ఇంటినొదల్లేని బెంగ(కవిత ) -డా.కె.గీత

ఆదమరిచి
నిద్రపోతున్న భార్యనొదిలి
ముద్దుగా ఒత్తిగిలిన చంటాడి నొదిలి
గౌతముడెలా వెళ్లాడో తెలీదు గానీ
ఆదివారం ఉదయం
ఎవరూ నిద్రలేవని
బద్ధకపు మంచు ఉదయం
ఒంట్లోని వెచ్చదనాన్ని దుప్పటీలోనే ఒదిలి
కాలేజీ చదువు కళ్లని నులుముకుంటూ
ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న
అతన్ని
అందాల కుందేలు పిల్లై పక్కనే ముడుచుకున్న
పసిపాపని ఒదిలి
ఎలా వెళ్లగలను?!
సాయంత్రానికి గూటికి చేరగలిగిన
రెక్కల ధైర్యమున్నా
మనసు ఇంటినల్లుకున్న జూకా మల్లెతీగ పరిమళమై
అక్కడక్కడే
తిరుగుతూ ఉన్నా
ఇప్పటికెందుకో ఇంటినొదల్లేని బెంగ
ఉదయం నించి సాయంత్రం వరకూ
మెదడు తినే పాఠాలలో
ఎక్కడొక్క సెకను
పక్కకి తొలగినా
ఇంటి వైపుకి మనసు లాగుతుంది
సరిగ్గా పన్నెండయ్యే సరికి
పాపాయికి అన్నం తినిపించమని
గుండె అలారం మోగుతుంది
అటూ ఇటూ పచార్లు చేసే
చిన్న విరామాల వరండాలో
పిల్లలు ఎదురుగా పరుగెత్తుకొచ్చి మారాం చేస్తారు
నిశ్శబ్దంగా ఆ మూలనెక్కడో కంప్యూటరు
ముందు కూచున్న సహచరుని
ఓరకంటి మెరుపు
క్లాసురూము లో ఉన్నట్టుండి వెలిగి
నా పెదాల మీద అసంకల్పితంగా
నవ్వు పూలు పూయిస్తుంది
ఎక్కడ హోం పేజీ చూసినా
హోమంటూ మనసు మొరాయిస్తుంది
ఇంటినొదల్లేని బెంగ
ఇంటినొదిలి ఎక్కడికెళ్లినా
తీరని బెంగ
సాయంత్రం ఇంటికొచ్చి గరాజు తీయగానే
ఏదో ఒక అట్టపెట్టెలోకి పోయి కూచుని
నా వెనకే మూసుకుంటున్న తలుపు వెనక
నిశ్శబ్దంగా నిద్రపోతుంది

                                                            – డా.కె.గీత 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , Permalink

3 Responses to ఇంటినొదల్లేని బెంగ(కవిత ) -డా.కె.గీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో