విషలేపనం(కవిత )- ఘాలి లలిత ప్రవల్లిక

ghali lalitha pravallika

గగన తలానికి ఆశతో….
ఎగిరిందా గువ్వ……
ముందు ఎగిరే రాబంధులు
దారి చూపుతాయని తలచి
ప్చ్..రాబంధులుకదా !
ఆశల కళ్ళు,ఆశయాల కళ్ళు
మట్టి రేణువులను….
రెప్పల మాటున శోధిస్తూ…
నేలతల్లి ఒడిలోకి జారిందాగువ్వ…..
బ్రతుకు సౌధపు నిర్మాణపు బాటలో…
అవధులు దాటిన
అవమానపు కొరడా వేటుకు
ఉబికే కన్నీటి చారలు
కనబడనీయక…
అడకత్తెరలో పోకచేక్కై
నలిగే బ్రతుకు పుస్తకాలు కొన్నైతే…
యువరక్తంలో కలిసి వెర్రితలలతో వేళ్ళూరిన
వట వృక్ష నిషా ఛాయలో…
దాగిన విషాదాలు మరికొన్ని
ఏ సంస్కృతి పూసిన విష లేపనం
ఈ చదువరుల బుద్ధి కుసలతను
అవిటితనం గావిస్తున్నది
వికసించాల్సిన కుసుమాలను
మొగ్గలోనే తుంచేస్తున్నది
ఎవరిచ్చారాఅధికారం?
ఓ…నవభారత నిర్మాతల్లారా!
నిషా మత్తులోంచి బయట పడండి
విష లేపనాలను తుడిచేయండి.
మీ కళాశాలలోకి చొరబడి
విచ్చలవిడిగా తిరుగుతున్న
ర్యాగింగ్ పిచ్చికుక్కను తరిమి కొట్టండి
దానితో చెలిమి చేశారో….
మీ ప్రాంగణంలోనే….
ఎన్నో గువ్వపిల్లలు నేలరాలతాయి
అమ్మ పొత్తిళ్ళు ఆక్రోశిస్తాయి…
మరెన్నో కుసుమాలు మానసిక వత్తిళ్ళకు నలుగుతాయి
రాచబాటను…..ముళ్ళబాటగామార్చుకొని
ఏడుఊచల గదిలో చదువులమ్మకు దూరమవ్వడం అవసరమా
ఆలోచించండి…
ఆ విష సంస్కృతీ లేపనాలు మనకొద్దు
అవి మన ఉన్నతికి మెరుగులు కావు తరుగులు
తెలుసుకొని బంగారుబాటలో
సాగించు నీ పయనం.

– ఘాలి లలిత ప్రవల్లిక 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

One Response to విషలేపనం(కవిత )- ఘాలి లలిత ప్రవల్లిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో