బోయ్‌ ఫ్రెండ్‌ – 29 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”మీరంటే, నా గుండెల్లో ఎంతి స్థానముందో మికు తెలుసా కృష్ణా.”
”మిమ్మల్ని చూచిన క్షణంలో నేను వెతుకుతున్నదేదో నాకిం ముందు కన్పించినట్లరుంది. కానీ నా కందుబాటులో, నేను ఎక్కగలిగే ఎత్తులో వుందో లేదో నని అనుమానించాను. వెనక్కు తగ్గాను. కానీ సీలేరులో, ఆ అందమైన ప్రకృతిలో నన్ను చైతన్యవంతం చేసిన మిమ్మల్ని మరచిపోరు నన్ను నేను మభ్య పెట్టుకోవాలనుకోలేదు. కానీ ఏ ఆధారంతో మిమ్మల్ని చేరుకోను నేను… నిట్టూర్చి మరలా అన్నాడు.”

”నిరాశగా మికు వీడ్కోలు చెప్పిన నేను మిమ్మల్ని మరిచిపోవాలని చాలా ప్రయత్నించాను. నేను మరచిపోవాలనుకునే విషయం, మర్చిపోవాలనే కొద్దీ ఒక్క క్షణం కూడా మర్చిపోలేనని పించసాగింది. ధైర్యం చేసి ఒక రోజు మి ముందు కొచ్చి వాలాను. సాదరంగా ఆహ్వానించారు మిరు. ఆ చిన్న ఆధారంగా మరలా ఆశలు అల్లుకున్నాను. ఈ రోజు ఆ ఆశాబలం చేతనే మి ముందుకొచ్చి మి మంచితనాన్ని- ఆధారం చేసుకుని ఇంతసేపు కూర్చుని మ్లాడగలుగుతున్నాను. అతను ఆయాసంతో ఆగాడు. అంతా విన్న ఆమె, తనకు తెలిసిన విషయమే అతను చెప్తున్నట్లు నిర్లిప్తంగా వుండిపోరుంది.

”చెప్పండి కృష్ణా ! నా మనసు మికింకా అర్థం కాలేదా? మి మనస్సును అర్థం చేసుకునే అవకాశం నాకివ్వకూడదా?”
ఆత్రంగా అడుగుతున్న అతని చూపుల్లో కొన్ని నెలల క్రితం ఒకరోజు చైతన్య మూడోమారు తనిం కొచ్చి వెళ్ళిపోయాక తన మనసులోని భావం తెలుసుకోవాలనే ప్రయత్నంలో తన తల్లి కళ్ళల్లో కదలాడిన ఆరాటమే కనబడింది. ఆరోజు చైతన్య వెళ్ళిపోయాక అడిగింది వర్థనమ్మ.

”ఎవరు కృష్ణా ఆ వచ్చింది చైతన్య లాగుందే?”
సమాధానంగా తలాడించింది కృష్ణ.
”అదేమోనే ఆ పిల్లాడంటే నాకు గిట్టదు.”
కృష్ణ మ్లాడలేదు.

”అతనిని మనింకి రావద్దని చెప్పకూడదూ?”
అసలే అతని తాలూకు వివిధమైన భావ సంఘర్షణల మధ్య విసిగిపోయున్న కృష్ణకు తల్లి మాటలు చిరాకు కలిగించారు.

”ఇంికొచ్చే మనిషిని రావద్దని నేను చెప్పలేను. నీకు వీలైతే నువ్వే చెప్పుకో”
వర్థనమ్మకు కూతురు చిరాకు మరేదో అనుమానాన్ని కలిగించింది. ఏదో ఆలోచిస్తూ మౌనంగా వుండిపోరుంది. మౌనంగా వున్న తల్లిని చూడగానే అలా చిరాకు పడ్డందుకు పశ్చాత్తప పడ్డది కృష్ణ. అందుకే వెంటనే తన సహజ హాస్యధోరణిలోకి వెళ్ళిపోతూ అంది.

”మరి భానుమూర్తిని కూడా రావద్దని చెప్పేదా అమ్మా?”
ఆమె చటుక్కున కళ్ళెత్తి సూిగా కూతురి కళ్ళల్లోకి చూచింది. ఆమె ఆశించిన భావం కృష్ణ కళ్ళల్లో కన్పించకపోయే సరికి, ఆమె గుండెల నిండా గాలి పీల్చుకుంది.

”ఆ పిల్లాడేం చేసాడు రావద్దనడానికి?”
”మరి ఈ పిల్లాడేం చేసాడమ్మా?” సన్నగా నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది కృష్ణ. దానికి వర్థనమ్మకు జవాబేం దొరకలేదు.
”ఆ పిల్లాడికి భానుమూర్తికి పోలికా?” అని నసిగింది.
కృష్ణకు తల్లిని ఇంకొద్దిసేపు సరదాగా ఏడ్పించాలనిపించింది.

”ఏమ్మా? ఎందుకు పోల్చకూడదూ? ఆ లెక్కకొస్తే చైతన్య కంటే భాను ఎందులో గొప్ప?”అలా అనేసిన తర్వాత తల్లి కళ్ళల్లో భావానికి కంపించి పోరుంది కృష్ణ. ఆమె కళ్ళల్లో కూతురి పట్ల అనుమానమేదో నీడలా కదుల్తోంది. అది తనకు అప్రసన్నమైన విషయంలాగ, ఆమె కనుపాపలు అసహనంగా కదుల్తున్నారు.

”సరే నీ ఇష్టం” అతి ప్రయత్నం మిద బలహీనంగా ఆ మాటలనేసి వెళ్ళిపోతున్న తల్లి భుజాలు పట్టుకుని కుదుపుతూ తొందర తొందరగా అంది కృష్ణ.

”అలాగే! రావద్దని చెప్తాలే అమ్మా. నీ కిష్టం లేనిది నేనెప్పుడైనా చేసానామ్మా?”
వర్థనమ్మ చటుక్కున వెనక్కు తిరిగి కూతురిని బలంగా తన గుండెల కానించుకుంది.

”నా బంగారు తల్లివి నువ్వు. నాకు తెలుసు. నువ్వు పెద్ద దానివయ్యావు. నా ఇష్టాలే నీ ఇష్టాలను కుంటే ఎలాగమ్మా! నీ అంత వివేకం నాలో లేదు. పైగా అరుష్టానికి ఒక అర్థం కూడా లేదు. నీ కిష్టమైందే చెయ్యమ్మా.”
ఆ రోజు అలా అంటున్న అమ్మకు జవాబేం చెప్పాలో తెలియక మౌనంగా వుండి పోరుంది కృష్ణ. ఈ రోజు దానికి జవాబు సిద్ధంగా వున్నా, ఎలా మొదల్టెాలో ఆలోచిస్తూ వుండిపోరుంది.

”మీరు సందేహిస్తున్నారు. నాకు తెలుసు. అందమైన అమ్మారుని చూచి ఆకర్షించబడి వెఱ్ఱి మొఱ్ఱి వేషాలు వేసే వయస్సు కాదు నాది. పైగా నా తత్వం కూడా అలాటిది కాదు. మీరంటే ఎందు కిష్టమని అడిగితే నేనేం చెప్పలేను. ఒక్కి మాత్రం చెప్పగలను. మీలో నాకు కావాల్సిందేదో చూడ గలిగాను నేను. మీరు నాకు కావాలి. నేను అసంపూర్ణుణ్ణి. మీకు నేనేమివ్వకుండానే మీ  దగ్గర నుండి సర్వం పొందాలనే స్వార్థపరుణ్ణి. నా స్వార్థాన్ని, లోపాలని చీల్చుకుని నన్ను మీరు చేరుకోలేరా ! నాతో జీవితాన్ని పంచుకుని నన్ను అదృష్టవంతుణ్ణి చేయలేరా?”

అతని మాటలు వింటుంటే, ఆమె కూడదీసుకున్న ధైర్యమంతా కరిగి పోతోంది. ఆమె తల తిరిగిపోతోంది. ఆమె కాళ్ళు తేలిపోతున్నారు. ఆమె రక్తంలో ప్రతి కణమూ ఆవిరైపోతోంది. ఆమె ఈ పరిస్థితిని గమనించినట్టే, భానుమూర్తి ఆమెకు నోట్సు తయారు చేసుకుని అందివ్వడానికి వచ్చాడు. అతని రాక ఆమె కెంత బలాన్నిచ్చిందో చైతన్య ముఖంలోని కళని అంతగా హరించేసింది.

”నువ్విక్కడున్నావా?” అని తమ్ముణ్ణి పలకరించి, కృష్ణకు నోట్సు అందించి, క్షేమ సమాచారాలు కనుక్కుని ”వెళ్తాను” అని లేచి నిలబడ్డ భానుమూర్తిని ఎలా అరునా ఆపాలని కృష్ణ ఆరాటపడింది. చటుక్కున ఆమెకు ఆ రోజు పోస్ట్‌లో అమ్మ దగ్గర నుండి అందుకున్న ఉత్తరం గుర్తు కొచ్చింది. నిజానికి దానిని భానుమూర్తికి చూపాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆ ఉత్తరం తెచ్చే నెపంతో అతనిని కాసేపు ఆపాలనిపించింది.

”ఉండుండు. అమ్మ ఉత్తరం వ్రాసింది తెస్తాను.” అనేసి అతని జవాబుకైనా ఆశించకుండా గబగబ పరుగెడ్తున్నట్టే గదిలో కొచ్చి ‘బెడ్‌’ మిద వాలిపోరుంది.

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Comments are closed.