”ఏమో ! ఏమో!” గొణుక్కుంటూ లేచిపోయిoదామె.
చాలా తేలిగ్గా నాయనమ్మను ఒప్పించగలిగానని సంతోషపడ్డాడు భాను. కానీ ఆ రోజు షర్మిలక్కను పువ్వుల వాయిల్ చీరలో చూసి నాయనమ్మ చేసిన గొడవ అతనిని పిచ్చివాడిని చేసింది.
”ఆ చీరవిప్పెయ్ షర్మిలా! ఎవరైనా చూస్తారు.” అంటున్న నాయనమ్మ కెదురుగా వచ్చాడు భాను.
”నాకు కోపమొచ్చిందంటే నేను మనిషిని కాదు. నువ్వు నోరుమూసుకొని అవతలికి నడువు. అక్క ఆ చీర విప్పడానికి లేదు.”
ఎప్పుడూ ఇంతవరకు చూడని భాను కోపానికి బిత్తరపోరుంది కృష్ణ.
”ఔరా! పెద్దంతరం, చిన్నంతరం….” ఆ ముసలమ్మను మరి మాట్లాడనీయలేదు భాను.
”నీ వయసుకు వచ్చిందేమో గాని, నీ బుద్ధులకు పెద్దతనం రాలేదు. నీ పెత్తనం సాగే రోజులు కావివి. మరి ఇలాంటి ప్రస్ధావన షర్మిలక్క దగ్గర తెచ్చావో, నేను మనిషిని కాను.” ఒక రకంగా ఆ ముసలామెను తోసుకుంటూ అవతలికి తీసుకెళ్ళాడు. అల్లంత దూరాన పనిచేసుకుంటున్న రాజేశ్వరమ్మకు అంతా వినిపిస్తూనే వుంది. ఇంకొకమారరుతే కొడుకును మందలించేదామె. కానీ రోజు ఈ విప్లవానికి ఆమె మనస్పూర్తిగా సంతోషించింది. ఏదోవిధంగా తన కూతురు సుఖంగా వుండడమే ఆమెకు కావల్సింది… ముసలమ్మనయి తే నోరు మూయించాడుగాని, ఆ ఇంకోల మరికొంత మంది పెద్దలు దానికి నిరాకరించడంతో ఆఖరి అస్త్రంగా,
”షర్మిలక్క ఆ చీర మార్చిందో ఆ క్షణం నుండి నేను కనబడను.” అని శపధం చెయ్యడంతో అందరూ నోరు మూసుకుని, ఊర్కున్నారు. పెద్దన్నలు తమకేమాత్రం జోక్యం లేనట్టు విడిగా వుండిపోయారు.
ఈ గొడవ మధ్యగా, ప్రాణం బిక్క చచ్చిపోరు సిగ్గుతోను, లజ్జతోను పడకకు అంటుకుపోయి నిశ్శబ్దంగా రోదిస్తున్న అక్క తలదగ్గర కొచ్చి ఆర్ద్రంగా అన్నాడు భాను.
”అక్కా! ఇలాంటి క్షణం మరెప్పుడూ నీకు తటస్థపడదని నేను హామిరుస్తున్నాను. ఈ రోజుకిది తప్పలేదు.నన్ను క్షమించు షర్మిలక్కా!”
షర్మిల తలెత్తి కూడా చూడలేదు. తన దౌర్భాగ్యానికి మనసులోనే రోదించ సాగింది.
ఇది ఇలా వుండగా – జరిగిపోరున దుర్ఘటనను తాత్కాలికంగా మర్చిపోతున్న సమయంలో, ఎవరో వచ్చి మరలా ఆ ప్రస్ధావన తెచ్చి రాజేశ్వరమ్మ షర్మిల కళ్ళల్లో నీళ్ళు తెప్పించేవారు.
ఈ ఫార్మాలిటీస్ కృష్ణకు బొత్తిగా నచ్చవు.
”ఎంత నిర్దయగా గాయాన్ని గెలుకుతారు వీళ్ళు!”
వీలైనంతగా రాజేశ్వరమ్మ దగ్గరకు, షర్మిల దగ్గరకు చుట్టాలను రానీకుండా తామే ఏదో మ్లాడి పంపడానికి ప్రయత్నిస్తుండేవాళ్ళు కోడళ్ళు. కానీ అందులోనూ పూర్తిగా సఫలీకృతురాలు కాలేకపోయారు వాళ్లు.
”ఔరా! భగవంతుడు. అరునా గానీ…” అని అసంపూర్ణ వాక్యాలతో షర్మిల దుఃఖాన్ని మటుకు సంపూర్ణం చేసి వెళ్ళేవాళ్ళు.
”కృష్ణా! కాస్త భానును పిలుస్తావా అమ్మా!” అంది రాజేశ్వరమ్మ.
”అలాగే” అని లేచి నాలుగడుగులేసిన కృష్ణకు వెనకనుండి ఎవరో, ”ఎవరీ అమ్మారు రాజేశ్వరీ!” అనడం విన్పించి కుతూహలంగా ఆగిపోరుంది. అంతి దు:ఖంలోనూ పొరుగిం ఆ పుల్లమ్మ కుతూహలానికి రాజేశ్వరమ్మ విరక్తిగా నవ్వడం విన్పించింది కృష్ణకు.
రాజేశ్వరమ్మ ఏమి చెప్తుందోనని ఆ పుల్లమ్మతో పాటు కృష్ణ కూడా క్షణం ఎదురుచూచింది.
”నా స్నేహితురాలు.”
కృష్ణ శరీరమంతా తీయి అనుభూతి తీగలా పాకింది.
భానును పిలవడానికి వెళ్ళిన కృష్ణకు ఆ అవకాశం ఇవ్వకుండానే అన్నాడు భానుమూర్తి.
”ఇక నువ్వు వెళ్ళిపోకూడదూ కృష్ణా!”
కళ్లెత్తి చూచింది కృష్ణ.
”ఎందుకు?” అని ప్రశ్నించబోయిన ఆమెకు అతని కళ్ళల్లో జవాబు దొరికింది.
”నువ్వు అందరి కుతూహలానికి ఎందుకు కారణం కావడం?”
కృష్ణ అలాగే అని తలూపిందే గాని, రాజేశ్వరమ్మను షర్మిలని స్వంత చెల్లెలి భర్త పోయినట్టు దుఃఖిస్తున్న ఆ ఇంట్లో కోడళ్ళను ఆ స్థితిలో వదిలి మరో మూడు రోజుల వరకు వెళ్ళలేకపోరుంది కృష్ణ.
– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~