జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”ఏమో… నాకెర్కలే” అంది పోశవ్వ.

అంతలో.. ”పోశీ… ఓ.. పోశీ…” అంటూ హడావిడిగా అక్కడికి వచ్చాడు వార్డు మెంబర్‌ దూదేకుల ఖాసింభాయ్‌.

”ఏంది ఖాసింభాయ్‌.. ఆడికెల్లి కొంపలు ముంచకబోతున్నట్లు గట్ల ఆగం అరుసుకుంటు రాబడితివి.”

”గెలిచిన ఆడోల్లకు పట్నంల ట్రైనింగ్‌ ఉన్నదట. పంచాయితీ ఆఫీసుల అనుకోంగ ఇన్న. వారం రోజులు బోవాల్నట రేపచ్చే సోమారం గాక ఆ మీది సోమారం ఉన్నదట. పట్నం బోవాల్నట” అని చెప్పి తనపని అయిపోయినట్లు వచ్చినంత వేగంగా వెనుదిరగబోయాడు.

”కూసోయె కాసిం మామా…” అంటూ అక్కడే నిలబెట్టి  ఉన్న నులక మంచం వాల్చింది సబిత.

”ఏంది కాసింభాయ్‌, నువ్‌ చెప్పేది నాకేం సమాజ్‌గాలె. నేను పట్నం బోవాల్నా.. వామ్మో….నాతోని గాదు. గీ నాల్గూర్లు దాటి  ఎన్నడబోయిన్దాన్నా… గ ఎల్లారెడ్డికి పోవుడంటెనే మా లెస్స బుగులయితది. గీ సిందాన్నీ…గా ముసలి దాన్ని ఇడ్సి నే యాడికి బోత” అంది భయం భయంగా. అదేం లేదు మేడం. మీరు సర్పంచ్‌ పదవికి కొత్త. సర్పంచ్‌గా మీరేమి చేయాలో తెల్సుకోవాలంటే మీరు పట్నం పోవాలి. అక్కడ మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. వెళ్తుంటేనే భయం పోతుంది” నచ్చజెప్పబోయాడు రవి మాదిగ.

మేడమ్‌ అని రవి అంటుంటే పోశవ్వకి గమ్మత్‌గాను, కించిత్‌ గర్వంగాను, అంతలోనే అదో రకంగాను, సిగ్గుగాను అన్పిస్తోంది. పెద్దోల్లని పిలిస్తే  పిలువు. తనను పిలుస్తోంటే సిగ్గుగాను, గర్వంగానూ ఉంది. ”అవ్‌ పోశి… నువ్వుబోవాల్నే…” ఖాసిం.

”సర్పంచ్‌ గిరి నాకు తెల్సుడేంది. గౌడ్‌ సాబ్‌ ఉన్నడు గద. గదంత ఆయనకే ఎర్క అంతే. నన్నునిశాచి ఎయ్‌మన్నకాడ ఏసుడు గంతె. గా పొద్దు బీ పంచాయితీ ఆఫీసుల జెప్పిండు” పోశవ్వ. లేదు మేడం మీరు మీరుగా ఉండాలి. మీరు ఇప్పుడు జోగు పోశవ్వ కాదు. గ్రామ పెద్ద. సర్పంచ్‌ పోశవ్వ. ఈ ఊరి మంచి చెడు చూడాల్సిన బాధ్యత మీది. మీరే ఎన్నోమీటింగులు చేయాలి.

చట్టపరంగా ఊరి బాగుకోసం అభివృద్ధి కార్యక్రమాలు చేప్టాలి. అసలు సర్పంచ్‌ అంటే ఏంటో , సర్పంచ్‌ ఏం చేయాలో, ఏం చేయకూడదో మీరు తెల్సుకోవాలి. అంటే మీరు తప్పని సరిగా వెళ్ళి తీరాలి.” నొక్కి చెప్పాడు రవి మాదిగ.

ఓ సారూ… మీరిద్దరూ పట్నం పోవాల్నంటరు. నాకంత పరేశాన్‌ అయితాంది. అచ్చరం ముక్క రానిదాన్ని నేనుబోయి చేసేడ్ది ఏందట.

”మీ లాంటి  వారి కోసమే ఈ ట్రైనింగ్‌, అందుకే వెళ్ళాలి. విషయాలు తెలుసుకోవాలి. సర్పంచ్‌గా మీ డ్యూటి  మీరు చేయాలి. అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి” అన్నాడు రవి.

ఓ వైపు ఊరు దాటి విశాల ప్రపంచం చూసే అవకాశం కలిగిందన్న సంబర తనకేమీ తెలియదే అన్న కలవరంతో ”అమ్మో పట్నం పోవాల్నంటే పైసలు గావాలె. ఎట్లబోవాల్నో ఏడికి బోవాల్నో నాకెమెరుక?” ”అవసరమైతే నేను సాయం చేస్తా” ఒప్పించాడు రవి మాదిగ.

మహిళా రిజర్వేషన్‌ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు హైదరాబాదులో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చారు. అంతా ఆడవాళ్ళే. కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటే… ఇంకొందరు పోశవ్వలానే అసలేమీ చదువు రాని వాళ్ళు. కొందరికి సర్పంచుగా పూర్వానుభవం ఉంది. మరి కొందరు రాజకీయానుభవం ఉంటే కొందరికి. వార్డు మెంబరుగా కొద్దిగా రాజకీయానుభవం ఉంటే, మరికొందరు రాజకీయాల్లో ఓనమాలు తెలీనివాళ్ళు కానీ అందరినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన శిక్షణా కార్యక్రమం అది. తమకు అనుకూలంగా ఉండే మహిళలను సర్పంచ్‌గా నిలబెట్టె , వారిని మర బొమ్మలుగానూ, రబ్బరు స్టాంపులుగానూ మార్చి మగవాళ్ళు పెత్తనం ఎలా చేస్తారు. ఎందుకు చేస్తారో తెలియజేశారు.

మహిళలకు ఏం తెల్సు? నగలు, చీరలు గురించి ఆలోచించడం తప్ప అని స్త్రీలకు 33% శాతం రిజర్వేషన్‌ ప్రకించగానే అన్నారు. రాజకీయం అంటే అన్నం కూరా వండి పడేయడం కాదు అని ఎద్దేవా చేసిన వాళ్ళూ వున్నారు. మరి స్త్రీలు అలాగే అయితే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా కాగలిగేది? స్త్రీలందరికీ రాజకీయాధికారం చేపట్టగల సత్తా ఉంది. చేవ ఉంది. ఇన్నాళ్ళు అవకాశాలు లేవు. ఇప్పుడా అవకాశం వచ్చింది. మనల్ని మనం నిరూపించుకోవాలి. అంటే ముందుగా మనని మనం ఆడదంటే అణిగిమణిగి ఉండే ఆటబొమ్మ కాదు. ఆమె కూడా ఒక వ్యక్తి. ఒక శక్తి. అవకాశం వస్తే, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తే ఆమె ఏదైనా చేయగలదు. సాధించగలదు. మగవారి నీడలా కాకుండా, ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానైతే బాగుండునని ఆత్మన్యూనత భావంలో కొట్టుకుపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయమని చెప్పారు శిక్షకులు.

స్వయంగా ఆలోచించి, స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడం సర్పంచికి ఎంత అవసరమో చక్కగా చిన్న చిన్న నాటికల ద్వారా వాళ్ళతోనే చెప్పించారు. పాటల ద్వారా విన్పించారు. ఆ కార్యక్రమం అంతా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో.. పంచాయితీ అంటే ఏమి? సర్పంచ్‌గా చేయవల్సిన విధులు – భాధ్యతలు ఏమిటో  చెప్పారు. అప్రమత్తంగా లేకపోతే, ఏమరపాటుతో ఉంటే, సక్రమంగా పనిచేయకపోతే మధ్యలో తొలగించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఇవన్నీ కూడా ఉపన్యాస ధోరణిలో కాకుండా గ్రూప్‌ డిస్కషన్స్‌, రోల్‌ ప్లే ద్వారా తెలిపారు. గతంలో రాజకీయ అనుభవం ఉన్న మహిళల అనుభవాలు తెలిపారు.

-శాంతి ప్రబోధ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో