ప్రియంవద జ్ఞానానందులు కనబడనీయక తెరవేసీ మళ్లీ ఆ నూతన స్త్రీ ఇటు వస్తుందేమోనని ఇపుడే వస్తానంటూ చెప్పి బయలు దేరాడు (దేరింది ) రమణ . వీధి చివర వరకు తోడుగా వెళ్లి అదిగో అక్కడ వెడుతున్నారే వాళ్లంతా ఆలయాని కెళ్లే వారే కలిసి వెళ్లు అన్నది రమణ . వారిని అనుసరిస్తాను అపరిచితులు కదా (అన్నాడు )అన్నదా అగంతకి .
నాకు తెలుసు అంటూ ఓ నాగమల్లెక్కా అంటూ పిలిచాడు (పిలిచింది ) రమణ వెళుతున్న నలుగురి స్త్రీలలో ఓ స్త్రీ వెనుదిరిగి ఏంటి రమణా …పలికింది .
ఇదిగో తను మా అతిధి ఊరికి కొత్త కొంచెం ఆలయం వరకు మీతో తోడ్కుని పోవలవా అన్నది రమణ .
ఆ .. తప్పకుండా ..అన్నది నాగమల్లి . వెళ్లమ్మా అంటూ ఆమె వెళ్లేదాకా ఉండి వెనుదిరిగింది (గాదు )రమణ .
ఏ ఊర్నుంచి వచ్చావ్ అన్నది నాగమల్లి శౌర్య తో మాట కలుపుతూ ..
వి ..హ్ హ్ అని గొంతు సవరించుకుని చంద్రగిరి . మాకు నెలదమ్మ దూరపు చుట్టం . చూసెల్దామని అన్నాడు స్త్రీ వేషంలో ఉన్న శౌర్య .
ఆహా … బంగారం వంటి మనిషి నెలదమ్మ ఎంత పుణ్యాత్ములకు బుట్టిందో ఏమో గానీ మరొక మగువ కల్పించుకుంది .
అదిగో గుడి వచ్చేసింది . నాట్యం కూడా సగం వరకు అయిపోయి ఉంటుంది . చివర్న నెలదమ్మ , ప్రమిదలు కాగడాలు వెలిగించుకుని నాట్యమాడు తుంది చూసేదానికి రెండు కళ్ళు చాలావ్ శౌర్య కు వివరించింది నాగమల్లి .
ఓహో , నెలదమ్మ మీకు చిన్నతనం నుంచీ తెలుసా కుతూహలంగా అడిగాడు శౌర్య .
ఆ మాటకొస్తే నాదీ ఊరు కాదు ఉర్వకొండ మెట్టినిల్లు ఇది . నాకు పదకొండో ఏట పెళ్లయినాక వచ్చాను . ఈ ఊరు , పరగాణా , అన్నీ నెలదమ్మవే నాగమల్లి ఢంకా భజాయించినట్లు చెప్పి గుడి గడపకు వంగి దణ్ణం పెట్టుకుంటోంది . ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు ప్రాకారపు గాలి గోపురానికి దణ్ణం పెట్టుకుంటున్నారు .
తనూ అలా చేయక పోతే బావుండదని వంగాడు శౌర్య అప్పటికే గడప దాటి లోనికి రెండడుగులు వేసిన నలుగురు ఒకరు ముందు ఒకరు వెనకగా నడుస్తున్నారు . నాగమల్లి ఆగి రమణ ఒప్పగించిన అమ్మాయి రాలేదే అన్నట్లు చివాల్న వెనక్కు తిరిగింది . వేసుకున్న కొత్త జలతారు ఓణీ జారిపోయింది కళ్ళు మూసుకుని నా పని నిర్విఘ్నంగా కావాలి అనుకుంటు మొక్కుతున్న శౌర్య పట్టించుకోలేదు .
నాగమల్లి హోయమ్మే అన్నది ఆశ్చర్యంగా . ఒక్కసారి ఉలికి పది కళ్ళు తెరిచి లేచి గబగబా పైట సర్దుకున్నాడు శౌర్య . కొంపదీసి ఈ మహా తల్లి కనిపెట్టేసిండా ? అనుకున్నాడు .
ఏవైందీ మరో స్త్రీ అడిగింది నాగమల్లి భుజం తడుతూ ….
శౌర్య ఆమె ఏం చెపుతుందోనని భయంతో ముచ్చెమటలు పడుతుండగా ఒక్క అంగలో వాళ్లని చేరి తప్పట్లు తడుతూ …
ఆ .. అదే అనుకున్నా అన్నది అయోమయంగా నాగమల్లి నాకపుడే అనిపించిందే అని మరో ఆవిడ దీర్ఘం తీసింది .
సర్లే పద పద అంటూ అందరూ లోనికి కదిలారు .
ఈ జన్మకు బ్రతికాన్రా బాబూ …. రమణ గుర్తు రాకపోతేనా బతుకు అధోగతి పాలయ్యేది అనుకుంటూ ఎంతో విశాలంగా అద్భుతమైన శిల్ప రీతుల ప్రాకారాలున్న ఆలయాన్ని కళ్ళింత చేసుకుని చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు .
రంగ మంటపం చేరుకొని అందరూ మైమరచి చూస్తున్న నెలద నట్టువమేళాన్ని చూడసాగారు .
(ఇంకా ఉంది )
-సుమన కోడూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~