదే అంశాన్ని జోడిస్తూ సారంగ లో ఒక అర్టికల్ రాసాను.
  ఇద్దరి ఆలోచనలు కలిసినందుకు ఆనందంగా వుంది కృష్ణ.
  చాలా బాగా రాసారు.
  ధన్యవాదాలు.

  • Krishna Veni Chari says:

   నూతన పద్ధతులని అనుసరించడానికి షరియత్ అడ్డు పడుతోంది కదా దమయంతిగారూ. ఈ రెండక్షరాల పదాల వల్లే ఎందరు స్త్రీలు క్షోభ పడుతున్నారో! సరిగ్గా చెప్పారు మీరు.
   మీ సారంగ వ్యాసాన్ని చదివేను నేను. బాగా నచ్చింది నాకు.
   మీ అభినందనలకీ, పొగడ్తకీ నేనే మీకు ‘ధన్యవాదాలు’ చెప్పాలి. థేంక్యూ 🙂

 7. kittgadu says:

  మీరు రాసింది చదివేవరకు ఇంత గోల ఉందని తెలియదండి. బాగా చెప్పారు
  ఐన భర్త ఈ తింగరమలిన పని చేసిన కూడా భార్య కీ ఇబంది అన్నటు ఉంది ఇక్క్కడ అది. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ చేంజ్ ఇన్ తట్ లా

  • Krishna Veni Chari says:

   “గోల” అన్నది ప్రతి మతం/కులం/దేశంలో ఉండేదే కదండీ కిట్టుగాడు గారూ!నిజమే, ఈ చట్టంలో మాత్రం తప్పక మార్పు రావాలనీ/వస్తుందనీ కూడా ఆశ. చదివి కామెంట్‍ పెట్టినందుకు కృతజ్ఞతలు 🙂

 8. Durga Dingari. says:

  కృష్ణా, నీ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నేను ఒకప్పుడు రెగ్యులర్గా రాసేవి అన్ని గుర్తొచ్చాయి. చాలా బావుంది. ఐ యాం సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రెండ్.
  ఇలాగే చక్కని ఆర్టికల్స్, కథలు రాస్తూ వుండు.

  • Krishna Veni Chari says:

   దుర్గా, నీకెన్నెన్నో కృతజ్ఞతలు. నీ ప్రేరణ లేకపోతే నేను తెలుగులో అసలు రాయగలిగేదాన్నా చెప్పు.
   నాకు తెలుసు-నీ ఆరోగ్యం సరై, ముందటిలాగే మళ్ళీ రాయడం ప్రారంభిస్తావని. త్వరగా కోలుకో ముందు.

 9. Lakshmi Narayana Addagiri says:

  కాలానుగునంగా మార్పు రావాలి, బారతీయ ముస్లిం స్త్రీలు అన్ని రంగాలలో అభివృధి చెందారు.. భారతీయ ముస్లిం చట్టాలు లో మార్పు రావాలి,

  • Krishna Veni Chari says:

   లక్ష్మి నారాయణ అద్దగిరి గారూ,
   ఇంత ఓపికగా చదివి మీ అభిప్రాయం వెళ్ళబుచ్చినందుకు కృతజ్ఞతలండీ 🙂

 10. కిరణ్ కుమార్ says:

  బాగా రాసారు. గుడ్.

  • Krishna Veni Chari says:

   కిరణ్‍ కుమార్‍ గారూ, కృతజ్ఞతలు- నేను రాసేవాటన్నిటినీ ఓపికగా చదివి, కామెంట్లు కూడా పెడుతున్నందుకు. 🙂

 11. వనజ తాతినేని says:

  పుట్టింటికి వెళితే ఎప్పుడూ వచ్చే పీడకల భర్త విడాకులు ఇవ్వవచ్చు ..ఎంత దారుణం. ఇతర ముస్లిం దేశాలలో ఉన్న IIT పూర్తీ రద్దు మన దేశంలో కూడా త్వరగా అమలులోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను . నాకు తెలిసిన ముస్లిం స్త్రీలకి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి. నిస్తేజంగా బ్రతుకునీడుస్తున్న వారిని చూస్తే బాధగా ఉంటుంది కూడా ! పెళ్ళి మరియు వారసత్వం మతంలో భాగం కావనీ, చట్టం కాలానుగుణంగా మారాలనీ మనమందరం కూడా అనుకోవాలి.
  ఒక మంచి విషయాన్ని అందరి దృష్టికి తెచ్చారు . ముస్లిం స్త్రీల బాధల పట్ల సహానుభూతితో .. ఈ స్పందన. ధన్యవాదాలు.

  • Krishna Veni Chari says:

   వనజగారూ, నిజమే కదా! ఏ నిముషాన మనస్సులోకి వస్తే అప్పటికప్పుడే వివాహబంధాన్ని తెంచే అవకాశం పురుషులకి మాత్రమే ఉంటోందిప్పటివరకూ. ఏమో ఇరువురి అనుమతీ కూడా కావలిసి వచ్చే రోజు వస్తుందనుకుందాం. కృతజ్ఞతలు. 🙂

 12. mala` says:

  మీరు ఎప్పుడూ మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని వివరంగా బాగావ్రాస్తారు.బాగా వ్రాసారు.
  నాకైతే మీరు వ్రాసింది చదువుతే “నిఖా” సినిమా గుర్తొచ్చింది.

  • Krishna Veni Chari says:

   మాలగారూ, పొగడ్తకి అనేక థేంక్యూలు. అవును కదా- ఆ సినిమా చూసి చాలా ఏళ్ళయింది. గుర్తుకి తెచ్చారు. మరిచేపోయాను. మళ్ళీ ఆన్లైన్లో చూడాలనిపిస్తోంది మీ కామెంటు చదివిన తరువాత. దానికీ థేంక్యూ 🙂

 13. Venkata S Addanki says:

  ఎప్పటికప్పుడు బర్నింగ్ టాపిక్స్ మీద మీరు వ్రాసే ఆర్టికల్స్, పాఠకుల మనసుల్లో కొత్త ప్రశ్నలు ఉదయింప జేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు క్రిష్ణవేణి గారు. ముందుగా మీకు మీ ఆర్టికల్ కు అభినందనలండీ.
  ముఖ్యంగా ఒక ప్రత్యేకించి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండి వివాహసంబంధ విషయాలలో వీటి నియమాలను గౌరవిస్తూ వచ్చిన కోర్టులు, ఇప్పుడు ప్రభుత్వానికి సూచించడాలు చేసేకన్నా, ఆ మతపెద్దలను సంప్రదించో లేక వారిని ప్రతివాదులగచేర్చీ కేసును విచారించడం, కావలసివస్తే ప్రభుత్వాన్ని కూడ ప్రతివాది జేర్చవచ్చు కానీ కేవలం మైనారిటీ వర్గం అన్న నెపంతో కేసును ప్రభుత్వానికి అప్పగించడం ఎంతవరకూ సమంజసం.
  ఒకపక్క వివాహలను చట్టబద్దం ఎంతవరకూ చేస్తున్నారు. వివాహాలను మతాచారాల ప్రకారం ఆమోదించి విడిపోయే సమయంలో మాత్రం కోర్టులెందుకు. ఇంకొకముఖ్యమైన విషయం ఇరువురిలో ఒక్కరికి ఇష్టం లేనంత మాత్రాన వివాహం రద్దు ఎలా చెయ్యగలరు. ఏ మతాచారమైనా ఇరువురి ఇష్టాలతో, ఆమోదంతో వివాహం జరిగినప్పుడు, విడిపోవడానికి ూడా ఇరువురీ అంగీకారం ఉండితీరాలి అన్న చట్టం చెయ్యాలి లేక పోయునట్లయటయితే ఇటువఃంటి కేసులు మరిన్ని నమోదుకి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే రాజకీయ,ప్రభుత్వాలని జోక్యం చేసుకోమంటారో అప్పుడు ఈ అంశం సున్నితమైన అంశంగా మారిపోయి రాజకీయ బలాలకో, ఉపయోగాలకో వాడుకోవడం మొదలయ్యి అసలు సమస్య దాని పరీష్కారం అటకెక్కుతాయి. అందువల్ల ఇటువంటి అంశాలలో మతపెద్దలని ప్రతివాదులుగా చేర్చితే సమస్యలకి పరిష్కారమర్గాలు కనపడే అవకాశం ఉందీ.

  • Krishna Veni Chari says:

   వెంకట్ అద్దంకిగారూ, మొట్టమొదటిగా మీ విశదమైన కామెంటుకి బోల్డు కృతజ్ఞతలు. 🙂
   కేసుకి కోర్టుకి అప్పగించడం వల్లే కదా, కొంతలో కొంతైనా మార్పు కానవస్తోంది! అయినా కూడా కోర్టు ఇస్తున్న అనుకూల నిర్ణయం పట్ల ముస్లిమ్ పర్సనల్ లా ఇంకా ప్రతిఘటిస్తోంది. ఇంక ఇప్పటికీ ఏడవ దశాబ్దంలోనే ఉన్న షరియత్ చేతుల్లో నిర్ణయాన్ని వదిలేస్తే ఈ స్త్రీల బాధలు భగవంతుడైనా తీర్చలేడు.
   “ఇరువురీ అంగీకారం ఉండితీరాలి అన్న చట్టం చెయ్యాలి” –అది పూర్తిగా నిజమే. ఈ చట్టాలింకా రాతియుగపువే.
   మీరెప్పుడూ ఇలా అందిస్తున్న సహకారానికి థేంక్యూ. చాలాసార్లని అనుకోండి. 🙂

   • కిరణ్ కుమార్ says:

    >>ఇరువురీ అంగీకారం ఉండితీరాలి అన్న చట్టం చెయ్యాలి

    ఈ విధానం అస్సలు సమ్మతం కాదు, పైగా ఇలాంటి చట్టం భాదితులకు తీరని అన్యాయం చేస్తుంది. దుర్మార్గులైన భర్త/భార్య తమ తమ స్వలాభం కోసం విడాకులకు ఒప్పుకునే సమస్యే లేదు. అలాంటప్పుడు బాధితుడికి(భాదితురాలికి) వారి జీవిత కాలంలో విడాకులు వచ్చే సమస్యే లేదు.

    • Krishna Veni Chari says:

     అదీ నిజమే కిరణ్‍ కుమార్‍ గారూ,
     కానీ, హైందవ దుర్మార్గురాళ్ళయిన భార్యలు ఎలాగూ ఐపిసి 498 ఏ ని ఆశ్రయించి, తమ లక్ష్యం సాధించుకుంటున్నారుగా ఈ మధ్యకాలంలో!
     ఇకపోతే బాధితులైన ఆడవాళ్ళు- ఈ టాపిక్లో ముస్లిము స్త్రీలే కనుక,వారికి కూడా ఏదైన వెసులుబాటుండాలిగా! ఏడవ శతాబ్దంలో షరియత్‍ నియమించిన సూత్రాలని పాటిస్తూ వారి భర్తలు ఇంకా అడ్వాంటేజ్‍ తీసుకుంటూనే ఉన్నారు మరి. 🙁 దీనికీ విరుగుడూ, మధ్యే మార్గం ఉండాలి కదా- ఏదో విధంగా/విధానంలో!!!

     • కిరణ్ కుమార్ says:

      మెజారిటి తప్పులు భార్యలు చేస్తున్నారా లేక భర్తలు చేస్తున్నారా అనే చర్చను పక్కన పెట్టి అందరికి సమానా అవకాశాలు కల్పించేలా చట్టం చెయ్యాలి.

      కట్న కానుకలు గృహ హింస లాంటివి ఆడవారిపై పెరిగిపోతున్నాయి అని కారణం చెప్పి పూర్తీ స్త్రీ పక్షపాత చట్టాలు చేసారు. పలితంగా ఆ చట్టాలను దుర్వినియోగం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆ చట్టాలను కొద్దిగా సవరిద్దాం అని కదిపితే స్త్రీ వాదులంతా కలసి ఉతికి ఆరేస్తారు. ఆ కారణం చేత ఆ చట్టాల సవరణలు ముందుకు వెళ్ళటం లేదు. రోజు రోజుకు బలయ్యే అమాయకులు పెరుగుతూనే ఉన్నారు.

      పై విషయాన్ని గుణపాఠంగా తీసుకొని కొత్త చట్టాలు పకడ్బందీగా చెయ్యాలి. అలా కాకుండా ‘ఇరువురి అంగీకారం ఉంటేనే … ‘ లాంటి చట్టాలు రోపొందిస్తే ఇప్పుడు బాగానే ఉంటుందేమో కాని ఓ అయిదు పది సంవత్సరాలలో అవే చట్టాలు తిరగ బెట్టటం ఖాయం.

      మతాలకు అతీతంగా వివాహ చట్టాలను రూపొందిస్తే మంచిది అని నా అభిప్రాయం.

      • Krishna Veni Chari says:

       కిరణ్ కుమార్ గారూ,
       నిజమే. ఐపిసి 498Aని స్త్రీలు ఎలా దుర్వినియోగపరుస్తున్నారో అన్న టాపిక్ మీద నేను రెండు నెల్ల కిందటే విహంగలోనే రాశాను. మీరు చెప్పినట్టు “ఇరువురి అంగీకారం “ ఉండే చట్టాలు రూపొందిస్తే, వాటిల్లోనూ ఏవో లొసుగులు కనిపెట్టి వాటినీ తమ తప్పులకి అనుగుణంగా మార్చకోగల సమర్థులుంటారు-చట్టాలని ఎంత పకడ్బందీగా రూపొందించినాకానీ. అయినా కానీ అది ప్రస్తుతానికి hypothesis మాత్రమే అవుతుంది( ఇంకా అలాంటివేమీ అమలులోకి రాలేదు కనుక.) కాబట్టి అది వదిలేద్దాం.
       మీరు చెప్పిన “మతాలకు అతీతంగా వివాహ చట్టాలను రూపొందించడానికి” అడ్డంకి అవుతున్నది ప్రస్తుతానికి భారతదేశంలో Uniform Civil Code లేకపోవడం మాత్రమే. అదే ఉంటే ఇంకేం? ఈ మూడు తలాకులూ అలాంటివీ ఉండవేమోనన్న ఆశ.
       మీరింత ఓపికతో టాపికుని ఫాలో అవుతున్నందుకు బోల్డు కృతజ్ఞతలు. 🙂

 14. Venkat Suresh says:

  ఈ అంశం పై దాదావు 30 ఏళ్ళ కిందట ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసాక ఇటు వంటి పద్ధతిని ఎందుకు ఎవ్వరూ వ్యతిరేకించటం లేదు అని భలే ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మీరు మార్పుకి అవకాశం ఉంది అని చెప్పిన మాటలు…చాలా సంతోషం కలిగించాయి.. రోజులు మారుతున్నాయి…మనమూ మారి తీరాలి. చాలా మంచి అంశాన్ని ఎంచుకొన్నారు ఎప్పటిలానే

  • Krishna Veni Chari says:

   >మీరు మార్పుకి అవకాశం ఉంది అని చెప్పిన మాటలు< ఊహూ, కాదు, ఈ అవకాశం కలిపిస్తున్నదీ, ఆశాకిరణాన్ని చూపిస్తున్నదీ మన అత్యున్నత న్యాయస్థానం.
   ఎప్పటిలాగే మీ మెప్పూ, ప్రోత్సాహం వల్ల ఎంతో సంతోషం కలిగింది. థేంక్యూ 🙂
   అదేదో ఆ సినిమా పేరు కూడా చెప్పేయండి మరి. 🙂

   • Venkat Suresh says:

    Nikah అని హిందీ/ ఉర్దూ సినిమా అంది. బి ర్ చోప్రా తీసారు. చాలా బాగుంటుంది.

    • Krishna Veni Chari says:

     ఓ, అవును. ఇదే అని మాలగారు చెప్పారు. థేంక్యూ 🙂
     చూశానన్నట్టుగానే గుర్తు తప్ప సినిమా గుర్తుకి రావడం లేదు వెంకట్‍ సురేశ్‍ గారూ. మళ్ళీ నెట్లో వెతుక్కుని చూస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)