ఉగాది పరిమళం(తొలి కథ) – వనజ

10702066_524653801002848_7852801715068025185_nతలంటు గిన్నెలో నూనెవేసుకొని ఇంట్లో తిరుగుతూ ఒరేయ్!చిన్నా రారా !పండుగ నాడు ఇలా చేస్తే మంచిదిరా .నా మాట వినరా !నాకు చాలా పనుంది రారా ! విసిగించకు రా బాబు !నాలో ఓపిక నశిస్తోంది !అంటూ ఆయాసంతో రొప్పుతూ మా చిన్నాడు ట్వింకి వెంట తిరుగుతున్నాను . వాడికి నాలుగేళ్ళు .వాడేమో బెడ్ రూమ్ లోనుంచి హాల్లోకి ,హాల్లో నుంచి డైనింగ్ రూమ్ లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ చూట్టూ వాడు తిరిగి నన్ను తిప్పుకొంటూ…
” ఛి!యాక్ ఆయిల్ వద్దు మమ్మీ!” అంటూ ఇల్లంతా తిరుగుతూవున్నాడు.
నాకు విసుగొచ్చి దాని కన్నా ముందు నీరసం వచ్చి హాల్లోకి వున్నగుమ్మం దగ్గర గోడ నానుకొని నిలబడి చూస్తున్నా !
మా గందర గోళానికి మా వారికి మెలుకువ వచ్చినట్టుంది . మా వారు వెనుక నుంచి రెండు చేతులు నా మెడ చుట్టూ వేసి,
“ఏంటి మేడం గారూ ! రోజూ ఈ టైంకి నైటీకి పిండి , పసుపు వగైరా వంటివి రాసుకొని వంటిట్లో యజ్ఞం చేసేదానిలా వుండేదానివి !ఈ రోజు ఇలా” అంటూ తన కనుబొమ్మలు రెండు ఎగరేస్తూ నా వైపు చూస్తున్నారు .
అంటే అప్పటికే నేను లేచి పూజకి అన్ని సిద్ధం చేసుకొని తలస్నాం చేసి కొత్త చీరకట్టుకొని కాళ్ళకు ,ముఖానికి పసుపురాసుకొని ,బొట్టుపెట్టుకొని ,చీరకు మేచింగ్ గాజులు వేసుకొని తయారయ్యి ఉన్నాను. అది మావారి ఆశ్చర్యం. నేను ఆయనలో వున్న సరసాన్ని పట్టించుకోకుండా కోపంగా గుమ్మానికి కట్టిన మామిడి తోరాణలవైపు చూసాను .
దానితో మావారికి గుర్తొచ్చినట్టుంది ఆ రోజు ఉగాది అని .వెంటనే ఒక్క ఉదుటున ట్వింకి దగ్గరకు వెళ్లి,
” ట్వింకీలు ! చూడు నాన్న,ఈ రోజు అమ్మ చెప్పినట్టు తలంటు పోసుకోవాలి నాన్నా. నడువు నేను చేయిస్తా అంటూ నా చేతిలోని గిన్నె తీసుకొని ఇద్దరు బాత్రూం వైపు నడిచారు .
“ఎందుకు డాడీ ! ఈ రోజు ఏమైనా స్పెషలా” అడిగాడు ట్వింకి .
“అవును నాన్నలు ఈ రోజు ఉగాది”.
ఓహో !అన్నాడు మావాడికేదో అర్ధమైనట్టు .
మరి నువ్వు చిన్నప్పుడు యీలాగేచేసేవాడివా ?అడిగాడు ట్వింకి వాళ్ళ డాడీని .
ఇలాగేంట్రా ఇంకా బ్రహ్మoడంగా …. తన బాల్యమంతా కళ్ళముందు కదలినట్లు మావారు తన చిన్ననాటి ఉగాది పండుగ విషయాలన్ని కొడుకుతో చెబుతున్నారు .
ముందు రోజే మా స్నేహితులతో తోటలోకి వెళ్లి మామిడి ఆకులు(ఒక పెద్ద రొట్ట)అనే చెప్పాలి . మామిడి ఆకుల్ని ,కాయల్ని ,వేపపువ్వును తెచ్చి నాన్నమ్మకు ఇచ్చేవాడ్ని. నాన్నమ్మ మామిడి ఆకుల్ని గుమ్మాలకు కట్టించి వేపపువ్వుని శుభ్రంచేసుకొని ,ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్ని తాతయ్యతో తెప్పించి సిద్ధం చేసుకొనేది .
తెల్లవారు ఝామునే లేచి పొయ్యి మీద నీళ్ళు పెట్టి మమ్మల్ల్ని స్నానానికి పిలచేది . ఒక పక్క అత్తేమో కుంకుళ్ళుకొట్టి ఒక చెంబులో వేడి నీళ్ళు పోసి దానిలో కుంకుడు కాయల్ని నానబెట్టి వుంచేది . నేనేమో మా బావి చూట్టు తిరుగుతూ పారిపోయేవాణ్ని . ఎలాగోలా పట్టుకొని పీట మీద కూర్చోబెట్టి ,నువ్వులనూనె ఒంటికి పట్టించి కుంకుడు రసం తో స్నానం చేయించేది . పులుసు కళ్ళలో పడుతుందని తన కాలు నా దగ్గరకు పెట్టి కళ్ళు మూసుకోమనేది నాన్నమ్మ . అత్త పులుసు పోస్తుంటే నాన్నమ్మ నాకు తల రుద్దేది .
మద్యలో మా వాడు “కుంకుడు పులుసు అంటే ఏంటి డాడీ’ అని అడిగాడు .
అది అప్పటి షాంపు అనుకో అని మాటల్లో పెట్టి ఎలాగైతే ట్వింకీ కి వాళ్ళ నాన్నా స్నానం చేయించారు .
ఇంతలో మా కాలింగ్ బెల్ మోగింది .
డోర్ తీసే వుంది రామ్మా అంటూ వంటగదిలోంచి కేక వేసాను . అయితే అప్పటికే మా ఆయన తలుపు తీసి నిశ్చేష్టులయ్యారు.
ఎదరుగా బ్లాక్ వెల్వేట్ క్లాత్ తో ,రెడ్ క్లాత్ మోచేతుల వరకు వున్న లాంగ్ ఫ్రాక్ లో మా అమ్మాయి పింకీ .
దానికి ఇందాకే స్నానం చేయించి రెడీ చేసాను .వాచ్ మేన్ దగ్గరకు వెళ్లి కింద కుండీల్లో వున్న పువ్వుల్ని ,అపార్టుమెంటు గోడకి ఆనుకొని వున్న పసుపు పూల మొక్కనుంచి పువ్వుల్ని తీసుకురమ్మని పంపాను . ఇంకా మంచం మీదే పడుకుంది అనుకున్న తన గారాల పట్టి తన ఆరేళ్ళ కూతురు పింకీ ఎదురుగ ప్రత్యక్షమయ్యే సరికి అవాక్కయ్యారు .
రా బంగారం అంటూ తన చేతిలోని పూల కవర్ని అందుకున్నారు .
సరే అయితే అందరం రెడీ అయ్యాం కాబట్టి ఉగాది పచ్చడి చేద్దాం రండి అంటూ సంసిద్ధులయ్యారు . ఎప్పుడు ఉగాది పచ్చడి మావారి డ్యూటీ నే షడ్రుచులు తెలిసేటట్లు చాల అమోఘంగా చేస్తారు .
ముందు రోజే మార్కెట్ నుంచి వేప పువ్వు ని , మామిడి కాయల్ని ,కొబ్బరి కాయని కొనుక్కొచ్చారు . కొబ్బరి ,మామిడి కాయల్ని ముక్కలు తరగటానికి గోవిందమ్మ ఇంకా రాలేదా? అని అడిగారు మా వారు .
కింద ఫ్లాట్ లో భార్గవి గారికి పింకీ పట్టు పరికిణి కుట్టడానికి ఇచ్చాను .ఇప్పుడు ఫోన్ చేస్తే అయింది రమ్మన్నారు . వెళ్లి తీసుకు రమ్మని పంపించాను . అంటూ చెప్తుండగానే గోవిందమ్మ రానే వచ్చింది . రాగానే లంగా జాకెట్ ని పింకీ కి కట్ట బెట్టింది .లంగా జాకెట్ లో బుట్ట బొమ్మలా చక్కగా వుంది పింకీ . ఈ లోపు పచ్చడి సిద్ధం అయ్యిది .
వైఫై ఆన్ చేసినట్టున్నారు వాట్సప్ మెస్సేజ్ లు వస్తూనే వున్నాయి .
మా వాడు ఉగాది పచ్చడ్నిఫోటో తియ్యడానికి ఫోన్ తీసుకొచ్చాడు .
మా కొలీగ్స్ ఫోన్ లో ఉగాది శుభాకాంక్షలు పంపించారు .
ఫోన్ అందుకొని మేస్సేజ్ చూసి పగలబడి నవ్వుతుంది పింకీ .
అంతలా నవ్వుతున్నావు ఏంటి తల్లి అంటే న్యూఇయర్ అయిపోయింది కదా మమ్మీ. ఈ ఆంటీ ఎవరో ఇప్పుడు హ్యాపీన్యూఇయర్ అని మెసేజ్ పంపించింది. అని చెప్పింది పింకి.
ఉగాది అంటే తెలుగు న్యూఇయర్ తల్లీ ! ఇది మన తెలుగు సంవత్సరాది మన తెలుగు వారి అందరికి కూడా ఈరోజు నుంచే సంవత్సరం ప్రారంభమౌతుంది. యుగానికి ఆరంభం కాబట్టి ఉగాది అంటారు. 12 నెలలలో ఆరు ఋతువులు ఉంటాయి. జీవితంలో నవ్వు,ఏడుపులు అన్నివుంటాయి కనుక ఆరు రుచులు కలిపి ఉగాది పచ్చడిని చేసుకుంటారు. అంటే పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్లే జీవితంలో కష్ట సుఖాలు వుంటాయి అని తెలుపుతుంది.అందుకే ఈరోజు ఆనందంగా పండుగ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.అని చెప్పాను.
” ఓహో ! అలాగా మమ్మీ అయితే మనం అందరికి శుభాకాంక్షలు చెప్పి ,ఉగాది పచ్చడి తిందాం అన్నారు” మా పిల్లలిద్దరు ముక్తకంఠంతో.
ugadiనేను పూజ గదిలోకి వెళ్లి పూజ చేస్తూ ఆలోచనలో పడ్డాను .నా చిన్నతనంలో పండుగలు ,పూజలు, అంటే ఎంతో హడావిడి. మాన్నాన్నకి ముగ్గురు చెల్లెళ్ళు అందరూ పండక్కి మా యింటికి వచ్చేవారు వాళ్ళు రావడమే పండగలా వుండేది.పండగరోజు ఉదయాన్నే అమ్మ ,అత్తయ్యలు చేసే హడావిడి మొదట స్నానాలనుంచి ప్రారంభమై పూజలు ,నైవేద్యాలు,పిండివంటలతో చాల సందడిగా వుండేది. పిల్లలమంతా ఆటపాటలతో చాలా ఆనందంగా వుండేవాళ్ళం ఇప్పుడు ఏదో మొక్కుబడిగా అయ్యింది అనుకుంటూ పరద్యానంగా వుండగా ఏంటమ్మా అలా నుంచునే వున్నావు, అన్నమాచిన్నోడి పిలుపుకు ఈలోకంలోకి వచ్చి పూజకానిచ్చాను .
నేను ఫోన్ తీసుకొని అందరికి మెసేజ్ పెట్టాను.
“అందరికి శ్రీ దుర్ముఖి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు”

– వనజ మల్లిపూడి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, తొలి కథ, , , , , , Permalink

6 Responses to ఉగాది పరిమళం(తొలి కథ) – వనజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో