“సింహపురి సీమ”కు నిలుటద్దం(పుస్తక సమీక్ష ) – అరసి

IMG_20151107_171948 ఎం .వి రమణారెడ్డి తన వ్యవసాయ రచనల ద్వారా రాష్ట్ర రైతాంగానికి సుపరిచితులే . నెల్లూరు జిల్లా గండవరం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు . వ్యవసాయ శాఖలో 37 సంవత్సరాలు సేవలందించారు . వీరి వందలాది వ్యాసాలూ దిన పత్రికలు , మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి . కర్షక విజ్ఞానం , రైతు వెలుగు , సేంద్రియ వ్యవసాయం పుస్తకాలు రచించారు . రేడియో ప్రసంగాలు చేశారు . ఆయన రచించిన మరొక రచన “సింహపురి సీమ సింహావ లోకానం “.

సింహపురి సీమ- నెల్లూరుగా వ్యవహరించే వాళ్లం . ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్పు చేశారు . సింహపురి సీమ భౌగోళిక స్వరూపాన్ని వివరిస్తూ ఈ ప్రాంతం విస్తీర్ణం , ఆనాటి పెన్నా ఆనకట్ట సంగం ఆనకట్టను కనిగిరి రిజర్వాయరును ప్రస్తావిస్తూ మండలాల గురించి సమాచారం అందించారు .

రాజకీయంగా సింహపురి స్థానాన్ని సవివరంగా చెబుతూ ముఖ్యమంత్రులు , గవర్నర్లు వంటి ఉన్నత పదవులు అలంకరించిన వారి గురించి పురస్కారాలు పొందిన వారి వివరాలతో పాటు రాజకీయ ప్రముఖులు , జిల్లా రాజకీయాలు , ఎన్నికల , వర్గ పోరాటాలు గురించి కూడా సమాచారాన్ని అందించారు రచయిత .

తమ నడక , నడతతో సింహపురి సీమకే వన్నె తెచ్చిన మహనీయుల కథలను , వారి వివరాలను పొందుపరిచారు . ఆంద్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు , సింహపురి సీమలో స్త్రీ విద్యకు బీజం వేసిన పోణాక కనకమ్మ , దాన గుణంలో పేరొందిన దాన వీర రేబాల లక్ష్మినరసారెడ్డి , హరి జనోద్దారకుడు ఏనుగు పట్టభిరామి రెడ్డి , స్వాతంత్ర్య పోరాట యోధుడు తిక్కవరపు రామిరెడ్డి .

పాడి పంటలకు నెలవు కోస్తా , ఆంధ్రా అటువంటింది . వ్యవసాయ రంగంలో సింహపురి సీమ స్థానం కూడా ప్రస్తావించారు . ఆక్వా రంగం , పరిశ్రమలు వాటి ప్రగతి , ఉపాధి విషయాలు . మన భారతావనిలో ప్రతి స్థలానికి ఒక పురాణ కథనం , ప్రాశస్త్యం ఉంది . అలాగే సింహపురి సీమలోను అనేక ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు , ప్రార్ధన మందిరాలున్నాయి . ముందుగా గుతుకు వచ్చేది రంగనాధ స్వామి దేవాలయం (పల్లి కొండనాధుడు ). మూల స్థానే శ్వర స్వామి దేవాలయం ఇవే కాకుండా కన్యకా పరమేశ్వరి గుడి , ఇస్కాన్ మందిరం , సాయి బాబా గుడి , శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం , జిన్నవాడ కామాక్షమ్మ దేవాలయం , పెంచలకోన వేదగిరి నరసింహ స్వామి దేవాలయం వీటితో పాటు మహ్మదీయ దర్గాలు ఉన్నాయి . వేలాంగిణి మాత దేవాలయం , జైన దేవాలయం ఉన్నాయి .

మనిషి వ్యక్తిత్వం నడవడిక తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది . తద్వారా సమాజ ప్రగతి ఆధారపడి ఉంటుంది . డానికి కిలకమైనవే విద్యాలయాలు . సింహపురి సీమలో తొలి విద్యాలయం v .r కళాశాల గురించి పలు విద్యా సంస్థలు , వాటిని నిర్మించి, నడుపుతున్న ట్రస్ట్ ల వివరాలు , విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సమాచారం వివరాలను పొందుపరిచారు రచయిత .

వైద్యంలో ఆయుర్వేదం , హోమియోపతి , అలోపతి విధానాలున్నాయి . వైద్యం ఆసుపత్రుల సమాచారం , వాటి సేవల వివరాలు , స్వచ్చంద సంస్థలు నిర్వహించే రక్త , నేత్రదాన శిబిరాలు , వృద్ధాశ్రమాలు , అంధుల బడులు , ఆశ్రమాలు తద్వారా సేవలందించే వారి పరిచయం చేయడం సుమచితంగా ఉంది .

మనిషి ఎన్ని విషయాలలో తలమునకలై ఉన్న కాస్తంత విశ్రాంతిని , హాయిని కోరుకుంటాడు , ఆ ఆహాయిని ఇచ్చేవి కళలు . అటువంటి కళా రంగంలో తమ ప్రతిభని చాటి , ఆ కళా రంగానికే వన్నె తెచ్చిన నాటక , సినీ , సంగీత వంటి రంగాలలోని కళాకారుల వివరాలను అందించారు . నాటకాలలో పొన్నాల , రామ సుబ్బారెడ్డి , రేబాల శ్రీలక్ష్మి , గూడూరు సావిత్రి , కోటేశ్వరీ దేవి , చిత్ర సీమలో నాగ భూషణం , రాజనాల , రమణారెడ్డి , వాణిశ్రీ వంటి కళాకారుల గురించి ప్రస్తావించారు .
సాహిత్యంలోను సింహపురి సీమకు ప్రత్యేక స్థానం ఉంది . కవి బ్రహ్మ తిక్కన నుంచి నేటి వరకు ఎంతో మంది కవులు , కవియిత్రులు , రచయితలు , రచయిత్రుల తమ రచనలో సాహిత్యాన్ని సుస్థిరం చేసిన వారే , చేస్తున్న వారే . జక్కన , మొల్ల , వేదం వెంకట రాయ శాస్త్రి , దువ్వూరి రామిరెడ్డి , గుటూరు శేషంద్ర శర్మ , మనసు కవి ఆత్రేయ , ప్రస్తుత కాలంలో పెరుగు రామకృష్ణ , రాచపాళెం రఘు , ఖదీర్ బాబు , వరదా శ్రీనివాసులు , పాతూరి అన్నపూర్ణ ,పెళ్లకూరి జయప్రద , దోర్నాదుల సుబ్బమ్మ , ప్రతిమ , హేమలత పుట్ల , ఈతకోట సుబ్బారావు , బండి గోపాల రెడ్డి వంట ఎంతో మంది తమ రచనలను వెలువరిస్తున్నారు .

సింహపురి లో చూడవసిన ప్రదేశాలు నేలపట్టు – పక్షుల వలస కేంద్రం , పులికాట్ సరస్సు , ప్రసిద్ధ కృష్ణ పట్నం ఓడరేవు , ప్రపంచ ప్రఖ్యాత షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం , మైపాడు బీచ్ , ఉదయగిరికోట , భైరవ కొన , కండలేరు జలాశయం , వెంకటగిరి దుర్గం వంటి ఎన్నో ప్రదేశాల వివరాలు చదువుతుంటే ఒక్కసారైనా చూసిరావాల్సిందే అనిపించక మానదు .
ప్రజాస్వామ్యంలో ప్రముఖమైన పాత్ర పోషించేవి వార్త పత్రికలే అటువంటి పత్రికలు నెల్లూరులో వార , మాస పత్రికలకి కొదవేలేదు . కుడ్య , మందాకినీ , లాయర్ ,పీపుల్ పేపర్ ,విశాలక్షి ,నెల్లూరు మాండలికం , పున్నమి ,సింహపురి రైతు మచ్చుకు కొన్ని పత్రికలు .

ఈ పుస్తకం పేరుకు తగినట్లుగానే సింహపురి సీమకి సింహాలోకనం . నెల్లూరు జిల్లా గురించి తెలుసుకోవడానికి ఒక కర దీపికలాంటిది . మన ముందు తరాలకు గత చరిత్ర , విశిష్ట తెలియడానికి ఒక మంచి గ్రంఘంగా ఉపయోగపడుతుంది . ప్రతి ఒక్కరు మరీ ముఖ్యంగా నెల్లూరు వాసులు చదివి , భద్ర పరుచుకోవాల్సిన పుస్తకం .

-అరసి

ప్రతులకు :
ఎం .వి . రమణారెడ్డి,
సాయి కేర్ హోమియోపతి,
16 – 2 -4 2 6 ,
ఇందిరా భవన్ రోడ్,
నెల్లూరు,
సంచారవాణి :9246432032

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో