‘అమ్మ ఎంత కఠిన నిర్ణయం తీసుకుంది?’
అమ్మ డైరీ చదువుతున్న తేజకు కన్నీరు ఆగటం లేదు. పేజీలు తిరగేస్తున్న అతని చేతలు వణుకుతున్నాయి. మనసు అమ్మకోసం రోదిస్తున్నది. ఈ ఏడుపు అమ్మకి విన్పిస్తుందా? పుట్టిన కొన్నాళ్ళకే తనని అమ్మలేనివాడ్నిగా చేసి వెళ్ళిపోయిన అమ్మని నిర్దయురాలు అనగడా?
భార్య ప్రణవి బెడ్రూంలోకి వచ్చింది. భర్త మానసంలో రేగుతున్న కల్లోలాన్ని అర్థం చేసుకున్నదానిలా అతని చేతిలోని డైరీని మెల్లగా తీసుకుని మూసేసి పక్కగా పెట్టింది. ఆసరా కోసమన్నట్లు తేజ భార్య హృదయంలో తలదాచుకున్నాడు. అతన్ని ఓదారుస్తున్న ఆమె చేతలు సున్నితంగా చుట్టుకున్నాయి. ఇద్దరూ డాక్టర్లే అయినా వాళ్ళ జీవితంలో యామిని స్మృతి అంతగా విచలితుల్ని చేస్తుంది.
‘‘యామినీ! నీ బ్లడ్ రిపోర్టులో కొంత ప్రాబ్లం ఉంది. వివరాలు తర్వాత చెప్తాను. రేపు మీ ఆయనతో రా! నువ్వు అభార్షన్ చేయించుకోవసి ఉంటుందేమో!’’ దిగ్గున చూసింది యామిని డాక్టర్ భారతి కేసి.
‘‘అలా ఎందుకు డాక్టర్?’’ యామిని గొంతు రుద్ధమైంది.
‘‘అమ్మని కావాలనుకున్నాను. హంతకిని చేస్తారా?’’ యామిని గొంతులో కన్నీరు సుడులు తిరిగింది.
‘‘హత్య అనే మాటే లేదు యామినీ! నేను డాక్టర్నే కాదు నీ ఫ్రెండుని కూడా. జబ్బుకి మందు వాడకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. వాడితే నీ బిడ్డకి అపాయం. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది’’ అంది డాక్టర్ భారతి విచారంగా.
‘‘బాగా ఆలోచించాను డాక్టర్! బిడ్డకి అపాయం అయేటట్లయితే నేను ఏ మందులు వాడను’’.
‘‘యామినీ! నేను చెప్పేది అసలు నీకు అర్థం అవుతోందా?’’ డాక్టర్ భారతి సహనాన్ని కోల్పోతోంది.
ఈ మాటు వింటున్న యామిని భర్త శేషు ఇంక ఊరికే ఉండలేక పోయాడు.
‘‘నాకన్నీ అర్థమవుతునన్నాయి డాక్టర్!’’ అన్నాడు దగ్గరగా వస్తూ.
‘‘నాకూ అన్నీ తెలుస్తున్నాయి. నాకు కాన్సరనీ, దీనికి వాడే మందు, థెరఫీ వల్ల నా బాబుకి హాని అని. కానీ నా నిర్ణయంకూడా వినండి. నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోను. మీ నిర్ణయాలు నావికావు ప్లీజ్’’ ఖచ్చితంగా అంది యామిని.
డాక్టర్ భారతి మౌనం వహించింది. చిన్నప్పటి నుంచి స్నేహితురాలయిన యామిని పట్టుదల ఎలాంటిదో భారతికి తెలుసు.
ఎంతచెప్పినా యామిని వినదని శేషుకీ అర్థమైంది. తన నిర్ణయం తనదే. కారు భారంగా స్టార్ట్ చేశాడు. దోవ పొడవునా ఇద్దరికీ మాటలు లేవు. ఆమె మనసులో చెలరేగుతున్న సంఘర్షణ శేషుకి అర్థమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితి.
ఇంటి తాళం తీసి ఇద్దరూ లోపలికెళ్లారు.
సోఫాలో కూలబడిందామే . లైట్లు వేసి మంచినీళ్ళందించాడు శేషు. యామిని మౌనంగా కాసిని తాగింది. కళ్ళు మూసుకొని సోఫాలో ఆనుకుని కూర్చుంది. శేషు మౌనంగా పక్కన కూర్చున్నాడు.
భగవంతుడు ఎందుకీ శిక్ష వేశాడు. ఏం పాపం చేశామని. పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. చేయని పూజ, మొక్కని దేవుడూ లేరు. అన్ని పరీక్షలు చేయించుకున్నా ఇద్దరిలోనూ ఏం లోపం లేదు. అనుకోకుండా ఆస్యంగానైనా వసంతం వచ్చింది. తల్లిదండ్రులు కాబోతున్నా మన్న వార్త యామినికీ, శేషుకీ ఆకాశమంత ఆనందాన్ని కల్గించింది. కానీ ఫలితం అందుకునేంతలోనే అది ఇంత శూన్యంలా మిగ్తుందా? ఇద్దరి మనసుల్లోనూ ఎడతెరిపి లేని ఆలోచనా వేదన.
టెస్ట్న్నీ పూర్తిచేసిన తర్వాత డాక్టర్ భారతి చెప్పిన వార్త వింటే కళ్ళముందు చీకటి కమ్మింది.
క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన భార్యను రక్షించుకునే ప్రయత్నంలో లేకలేక కలిగే బిడ్డను మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయటమా?
శేషు తల పగిలిపోతున్నది ఆలోచనతో.
‘‘డాక్టర్ భారతి రిఫర్ చేసిన హాస్పిటల్‌కి వెళ్దాం. రేపు అపాయింట్మెంట్ ఉంది’’ అన్నాడు మెల్లగా .
‘‘ఎందుకు?’’ నవ్వింది మెల్లగా .
‘‘అలా అనకు యామీ! నాకు నువ్వు కావాలి’’ చిన్నపిల్లాడిలా ఆమె భుజం మీద తవాల్చాడు.
‘‘మరి బాబు వద్దా?’’ ఆ ప్రశ్నకు అతని దగ్గర జవాబు లేదు.
‘‘మీ తృప్తి కోసం కన్సల్టేషన్‌కి వస్తాను కానీ మందు వాడను’’ నిశ్చంగా అంది యామిని.
హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో పేరొందిన కాన్సర్ హాస్పిటల్ అది. వార్డు, విజిటింగ్ హాల్స్, రకరకాల పేషెంట్స్ వారి తాలుకు బంధువుల్తో సందడిగా ఉన్నా విషాదం తొణికిసలాడుతోంది. పదేళ్ళపిల్ల కుచ్చు గౌను వేసుకుని గజ్జె పట్టాలు మోగిస్తూ తల్లికి చిక్కకుండా పరిగెడుతోంది.
‘‘మా అమ్మ కదూ! రా తల్లీ! డాక్టర్‌గారు పిలుస్తున్నారు’’ తల్లి దీనంగా పిలు స్తూ ఆ పిల్ల వెంటబడుతోంది.
‘‘నేను రాను. కాలికి ఇంజక్షన్ చేస్తే కొత్త గజ్జొ తీసేస్తారు’’ ఆ పిల్ల రోగం ప్రాథమిక దశలో ఉందేమో? పేషెంటులా కన్పించటం లేదు. తల్లి కళ్ళలో దైన్యం అందరినీ కలచివేస్తున్నది.
తన కళ్ళలో తిరిగిన కన్నీటితడి కన్పడకుండా త తిప్పుకుంది యామిని. శేషుదీ అదే పరిస్థితి.
డాక్టర్ చెకప్ చేశారు. రిపోర్ట్స్ చూశాడు. యామిని అభిప్రాయం విని నొసలు చిట్లించాడు గర్భంలో పెరిగే బాబు రక్షణకు కొన్ని మందు. జాగ్రత్తు చెప్పాడు. అంతకుమించి యామినీకి ఇంకేమీ వద్దు కూడా. మర్నాడు యామిని అమ్మానాన్నలు వచ్చారు. మొదట్లో తెలీకపోయినా ఒకటి రెండు రోజు తర్వాత యామిని పరిస్థితిని వాళ్ళకు వివరించాడు శేషు.
తల్లి గుండె చెరువైపోయింది. కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో విధాల నచ్చజెప్పింది.
‘‘యామీ! నువ్వు కోరి శేషుని చేసుకున్నావు. నువ్వంటే అతనికి పంచప్రాణాలు. పిల్లలు లేకపోయినా ఏమయింది? మన శ్యాం అంకుల్ అమెరికాలో అంకాజిస్టు కదా! సంప్రదిద్దాం! అమెరికా వెళ్ళి చికిత్స చేయించుకుందాం. మా మాట వినమ్మా!’’ తల్లి గొంతులోని వేదనకు యామిని మనసు అర్ద్రమైంది.
‘‘అమ్మా! నువ్వు నాకోసం బాధపడుతున్నట్లే నేను నాబిడ్డ క్షేమంకోసం ఆరాట పడ్తున్నాను. డాక్టర్ భారతి అమెరికన్ డాక్టర్స్‌ని కూడా సంప్రదించింది. ఎక్కడయినా చెప్పేది ఫిఫ్టీ ఫిఫ్టీనే! నా బాబుని ఈ లోకంలోకి తేవాలనే నా నిర్ణయం. నీకు చేతనయినంత సాయం చేయగలిగితే చేయమ్మా’’ దీనంగా అంది యామిని.
‘‘నిన్ను బలితీసుకునే బిడ్డ…’’
తల్లిమాట పూర్తికాకుండానే ఉగ్రంగా అరిచింది యామిని.
‘‘అమ్మా! నా బిడ్డనేమీ అనొద్దు. నేను భరించలేను. వాడిని బలితీసుకుని నేను బతకటం అనవసరం. నా ప్రాణం కోసం ఆ మొగ్గని చిదిమేస్తే తల్లినెలా అవుతాను. ఏదో ఒకరోజు ఎవరమైనా చనిపోవాల్సిందే! దీనికింత బాధపడటం అనవసరం’’ ఆవేశంగా అంది.
‘‘భారతి సహా అయినా వినవా? తను నీ ఫ్రెండ్ కదా!’’
‘‘ఎవరేం చెప్పినా నా అంతరాత్మ చెప్పిందే వింటానమ్మా!’’
యామిని నిర్ణయాన్ని మార్చలేనని తల్లికి అర్థమైంది. కన్నీరు పెట్టుకుని జాగ్రత్తలు చెప్పి తల్లిదండ్రులిద్దరూ వెళ్ళిపోయారు.
భార్యకి నచ్చజెప్పటానికి శేషు తనతల్లిని పిలిపించాడు. ఆవిడ యామినితో మొత్తుకుంది.
‘‘నీ వ్యాధి తొలి దశలోనే ఉంది. నువ్వు మందు వాడు. తర్వాత మరో బిడ్డని కనొచ్చు’’ నచ్చజెప్పింది కోడలికి.
యామిని మాట మారలేదు. అత్తగారు రెండు రోజుండి కొడుకు బాధ చూడలేక తిరుగు ప్రయాణమైంది.
తనకి నభైయేళ్ళు వస్తున్నాయి. పెళ్ళయిన ఇన్నాళ్ళకు తన కోరిక ఫలించింది. నట్టింట్లోకి వస్తున్న బిడ్డను చంపుకొని మోడులా బతకాలా? యామిని ఆలోచను మరింత స్పష్టంగా ఉన్నాయి.
***** ***** *****
కాలచక్రం దొర్లిపోతున్నది. నెలలు నిండాక పండంటి బిడ్డను కన్న యామిని మొహంలో ఎంతో ఆనందం. మాటకందని సంతోషం. తన ఆరోగ్యం గురించిన ఆలోచనే లేదు.ఈ సంతోషం దేవుడిచ్చిన వరం. ఎంత తపస్సు. సంఘర్షణ ఫం ఈ బాబు! వాడు నవ్వినా, ఏడ్చినా ఆమెకి పులకింత. వాడు మెల్లగా చేతులు , కాళ్ళను కదుపుతూ అమ్మని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బాబు పుట్టాక యామిని పూర్తి చికిత్స చేయించుకుంటున్నది. ఆరోగ్యం కొంత ఫరవాలేదనిపిస్తున్నది. కానీ నీరసం వదలటం లేదు.
‘‘నేను సెలవు పెడుతున్నాను. మనపల్లెకు పోదాం. కొత్త వాతావరణం, విశ్రాంతి దొరుకుతాయి. బాబుని అమ్మ దగ్గర వదిలి వద్దాం’’ శేషు సూచించాడు.
‘‘వద్దు నేనెక్కడికీ రాను. నా బాబుని ఎవ్వరికీ ఇవ్వను’’ ఖండితంగా చెప్పింది.
వైద్యంకూడా హైదరాబాద్‌లో ఉంటేనే సరిగ్గా జరుగుతుంది. అందుకే ఆమెను బాధపెట్టలేక ఊరుకున్నాడు శేషు.
బాబుతోపాటుగా ఆమె గర్భాశయంలో కాన్సర్ కూడా పెరుగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు వైద్యం జరుగుతున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదు.
బాబు సమక్షంలో యామిని సర్వం మరిచిపోతోంది. అమ్మ అయినందుకు ఆమె అందం రెట్టింపయింది. పేషెంట్ అని తనకే గుర్తుండదు.
డాక్టర్లు చెప్పిన దాని కంటే ఆత్మబలం తో మరో రెండేళ్ళు జీవించిన యామిని ఓ అర్ధరాత్రి తన బాబు ఏడ్చినా విన్పించని దూరాల కు వెళ్ళిపోయింది. జీవితకాలం వెంట ఉంటానని పెళ్ళిలో ప్రమాణాలు చేసిన భార్య తనని ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోవటంతో శేషు విచారంలో మునిగిపోయాడు.
రెండోపెళ్ళి ప్రతిపాదనలేవీ అతను ఒప్పుకోలేదు. కాలం ఎవరికోసం ఆగదు.
యామిని కొడుకు డాక్టర్ తేజగా ఎదిగి ‘యామిని కాన్సర్ హాస్పిటల్’ స్థాపించాడు. అతని భార్య డాక్టర్ ప్రణవి కూడా కాన్సర్ స్పెషలిస్టు.
అమ్మ డైరీ ఎన్నిసార్లు చదివినా తేజకి తనివి తీరదు. తన గురించి ఎన్ని కలలు ఎన్ని ఆశలు ! తనకి జన్మనివ్వడం కోసం ప్రాణాలే వదిలేసింది. అమ్మంటే దేవత అంటారు. అంతకంటే ఎక్కువే! గోడమీద అమ్మ ఫోటోలో ఆమె కళ్ళలోని ప్రేమ అతన్ని నిరంతరం మానవసేవకు పురికొల్పుతున్నది .
తన స్నేహితురాలు పేరుమీద ఉన్న హాస్పిటల్ల్లోనే ఇప్పుడు డాక్టర్ భారతి కూడా నిబద్ధతగా పనిచేస్తున్నది.
‘‘యామిని కాన్సర్ హాస్పిటల్’’లో యామిని నిలువెత్తు ప్రతిమ దగ్గర సిమెంట్ బెంచి మీద కూర్చొని ఆ ప్రతిమ కళ్ళలోకి చూస్తూ తనలో తాను యామినితో మాట్లాడటం శేషు దినచర్య. అంతా క్షణాల్లో జరిగిపోయిందనిపిస్తుంది.
ఏవో మాటలు తేజ రూంలోంచి గట్టిగా విన్పిస్తున్నాయి. లోనికి వెళ్ళటం సభ్యత కాదు. అలాగే కూర్చున్నాడు శేషు. ప్రణవికూడా తేజ కన్సల్టేషన్ రూంలోకి వెళ్ళింది. మాటు పెద్దగా విన్పిస్తుంటే ఇక ఆసక్తి ఆపుకోలేక తనూ వెళ్ళాడు శేషు. అక్కడ డాక్టర్ భారతి కూడా ఉంది. ఆవిడ చేతిలో మెడికల్ రిపోర్టున్నాయి.
‘‘ప్రణవీ! ఇది స్పెషలిస్టు రిపోర్టు. యామిని లాంటి కేసు. సంతానం, కాన్సర్ ఒకేసారి పెరగటం విధి వైచిత్రి’’. భారతి బాధపడిరది.
యామినిలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ యువతికి పాతికేళ్ళుంటాయేమో!
‘‘ఇప్పుడు చాలా మంచి మందు వచ్చాయి తల్లీ! నీ బిడ్డకేం అపాయం రాదు. నువ్వు కూడా వైద్యం ఆరంభించవచ్చు. ప్రసవమయ్యాక మరింత చురుకయిన చికిత్స తీసుకోవచ్చు’’ భారతి గొంతులో నిజాయితీ ధ్వనించింది.
‘‘నా బిడ్డకు ఏ అపాయం రానంతవరకు నేనొప్పుకుంటాను డాక్టర్! నా బిడ్డ ప్రాణమే నాకు ముఖ్యం’’ ఆ అమ్మాయి గొంతు వణికింది. ‘‘ఇదే మాట సుమారు పాతికేళ్ళ క్రితం విన్నాం!’’ డాక్టర్ భారతి తనలో తాను గొణుక్కుంది. పాత యామిని మళ్ళీ ఎదుటవచ్చి నిలిచినట్లుంది.
‘‘అమ్మంటే ప్రేమ, సంవేదన కలయిక. ఆమె అస్థిత్వాన్ని ఓడిరచే శక్తి ఎవరికుంటుంది.’’ ప్రణవి కళ్ళు చెమ్మగిల్లాయి. మానవత్వానికి మూం ఈ మమకారమే!
‘‘అందుకే… ఏ కాంలోనైనా అమ్మ అమ్మే!’’ ఆరాధనగా ఆ అమ్మాయికేసి చూశాడు తేజ. యామిని విగ్రహం పెదవు చిరునవ్వుతో విచ్చుకోవడం శేషుకే తెలుస్తున్నది .
– సి .భవానీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~