చాలు చాలు పనికిరాని వాగ్ధానాలు… – కనక దుర్గ

Kanaka Durga

Kanaka Durga

అడవిలో అన్నలేమంటున్నరు,
ప్రజలకుభూమి, తిండి, బట్ట,
వుండడానికి ఇళ్ళు కావాలంటున్నరు, అంతే కదా!
అన్నీ మంచివే చేయమంటున్నరు కదా!
వాళ్ళతో మనకి వైరమెందుకూ?’
అని నక్క వినయాలు పోయిన రాజకీయ నాయకులు,
ప్రజల వోట్లతో చేతికి పదవి వచ్చిన తర్వాత,
ఫ్రభుత్వం చేసిన వాగ్ధానాలను మరిచి
ప్రజలను పట్టించుకోకపోవటం,
వారి స్వార్ధం, కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు
రాజకీయాలనే పట్టుకు వేళ్ళాడుతుంటే,
అన్నలు, అక్కలు,
ప్రజలకు నిజం ఏమిటో తెలియజేసి చైతన్యవంతులను చేస్తూ
ప్రజలకు దగ్గరవుతుంటే,
కుక్కిన పేనుల్లా పడివుండాల్సిన ప్రజలు
అన్నల, అక్కల పాపులారిటీని పెంచుతుంటే,
చేతిలో పట్టుకున్న పదవి అనే చర్నాకోలా జడిపించి,
ఒక అన్నని, ఒక అక్కని పట్టుకుని
రెండు మూడు రోజులు వారిని చిత్ర హింసలకు గురి చేసి,
వారి రాక్షసత్వానికి పరాకాష్ట ఏమిటో
అది అంతా ఆ ఇద్దరి పై చూపించి,
వారిని అడవిలో పడేసి తుపాకీలు పేల్చి
ఎన్ కౌంటర్ అని ప్రజల్ని వెర్రి వాళ్ళని
చేయడానికి ప్రయత్నించినంత మాత్రానా
వారి కర్కశ, కీచక చర్యలు ఎవరికీ తెలియవని
అనుకుంటే సరిపోతుందా?
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని
ఎవ్వరూ చూడటం లేదని అనుకున్నట్టు వుంది
ఈ తంతు.

రైతుల జీవితాలనే మార్చేస్తానన్న నోరే,
నోర్మూసుకుని విలాసాల్లో, విదేశాల్లో తిరుగుతుంటే,
తమ కడగళ్ళు ఎవ్వరైనా సరే పట్టించుకోరని
కొంచెం ఆలస్యంగా తెలుసుకున్న నలుగురికి
తిండి పెట్టే రైతన్నలు చేసిన అప్పులు తీర్చలేక
కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు
చేసుకుంటున్నారు,
వారికి కావాల్సిన ఆత్మస్థయిర్యం, మీ రుణాలు
మాఫీ చేయిస్తాము, మీ ప్రాణాలు తీసుకోకండి,
మీకు అండగా మేముంటాము అని చెప్పకుండా,
ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు
కొన్ని లక్షల రూపాయిలిస్తామంటే,
తిండి తిప్పలు లేక అల్లాడుతున్న కుటుంబానికి,
రెక్కాడితే కానీ డొక్కాడని పేద రైతుకి
’నే చస్తే కనీసం నా భార్యా బిడ్డలు అప్పులు తీర్చుకుని,
రోజు కడుపునిండా తిండి తింటారేమో?’
అని మరింత మంది రైతన్నల ఆత్మహత్యలకు
కారణం అవుతున్నారు?
ఇప్పటికైనా,’ మీకు అండగా మేముంటాము, ప్రాణాలు
తీసుకోకండి,’ అని అంటున్నారా?
వాళ్ళకి కావాల్సింది బతకడానికి ధైర్యం, అప్పులు మాఫీ
చేయించి వారు తమ పొలంలో పంటలు పండించుకుని
ఏ సమస్యలు లేకుండా బ్రతికే అవకాశాలు కల్పించడం
పెద్ద బాధ్యత,
అంత చేసే ఓపిక మన కుహనా నాయకులకు ఎక్కడిది?
తెలంగాణా వస్తే బతుకులు బాగవుతయనుకున్న పేద
ప్రజల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది!

విద్యార్దులను కూడా పావులుగా వాడుకున్న సర్కారు,
చేతికి పదవి వచ్చిన తర్వాత ఎవ్వరి సమస్యలు
కానరాకుండ పోయినవి,
విశ్వవిద్యాలయాల హాస్టళ్ళ పరిస్థితి భయంకరంగా
వున్నా పట్టించుకునే నాధుడే లేడు,
కష్టపడి చదువుకున్నవారికి వుద్యోగాలు లేవు,
ఈ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అనుకున్న విద్యార్దులకు
నిరాశా నిశ్పృహలే చోటు చేసుకున్నాయి.

రెండు రాష్ట్రాలేర్పడినప్పటినుండి ఒకరి మీద మరొకరు
బురద చల్లుకోవడం, తిట్టిన తిట్లు తిట్టుకోకుండా
తిట్టుకోవడంలో బిజీగా వున్నారు పాపం!
ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకోవడానికి అన్న
సామెతని నిజం చేసి చూపిస్తున్నారు మన నాయకులు !

– కనక దుర్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

9 Responses to చాలు చాలు పనికిరాని వాగ్ధానాలు… – కనక దుర్గ

 1. ఉదయ భాను says:

  చాలా చాలా బాగుంది….. నడుస్తున్న చరిత్ర కళ్ళ ముందు కదలాడింది …… నందిని నంది ….. పందిని పంది అనడం లో తప్పేమీ లేదు కుహానా మేధావులు మా ఇల్లు మావళ్ళు చల్ల గుంటే చాలు అనుకుంటూ కళ్ళు మూసుకుని సిగ్గూ ఎగ్గూ లేకుండా నిదుర నటిస్తున్నప్పుడు చిట్టి కోయిలలే గళం విప్పక తప్పదు….. చిన్న చీమలే కోరలు పీకక తప్పదు….. అలా అనుకుంటె దాశరథి నిజాం ను ఎదిరించేవాడా ….. నయా నిజాంను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది.

  • Durga says:

   థ్యాంక్స్ ఉదయభాను అన్న, నువ్వు రెస్పాన్స్ పెట్టాలని ఎదురుచూసాను! జరుగుతున్నవి చూస్తూ వూరికే వుండలేక కొంతమంది అయినా చదివిన తర్వాత ఆలోచిస్తారేమో అనే ఒక చిన్న ఆశ. థ్యాంక్స్ ఎ లాట్!

 2. bapuji says:

  నీ ఆరోగ్యం బాగున్నది – సంతోషం- నీ ఘోష బాగున్నది- కానీ
  , ఎవరిక్కావాలి? నలుగురూ కలిసి ఒక్క అడుగు ముందుకు వేస్తె బాగుందా వచ్చు

  బాపూజీ

  • Durga says:

   ఎవరిక్కావాలి అని నోరు మూసుకుని కూర్చోవాలంటారా? మనసులోని ఆవేదన భయట పెడితే నలుగురూ ఆలోచిస్తారేమో, మీరు అన్న అడుగు ముందుకు వేయాలన్నా ఆలోచన వస్తుందేమో అన్న ఆశతో ఈ రాతలు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ రీడింగ్ అండ్ లీవింగ్ కామెంట్ బాపూజీ బాబాయి గారు!

 3. గౌతమ్ కశ్యప్ says:

  దుర్గమ్మా
  ఎప్పట్లాగే నీ ఆవేదన
  ఇప్పుడు కూడా నచ్చింది
  మెచ్చకేంచేస్తాం.!
  నీ నిర్మల హృదయానికీ
  నిరంతరం నీలో పొంగే ఓ నిత్య చైతన్య శక్తికి
  నేనెప్పుడూ ఆశ్చర్యపోతూనే వుంటాను
  ఒక్కోసారి నువ్వు నాకు అక్కవుగా
  అమ్మవుగా కనిపిస్తావు
  స్పూర్తినిస్తావు.

 4. గౌతమ్ కశ్యప్ says:

  నీకు కనిపించిన సత్యాన్ని
  ప్రత్యక్షర సత్యంగా వినిపించావు.
  దుర్గవనిపించావు
  (నా) మార్గానివనిపించావు – గౌతమ్ కశ్యప్
  🙂

  • Durga says:

   ఇన్ని మంచి మాటలు, ఇంత అభిమానం, మాట రావడం లేదు ఏమి చెప్పడానికి.
   చాలా చాలా ధన్యవాదాలు, గౌతమ్ అన్నయ గారు!

 5. Krishna Veni Chari says:

  చాలా బాగా రాశావు దుర్గా. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)