డబ్బెవరికి చేదు!(పుస్తక సమీక్ష ) – మాలాకుమార్

రచయత;మల్లాది వెంకటకృష్ణమూర్తి

dabbevariki cheduడబ్బెవరికి చేదు! అవును డబ్బెవరికి చేదు?
మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు తన నవల “డబ్బెవరికి చేదు!” లో ఇలా అంటున్నారు, తెల్లదైనా కావచ్చు, లేదా నల్లదైనా కావచ్చు.శతృత్వానికి మాతృభూమి.మాతృత్వానికి మరుభూమి! పేరాశకి పుట్టిల్లు.అత్యాశకి అత్తిల్లు.అదిలేని చోట అష్టకష్టాలు.ఉన్న చోట సర్వసౌఖ్యాలు! మనుషులను కలపగలదు.విడదీయగలదు.కలిపి విడదీయగలదు.విడదీసి మళ్ళీ కలపగలదు. అవసరమైన చోట పుట్టదు.అనవసరమైనచోట పెరుగుతుంది. ద్వేషాన్ని ప్రేమించగలదు.కావాలనుకుంటే తుంచగలదు.మనిషిని బ్రతికించగలదు.చంపగలదు.బ్రతికున్న మనిషిని చచ్చినవాడితో సమానం చేయగలదు. తండ్రిని హత్య చేసే కొడుకుని సృష్టించగలదు.ఆ మాట కొస్తే తల్లిని చంపే కూతురిని కూడా!అన్నదమ్ములను విడదీయగలదు.భార్యాభర్తలని దూరం చేయగలదు.బాల్యమితృల స్నేహం శాశ్వతంగా విడగొట్టగలదు.అంతే కాదు ముసలి మొగుడికి పడుచుపెళ్ళాన్ని సమకూర్చగలదు కూడా!

అది అందరికీ మంచి మితృడు.ఆఖరికి ముక్కు మూసుకున్నా, మూసుకోని సన్యాసులకు కూడా. అందుకే అది మంచివాళ్ళను చెడ్డవాళ్ళుగా మార్చగలదు.ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదు. కూల్చగలదు.రక్తపాతాన్ని సృష్టించగలదు.మాన్పగలదు.ఓ శీలాన్ని కొన్ని వేల సార్లు సంతోషంగా నాశనం చేయగలదు. పేరాశ, స్వార్థం,అన్యాయం,అక్రమం,అవినీతి దాని తోబుట్టువులు. మానవత్వం, మంచి, ధర్మం అది పుట్టక మునుపు నుంచే దాని శతృవులు. అదుంటే కొనలేనిదేమీ లేదు.లోకం దానికి దాసోహం.దాని శరణం తో చాలామంది మరణాన్నే జయించగలరు.
కొందరు దానిని దొంగతనంగా తయారుచేస్తుంటే అది చాలా మందిని దొంగలుగా చేస్తుంది. అది రెండే రెండక్షరాల పదం!
చిల్లిగవ్వ,డాలర్,రూబుల్,ఎన్,ఫ్రాంక్.మార్క్,రూపాయి. . . . . ఏ పేరు తో పిలిచినా ఏ దేశంలో ఉన్నా దాని లక్షణాల్లో ఎలాంటి స్వల్ప మార్పూ వుండదు.లేదు!

మనిషిలో ఎప్పటికీ తీరని దాహాన్ని సృష్టించగల ఆ ఏకైక పదార్ధం సృష్టిలో అత్యంత అందమైనది, అత్యంత భయంకరమైనది.
అవును మరి అంత శక్తి వంతమైన డబ్బు ఎవరికి చేదు! ఆ డబ్బు ముగ్గురు అక్కచెళ్ళళ్ళ జీవితం లో సృష్టించిన తుఫాను కథ నే మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన నవల “డబ్బెవరికి చేదు!”

ఇక కథ లోకి వస్తే, విశ్వనాథ్ కు ముగ్గురు కూతుళ్ళు, దేవిక, స్వర్ణ,మమత, కుమారుడు మనోహర్.అందరికి వివాహాలయ్యాయి.దేవిక భర్త గోవర్ధన్.వారికి ఇద్దరు పిల్లలు.ఇద్దరికీ దైవ భక్తి ఎక్కువ.పొద్దున లేవగానె పడక గదిలో మంచం ఎదురుగా ఉన్న వెంకటేశ్వరస్వామి, అలివేలుమంగకు దండం పెట్టుకోని కాని మంచం దిగరు.ఇద్దరిలో దేవికకు భక్తి మరీ ఎక్కువ.ఆమెకి దైవభక్తి చాలా మంది కన్నా ఎక్కువ.దేవుడికి మొక్కుకోవటం, ఏదైనా కోరిక తీరితే కొబ్బరికాయ కొట్టటం దేవికకు చిన్నప్పటి నుంచి అలవాటు.వాళ్ళు హైదరాబాద్ లోని వనస్తలిపురం లో గోవర్ధన్ తండ్రి నుంచి సంక్రమించిన ఇంటిలో ఉంటున్నారు.గోవర్ధన్ బాలానగర్ లోని ఓ ఇంజనీరింగ్ కంపెనీలో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నాడు.ఈ ఇల్లు అమ్మేసి ఆఫీసుకు దగ్గరలో వేరే ఇల్లు కొందామంటే ఇది అమ్మగా వచ్చిన డబ్బు సరిపోదు.పోనీ ఇది అద్దెకు ఇచ్చి అక్కడ వేరే ఇల్లు అద్దెకు తీసుకుందామనుకుంటే ఇక్కడ ఇంటికి అద్దె సరిగ్గారాదు.దానితో సమస్యను ఎదుర్కుంటున్నారు.గోవర్ధన్ కు ఒక మళయాళీ అమ్మాయితో సంబంధం ఉందని తెలిసి దేవిక పుట్టింటి కి వెళ్ళిపోయింది.తండ్రి ఇద్దరికీ సయోధ్య కుదిరించి, గోవర్ధన్ ఆ మళయాళీ అమ్మాయిని వదిలేటట్టుగా చేసి కాపురం నిలబెడుతారు.ప్రస్తుతం ప్రతి రోజూ అంతదూరం ఉదయమే వెళ్ళిరావటం ఆ దంపతులు ఎదుర్కుంటున్న సమస్య తప్ప ఇంకేమీ లేదు.

విశ్వనాథం రెండో కూతురు స్వర్ణ.ఆమె భర్త లక్ష్మీకాంత్.ఇద్దరికీ ఏ విషయము లోనూ అభిప్రాయాలు కలవవు.ఐతే ఒకేఒక్క విషయం లో మాత్రం ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి.ఆ యిద్దరికీ ఓ మాన్సిక భయము ఉంది.అదే “ఫీనియా ఫోబియా”.అంటే డబ్బు ఖర్చు చేయటమంటే చాలా భయం.డబ్బు ఆదా చేసి తక్కువ ఖర్చు చేస్తూ ఉంటుంది.భార్య అడుగుజాడలల్లో నడుస్తూ ఉంటాడు లక్ష్మీ కాంత్.వారి ఇంటి ముందు బిచ్చాగాడు కూడా ఆగడు.లక్ష్మీకాంత్ ఓ రాష్ట్రప్రభుత్వ కార్యాలయం లో అప్పర్ డివిజన్ క్లర్క్ గా పని చేస్తున్నాడు.ఆఫీసు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరం లో ఉంది.డబ్బు ఖర్చని సైకిల్ కూడా కొనుక్కోకుండా, ఆఫీస్ కు నడిచి వెళ్ళి వస్తూ ఉంటాడు.

విశ్వనాథ్ మూడో కూతురు మమత.ఆమె భర్త విద్యాసాగర్.విశ్వనాథ్ కు ఆఖరి కూతురు మమత అంటే చాలా ప్రేమ. ఆమె కొరిని వన్నీ తీర్చాడు. కాని తను చెప్పిన బాంక్ మానేజర్ ను చేసుకోకుండా విద్యాసాగర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకోవటాన్ని సమ్మతించలేదు.అందువలన మమత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి , విద్యాసాగర్ ను పెళ్ళి చేసుకొని తండ్రికి దూరం అవుతుంది.మమత , విద్యాసాగర్ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు.సాంప్రదాయంగా వివాహం కాలేదు అన్న ఒక్క కొరత తప్ప ఇంకేమీ కొరత లేదు మమత జీవితం లో.

ఆ విధము గా సాఫీగా సాగిపోతున్న ఆ ముగ్గురు అక్కచెళ్ళళ్ళ జీవితము , విశ్వనాథ్ చనిపోతూ వ్రాసిన వీలునామా కల్లోలాన్ని రేపింది.కొందరి జీవితాన్ని శాసించింది.ఆ వీలునామాలో ఏముంది? ఆ కల్లోలం ఏమిటి? చివరకు ఏమి జరిగింది తెలుసుకోవాలంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిని “దబ్బెవరికి చేదు!”చదవాల్సిందే!

నవల ఆద్యంతమూ అసక్తిగా చదివిస్తుంది.ఇక రచయత శైలి గురించి కొత్తగా చెప్పేందుకు ఏముంది నవరస నవలా చక్రవర్తి మల్లాది వెంకటకృష్ణమూర్తి.

– మాలాకుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , Permalink

2 Responses to డబ్బెవరికి చేదు!(పుస్తక సమీక్ష ) – మాలాకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో