బోయ్‌ ఫ్రెండ్‌ – 32 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

స్నేహితుని ముఖంలోని నీలి నీడలను గమనించిన కృష్ణ చటుక్కున లేచి టెలిగ్రామ్‌ అందుకుంది. నీరసంగా కూలబడి పోయాడు భానుమూర్తి. ఆ టెలిగ్రామ్‌ చదువుతున్న కృష్ణకు మొదట గుర్తుకొచ్చింది రాజేశ్వరమ్మ. ‘రాజేశ్వరమ్మ ఈ అఘాతానికి తట్టుకోగలదా? తన కూతురి వైధవ్యాన్ని చూడడమనేది ఆ తల్లికెంత పెద్ద శాపం!’ వ్యధా పూరితమైన ఆమె మనసు క్షణంలో పదోవంతు టైమ్‌లో భానుమూర్తి అమ్మ రాజేశ్వరమ్మతో తన మొది పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

ఒక రోజు ప్రొద్దున్నే విజిటర్స్‌ హాల్‌ దగ్గర భానుమూర్తి ప్రక్కగా నిల్చున్న ఆమె ఎదురుగా వెళ్ళి నమస్కరించింది కృష్ణ. ఆమెలో భానుమూర్తి పోలికలు కొట్టవచ్చినట్టు కన్పిస్తున్నారు.

”ఏమ్మా కృష్ణకాంతీ! అమ్మావాళ్ళు వెళ్ళిపోయాక దిగులుగా లేదా?”

ఆమె మాటల్లో ఎదుటి  వ్యక్తిని అప్పుడే అక్కడే మొదిటి సారిగా చూస్తున్నభావం లేదు. ఎన్నో ఏళ్ళుగా పరిచయమై కొన్ని రోజులు విడిపోరు మరలా కలిసిన వ్యక్తితో మాట్లాడినట్టు వుంది.

”లేదండీ ఇక్కడా బాగానే వుంది” అలా అనేసాక ఆ ‘అండి’ శబ్దం తనకే వెగటు వేసినట్లరుంది. ఆమెను రూమ్‌కు తీసుకెళ్ళి విద్యకి పరిచయం చేసింది. డబ్బాలో వున్నవేవో ఫలహారంగా పెట్టి , మెస్‌కెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది. అంతా అయ్యాక విద్యతో చనువుగా అందామె.

”మీ  కృష్ణకాంతిని తీసుకెళ్తున్నానమ్మారూ !”
”అలాగే నండీ. సాయంత్రానికల్లా పంపేయండి. లేకపోతే నాకేం తోచదు.”
”భలేదానివే అమ్మా ! నాకు మటుకు ఈ కొత్త స్థలంలో ఎలా తోస్తుంది నువ్వే చెప్పు.”
నవ్వేసింది విద్య.

”పోనీ నువ్వూ రాకూడదామ్మా.” ”ఈ రోజు కాలేజీ వుంది కదండీ. మరొక రోజు వస్తాను.” ఆ మాటతో రాజేశ్వరమ్మ గారు కృష్ణ వైపు తిరుగుతూ అన్నది. ”అరుతే కృష్ణమ్మా నీకు లేదూ కాలేజీ?”

ఆమె పిలుపులోని మాధుర్యానికి చలించిపోరున కృష్ణ ఒక్క క్షణం పలకలేదు. అంతవరకు వున్న బెరుకు ఆమె పిలుపుతో నామమాత్రం లేకుండా మాయమరుపోరుంది.

”ఎప్పుడూ వుండే కాలేజే కదమ్మా ! మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తారా? మీరే చెప్పండమ్మా.”
ఆమె నవ్వింది.
”గడుసు పిల్లవే. ‘మా రెండో కోడలు కూడా ఇలాగే అంటుంది” అని నవ్వేశారామె.

”చూచుకో కృష్ణమ్మా. ఈ ముసలి జడ నీకు నచ్చిందో లేదో” ఆ సాయంత్రం జడ వేయడం పూర్తి చేసి జడ ముందుకేస్తూ అంది రాజేశ్వరమ్మ. ”చక్కగా వేసారు.”

”మా మూడో కోడలు నేను వేసే జడకి ఎన్ని వంకలు పెడ్తుందో తెలుసా నీకు? మరలా నేనెంత పనిలో వున్నా పని వదిలేసి వచ్చి ఆ పిల్లకి జడవేసి పోవాల్సిందే. మరెవ్వరి చేతా వేరుంచుకోదు. ”నవ్వింది రాజేశ్వరమ్మ. ఆ నవ్వులో మూడో కోడలు మిద ఆప్యాయతే గాని, నిష్టూరం లేదు.

”చిన్నబ్బాయ్‌! కాస్త బజారుకెళ్ళి సన్నజాజులు తెచ్చి పెడ్తావ్‌?” విసుక్కున్నాడు భాను. ”ఫోమ్మా! అంత దూరం ఇప్పుడెవరెళ్తారు?”

”నా బంగారు చిన్నవి కదూ! చూడు పూలు లేకపోతే జడ ఏం బాగలేదు. కాస్త తెచ్చి పెట్టరా.” నవ్వుతూ వెళ్ళాడు భాను.

అతను పూలు తెచ్చి చేతి కందిస్తుంటే కాస్త సంకోచంగా అన్పించింది మొది మారుగా కృష్ణకు. అతని వద్దనుండి ఎప్పుడూ ఎలాంటి బహుమతినీ అందుకో లేదామె. ఏదైనా అవసరమైన వస్తువు తెచ్చిమ్మంటే తెచ్చివ్వడమే గాని, పుట్టిన  రోజని, క్రొత్త  సంవత్సరమనీ ఎప్పుడూ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని అతనికి గుర్తురావు. కనీసం గ్రీటింగ్స్  చెప్పాలని కూడా అతనికి అన్పించదు.

”కూరేం చేయమాంవ్‌ బాబూ!” అని వచ్చిన వంట కుఱ్ఱాడి మిద ఇంత ఎత్తు లేచింది కృష్ణ.
”నీ మొహం అవతలికి ఫో. యజమానికి తగ్గ సర్వ్‌వి దొరికా వెక్కడో”

”ఎందుకమ్మా పాపం వాడి మీద కోపగించుకుంటావ్ .” ”నువ్వే అడుగమ్మా. వీడొచ్చాక భాను ఎప్పుడైనా కడుపునిండా తిన్నాడేమో! వీడికా వంటలో ఓనమాలు రావు. ఈ బుద్ధావతారానికా అదేం పట్టదు. ఇష్టమైతే తినడం లేకపోతే మానేయడం. ఎందుకు ఇష్టపడ లేదోనని ఒక్కమారు కూడా ఆలోచించడు.ఈ వంటవాణ్ణి మాన్పించండి బాబూ అని నెత్తి నోరూబాదుకున్నా వినడు.”

”నిజమేనమ్మా కృష్ణా! ఇంటి  దగ్గర కూడా బెండకాయ కూర చేస్తే వంకాయ కూర చాలా బాగుందమ్మా అన్నాడు ”. కొడుకు అజ్ఞానాన్ని తలచుకుని తలచుకుని నవ్విందామె.

”వేలుడు లేడు. ఈ వెధవకి వంటవాడి బిరుదు కావాలంట. పైగా వీడి సర్వీస్‌కి తోడు అన్నీ క్యాజువల్‌ లీవ్స్‌.”

”ఈ మారు సెలవు పెట్టు నీ పని చెప్తాను.”

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , Permalink

Comments are closed.