తెలుగులో తొలి మహిళా ఆత్మకథ – డా.శిరీష ఈడ్పుగంటి

వ్యాస ఉద్దేశ్యం

తొలి తెలుగు మహిళా ఆత్మకథ ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము రచనలోని విశేషాంశాలను ప్రస్తుత వ్యాసంలో చర్చించడం జరిగింది.

స్వీయచరిత్ర

ఆంగ్ల సాహిత్య ప్రభావం వన తెలుగులోకి వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో స్వీయ చరిత్ర ఒకటి. స్వీయచరిత్ర అంటే ఆత్మకథనం. ఒక వ్యక్తి తన జీవితం గూర్చి తానే రాసుకున్న దాన్ని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటాం. స్వయంగా రాసుకున్న చరిత్ర. ఎవరైనా సరే వారివారి జీవితాలో జరిగిన అనుభవాలను, సంఘటనల ను తెలుపుతూ, వారి జ్ఞాపకాల ను భావితరాల కు అందించడానికి చేసే ప్రయత్నమే స్వీయచరిత్ర. ఆటోబయోగ్రఫీ అనే ఆంగ్లపదానికి సమానపదంగా తెలుగులో స్వీయచరిత్ర అని వాడుతున్నాం.

తొలి తెలుగు మహిళల  ఆత్మకథ

aatmacaritamu00011-192x300భారతీయ భాషలో స్త్రీలు స్వీయచరిత్రలు రాయడం సుమారుగా పంతొమ్మిదో శతాబ్దపు మధ్యభాగం నుండి మొదలైంది. తెలుగులో స్త్రీల స్వీయచరిత్రలు అరుదుగానే కనిపిస్తాయి. తెలుగులో వచ్చిన స్త్రీల స్వీయచరిత్రలో మొట్టమొదటిది ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము. ఇది 1934లో మొదటి ముద్రణ వచ్చింది. ఇదే తొలి తెలుగు మహిళా ఆత్మకథ. అంతేగాకుండా ‘‘ఆధునిక స్వీయచరిత్ర తెలుగులో వీరేశలింగం రాసిన రెండు సంపుటాలతో (1911లో మొదటిసంపుటం, 1915లో రెండవది) ప్రారంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. 1915 – 1946 మధ్య స్వీయచరిత్రలు రాసి ప్రచురించినవారు ప్రధానంగా అయిదుగురే ఉన్నారు. అందు వల్ల సత్యవతిగారి ఆత్మచరితముకు తెలుగు లో వచ్చిన తొలి స్వీయచరిత్రల్లో కూడా స్థానం వుంది. (సత్యవతి, ఏడిదము. 1934 :7,8)

మనిషి జీవితం కంటే ఆసక్తికరమైన అంశం మరొకటి ఉండదు. ప్రతిఒక్కరూ వారివారి జీవితాలో వివిధరకాల సమస్యల ను ఎదుర్కొంటుంటారు. వాటికి ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. ఇదేవిధంగా సత్యవతిగారు కూడా వారి కా లం లో (1934 ) జరిగిన సాంఘిక దురాచారాలకు స్పందించి ఈ రచన చేశారు. (శిరోముండనాది పరాభవము – భర్త చనిపోయిన ఆడవాళ్ళకు గుండు చేయించడం మొదలైనవి)

రచయిత్రి (సత్యవతి) :

ఈమె సున్నిత మనస్కురాలు . సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు ఎంతగానో బాధపడేవారు. మనసులో ఉన్న ఈ బాధంతా ఆత్మకథ రూపంలో వెలు వరించారని ఈ రచనను బట్టి తెలుస్తుంది. ఇదే విషయం సత్యవతిగారు కూడా ఈ రచనలోని ‘తొలిపలుకు’ లో ప్రస్తావించారు. సంఘంలో స్త్రీల కు జరుగుతున్న దురాచారాల ను నిర్మూలించుటకై ఈ రచన చేసినట్లు పేర్కొన్నారు. ఈమె తన జీవిత విశేషాలను ఆత్మకథగా రాయాని ఈ రచన చేయడం మొదలు పెట్టలేదు. కేవలం ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాలను నిర్మూలించాలని రచన చేశారు.

అంతేగాకుండా సత్యవతిగారి పుట్టుక, వివాహం మొదలైన సంఘటన తేదీలు గాని, సమయాలు గాని ఈ రచనలో ఎక్కడా కనిపించవు. ఈమె వీటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. కేవలం ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ను మాత్రమే ఈ రచనలో పేర్కొన్నారు. ఈ రచనంతా కూడా ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాల ను రూపుమాపుటయే ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తుంది.

రచన -విశేషాంశాలు-వర్ణనలు

ఈ రచనలోని వర్ణనలు , పాత్రలు , సంభాష ణలు మొదలైనవన్నీ నవల ను తపించేవిధంగా ఉన్నాయి. ఆమె బాల్యం నందు జరిగిన కొన్ని సంఘటనల ను వర్ణించిన తీరు పాఠకులకు ఆసక్తిని కలిగించేవిధంగా ఉంది. దీనికి గల కారణం ఒకటి ఆమెకు చిన్ననాటి నుండి పుస్తక పఠనం అల వాటు ఉంది. మరొకటి బాల్యం లో సీత, సావిత్రి, చంద్రమతి … వంటి పతివ్రత కథలను చదువుటలో ఎక్కువ ఉత్సాహo చూపించటం కావచ్చు. ఉదాహరణకు దేవాలయ దర్శనం, శైశవం మందు శపథం మొదలైన ఘట్టాల వర్ణన. ‘‘యుద్యానవనములో మాలతి, మందారము, పారిజాతము మున్నగు రకముల పూచెట్లు చక్కగా పుష్పించి, తమ పరిమళమును మందమారుతమున కందజేయుచున్నవి. ఆ వనములో నొక పొదరింటి దరిని యువకుడాగి, కూర్చుండి, నన్ను కూడ గూర్చుండ నియమించెను. నేనా వన సౌందర్యమును జూచుచు ఆనందమున మునిగితిని’’. (సత్యవతి, ఏడిదము. 1934 : 28, 29)

సంభాషణలు

సత్యవతిగారి బాల్యం లో జరిగిన కొన్ని సంఘటనలోని సంభాషణలు చదువుతుంటే ఒకవిధమైన కుతూహలం కలుగుతుంది. సత్యవతిగారికి ఆమె భర్త సీతారామయ్యగారికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఈ రచనలో పేర్కొన్నారు. వారిరువురు బాల్యం లో మొట్టమొదటసారి కలిసినపుడు జరిగిన సంభాషణలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయి.
ఉదాహరణకు ‘‘ యువ- నీ పేరు?
నేను -సత్యవతి
యువ – ఏమి చదువుకొనుచున్నావు?
నేను – నాల్గవ తరగతి
యువ -నీకు సంగీతము వచ్చునా?
నేను -రాదు ’’ (సత్యవతి, ఏడిదము. 1934 : 29) ఈవిధంగా వారిరువురి మధ్య సంభాషణ జరుగుతుంది.
వివాహం ఈ రచనలో (1934కు ముందు) ఒకరకమైన వివాహపద్ధతి కనిపిస్తుంది. రచయిత్రి మాటలో చెప్పాంటే ‘‘ నా జననీజనకులు నాయొద్ద బంధువుల కుమారుల లో కొందరి పేరులు చెప్పి వీరిలో నెవరిని పెండ్లి చేసుకొందువని నన్నడిగినారు. మీ యిష్టమంటిని. తల్లీ! నీ యిష్టమైన వారిని తెలుపుమని బ్రతిమాలిరి. వారడిగిన పేరులో నా మనోహరుని పేరు గూడ నుండెను. కావున నేనాతని బేర్కొంటిని. చివరకు మా కోరిక ప్రకారమే సంబంధము కుదిరినది.’’ (సత్యవతి, ఏడిదము. 1934 : 32) అని ఈ రచనలో తెలిపారు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుచేసుకోవచ్చు. ఒకప్పుడు రాజు కాలంలో స్వయంవరాలుం డేవి. సీత, దమయంతి… మొదలైన వారికి స్వయంవరాలు జరిగాయి. వీటన్నింటి గూర్చి రచయిత్రి బాల్యం లోనే ఎన్నో గ్రంథాల లో చదివారు. ఇది ఒకరకమైన వివాహపద్ధతి. నేటి కాలం లో పెళ్లిచూపులు , అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోవడం, ఫోటోలు చూసి పెళ్లిళ్ళు కుదుర్చుకోవడం, ఫేస్‌బుక్‌ ద్వారా, బంధువులు , మ్యారేజ్‌ బ్యూరోల ద్వారా, బ్రోకర్ల ద్వారా, మొదలైన వివిధ పద్ధతు ద్వారా వివాహాలు జరుగుతున్నాయి. ` ఇది నేటి కాలం .
రచయిత్రి కాలం లో అంటే 1934 కు ముందు బంధువులలో పెళ్ళికాని కొంతమంది అబ్బాయిల పేర్లు చెప్పి వారిలోంచి ఒక పేరును ఎంచుకోమనడం కనిపిస్తుంది. ` ఇది మరొక రకమైన పద్ధతి.

నిరుద్యోగ సమస్య

సత్యవతిగారి భర్త సీతారామయ్యగారికి బి.ఏ. పాసైన చాలాకాలం వరకు ఉద్యోగం దొరకలేదు. ఆ రోజుల లోను, ప్రస్తుత రోజులలోను నిరుద్యోగ సమస్య కనిపిస్తూనే ఉంది. కొంతకాలం తర్వాత సీతారామయ్యగారికి పోలీస్‌శాఖలో ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో ఆయనకు పై అధికారుల నుండి ఎదురయిన కష్టనష్టాల ను గూర్చి సత్యవతిగారు రచనలో పేర్కొంటారు. పోలీసు వ్యవస్థ ఏవిధంగా ఉన్నదీ, అధికారులు ఏవిధంగా కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారో వివరించారు.

ప్రతివ్రత ప్రభావం

సీత, సావిత్రి, దమయంతి వంటి పతివ్రతల ప్రభావం రచయిత్రి పై కనిపిస్తుంది. పతివ్రతల లక్షణాను రచయిత్రి పాటించాలనుకుంటుంది. దానికి నిదర్శనమే ఈ ఘట్టం. సత్యవతిగారి భర్త సీతారామయ్యగారు బమినిగాం మన్యప్రదేశానికి ఉద్యోగ నిమిత్తం ఒక్కరే వెళతారు. ఆ సమయంలో సత్యవతిగారిని పుట్టింట్లో వదిలి వెళతారు. అప్పుడు ఆమె మనసు భర్త గూర్చి పరి విధాలు గా పరితపిస్తుంది. భర్తకు వంట చేసుకోవడం రాదు. ఒంటరిగా ఏమి కష్టాలు పడుతున్నారో అని మదనపడుతుంది. సీతాదేవి రామునితో వనవాసం వెళ్ళి అక్కడ కష్టాలలో పాలు పంచుకున్నట్లుగా భర్త పడుతున్న కష్టాలో తాను కూడా పాలు పంచుకోవానుకుంటుంది. బాల్యం లో చదివిన పుస్తక పఠన ప్రభావం సత్యవతిగారి పై ఇక్కడ కనిపిస్తుంది. ‘‘లోకమున భర్తతో పాటు భార్య కూడ కష్టసుఖముయందు పాల్గొనుట సతీధర్మము. కాని సుఖముగ నున్నప్పుడు భర్తను గౌరవించుటయు, కష్టకాలమున విడనాడుటయు ధర్మము కాదు. సర్వదా భర్తృ సహచరీత్వమే భారతనారీమణులకు పరమధర్మమని నా ఆశయము’’. (సత్యవతి, ఏడిదము. 1934 : 35)

వివాహానంతరం భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు

సత్యవతిగారిని భర్త దగ్గరకు పంపేటప్పుడు తోడుగా ఒక ముసలావిడను కూడా పంపుతారు. అక్కడ ఇంటిపనులో సత్యవతిగారికి సహాయంగా ఉంటుందని పంపుతారు. ‘‘ మా బంధువులో నొక ముసలమ్మను నాతో పంపవలెనని తచి, మా నాయనగారు నన్ను, మాఅమ్మను, మాతాతగారి గ్రామమగు నిందుపల్లికిం బంపిరి.’’ (సత్యవతి, ఏడిదము. 1934 : 36) ఈ ఘట్టం చూస్తే ఒకప్పుడు రాజు కాంలో వివాహానంతరం రాణి కూడా ఒకరిద్దరు చెలికత్తెలో రాజ్యానికి వచ్చేవారు. వారు రాణిగారికి సపర్యలు , రాణిగారి యొక్క సొంతపనులు చేసేవారు. పై ఘట్టం ఈ సంప్రదాయాన్ని తలపిస్తుంది.

భర్త దగ్గరకు వెళ్ళే ప్రయాణం

ఈమె భర్త దగ్గరకు వెళ్ళే ప్రయాణం తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయాణాన్ని తపిస్తుంది. ఆ రోజులలోని ప్రయాణాలు , వారికి ఎదురయిన ఇబ్బందులను తదితర విషయాన్నింటిని ఇందులో వివరిస్తారు.

భర్త చనిపోయినప్పుడు :

ఈ రచనలో మరొక ఘట్టం భర్త చనిపోయినపుడు సత్యవతిగారి మనసు ఏవిధంగా తల్లడిల్లిందో తెలియజేస్తుంది. ఆమెలోని మనోవ్యధ ఆమె మాటలో ‘‘ యీ దీనురాలిని కరుణింపవా? అయ్యో ! ఆనాడు సావిత్రికి యముడు దర్శనమిచ్చి భర్తను పునర్జీవితుని జేయలేదా? నీ కాపాటి చేతకాదా? తండ్రీ ! నాకే దైవమును కనుపడని కారణమేమీ? బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా ! మీరనేకమంది పతివ్రతల దీనాలాపము నాకించి వారిని రక్షించితి మని గ్రంథము వ్రాయించుకొంటిరే! నన్నేల రక్షింపరాదు. నా జీవితేశ్వరుని జీవము నివ్వలేరా?’’ (సత్యవతి, ఏడిదము. 1934 : 47) అని రచనలో కనిపిస్తుంది. సావిత్రికి యముడు దర్శనమిచ్చి భర్త ప్రాణాలు కాపాడినట్లుగా తన భర్త ప్రాణాలు కాపాడమని భగవంతునితో మొరపెట్టుకుంటుంది. ఎంతోమంది సాధ్వీమణుల వృత్తాంతాను బాల్యంలో చదువుట కారణంగా వారి ప్రభావం సత్యవతిగారి పై కనిపిస్తుంది.

సతీసహగమనం
దీన్ని ఒక ఆచారంగా రచనలో పేర్కొన్నారు. భర్త చనిపోయినపుడు భర్త ఎడబాటు తట్టుకోలేని స్త్రీ సతీసహగమనం చేయడం మేలని, ఈమె కూడా సతీసహగమనాన్ని కోరుకుంది.

హేతువాదం
భగవంతుని పై మొట్టమొదట్లో నమ్మకం ఉండేది. తర్వాత ఆమెలో హేతువాది కనిపిస్తుంది.

హరికథకు అజ్ఞానం
‘కొంతమంది హరికథకు కథ చెప్పడానికి ముందు గణపతి ప్రార్ధన చేసి తరువాత స్త్రీ నిందలు చేస్తారు. కలియుగంలో పతివ్రతలు లేరని వీరి అభిప్రాయం. స్త్రీనే గాని పురుషులను నిందించరు’. వీటన్నింటిని సత్యవతిగారు ఖండించారు.

అనాథకే అవస్థలా?
భర్త పోయిన ఆడవాళ్ళపట్ల చేయు విపరీత చర్యలను ఖండిoచారు. ‘‘భర్త పోయిన వెంటనే, కేశఖండనము సేయించుట, సైనుగుడ్డ కట్టించి ముసుగు వేసి మూల ను కూర్చుండబెట్టుట, రాత్రుయందు తిండిని మాన్పించి పిండియో రొట్టెయో పెట్టుట’’. అన్నింటి కంటే ముఖ్యమైనది. ‘‘శిరోముండనము చేయించుటయంత అక్రమమైన పని వేరొకటిలేదు. ఏల యన, స్త్రీకు పరపురుష స్పర్శము నిషిద్ధము కదా! అట్టి యెడ నందరును చేరి, యిది భర్తృ వియోగ దు:ఖమున హృదయము పగిలి యేడ్చుచుండ, పైగా, దీన్ని మంగలివాని కప్పగించుటెంత విరుద్ధము. వాడు పరపురుషుడు కాదా? వానిని స్పృశించుటెంతయు అపసవ్యము కాదా? ఇంకను ప్రాణాపాయము కలిగిన నితరులని ముట్టుకొనిన దోషము కాదు కాని విధవలూరక పరపురుషుని ముట్టుకొనుట మరింత దోషము కాదా? లేక యీ శిరోజము తీసివైచిన పునర్భవము కాకుండునా?… (సత్యవతి, ఏడిదము. 1934 : 53) మొదలైన విషయాలను ప్రశ్నిస్తూ, భర్త పోయిన ఆడవాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు.

మరికొన్ని అంశాలు

బాల్య వివాహాలు , పునర్వివాహాలు , దాంపత్య ధర్మాలు మొదలైన విషయాలను ఈ రచనలో చర్చించారు. తల్లిదండ్రుల కు అన్నం పెట్టని పిల్లలు వారు చనిపోయిన తరువాత తమను ఇతరులు మంచివారను కొనవలెను శ్రాద్ధంనాడు రకరకాల వంటలు చేస్తారు. తదితర అంశాల న్నింటి గూర్చి ఈ రచనలో సత్యవతిగారు ప్రస్తావించారు.
సత్యవతిగారు ఆ రోజులో జరిగే దుశ్చర్యలు చూసి చలించిపోయి వాటన్నింటిని స్వవిషయాల తో పాటుగా ఆత్మకథ రూపంలో రాసి ఉండొచ్చు. అంతేగాకుండా ఈ రచనలో సత్యవతిగారి బాల్యం , వివాహం, సంసారం, కొంతకాలమ్ తర్వాత భర్త మరణం, దాంతో సత్యవతిగారు తిరిగి పుట్టింటికి చేరడం మొదలైన సంఘటనలు కనిపిస్తాయి. తదుపరి జీవితం అంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవితం గూర్చి గాని దానికి సంబంధించిన సంఘటను గూర్చి గాని ఈ రచనలో కనిపించవు. దీనికి కారణం భర్త చనిపోయేంత వరకు మాత్రమే ఆమె జీవితం అనుకుంది. ఆ తరువాత తాను జీవించియున్నా అంటే శరీరం బతికి ఉన్నప్పటికీ తాను చనిపోయినట్లే అనుకుంది. తరువాత ఆమెకు జీవితం లేదనే భావన కలిగి ఉంది. భర్త చావుతోనే తన జీవితం కూడా ముగిసిపోయిందని భావించింది. అందుకే అంతవరకు మాత్రమే ఆమె జీవితంలో జరిగిన సంఘటను, మంచిచెడు గూర్చి ఆత్మకథలో రాశారు. ఆ తర్వాత విషయాలేమి ఆమె ఈ రచనలో పేర్కొనలేదు.

ఉపయుక్త గ్రంథసూచి
సత్యవతి, ఏడిదము. 1934. ఆత్మచరితము. (సంపా. వకుళాభరణం రాజగోపాల్‌) అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌. సికిందరాబాద్‌.

-శిరీష ఈడ్పుగంటి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.