బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”భలేవాడివేనే! అమాంతంగా రూమ్‌ మార్చేస్తే ఎలాగనుకున్నావు? అసలు నా టెలిగ్రామ్‌ చూసుకుని స్టేషన్‌ కొస్తావనుకున్నాను. నువ్వు రాక పొయ్యేసరికి నాలుగు కడిగేద్దామని కోపంగా నీ రూమ్‌ కెళ్తే అక్కడ నువ్వు రూము ఖాళీ చేసావని చెప్పారు. ఏమి చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తుంటే నీ స్యూటర్‌ నా కళ్ళముందు నుండే దూసుకుపోరుంది.  వెంట తరుముకొచ్చాను.”

దాదాపు సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితుణ్ణి తిట్లతో పలకరించింది కృష్ణ. ఆమె నాన్నగారికి ఇప్పుడు విశాఖపట్ణణం ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది .

”నువ్వు వస్తావని నేనేమన్నా  కలగన్నానా? రూము మార్చిన విషయం నీకు వ్రాద్దామనుకుంటునే వున్నాను. నువ్వు గాలి దుమారంలా వచ్చావు” అని నవ్వి

”పాపం కష్టపడి నా వెంటబడి వచ్చావు. ఏమి కధ?” అన్నాడు.

”ఇలాగే నడి వీధిలో నిలబెట్టి  మాట్లాడతావా? గూడు నీడా ఏం లేదా నీకు?”
భానుమూర్తి నొచ్చుకున్నాడు.

”పొరపాటరుపోరుంది క్షమించు కృష్ణా!”
ఆమె పకపక నవ్వింది. ”ఒక్కమారు గుర్తు తెచ్చుకోభానూ, మన మొది పరిచయమైనప్పి నుంచి నిన్ను ఎన్నిమార్లు క్షమించానో..” అని ఇంకా నవ్వుతున్న స్నేహితురాలిని ఆపుతూ అన్నాడు భానుమూర్తి.

అవును మన పరిచయమే నేను నిన్ను క్షమించమని అడగడంతో మొదలరుంది. అసలు నువ్వు నన్ను క్షమించమని అడిగే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను” అని భానుమూర్తి కూడా నిష్కల్మషంగా నవ్వేసాడు.

”అసలు వస్తుందో రాదో” చిలిపిగా చూసిందామె. అలా చూస్తున్న ఆమెను తదేకంగా ఒక్కక్షణం చూసి ”రా వెనక ఎక్కు” అన్నాడు స్కూటరు మీద కూర్చుంటూ.

”అమ్మో! నాకు భయం బాబూ. నేను ఎక్కను.”

”నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు కూర్చో”. ఆమె బుద్ధిగా వచ్చి అతని వెనక కూర్చుంది. అతని దగ్గర ఎంత చిలిపితనం చేసినా అతను సీరియస్‌గా చూస్తే మటుకు మెత్తబడిపోతుంది కృష్ణ.

క్రొత్త రూముని కలియజూస్తూ వచ్చి కుర్చీలో కూర్చుంది కృష్ణ. భానుమూర్తి స్టౌ వెలిగించి దానిమిద కాఫీకి నీళ్ళు వేసి వచ్చి ఆమె ప్రక్కనే మరో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ”అలిసిపోరునట్టున్నావు. కాసేపు పడుకుంటావా ?”

” ‘ఆ ఆ’ ప్రయాణపు బడలిక అటుంచి నువ్వు దొరుకుతావో లేదో అనే టెన్షన్‌లో మటుకు నిజంగా అలిసిపోయాను” అంది.

”అయామ్‌ సారీ కృష్ణా ! నీకు నేను వ్రాసుండాల్సింది.”
కళ్ళతో నవ్వింది కృష్ణ. ”మరొక్కమారు క్షమించనా?” భానుమూర్తి కూడా నవ్వేసాడు. స్నానం చేసొచ్చి వేడి వేడి కాఫీ తాగి అలా బెడ్‌ మిద పడుకున్న కృష్ణ మరు నిముషంలో నిద్రాదేవి ఒడిలోకి నిశ్చింతగా ఒరిగిపోరుంది.

తెల్ల  దుస్తుల్లో చిత్రమైన దేహకాంతిలో నిర్మలంగా నిద్రపోతున్న స్నేహితురాలిని చూస్తూ అనుకున్నాడు మనసులో.
‘తనను వెతుక్కుంటూ హఠాత్తుగా వచ్చిన ఈ స్నేహితురాలిప్పుడు తనకు ఏమి అందమైన కబురు చెప్తుందో !’

రెండు గంటల తర్వాత నిద్రలేచిన కృష్ణ అలాగే కుర్చీలో కూర్చొనున్న భానుమూర్తిని చూస్తూ అంది.

”ఇంకా నువ్వు అలా కూర్చునే వున్నావా?”

”నీ కొఱకు చూస్తున్నానులే. భోం చేద్దాం. ఆకలేస్తోంది.”

భానుమూర్తి లేచి టేబిల్‌ మిద అన్నీ సర్దసాగాడు. అలా సర్దుతున్న అతనిని చూస్తూ అంది కృష్ణ.

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Comments are closed.