ఇది నీకు భావ్యమా?-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

ఇది నీకు భావ్యమా?
ఇది నీకు భావ్యమా?
ఇలా వెళ్ళిపోవటం సవ్యమా?
అరవైఆరేళ్ళ జీవితం నీకు నేర్పిన అనుభవాల
బ్రతుకు పుస్తకాన్ని అరక్షణంలో చింపివేశావు.
ఆరేళ్ళ క్రిందట నీ సహధర్మచారిణి
నిన్ను వదిలి వెళ్ళిపోయిందని
జీవితంపై అలుక పూనావు.
దగ్గరగానే ఉన్న పెద్ద కూతురి
ప్రేమాభిమానాలతో సంతృప్తి చెందలేక
దూరంగా ఉన్న కొడుకు,కూతుర్ల
ఆత్మీయతను అంతగా పొందలేక
ఆవేదనతో అంతరంగాన్ని నింపుకున్నావు,
ఆ ధోరణి లోనే నిన్ను నీవు చంపుకున్నావు.
సినిమా రంగంలో ఆరడుగుల అందమైన
హీరోవని అనిపించుకున్న నీకు
హటాత్తుగా అవకాశాలు తగ్గిపోయినా
సహాయ పాత్రలను కూడా సానుకూలతతో స్వీకరించావు.
ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా
ఎదురొడ్డి నిలుచున్నావు.
కవివై,కళా రవివై వెలుగొందిన నీవు
ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయావెందుకని?
నీ పోకని మా మనసులు ఒప్పుకోలేక పోతున్నాయి,
తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాయి.
(సినిమా నటుడు రంగనాద్ హటాత్తు పయనానికి సంతాపంతో) భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో