సహ జీవనం -6 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

నెల తిరక్కుండానే టికెట్లు బుక్ చేసి చెప్పాడు సుభాష్. నిజానికి సుబ్రహ్మణ్యానికి, అతని భార్యకు అమెరికా మళ్ళీ వెళ్ళడం అసలు ఇష్టం లేదు. ఇక్కడ ఊళ్ళో మల్లే, అక్కడ మాట్లాడేందుకు మనుషులు వుండరు. ఎక్కడకు వెళ్ళాలన్నా వంటరిగా వెళ్ళలేరు. కొడుకు, కోడలు తీసుకు వెళ్ళాల్సిందే. కానీ, కొడుకు ఎక్కడ బాధ పడతాడో అనీ, అవసరానికి వాళ్లకు అండగా ఉండక పోతే ఎలా అని సుబ్రహ్మణ్యం భార్యను ఒప్పించి, ఇద్దరూ బయల్దేరారు.

వచ్చిన కొత్తలో మంచీ మర్యాదలు బాగానే ఉన్నాయి. వారం గడిచేసరికి మళ్ళీ మామూలే! అసలే వంటరితనం,ఆ పైన కోడలి చిరాకులు, పరాకులు ప్రతి రోజు బాధ కలిగిస్తూనే వున్నా, రత్నం మౌనంగా భరిస్తూనే వుంది. శారీరక శ్రమతో పాటు, మానసిక బాధ తోడై నాల్గు నెలలు గడిచేసరికి రత్నంకు అనారోగ్యం మొదలైంది. కొడుకు ఎలాగో తీరిక చేసుకుని రెండు సార్లు హాస్పిటల్లో చూపించినా, తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగ బెట్టింది. డాక్టర్లు లంగ్సులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందనడం తప్ప, పెద్దగా కారణం చెప్పలేక పోయారు. జబ్బేమిటో అర్ధం కాకపోవడం, తరచు అనారోగ్యం పాలవతుండడంతో, సుబ్రహ్మణ్యం తిరిగి ఇండియాకు వెళ్ళిపోవాలని నిర్ణ యించాడు. సుభాష్ మొదట వద్దన్నాడు. తల్లిని ఇక్కడే ఉంచి మరికొంత కాలం వైద్యం చేయిద్దాం అన్నాడు. అక్కడ ఇండియాలో ఇంతకంటే మంచి డాక్టర్లు ఉండరని వాదించాడు. కానీ ఆ మర్నాడు తనకై తానే ,తల్లి ఆరోగ్యం ఇండియాలో బాగుపడుతుందంటే, మీరు వెళ్ళడం మంచిదనుకుంటే టికెట్లు బుక్ చేస్తానని చెప్పాడు. బహుశా భార్య భర్తలు ఆలోచించుకుని ఉండవచ్చు. ఇద్దరూ ఉద్యోగాలకు వెడితే ఇక్కడ రత్నంకు ఆడ తోడు ఎవరుంటారు ? కోడుకైనా ఎన్నాళ్ళు సెలవులు పెట్టిహాస్పిటల్ చుట్టూ తిరుగ గలడు? సుభాష్ చివరకు తండ్రి చెప్పినట్లే, ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చేసి ఇండియాకు పంపించేశాడు.

రాగానే, సుబ్రహ్మణ్యం ఆమెను తనకు తెలిసిన మంచి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాడు. డాక్టరు మళ్ళీ పరీక్షలు అన్నీ చేసి, అంతా బాగానే ఉన్నదనీ, బహుశా ఆమె మానసికంగా బాధ పడుతోందేమో అని ఉద్దేశ పడ్డాడు. పరిసరాలు మారితే ఆమె కోలుకోవచ్చని చెప్పాడు. కొద్ది రోజులు ఆమెను ప్రశాంత వాతావరణం వున్న వూరికి తీసుకెళ్ళమన్నాడు.

కొన్నాళ్ళు తమ ఊరు వెళ్లి ఉంటే ప్రశాంతంగా ఉండవచ్చు అన్న ఆలోచనతో తను పుట్టి పెరిగిన ఊరు ఓగిరాల తీసుకెళ్ళాడు ఆమెను. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తరచూ పలకరించి మాట్లాడుతూ వుండడం, పాత స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో వచ్చి, పాత సంగతులు గుర్తు చేసుకోవడం ఇవన్నీ రత్నం బెంగ కొంత తగ్గించాయి. ఒక నెల రోజులు అక్కడ తమ సొంత ఇంట్లో వుండేసరికి రత్నం ఆరోగ్యం కాస్త బాగుపడింది.నిజానికి ఆ ఊరు వదిలి హైదరాబాదు వెళ్ళడం రత్నంకు ఇష్టం లేదు. కానీ, ఎప్పుడో అక్కడ స్థిరపడిపోయి ఇల్లు వాకిలి అమర్చుకున్న పరిస్థితిలో, సిటి వదిలి పల్లెటూరులో వుండడం సుబ్రహ్మణ్యంకు ఇష్టం లేక పోయింది. అదీగాక, సిటీలో వున్న వైద్య వసతి మరెక్కడా లేదు. రత్నం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాదు వెళ్ళడమే ఉత్తమం. అందువల్ల, అతను రత్నంను ఎలాగో ఒప్పించి హైదరాబాదు తిరుగు ప్రయాణమైనాడు.

తిరిగి వచ్చిన నెల రోజుల్లోనే, రత్నం మళ్ళీ జబ్బు పడింది. వెంటనే హాస్పిటల్లో చేర్పించాడు సుబ్రహ్మణ్యం. హాస్పిటల్ ఖర్చు పెరిగి పోవడంతో సుబ్రహ్మణ్యం చాలా ఇబ్బంది పడ్డాడు. దాచుకున్న డబ్బు తీసి ఖర్చు పెట్టాడు కానీ, కొడుకును అడగ లేదు. కొడుకు అప్పుడప్పుడు ఫోన్ చేసి తల్లి ఆరోగ్యం, గురించి అడుగుతూనే వున్నాడు. డబ్బు పంపిస్తానన్నా సుబ్రహ్మణ్యం వద్దని చెప్పాడు. తమ వైద్య ఖర్చుల కోసం ఇన్సూరెన్సు కడుతున్నాడు. ఇంకా పైన పడితే తన డబ్బే ఖర్చు చెయ్యాలని ముందే నిర్ణయించుకున్నాడు. అదీ గాక,తమ కోసం కొడుకు ఖర్చుపెడుతున్నాడని కోడలు బాధ పడడం అతనికి ఇష్టం లేదు.

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

One Response to సహ జీవనం -6 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో