ఆలి… – డా. శ్రీసత్య గౌతమి

(తొలి కవిత)

ఆలి రా …అది ఆలి రా
వెన్నంటి వుండే నీ నీడరా
నీ కష్టాన్ని మరపించే ఓదార్పురా
నీకు సేద తీర్చే పంటచేలురా
నీ స్వేదాన్ని తుడిచే చల్లగాలిరా
అందుకే అది ఆలిరా…..

ఆదరిస్తే పాలకడలి రా
అమ్మలా చల్లని నీడరా
మనసిస్తే మల్లెచెండురా
మానవతకే మంచుకొండరా
నిన్ను కాచే కాపరి రా
అందుకే అది ఆలి రా..

నీ ప్రేరణకు ఆమె రూపం రా
నీ గెలుపుకు రధసారధి రా
నువ్వు ఓడినా ఆమె వదలదు రా
వెన్ను తట్టి లేపి అడుగులేయించురా
నీ విశ్వాశాన్ని కొండని చేసే అండరా
అందుకే అది ఆలి రా

తనకు తక్కువైనా నిన్ను అడగదురా
ఎక్కువుంటే నీ తరువాతే నేను అనునురా
నీ ప్రతి అడుగులోనూ కనబడని సాక్ష్యము రా
నువ్వెక్కడున్నా మనసున తెలుసుకునే ఆరాటము రా
నువ్వు చెప్పకున్నా నిన్ను చదివే దైవశక్తిరా
అందుకే అది ఆలి రా..

డా. శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి.
ఫిలడెల్ఫియా, అమెరికా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

16 Responses to ఆలి… – డా. శ్రీసత్య గౌతమి

 1. D.Venkateswara Rao says:

  అవును ఆ స్త్రీ మూర్తి నా ఆలి
  ఎప్పుడూ నా వెన్నంటి ఉండే నా నీడ
  నా కష్టాల్ని మరపించే ఓదార్పు
  నాకు సేదదీర్చే పంటచేను
  నా స్వేదాన్ని తుడిచే చల్లగాలి
  ఆదరిస్తే పాలకడలిగా, అమ్మలా చల్లని నీడలా
  మనసిస్తే మల్లెచెండులా,మానవతకే మంచుకొండలా నన్ను కాచే కాపరి,
  నా ప్రేరణకు ఆమె రూపం
  నా గెలుపుకు రధసారధి
  నీను ఓడినా ఆమె వదలదు
  వెన్ను తట్టి లేపి అడుగులేయిస్తుంది
  నా విశ్వాశాన్ని కొండని చేసే అండ అని
  అలా అలా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో
  నా ఆలి గురించి నాకు తెలుసు

  అయినా నాకు తెలవకడుగుతాను
  నన్ను ‘రా’ అని సంభోదించే మీరెవరు
  ఆలి రా! అది ఆలి రా ! అంటూ
  పలుమార్లు నన్ను రా అంటూ
  నా ఆలినే నాకు గుర్తుచేస్తున్నారు.
  నా భార్యనే నాకు పరిచయం చేస్తున్నారు

 2. Anthony says:

  అవునురా అది అలేరా………
  తిక్క దోబ్బితే అది భద్ర కాళిరా…….

  గుడ్, చాలా బాగుంది. చిన్నప్పుడు కవితలు వ్రాయడమంటే చాలా ఇష్టంగా వుడేది. సైన్సులో మునిగి అది మరచిపోయాను.

 3. Sai Padma says:

  బాగుంది గౌతమి గారూ

 4. sasi kala says:

  చక్కగా వ్రాసారు

 5. Nagajyothi Ramana says:

  చాలా బాగా వ్రాశారు గౌతమి గారూ

 6. RAVIPRAKASH ADIPUDI says:

  బాగుంది…సూప్పర్…
  సహనం నశిస్తే కాళీ రా.. నువ్వు ఖాళీరా…

  • Srisatya Gauthami says:

   హహహ… మల్లెచెండు లా వుండనిచ్చి చూడండి. నెక్ష్ట్ స్టేజ్ కి వెళ్ళరు. 🙂

 7. sridhar says:

  చాలా బాగా వ్రాసారు .ఏది ఏమైనా బాగా వ్రాయటం మీకు ఆనవాయితీ గా మారిపోయింది .సున్నిత భావాలు ఉన్న సౌందర్య సైంటిస్ట్ మీరు .వెరీ నైస్

 8. సుజాత తిమ్మన says:

  నిజం ..చాల బాగా వ్రాసారు….శ్రీ సత్య గౌతమి గారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)