బోయ్‌ ఫ్రెండ్‌ – 32 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”అమ్మా! వీడు సెలవు పెట్టినప్పుడల్లా ఈయనగారు హోటల్‌కి పోవడానికి బద్ధకించి ఉపవాసం.ఆ పెట్టే సెలవేదో శనివారం పెట్టరా వెధవా మి యజమానికి స్వర్గంలో ఇంత చోటరునా దొరుకుతుంది అని చెప్తూ ఉంటాను  నేను” అని వాడి బిక్కముఖం చూచి పక్కున నవ్వేసింది కృష్ణ.

ఆ వంటవాడికి కూడా కృష్ణ కోపం అలవాటరుపోరుంది. అలా ఆమె కోప్పడ్డ నాలుగు నిముషాలు నోరు తెరవకుండా బిక్కముఖం వేస్తే తర్వాత యజమాని తాలూకు పాత చొక్కానో, క్రొత్త ప్యాంటు గుడ్డో ఆమె చేతిగుండా లభిస్తాయని ఇన్నేళ్ళ అనుభవంలో వాడికి బాగా తెలుసు.

”అదేమి చిన్నా భోజనం మానేస్తే ఎలా? హోటల్‌లో అన్నా భోంచేస్తుండరా!”

”నువ్వు కృష్ణ మాటలు నమ్మకమ్మా! అంతా అఘారుత్యం” అని విసుక్కున్నాడు భాను. కృష్ణ సాయంత్రం హాస్టలు కెళ్ళడానికి తయారవుతుంది . రాజేశ్వరమ్మ ఒప్పుకోలేదు.

”నా పడకలో పడుకుందువు గాని ఇబ్బందేంలేదులేమ్మా” అని నిలిపేసింది. భాను ఆ రాత్రికి స్నేహితుడి గదికి వెళ్ళి ఉదయాన్నే తిరిగొచ్చాడు. కృష్ణ ఇంకా నిద్రపోతూనే వుంది.

”కృష్ణను లేపమ్మా. కాలేజీ టైమవుతుంది.””ఎప్పుడూ వున్న కాలేజే, ఎవరెళ్తారమ్మా? పరమబోర్‌” అని రాజేశ్వరమ్మ చెర్యు కూడా ముసుగులోకి లాక్కుని పడుకుంది కృష్ణ.

”పడుకోనీరా… పోనీ రేపెళ్తుందిలే”

”నిన్న కూడా కాలేజీ కెళ్ళలేదు. ఈ రోజు పోనీ అమ్మా” విసురుగా ముసుగు తీసి లేచి కూర్చుంది కృష్ణ.

”నేను సుఖంగా వుంటే నువ్వు చూడలేవు కదా!” నవ్వేసాడు భాను. తయారయ్యి . కారిడర్‌లో కొచ్చి నిలబడింది కృష్ణ.

”కదులు. ఇంకా ఏం ఆలస్యం?” తొందరగా పద   భాను. మాట్లాడకుండా ఎదురు మేడవైపు చూస్తూ నిల్చుంది కృష్ణ. 1865 అని పెద్ద పెద్ద అంకెలు వేసున్నారు ఆ మేడ మీద.

”టైమవుతుంది కృష్ణా”

”చూడు భానూ. ఆ ఇంటి  గృహప్రవేశం నాటికి వున్న మనుష్యుల్లో ఒక్కరు కూడా ఈ రోజు బ్రతికి లేరు. అప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనకుండా వుండుంటే ఈ రోజు ఈ భూమి మీద మానవులనే తెగే వుండేది కాదు. తలచుకుంటే చిత్రంగా లేదూ!” అంది సంభ్రమంగా కృష్ణ.

”పద పద ఎప్పుడూ ఏదో పిచ్చి ఆలోచనే. ఆ బుద్ధిని కాస్త చదువులో వుంచరాదూ?”

”చూడమ్మా…భానూ….” అని బుంగమూతి పెట్టి  ”భానుకు తొందరగా పెళ్ళి చేసేయాలమ్మా. తిక్క కుదురుతుంది” అన్న కృష్ణను దగ్గరకు తీసుకుని కళ్ళనిండా వాత్సల్యం నింపుకుని మెచ్చుకోలు కంఠంతో అంది రాజేశ్వరమ్మ.

”నీలాటి  కోడలు నాకు దొరకాలే గాని ఆతర్వాత క్షణమైనా ఆలస్యం చేస్తానా?”

”బావ చనిపోయాడట కృష్ణా!” నీరసంగా బేలగా అలా అన్న భానుమూర్తి మాటలు ఆమెను ఈ లోకంలోకి తెచ్చారు అతని బేలతనాన్ని చూసి కృష్ణమనసు కరిగిపోరుంది.

”ఊరెళ్తాను.” అస్పష్టంగా అని లేచి నిలబడ్డాడు భాను. ”ఒక్కక్షణం ఆగు. నేనూ వస్తున్నాను.” ”నువ్వా! వద్దు…వద్దులే..”
వెనక్కు తిరిగి వెళ్ళబోతున్న కృష్ణ ఆగింది. క్షణం ఆలోచించింది. వెంటనే మరలా కదులుతూ అంది.

”కాదులే. నేనూ వస్తున్నాను రిక్షా పిలువు”.

                             ****                              *****                                        *****

తడి ఆరని కళ్ళతో, తడబడే కాళ్ళతో వణికే చేతుల్లోని పూవుల వారుల్‌ చీరతో కూతురు దగ్గర కొస్తున్న రాజేశ్వరమ్మని కళ్ళతోనే సైగ చేసి ఇవతలకు పిల్చింది లక్ష్మీదేవమ్మ.

”అదేమి? నీకు మతి పోరుందేమిటే?! ఏదైనా తెల్ల చీరుంటే చూసివ్వు. పసిది. పసిది.” గొణుక్కుంటూ వెళ్ళిపోరుందా వృద్ధురాలు. రాజేశ్వరమ్మ మ్లాడలేదు. వణికే చేతులు ఇంకా కంపించారు. కళ్ళల్లో తడి నీటిగా మారి చెంపల మీదుగా జారిపోరుంది. చేతుల్లో పూవుల చీర జారిపోరుంది. ఆమె రాయిలా  నిలిచి పోరుంది. ఎదురు గుండా గోడకున్న వెలిసిపోరున అద్దంలో తన నుదుటి మీద ఎవరో వుంచిన కుంకుమ ఎఱ్ఱగా మెరుస్తోంది. దీపశిఖలా అది ఆమె మనసును మండిస్తోంది. ఇక నిల్చునే శక్తి లేక అక్కడే కూలబడి చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

ఆ రోదన వింటూనే చేతుల్లో పని వదిలేసి గబ గబ వచ్చి ఆమె ఎదురుగా నేలమిద చతికిలపడ్తూ అంది కృష్ణ- ”ఊర్కోమ్మా.!”

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , Permalink

Comments are closed.