‘‘మహిళా హక్కులే ఎజండా – ఆకులే ఆయుధాలు,, …రచయిత్రి ,పత్రచిత్రకారిణి లక్ష్మీ సుహాసినితో ముఖాముఖీ
అతి సామాన్యంగా రాలి వాడిపోయే ఆకు ఆయుదాలు గా మారడం ఆశ్చర్యమే. ఆ ఆకు స్త్రీ కన్నీళ్ళకు భాష్యం చెప్పడం, కా గుణింతమై అక్షరాలు నేర్పడం, నిత్యం మంటలో మాడిపోతున్న స్త్రీమూర్తిని మన కళ్ళముందు నిలిపి దీనికి మీ సమాధానం ఏమిటి అని నిదీయడం… మనం ఆలోచనలో పడి సమాధానం వెతికేలోగా ఆ మహిళ చిత్రం నిలు వెత్తు మంటై మన ముందు నిలిచి… ఒళ్ళు గగుర్పొడిచేలా ‘‘మంటలే మన చేతి ఆయుదాలు ’’ అని నినదించడం ఒక్క లక్ష్మీసుహాసిని చిత్రాలోనే సాధ్యం. ఆమే ఒక పత్రాంగి. పత్రచిత్రాల జండాలు ఎగరేస్తూ నిరాడంబరంగా ఒకపక్కగా నిలబడి తన చిత్రాల మీది సమీక్షను ఏరుకుంటూ స్త్రీ మీద జరిగే సభలో తనవొంతు తనగొంతు కలుపుతుందలా.
1.అరుదైన పత్రచిత్రకళను తనకుతానుగా సృష్టించుకుని తాను నమ్మిన ఆశయాలను ఆదర్శాలను నిరక్షరాస్యుల దాకా జేరవేసే వాహకంగా తన కళను తీర్చిదిద్దారామె. దాదాపు 18 సం.లు గా ఈ చిత్రాల ను వేస్తున్నారు. ఇప్పటికి 89 ప్రదర్శన ను నిర్వహించిన సుహాసిని, దాదాపు 30,000 ఆకులు సేకరించారు. ఆకుల ]లో ఎన్నో పరిశోధనను చేశారు. ఆకు సేకరించి వంద చిత్రాలు వేశారు.
పర్యావరణ స్పృహ కలిగిన ఆమె చి త్రాలు బోటనీ నేర్పడానికి, తెలుగు నేర్పడానికి, స్త్రీ హక్కులు చెప్పడానికి మంచి బోధనోపకరణాలుగా ఉపయోగపడతాయి.
2. తన పాటకి బొమ్మ వెయ్యడమే కాక తనకు నచ్చిన కవితకి, పాటకీ కూడా బొమ్మ వేశారు. ‘‘బందిపోట్లు’’ కవితకి, ‘‘నిండు అమాసనాడు ఓ లచ్చగుమ్మడి’’, ‘‘కోడెనాగువై రావాలమ్మా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా’’ లాంటి పాటకీ వేసిన బొమ్మ మంచి స్ఫూర్తిదాయకాలు .
తన చిత్రాలు థీమాటిగ్గా ఉండడం వల్ల గొప్ప సామాజిక ప్రయోజనాన్ని సాధించగలిగాయి.
1. మహిళపై వివక్ష, 2. చెట్లకు వేలాడే బాల్యం , 3. పనిలో మహిళ, 4. కళారంగంలో మహిళ, 5. కుటుంబ హింస, 6. పోరాటాలో స్త్రీ , 7. రాజ్య హింస, 8. ప్రపంచీకరణ, 9. ‘కా’ గుణింతం, 10. విభిన్న ప్రాంతా స్త్రీలు , 11. నిరీక్షణ, 12. బాలకార్మికులు , 13. గింజల తో ` జిందగీ… మొ॥ థీమ్స్‌తో 200కు పైగా మహిళా చిత్రాలు తయారుచేశారు. ఈ ప్రక్రియను కొలాజ్ అంటారు. ఇవి ఆకుమీద బొమ్మ కాదు. ఆకుతోటి బొమ్మ . ఒక మీడియం మీద మరో మీడియంను అతికించడాన్ని కొలాజ్ అంటారు.
ఈ విధానంలో పికాసో, బ్రెక్లాంటి కళాకారులు తొలి ప్రయోగాలు చేశారు. ఈమె మల్టీమీడియా కొలాజ్ చిత్రకారిణి. ఈమె కాయితం, చార్ట్, కార్డుబోర్డు, కాన్వస్ లాంటి మీడియా మీద పెవికాల్తో ఆకు, పూల రేకు గింజలు అతికించి తన చిత్రాలను రూపకల్పన చేస్తారు. పత్రచిత్రకారిణిగా మంచి గుర్తింపు పొందారు. ‘‘తాను మహిళాకళాశాలో 30 సం॥ పనిచెయ్యడం, రోజూ 4గం॥ పాఠం చెప్తూ విద్యార్థులను సన్నిహితంగా గమనించగగడం, 120 మంది మహిళా సహాద్యోగినుల మధ్య మెలగడంతో పాటు మహిళా సంఘాలలో మహిళా ఉద్యమాలో పాల్గనడం వల్ల అన్ని వర్గాల స్త్రీ స్థితిగతులు , హావభావాలూ లూ , ముఖ కవళికలు పరిశీలించే అవకాశం భించింది. గ్రామాల కు ప్రచారాలకు వెళ్ళడం, మాతమ్మ, వెదురు మహిళపై సర్వే నిర్వహించడానికి గ్రామగ్రామాల కు తిరగడం అట్టడుగు వర్గాల మహిళల జీవితాని ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకోవడం వల్లనే మహిళా చిత్రాల కంతటి సహజత్వం, వైవిధ్యం ఏర్పడింది అంటారు ఆమె.
ఈమె తొలి ప్రదర్శనను 2000, మార్చ్ 8న తను పనిచేసే కాలేజీలోనే నిర్వహించారు. తొలిసారి ఆంధ్రజ్యోతి నవ్యలో 2000 మార్చ్ 8న వచ్చింది. తొలిసారి డ్రైలీఫ్ ఆర్టిస్ట్‌గా 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించుకున్నారు. 2010లో వీరి మంటలో మహిళ చిత్రం అదే పుస్తకంలో రెండోసారి రికార్డు సాధించింది. 6000 పూల రేకులు ఉపయోగించి 280 గంటల పరిశ్రమతో (28 రోజులు ) చిత్రించిన చిత్రం అది. 2013లో మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలు గు బుక్ ఆఫ్ రికార్డు సాధించుకుంది.
తరువాత వీరు ఆకులతో పాటు గింజల తో కూడా మహిళా చి త్రాలు చిత్రించడం ప్రారంభించారు. అలా చిత్రించిన గౌతమబుద్ధుని చిత్రం గింజల విభాగంలో రికార్డును నమోదు చేసుకుంది.
మంటల లో మహిళ గౌతమబుద్ధ
1. లింకా బుక్ ఆఫ్ రికార్డ్ 2010
2. మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్ 2013 2014
3.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2013 2014
4. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2014 2014
5. ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2014 2014
6. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2014 2014
7. వరల్డ్ అమేజింగ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2014 2014
8. రికార్డు హ్డోర్స్ రిపబ్లిక్ 2014 2014
9. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2015 2014
10. గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ 2016 2014
11. యూనివర్సల్ వరల్డ్ రికార్డ్స్ 2016 2014
12. గోల్డెన్ వరల్డ్ రికార్డ్స్ 2016 2014
I. Feat Achieved – Art with Dry Petals and Leaves – 6000 petals used – 2010 to 2016 (12 awards)
II. Feat Achieved – Art with seeds – 6060 Methy & Mustard Seeds – 2014 to 2016 (10 records)
III. Dry Leaf Artist – 2004 ; 2014 – (2 records) Limca, Wonderbook
3 కాటగిరీల లో మొత్తం 24 ప్రపంచ రికార్డు లు సాధించారు.
30 సం॥ తెలుగు ఉపాధ్యాయినిగా గూడూరులోని డి.ఆర్.డబల్యు కళాశాలో పని చేసిన విశ్రాంతోపాధ్యాయిని” పరిశోధకురాలు ” ‘‘కె.వి. రమణారెడ్డిగారి సాహిత్య రచనపై’’ ఈ పిహెచ్.డిని, ‘‘నెల్లూరు జిల్లా మహిళా రచయిత్రుల భాషాసేవ’’పై మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ని నిర్వహించారు. ఈమె మార్గ దర్శకత్వంలో ముగ్గురికి పిహెచ్.డి వచ్చింది.
జానపదాల లోని స్త్రీల పాటను సేకరించి అందులోని ‘‘స్త్రీ వ్యక్తీకరణ రీతులు ’’ అన్న అంశం మీద డి.లిట్ చేసి మద్రాసు విశ్వవిద్యాయానికి సమర్పించారు. స్వయంగా జానపద బాణీలో వంద పాటలు రాసి (అనువర్తిత గీతాలు ) పాడి, మహిళా ఉద్యమాలో పాల్గోని, గ్రామ గ్రామాలో సారా వ్యతిరేకం గా ప్రచారాలు చేశారు.
ఈమె పాట సంకలనం ‘‘దామ దచ్చియల్లో’’ 2006లో ముద్రింపబడిరది. వీరి కవితా సంకలనం రెక్కలు పొదిగిన చూపు 2008లో ప్రచురితం ` వీరి సాహిత్య సేవకు ‘‘కస్తూరి బా సన్మాన్’’ 2008) పేర జాతీయ పురస్కారాన్ని పొందారు.మొల్ల జయంతి పురస్కారం (2004), దువ్వూరి రామిరెడ్డి పురస్కారం (2004), పాల్‌రాజ్ ధన్రాజ్గిరి ధర్మనిధి ఉపన్యాసం (2006), నేషనల్ గోల్డ్‌మెడల్ అవార్డ్స్ వీరి సాహిత్య కృషిలో మెయిల్ రాళ్ళు(2013) ` విప్లవ రచయిత సంఘం, నెల్లూరు జిల్లా రచయిత సంఘం మహిళా సంఘాలో పనిచేసిన ఈమె ప్రస్థుతం ప్ర.ర.వే సభ్యురాలు గా తన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు
(గింజలతో స్త్రీ జీవితం…) లేదా ఆవాలతో అద్భుతాలు
(అరుదైన కొలాజ్ చిత్రకళా విశేషాల ను విహంగ పాఠకులతో ముఖాముఖి పంచుకున్న సుహాసిని గింజల తో మహిళావరణాన్ని వారి జిందగీని కొలాజ్ చేసి ఆ విభాగంలో సహితం మరో 10 ప్రపంచ రికార్డును హస్తగతం చేసుకున్నారు. మార్చ్ 8 సందర్భంగా మరోసారి ఆమెను అభినందిద్దాం.)
* నమస్తే సుహాసిని. ఆవాల తో, మెంతుల తో ఫ్రీహాండ్ మీరు చాలా కొలాజ్ చిత్రాలు చేసినట్లు వున్నా రు. మీ అనుభవాలు మా విహంగ పాఠకుల తో పంచుకుంటారా?
తప్పకుండా హేమా..
నేను తొలిసారి గింజలతో చేసిన ప్రయోగమే ‘‘గౌతమ బుద్ధుని ధ్యానానందం’’ అది 6060 గింజల తో కాన్వాస్ మీద వేసిన చిత్రం. అది 2014`16 మధ్య 10 ప్రపంచ రికార్డు పుస్తకాలో స్థానం సంపాదించింది.
*మా హార్థికాభినందనలు సుహాసిని…
కృతజ్ఞతలు హేమా. ఈ విజయం మన అందరిదీ…
*మీరు ఈ కొలాజ్ని లేదా మీ చిత్ర వ్యాసంగాన్ని ఎప్పుడు ప్రారంభించారు. ఎన్నేళ్ళుగా సాధన చేస్తు న్నారు?
నా ‘పత్రాంగికి పదిహేడేళ్ళు. (1999)
నా సీడీకి సెవెన్ ఇయర్స్ (2008) (చిరునవ్వుతో...)
* రెండింటి కొలాజ్‌లో తేడా ఏమిటి? ఏది ఎక్కువ కష్టం?
దేని కష్టం దానిదే. నిజానికి పత్రసేకరణ, వాటిని హర్బేరియమ్గా మార్చడం కష్టం. స్పాంటేనిటీ, క్రియేటివిటీ, దృక్పధం వుం టే చెయ్యడం తేలికే. కాని గింజలు మన పోపు పెట్టెలోనే దొరుకుతాయి. వాటిని ఒక్కొక్కటీ ఫ్రీహాండ్ స్కెచ్చింగ్ చేసుకుంటూ అతికించడం చాలా కష్టం.
* మీకు ఏది ఎక్కువ ఇష్టం.
దేని అందం దానిది ` దేని చాలెంజ్ దానిది. రెండూ ఇష్టం రెండింటితో కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం మరీ ఇష్టం.
*గింజలతో ఎన్ని స్త్రీ చిత్రాలు చేశారు. అన్నీ కాన్వాస్ మీదేనా? అన్నీ పెద్దవేనా?
*లేదు హేమా కాన్వాస్ మీద కొన్ని చేశాను. ఆర్ట్ పేపర్ మీద, పాత వెడ్డింగ్ కార్డ్ మీద, హాండ్‌మేడ్ పేపర్ మీద, చార్టు మీదా, పాతపుస్తకాల అట్ట మీద, హాండ్‌మేడ్ అట్టమీద అలాబేస్ మీడియాని మారుస్తూ మీడియం సైజ్, చిన్నవి కూడా చేశాను. 32 26 నుంచి పోస్కార్డ్ సైజ్ దాకా నల భై పైనే చేశాను. ఆకులతో వైతే ఒక 250 పైన చేశాను.
* మీరు మరిన్ని ప్రయోగాలూ చేస్తూ మహిళా సాధికారతని సాదించాలని , మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిస్తున్నాను . అభినందనలు !
One Response to ఆకులే ఆయుధాలు-లక్ష్మీ సుహాసిని