‘రావాలి ..రావాలి ..ఎవరో..ఒకరు..’ (కవిత)-

రావాలి ..రావాలి ..ఎవరో..ఒకరు..

ప్రాచీన కాలం నాటి వ్యవహారికంలో గల …
లోటు పాట్లకనుగుణంగా…
ఆనాడు పెట్టుకున్న ఆచారాలు..
రాను రాను అర్ధం చేసుకోను పరిణితి లేక …
మూర్ఖంగా పాటించేవే…ముడాచారాలయినవి..

చాకలి వాని మాట పట్టింపుకు నిండు చూలాలని చూడక..
అడవుల పంపిన ఆ రాముని సంస్కారాన్ని …
అలుసుగా చేకొని అనుమానం రోగంతో భార్యను
ఆంపశయ్య పరుండజేసే భర్తలు ఎందరో….

‘కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా!’ అని…
మగవాడు ఏమి చేసినా చెల్లునను భావం అహంకారమైయితే..
ఆ స్వార్ధపు కోరలలో చిక్కి బలి అయేది ఆడదే…

రాజులు..రాజ్యాలతో పాటు…
పోషించారు..రాజ నర్తకీమణులను..
జమిందారులు తమ భేషజం కాపాడుకొందుకు …
జోగినులను తాయారు చేసారు..
అదే రీతిన పసిమొగ్గల వంటి కన్నెలను..
నోరులేని శునకాలతో పెళ్లి చేసి…
తమ కామదాహానికి వారి మాన ప్రాణాలను
మధువు సేవనంతో పాటు సేవిస్తున్నారు …
‘ఇదేమిటి అంటే..’ ‘ఆచారం’ అంటారు…
నల్ల గుడ్డను కళ్ళకు గంతలుగా
కట్టుకున్న న్యాయ దేవతా….!
ఒక్కసారి నీ మనసును తట్టుకొని…
కళ్ళగంతలు తీసి చూడమ్మా..
ప్రతి గల్లిలో..ఓ చెల్లి..ఓ మల్లి…
కన్నీటికి కూడా భాష్యమెరుగని చిట్టి తల్లి…
అమాయకపు బెదురు చూపుల పాలవెల్లి..
అమానుషాలకు..ఆకృత్యాలకు .
ఆహుతి అవుతూనే ఉన్నారు…
రావాలి ఎవరో ఒకరు..మరో…
రాజారామ్ మోహన్ రాయ్…
ఆడవారి జీవితాలతో ఆటలాడు…
తరాల అంతరాలను అంతమొందించ…
రావాలి ఎవరో ఒకరు…మరో..
విరేసలింగం పంతులు …
అతివల అశువులు తుడిచి..
భావి జీవితాల వెలుగులు నింప….
రావాలి….. రావాలి.. ఎవరో..ఒకరు….
కధన రంగం కాదు ఇది..
కరుడు గట్టిన పాషాణ హృదయాలను కరిగించ..
వెన్నెల మనసుల… దీపాలను వెలిగించ..!

                                                                  -సుజాత తిమ్మన.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
.

కవితలు, , Permalink

2 Responses to ‘రావాలి ..రావాలి ..ఎవరో..ఒకరు..’ (కవిత)-

 1. D.Venkateswara Rao says:

  ఇప్పుడు రావలసింది ఎవరో ఒకరు కాదు
  ఇప్పుడు రావలసింది వారు కాదు
  ఇప్పుడు రావలసింది మీరు
  మీరే ఆడవారు
  ఒక్కరుకాదు ఇద్దరు కాదు మీరందరూ ప్రతి ఒక్కరు
  ఎవరో వస్తారని ఎదురు చూడకుండా
  మీరంతా ముందుకు రావాలి
  ఆచారాలను పక్కన పెట్టి
  ఆలోచనకు పదునుపెట్టి
  అరాచకాలను అణగదోక్కడానికి
  ప్రతి మగువ మొదట తన చక్కదిద్దుకుని
  ముందుకు రావాలి
  తమ హక్కులను కాపాడుకోవడానికి
  తామే ఒకరికొకరు సహాయపడాలి
  ఎప్పుడో ఏదో జరిగిందని వాపోవడం కంటే
  ఇప్పుడెంచేయ్యాలో తెలియచెప్పడానికి ముందుకు రావాలి
  ఎవరో వస్తారని ఎదురు చూడడానికి బదులు
  ఏమి చేసి ఈ దేశాన్ని బాగుచేయగలమో ఆలోచించాలి
  ఆడది ఎదురు తిరిగితే ఆదిశక్తి అవుతుందని చెప్పడం కంటే
  ఆదిశక్తే ఆడదని శాశ్వతంగా గుర్తుండిపోయేలా చెయ్యాలి
  అందుకు ఆడవారంతా ఒకే మాటమీద నిలబడాలి
  ఒకరికోసం ప్రతిఒక్కరూ నిలబడాలి
  అందరూ ఒక్కరిగా అవతరించాలి

  • sujatha thimmana says:

   ఆవేశపూరితమయిన మీ స్పందనకి ధన్యవాదాలండి….

   “ఆడది ఎదురు తిరిగితే ఆదిశక్తి అవుతుందని చెప్పడం కంటే
   ఆదిశక్తే ఆడదని శాశ్వతంగా గుర్తుండిపోయేలా చెయ్యాలి
   అందుకు ఆడవారంతా ఒకే మాటమీద నిలబడాలి
   ఒకరికోసం ప్రతిఒక్కరూ నిలబడాలి
   అందరూ ఒక్కరిగా అవతరించాలి”

   నిజం చెప్పారు……..ఈ స్పూర్తి తో ఒక్క అడుగయినా ముందుకు వెయ్యగలగాలి..ఆడవాళ్లు…(మేము )..