
యలమర్తి అనూరాధ
కొత్త సంవత్సరం
కోరికల విహంగాలను విప్పుకుంటూ
ఉగాదిగా ప్రత్యక్షమయ్యే తరుణం
ఆహ్వానిద్దాం ఆనందంగా
నీ నా బేధాలను మరిచి
నిలబడదాం సంతోషంగా
స్వార్ధాన్ని విడిచి
అందరం ఒకటే అని నినదిద్దాం
విరబూసిన వేపపూతలా
స్వచ్చంగా పలకరించుకుందాం
షడ్రుచుల సమ్మేళనం జీవితం
పంచుకుందాం తోటివారితో కలిసి మెలిసి
విభేదాలను ప్రక్కన పెట్టి
మానవత్వం తోడుగా పయనిద్దాం
చేయీ చేయీ కలిపి
నూతన సంవత్సరానికి
స్వాగతం పలుకుదాం !
– యలమర్తి అనురాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
2 Responses to ఉగాదికి స్వాగతం !(కవిత )- యలమర్తి అనురాధ