జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”నేను బోయి పేపర్‌ అందుకస్త గనీ ఎవరు సదుతరే..” అనాడు పీరయ్య
”నేను సదుత…. నేను మూడో సదిన గద” గర్వంగా చెప్పింది సబిత.

తను చేయలేని పని అది. కూతురు చదువుతానన్నందుకు ఎంతో సంతోషం కల్గింది పోశవ్వకి. అంతలోనే బాధగానూ అన్పించింది. తను స్వయంగా చదువలేనందుకు.

” అబ్బ… నీ ఫోట్వ పేపర్ల ఎంత మంచిగొచ్చింది.. గమ్మత్తు గొడ్తున్నది” అంటూ ఫోని. తల్లిని మార్చి మార్చి చూసింది. అమ్మకి, అమమ్మకి చూపింది సబిత. ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ సబిత చదివింది.

ఆఫీసర్ల ఏమచ్చిందో… నాకయితే సమజ్‌కాకచ్చింది. అరె గట్లింవేందే పోశవ్వా…? సర్పంచ్‌ అని నిన్ను పొగుడ్తున్నారే ——- అట్ల గాదె ఇండ్ల నాది ఏమున్నది? గౌడ్‌సాబ్‌ నా పేరు ఎక్కించిండు. గెల్పిచ్చిండు. నేనేం చేసిన్నని నన్ను పేపర్‌కిచ్చిన్రు అర్థం కాని పోశవ్వ.

”అవునె… పోశీ… నిన్ను ఓట్లల్ల నిలబ్టెింది. సర్పంచ్‌గౌడ్‌ సాబ్‌ గద. ఆయన కంటే నీదే బగ్గ రాసిన్రేందే… గా పెద్ద గౌడ్‌ గిన లేకుంటె నీ వేడుంటుింవే..? సందేహం వెలుబుచ్చింది సాయవ్వ.

”నా పేరు మీన నడ్సింది గద…! గందుకేమో….” పోశవ్వ అంటుండగానే సాయవ్వ అందుకుని.
”గా పెద్దగౌడు మీన బువ్వుడు కూతూన్న గిన్నె మీద తప్కు లెక్క ఎగిరెగిరి పడ్తవ్‌
గని ఆయన మంచోడెనే.

”ఊర్ల ఎంత మంది ఆడోల్లు లేరు…. ఆయిన పెండ్లం రాంబాయి, మస్తు బలగం ఉండంగ నిన్ను ఓట్లల్ల నిలబ్టెిండంటే శానా మంచోడేనే…” రాజాగౌడ్‌ గొప్పదానాన్ని పొగిడింది సాయవ్వ.

”అవునే.. అవ్వ… మంచోడే గావచ్చు. దయ గలోడనేమో…! నేను నిశాని ఏసినందుకు నాకు మస్తు పేరు దెప్పించ్చిండు” పోశవ్వ.

”గంత చిన్నంగ అంటవేందే… చిన్న కులంలో పుట్టిందాన్ని  ముట్టుకుంటెనె మైల వడ్తరనేదాన్ని, ఓట్లల్ల నిలవ్టెి పైసకు సూడకుంట, మస్తు పైస  పెతాపరెడ్డి దొర కోడలు మీన నిన్ను గెల్పిచ్చుడంటే సిన్న ముచ్చటనాయె”…పొరుగిం గిర్మవ్వ వ్యాఖ్యానం.

”గొప్ప దయగలోడు, కింది కులంలో ప్టుినోల్లంటే కనికరం కల్లోడు…” పొగిడింది. సాయవ్వ.పెద్దగౌడ్‌ని కాకుండా తనని పొగడడం ఎబ్బెట్టుగా అన్పించింది పోశవ్వకు. నిజంగానే పెద్దగౌడు కనికరం కల్లోడు కాకుంటే నా పేరు పేపర్లల్ల ఎట్ల రాయిస్తడు. మనసులో అనుకుంది పోశవ్వ.

అరిపండు తిని తొక్క పారేసినట్లుగా విసిరి అంత దూరంలో ఉంచే మాద్గిదాన్ని, జోగుదాన్ని సర్పంచ్‌గా నిలబ్టెి గెలిపించాడు. సర్పంచ్‌ ఏం చేస్తడో… ఏం జేయాల్నో… తనకేం దెల్సు… అంటూ రకరకాలుగా ఆలోచిస్తున్న పోశవ్వకి కబురొచ్చింది రాజాగౌడ్‌ నుండి. పంచాయితీ మీటింగ్  ఉంది రమ్మంటూ. ఉన్నంతలో మంచి చీర తీసి పెట్టింది . తలకి నూనె పెట్టి  నున్నగా దువ్వింది. చక్కగా తయారయి పంచాయితీ ఆఫీసుకు బయలు దేరుతున్నప్పుడు ఆమెలో కించిత్‌ గర్వం తొంగి చూసింది. అయితే ఆమె నడక రోజులా లేదు. ఆ నడకలో చిన్న ఒణుకు.. అడుగులు తడబడ్తూ… ఏమిటీ .. ఈ రోజు కొత్తగా నడుస్తూన్నట్లూ నా అడుగులు తడబడుతున్నాయేమి..? ఎన్నిసార్లు ఊర్లోకి నడిచింది ఈ రోడ్డుపై… ఇవ్వాలెంటీ .. ఎన్నడూ లేని విధంగా… మనసులో ప్రశ్నించుకుంది. పంచాయితీ ఆఫీసు దగ్గర పడే సరికి గుండె కొట్టుకోవడం ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది. పంచాయితీ ఆఫీసులోకి అడుగుపెట్టడం అదే ప్రథమం ఆమెకి. అడుగులు తడబడ్తూండగా, శరీరంలోంచి వణుకు పెరుగుతూండగా, గుండెవేగం మరింత పెరగగా ఊపిరి తీయడం… ఆగిపోతుందేమో నన్నట్లుగా ఉంది పోశవ్వ పరిస్థితి. గ్రామ పంచాయితీ ఆఫీసులో అడుగు పెట్టినప్పుడు.

గ్రామ పంచాయితీ హాలులో సభ్యులంతా కుర్చీల్లోనూ బల్లపైనా కూర్చున్నారు. మాదారి రాయనర్సు, బేగరి మశ్నప్ప తప్ప. వీళ్ళిద్దరూ మిగతా సభ్యులకు కాస్త దూరంగా నేలపై ఒదిగి కూర్చున్నారు. టేబుల్‌ ముందు ఉన్న కుర్చీలో పెద్దగౌడ్‌… అంతా పెద్దగౌడ్‌తో మ్లాడుతూ….

పోశవ్వ రాకను గమనించనట్లే వారంతా… తమ మాటల్లో నిమగ్నమై… ఎక్కడ కూర్చోవాలో… ఏం చేయాలో… అర్థం కాకుండా పోశవ్వ… అందరినీ ఓ సారి చూసి ఖాళీగా ఉన్న బెంచిపై కూర్చోబోయిందామె. సర్పంచు హోదాలో…
అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

-శాంతి ప్రబోధ

“~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో