బోయ్‌ ఫ్రెండ్‌ – 34 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”చూడు భానూ! షర్మిల మరలా నా కళ్ళముందు మామూలుగా తిరగాలి. పెళ్ళిగాక ముందు నా ఒళ్లో ఎలా వుండేదో అచ్చు అలాగే నా జీవితాంతం.

అది నా ఒళ్లో వుండిపోవాలి. అసలు… అసలు దానికి పెళ్ళరుందనే విషయం మనందరం మర్చిపోవాలి… ఈ కార్యానికి నువ్వు తప్ప మరెవ్వరూ నాకు సహాయం చేసేవాళ్ళు లేరు నాయనా!” ఆమె చెప్తున్నది అర్ధంగాని భాను మెల్లగా అన్నాడు.

”అక్కకి మేమందరం లేమా అమ్మా!”
”అది కాదురా…. నేను చెప్పబోయేది అదికాదురా…” ఆమె మాటల కొఱకు తడుముకుంటూ ఆగిపోరుంది.

అతను ఆమె వైపు కొత్తగా చూస్తున్నాడు. తన తల్లి ఇంతగా మ్లాడగా అతనెప్పుడూ చూడలేదు.కష్టంలో, సుఖంలో కూడ సమంగా ఒకి రెండు మాటలు మ్లాడే తల్లి అతనికీనాడు చిత్రంగా అగుపిస్తోంది. ఎప్పుడూ అందరికీ ‘అవును’ అని తప్ప ‘కాదని’ ఎరుగని తన అమ్మ తనకైతాను స్వతంగా ఏమి చెప్పబోతోందో! ఎదురుచూస్తూ కూర్చున్నాడు భాను.

”చూడు నాయనా! ఇన్నాళ్ళు అందరికీ తల ఒగ్గుతూనే వచ్చాను. ఏదైనా చేసుంటే ఎవరికైనా మంచే చేసాను గాని, చెడు చేయలేదు. అలాటిది  నాకీ శిక్షెందుకో? సాంప్రదాయం పేరిట దానిని తెల్ల చీరల్లో సింధూర హీనంగా చూడలేనురా భానూ!”

”అమ్మా….” అతను ఏమో చెప్పబోయేంతలో ఆమె అందుకుంది.

”దీనికి నువ్వు తప్ప మరెవ్వరూ కన్పించలేదు భానూ! నీ అవ్వను ఎదిరించు నాయనా .నీ అక్కని మరలా సౌభాగ్యవతిని చెర్యు.”
ఆమె కళ్ళ నుండి కారుతున్న ముత్యాల్లాి కన్నీళ్ళను తుడుస్తూ చెప్పాడు భానుమూర్తి.

”అమ్మా! షర్మిలక్క పోగొట్టుకున్న వ్యక్తినరుతే తెచ్చివ్వలేనుగాని…నువ్వు నిశ్చింతగా వుండమ్మా” అలా అనేసి మరిక అక్కడ వుండే శక్తిలేని వాడిలా వెళ్ళిపోయాడు.

”అక్కా…నీకీచీర బాగాలేదు.” అక్క ప్రక్కనే కూర్చుంటూ అతి సాధారణంగా అంటున్నట్లునిస్తున్న భానును చూస్తూ కృష్ణ ఉలిక్కిపడితే విరక్తిగా నవ్వింది షర్మిల.

”అరుపోరున జీవితానికి ఏ చీరరుతే ఏమిరా?”

”జీవితంలో ఒక్కి పోగానే జీవితమంతా అరుపోరుందాక్కా?”

ఆమె మాట్లాడలేదు. ఆమె చెంపల మీద కన్నీరు మాత్రం విరామం లేకుండా కారిపోతునే వుంది .ఆ కన్నీళ్ళు తుడిచే హస్తాలన్నీ అలసిపోయారు.

”నేను ఒప్పుకుంటాను కానీ, అక్కా నువ్వు విలువైందే పోగొట్టుకున్నావు. కానీ కానీ…నువ్వు పుట్టిన నాదిగా తెలిసిన మేము నీకేమి కర్మ  చెప్పు?”

”నువ్వు తెలివిగల దానివి. అర్థం చేసుకో. ఈ చీరల్లో, ఈ నగల్లో, ఈ బొట్టులో ఏముంది చెప్పు? అగ్నిలాటి  నీ మనసు ఎవరికి తెలీదు చెప్పు?” ఆమె విరక్తిగా చూచింది.

”అవునురా, ఈ చీరల్లో నగల్లో ఏముంది?”
భాను అక్క కళ్ళల్లోకి సూటిగా  చూస్తూ అన్నాడు.

”నాకు తెలుసు ఏమిలేదు. అందుకని నీ కట్టూ, బొట్టూ తీరు మార్చుకోవద్దు షర్మిలక్కా మేము చూడలేం.”

”నాకు వాటి మీద కోరికలేదురా భానూ!”

”ఈ రోజు రుూ విరక్తిలో, రుూ నిరోమయంలో నీకు కోరిక లేకపోవచ్చు. కాని కొన్నాళ్ళు జరిగాక కళకళలాడే వాళ్ళను చూచి అసూయపడే రోజు తప్పకుండా వస్తుంది. నువ్వే కాదు రుూ తెల్లచీరలు కట్టుకునే వాళ్ళు, ఏ పువ్వుల చీరను చూసి అసూయపడలేదో నువ్వే చెప్పు? ఏ నుదుటి  మీద తిలకంచూసి ఈర్ష్య చెందలేదో నువ్వే చెప్పు. అరునా అది మాత్రం వాళ్ళ దోషమెలా అవుతుంది? నైతికమైన విలువల్ని కాలదన్నే కోరికలనైతే సమాధి  గాని, ఈ స్వల్పమైన కోరికలకు ఎందుకు సమాధి క్టాలో నువ్వాలోచించు. పువ్వుల చీర కట్టగానే, నుదుటి  మీద తిలకం ధరించగానే మనసుకు మాలిన్యం అంటుకుంటుందనే వారిని నిలువునా కాల్చేయాలి…. – నీ శరీర సమాధికి ముందే నీ కోర్కెలకు సమాధి కట్టడం నేనొప్పుకోలేను. అసలు… అసలు నీకు గత జీవితం మరపుకురావాలంటే ,నీ రూపులో ఏ ఒక్క రవ్వకూడా మార్పు రాకూడదు.”

ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్ధంతో ఉలిక్కిపడింది కృష్ణ. ”భానూ!” అతనిని వారిస్తూ పిలిచింది.
కృష్ణవైపు కూడా చూడలేదు భాను.

(ఇంకా ఉంది )

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , , Permalink

Comments are closed.